Tuesday, July 10, 2012

'కణానాం త్వా కణ పతిగుమ్ హవామహే'!!

మొన్నేదో కొత్త కణాన్ని , ఇప్పటి దాకా ప్రతిపాదన లో ఉన్న కణాన్ని ఫైవ్ సిగ్మా స్యూరిటీ  అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్ మూడున్నర మిల్లియన్ లో ఒకటో వంతట  - దీటుగా చెప్పగలం ఇది ఉన్నది అని అన్నంత దాటీ గా చెప్పారని పేపర్లో చదివాకా మా అయ్యరు  గారు,,

'కణానాం త్వా కణ పతిగుమ్ హవామహే' అన్నారు..

కణముల లో కణం అన్న మాట ఈ దైవ కణం..

కణా లన్నిటికీ వాటి ఉనికి వాటి మాస్ కి ఈ దైవ కణం మూలాధార మట

సో,,

'కణానాం త్వా కణ పతిగుమ్ హవామహే'!!

ఉంది అనే దాన్ని ఉంది అని చెప్ప డానికి   ఎన్ని తంటాలు పడ వలసి వస్తోంది సుమీ అని హాశ్చర్య  పోయా..  వాళ్ళ సెర్న్ రీసెర్చ్ సెంటర్ పది బిలియన్ డాలర్ల పై చిలుకు ఖర్చు తో కూడినద ట .

 ఏ హిమాలయాల్లో నో లేకుంటే ఏ  కుగ్రామం లో నో ఎ మూలో కూర్చుని ముక్కు మూసుకుని ఉన్నాడు ఉన్నది అన్న దాన్ని కనుక్కోగ ల మానవుడు ఓ వైపు,, దాన్ని ఉంది అని చూస్తే గాని ఉంది అని ఒప్పుకోలేని మానవుడు మరో వైపు, ఒకడి కి ఒకడి ప్రతి బింబం లా ఉండటం కూడా ప్రకృతి విశేషమే మో అనిపిస్తుంది మరి !


సో,, జిలేబి కావాలంటే డోంట్ బీ లేజీ సుమీ అని ప్రకృతి చెబ్తున్నది లా ఉన్నది ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే.. మీ రేమంటారు మరి ?


చీర్స్
జిలేబి.

11 comments:

  1. నమ్మినవాడొకడు, నమ్మనివాడొకడు, ఇద్దరూ చేరేది అక్కడికే, దారులు వేరు, అంతే. విష్ణుమాయ

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      మా బాగా చెప్పేరు!

      జిలేబి.

      Delete
  2. Visit http://bookforyou1nly.blogspot.in/

    for books

    ReplyDelete
  3. Replies
    1. ధన్యవాదాలు డబల్ త్రీ చీర్స్ ట్రీ గారు!

      చీర్స్
      జిలేబి.

      Delete
  4. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి.అణువాదం,మనదేశంలోను,ప్రాచీన గ్రీసులోను ఉన్నా అది సిద్ధాంతానికే పరిమితం.కాని ఆధునిక శాస్త్రం అణువులను (మంచికీ, చెడ్డకీ )ఉపయోగంలోకి తీసుకురాగలిగింది .అలాగే మాలిక్యూల్సిని,న్యూట్రినోస్ని కూడా వైద్యంలో ఉపయోగిస్తున్నారు.ఈ ' దైవ కణాన్ని ' కూడా ఏవిధంగా ఉపయోగించ గలరో వేచి చూడాలి కదా .

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      రాబోవు కాలం లో ఈ జీన్స్ మార్పిడి లాగా, ఈ దైవ కణం మార్పిడి , తద్వారా హైఫై జీన్స్ తయారీ ఇట్లా ఉంటాయేమో మరి.

      రెండు, ఆలోచనా తరంగాలు సత్య నారాయణ శర్మ గారు మరో విషయం రాసారు, ఇట్లాంటి వి కనుగొన్న తరువాయి ప్రళయా త్మక సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉన్నట్టు.

      సో , ఇక వేచి చూడాలి ఏమౌతుందో అని.

      ఈ సంవత్సరం డిసెంబర్ నెల మాయన్ కాలండర్ తో ముడి పది ఉన్నది కూడాను.

      వేచి చూడవలె మరి!

      చీర్స్
      జిలేబి.

      Delete
  5. Replies
    1. నారాయణ స్వామీ గారు,

      నెనర్లు. బహుకాల దర్శనం నా టపాలో ! నెనర్లు.

      జిలేబి.

      Delete
  6. Replies
    1. పీ క్యూబు పురాణ పండ వారు,

      నెనర్లు.

      మీ కోరిక పై మళ్ళీ బాక్ప్యాకు బకరా బాబు మళ్ళీ రాబోతున్నాడు అతి త్వరలో

      చీర్స్
      జిలేబి.

      Delete