అందరూ టపా కి కామెంటు రాస్తారు. సరే, కొంత వెరైటీ గా కామెంటు కోసం ఒక టపా రాద్దామని !
కామెంటడం అన్నది ఒక కళ. అది బ్లాగ్ లోకం లో కొందరికి అచ్చి వచ్చిన విద్య.
మరికొందరికి చాలా కామెంటాలని ఉంటుంది.
కాని సమయాభావం వల్లో, సాంకేతిక కారణాల వల్లో, చిన్నగా రాసి ఊరుకుంటారు.
ఇవ్వాళ బ్లాగ్ లోకం లో జల్లెడ వేసామంటే ఎక్కువగా కనిపించే కామెంటు రెండు చుక్కలు ఒక బ్రాకెట్టు ! :)
ఆ తరువాయి - కనిపించే చాలా కామన్ కామెంటులు - సూపెర్, కెవ్వు, కేక ! హ హ హ , hahahaha ,
lol...ఇలా చిన్ని చిన్ని పదాలతో కామెంటు తారు.
సో ఇవన్ని తెలుగు లోకానికి బ్లాగ్ లోకపు సరి కొత్త పదాలు
కొన్ని ఇప్పట్లో ఉన్న తెలుగు పదాలే, కొత్త అర్థం ఆపాదించుకోవడం కూడా కద్దు. ఉదాహరణకి , కెవ్వు కేక - ఈ పదం టపా సూపెర్ అన్న అర్థం లో వాడతారనుకుంటా . అంతర్జాలం లో మరిన్ని సరికొత్త పదాలు పోను పోను వస్తూంటాయి అనుకుంటాను.
కొంత కాలం పోయాక , నిఘంటువు ఎవరైనా ప్రచురిస్తే , ఈ కొత్త పదాలు ఆ నిఘంటువులో వస్తాయేమో ? మొదట్లో కొంత విముఖం గా ప్రచురించినా పోను పోను వేరు వేరు ప్రచురణలలో కొత్త అర్థాలతో వస్తాయేమో !
మరో పోకడ, టపా కన్నా సుదీర్ఘ మైన కామెంటు- వ్యాఖ్య ! ఇది టపా కన్నా చాంతాడంత మరో టపా అంత నిడివి ఉండటం కద్దు.
కొన్ని చమక్కులు,
కొన్ని కవితలు,
కొన్ని పద్యాలు,
కొన్ని చేణుక్కులు,
కొన్ని సమస్యా పూరణలు
కొన్ని కొంటె దనాలు
కొన్ని ఇన్ఫర్మేటివ్
వెరసి నేటి బ్లాగ్ కామెంటులు
ఓ విన్నూత్న సాహితీ ప్రక్రియ !
ఇప్పటి దాకా రానిది చైను కథానిక, కామెంట్ల ద్వారా ! (టపా ల లో ఇంతకు ముందే గొలుసు కథలు వచ్చేయని ఒక మారు జ్యోతి గారు చెప్పారు - సో , కామెంటుల లో ఇప్పటిదాకా ఈ ప్రయత్నం రాలేదనే భావిస్తాను !
చీర్స్
జిలేబి.