Thursday, September 19, 2013

భిక్కువు - భిక్షా పాత్ర !

 
భిక్కువు - భిక్షా పాత్ర !
 
భిక్కువు భిక్షా పాత్ర తో 
రోడ్డెక్కాడు 
రోడ్డు నిర్మానుష్యం 
 
నుదిటి చెమటను తుడిచి 
భిక్షా పాత్ర ను పక్కన పెట్టాడు 
రోడ్డు నిండా జనవాహిని !
 
చీర్స్ 
జిలేబి 
 
 

Wednesday, September 18, 2013

విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః !

"వైదేహీ, జనకాత్మజే, స్త్రీలు స్వభావ రీత్యా విముక్త ధర్మ రీత్యా చపలులు, భేదాన్ని కలిగించే వాళ్ళు - ఇట్లాంటి పరుష వాక్యాలు నీ వద్ద నించి నేను వినలేను "

చెప్పింది లక్ష్మణుడు - ఉద్దేశించింది సీతమ్మ తల్లిని .

అరణ్య కాండ లో జింక రూపం లో ఉన్న మారీచుడు 'హా సీతా' అంటే , అది తన భర్త రాములవారిదే ననుకుని, లక్ష్మణుని రాములవారిని కాపాడ డానికి వెళ్ళమంటే, లక్ష్మణుండు ససేమిరా కుదరదం టాడు - ఆ ఆర్త నాదం రామునిది కాదు - ఆ మాయావి రాక్షసులది - నిన్ను కాపాడ మని రాములవారి ఆజ్ఞ - ఇక్కడి నించి కదలను గాక కదలను అంటే-

అమ్మవారు "సంరక్త లోచను" రాలై లక్ష్మణుని పరుష వాక్యాలతో అంటుంది -

'లక్ష్మణా, నువ్వు నన్ను పొంద డానికే రాముని వెంట గోముఖ వ్యాఘ్రం వలె పొంచి పొంచి వచ్చావు ఈ కాననానికి" అని .

అంతటి తో ఊరుకున్నదా  ?

"ఇది నువ్వూ , భరతుడు కలిసి ఆడుతున్న నాటకం కూడా అయివుండ వచ్చు. భరతుడు అర్ధం (రాజ్యం) , నువ్వు మరొక అర్ధమైన నన్ను నా పతి నించి వేరు జేయాలని అనుకున్నారు' అంటుంది పరుషం గా  .

"నా పై కోరికతో నువ్వు  రాముడు ఎట్లా పోయినా ఏమైనా కానీ అని ఆతన్ని కాపాడ డానికి  వెళ్ళ నంటు న్నావు "

लोभात् तु मत् कृतम् नूनम् न अनुगच्छसि राघवम् |
व्यसनम् ते प्रियम् मन्ये स्नेहो भ्रातरि न अस्ति ते || ३-४५-७

ఇట్లా పరుష మాటలు మాట్లాడి (వాల్మీకి అంటాడు 'సంరక్త లోచనా ! అని ) అన్న మరో క్షణం లో నే కళ్ళ నీళ్ళు జల జలా రాలి పోతున్నాయి - భీత హరిణి ! - బాష్ప శోక సమన్విత !

మరో క్షణం లో లక్ష్మణుని - अनार्य करुणारंभ नृशंस कुल पांसन అంటూ మరో మారు జాడించడం మొద లెడు తుంది !

ఈ అరణ్య కాండ లో ఈ ఒక్క సర్గ లో నే వాల్మీకి  స్త్రీ ఒక వివశ స్థితి లో ఎట్లా ఎట్లా మాట్లాడ గలదు - ఏమేమి అనుకో గలదు - ఏవిధ మైనట్టి 'reaction' చూపించ గలదు అన్నదాన్ని  ప్రముఖం గా చూపించడం జరుగుతుంది.

యథొ కర్మః తథొ ఫలః  అన్నదానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అవుతుందేమో మరి.

ఇట్లాంటి పరుష వాక్యాలని సీతమ్మ లక్ష్మణుడి తో అనటం - అదిన్నూ తన భర్త తమ్ముడు, పుత్ర సమానుడు ఐన వాడి తో అనటం - దీని పరిణామం - యుద్ధ కాండ లో - రాముల వారితో అట్లాంటి పరుష వాక్యాలు పలికించ డానికి కారణ భూతమయ్యిందేమో మరి కూడా అనిపిస్తుంది .

మళ్ళీ అంటుంది సీతమ్మ లక్ష్మణుడి తో -- గోదాట్లో దూకైనా , అగ్నిలో దూకైనా చస్తా గాని, రాముల వారు లేని జీవితాన్ని నేను చూడ లేను - మరొక్కరి తో ఉండ లేను అని - गोदावरीम् प्रवेक्ष्यामि हीना रामेण लक्ष्मण ! అంటుంది

(రామాయణం లో ఈ అరణ్య కాండ తనకు అన్నిటి కన్నా నచ్చిన కాండ అని చెప్పు కున్నారు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రు ల వారు - ఎందుకంటే - ఇందులో గోదావరి మాట ఉన్నదంట ! కాండం పర్యంతం ఆంధ్ర దేశం ఉన్నదంట !-  అందుకనేమో 'గోదాట్లో దూకి చస్తా ' అన్న పదం ఆంధ్ర దేశం లో ప్రాశస్త్య మైన పదమయి పోయింది మన  'ఆండోళ్ళ కి ' , సీతమ్మ వారి స్టైల్ లో !- అబ్బా, ఈ గోదావరి తీరం వాళ్ళు రామాయణం లో కూడా గోదారి తెడ్డు వెయ్యకుండా ఉండరు సుమీ !!!))

प्रवेक्ष्यामि हुताशनम् |! - అగ్గి లో బుగ్గై పోతా నంటుంది మళ్ళీ .

దీని పర్యవసానం - యుద్ధ కాండ లో అగ్ని ప్రవేశ ఘట్టం !

మరి ఈ అగ్ని ప్రవేశానికి కారణం సీతమ్మ తన గురించి చెప్పిన శోకా తప్త మాటలే తధాస్తు దేవతలయ్యే యా ?

పరుష వాక్యాలను విన్న లక్ష్మణుడు తన రెండు చెవుల మద్య కాల్చిన బాణం  తో పొడిచినట్టు ఉన్నది అని మళ్ళీ ఇట్లా అంటాడు - "ఇట్లాంటి ధిక్కారా లతో నిన్ను నువ్వే శపించు కుంటున్నావు వైదేహీ అని" - धिक् त्वाम् अद्य प्रणश्यन्तीम् !

(పానకం లో పుడక !
నిన్నటి గజేంద్ర హస్తాభిహతేవ వల్లరి కి లేటెస్ట్ ఉదాహరణం - నీనా దావులూరి - అమ్మాయి మిస్ అమెరికా అయితే - సోషియల్ మీడియా మొత్తం రేసిస్ట్ కామెంట్ల తో - సూటి పోటి మాటల తో - మిస్ ఇండియా కూడా ఈవిడ కి అయ్యే సత్తా లేదు - మరి మిస్ అమెరికానా లాంటి కామెంట్ల తో ! భరితం - ఇది కాదా  మరి గజేంద్ర హస్తాభి హతేవ వల్లరి?)

న తు అహం రాఘవాత్ అన్యం కదాపి (పదాపి!) పురుషం స్ప్రుశే !

न तु अहम् राघवात् अन्यम् कदाअपि (पदापि !) पुरुषम् स्पृशे!?

శుభోదయం
జిలేబి
(ఏమోయ్ జిలేబి, రామాయణం మీద పడ్డావు?- వెనక నించి అయ్యరు గారి పృచ్చ!)

Tuesday, September 17, 2013

గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ!

"రావణుని చేత అపహరింప బడి ఆతని ఇంట ఇన్ని రోజులు ఉన్న సీతా, నువ్వు నాకు తగిన దానవు కావు "

చెప్పినది రామభద్రుడు .

అంతటి తో ఊరుకున్నాడా ?

"నువ్వు నాకు తగిన దానవు కావు . లకష్మణుడి నో, భరత శత్రుఘ్నుల లో ఎవరినో, మరీ కాకుంటే, సుగ్రీవు ణ్నో విభీష ణు డి నో వేరే ఎవరైనా సరే నీ ఇష్టం ఎవరినైనా నీవు కోరి వారితో వెళ్ళు ' అంటాడు .

तदद्य व्याहृतं भद्रे मयैतत् कृतबुद्धिना |
लक्ष्मणे वाथ भरते कुरु बुद्धिं यथासुखम् || ६-११५-२२

शत्रुघ्ने वाथ सुग्रीवे राक्षसे वा विभीषणे |
निवेशय मनः सीते यथा वा सुखमात्मनः || ६-११५-२३


పతియే దైవమ్. అట్లాంటి పతి రామచంద్రుడు "జనవాద భయాందోళన చెందిన వాడై " , రెండు ముక్కలైన హృదయం తో అమ్మవారి తో ఈ మాట అంటే - ఇక సీతమ్మ గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ కాక మరి ఎట్లా ఉంటుంది ?

భీత హరిణేక్షిణి అని చాలా సాధారణం గా విని ఉంటాం .

సీతమ్మ గారి ని వాల్మీకి యుద్ధ కాండ లో - రావణ సంహారం తరువాయి గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ! అని పోలుస్తాడు. గజేంద్రుని హస్తం తో అభిహత మైన వల్లరీ అని .(ఒక ఏనుగు చేత లేత కొమ్మ పెకిలించి వేయ బడితే ఎట్లా ఉంటుందో కాకుంటే ఒక ఏనుగు తొండం తో దెబ్బ తిన్న ఒక తీగ కంపనం ఎట్లా ఉంటుందో మరి చెప్పాలా ?)

సందర్భం ఏమిటి ?

స్వామి వారు రావణ సంహారం తరువాయి అమ్మవారితో మాట్లాడే సమయం . అగ్ని పరీక్ష కి మునుపు సంభాషణ .

సింపుల్ గా 'నువ్వు వేరే ఎవరితో నైనా 'సెటిల్' అయిపో , నాకు తగిన దానివి కావు ' అని ఏ మగడైనా అంటే (ఇది చాలా పచ్చి గా ఉన్నదనుకుంటే ఎవరితో నైనా లేచి పో - అన్నాడను కొండీ ) ఇక ఆ స్త్రీ హృదయం ఎట్లా ఉంటుంది ?

వాల్మీకి ఒక ముక్క , జస్ట్ ఒక ముక్క - రాసి ఉండ వచ్చు - రాముల వారు సీతమ్మ తో - నువ్వు నాకు తగిన దానివి కావు' అని అన్నాడని  .

ఆ పై అట్లా పరుష మైన వాక్యాలు రామ భద్రుడు సీతమ్మ వారి తో అన్నట్టు రాసే డంటే - దీని వెనుక - ఆ కాలం లో జనవాదానికి, ప్రజల ఎద్దేవా కి ఎంత భయం ఉండేదో  అని పించక మానదు .

శ్రీ రాముల వారిని ఎవరైనా ఏదైనా అంటే అది మరీ వివాదాస్పద మయి పోతుంది . కాని రామాయణం - వాల్మీకి రామాయణం లో అయోధ్యా కాండం లో ఈ సర్గ శ్లోకాలు చదివితే మనం నిజంగా ఆలోచనలో పడక మానం మరి !

ततः प्रियार्हश्रवणा तदप्रियं |
प्रियादुपश्रुत्य चिरस्य मैथिली |
मुमोच बाष्पं सुभृशं प्रवेपिता |
                 गजेन्द्रहस्ताभिहतेव वल्लरी || ६-११५-२५


ఇప్పుడు కాలం మారింది . అయినా స్త్రీ ఇంకా గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ యే  ! దేశం లో ఎన్ని చట్టాలు , కోర్టులు తీర్పులు చెప్పినా గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ యే అని పించక మానదు



సీతాం ఉత్పల పత్రాక్షీమ్
నీలకుంచిత మూర్ధజాం !

జిలేబి 

Monday, September 16, 2013

Enjoy the path! Let the Goal wait for Me!

I am so obsessed with this Goal !
 
Every buddy says reach the Goal !
What is so great about Goal?
Whether I reach or not its staying eternally there!
So let it wait eternally for me then!
 
Goal, if thou is got by serendipity
Me too hast that time immortal given by thou!
Either the time takes of me
or
I take in time does not matter !
 
May it be so that in the game of me and Me
Let the Me take over of me rather than me try to get that Me
 
Me, Less of Me if its me, then let Thou be that Me
for to be that Me let me not ponder this me for Me !
 
 
Me that not me
Zilebi

Sunday, September 15, 2013

గుర్తింపు కోరిన మేఘం !

గుర్తింపు కోరిన మేఘం !
 
ఒక మేఘం గుర్తింపు కోరింది 
మేఘ గర్జనై ధారాపాత మయ్యింది 
ఒక చినుకు గుర్తింపు కోరింది 
కుంభవృష్టి యై కురిసింది 
ఒక కోన గుర్తింపు కోరింది 
జలపాతమై తల కోన అయ్యింది 
ఒక పిల్ల కాలువ గుర్తింపు కోరింది 
నదియై పరవళ్ళు తొక్కి మహానది అయ్యింది  
ఒక మహానది గుర్తింపు కోరింది 
వరదై పెనువరదై సుడిగుండమై  సాగరాన్ని చేరింది 
ఒక సాగరం గుర్తింపు కోరింది 
ఉవ్వెత్తున లేచి ఉప్పెనై ఆకసాన్ని ముద్దెట్టేసు కుంది 
 
చర్విత చర్వణం !
హిరణ్యగర్భః  సమవర్తతాగ్రే ....  
 
 
శుభోదయం 
జిలేబి 
 
 
 
 

Friday, September 13, 2013

తెలుగు తండ్రి !

తెలుగు తండ్రి ! ఒక స్నాప్ షాట్ !
 
ఫోటో కర్టెసీ గూగులాయ నమః !


చీర్స్ 
జిలేబి 

Thursday, September 12, 2013

Now your credit card is valid in Heaven too - Carry your credit card to the Heaven!

 
Zilebi Bank now serves you better and better !
 
Grab the opportunity now or its never!
 
Its a once in life-time opportunity !
 
Never miss it!
 
Our credit card is valid even in Heaven !
 
For Zilebi Bank Credit card holders entry to Heaven is free and entry to Hell is free too ! (This is the bonus we give you free!)
 
For all the privileges you enjoy in Heaven we give 50% discount. Remaining 50% you can pay by free-choice installment  on your next life ! You can even ask for total waiver on your next life spendings now by a small fee annual ! (T&C apply)!
 
What more! If in Hell you can seek postponement of penalties on you by Hell by topping it eternally on our credit card and pay it later conveniently in your next life! (We give discounts for these! T&C apply!)
 
cheers!
Zilebi Bank!

Wednesday, September 11, 2013

కొత్త ప్రపంచపు సరికొత్త శ్లోకాలు!

 
కొత్త ప్రపంచపు సరికొత్త శ్లోకాలు:

గూగుల్ బ్రహ్మ గూగుల్ విష్ణు గూగుల్ దేవో మహేశ్వరః
గూగుల్ సాక్షాత్ "అంతర్జాల బ్రహ్మం" తస్మై శ్రీ గూగులాయ  నమః!

యాహూ నమస్త్యుభం వరదే "సెర్చ్" రూపిణీ
సెర్చ్ ఆరంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా!



చీర్స్
జిలేబి.
 

Tuesday, September 10, 2013

జిలేబి నీ ఒడ్డాణం బరువెంత ?


పద్మనాభ స్వామీ వారి పాదాల చెంత ఒద్దికగా కూర్చుని స్వామీ వారి పాద సేవ చేసుకుంటూ ఉన్న లక్ష్మమ్మ దేవేరి  'పోస్ట్' అంటూ కేక వినబడటం తో ఉలిక్కి పడి పోష్టు అందుకుని స్వామీ వారి చెంత కిచ్చింది .

స్వామీ వారు అరమోడ్పు కనులతో చూసేరు .

లక్ష్మమ్మ కొచ్చెను మార్కు మొగం పెట్టింది స్వామీ వారి పాదసేవను విడనాడ కుండా .

పద్మనాభ స్వామీ వారు హు అన్నారు .

'స్వామీ ఎవరి వద్ద నించి పోష్టు ?' దేవేరి కి  కొంత సందేహం మళ్ళీ భూలోకం లో కి స్వామీ వారు ఏమైనా వెళ్లి పోతారేమో అని .

దేవీ నీ ఒడ్డాణం బరువెంత ? స్వామీ వారు అరమోడ్పు కనులతో అడిగేరు .

దేవేరి సిగ్గు పడి తే గులాబీ చెక్కిళ్ళు కెంపులు విసిరేయి .

స్వామీ వారు , అబ్బా ఈ ఆండోళ్ళ హృదయం ఎప్పటికీ అర్థం కాదు సుమీ అనుకుని - తానేమన్నా సరస మాడే డా ఇప్పుడు ? జస్ట్ మేటర్ ఆఫ్ ఫెక్ట్ అడిగేడు - దేవీ నీ ఒడ్డాణం బరువెంత అని . జస్ట్ మేటర్ ఆఫ్ ఫేక్ట్ కి ఇంత సిగ్గు మొగ్గై పోవాల్సిన పనే ముంది ఇప్పుడు ?

దేవీ ఇది రిజర్వ్ బ్యాంకు వారి తాఖీదు -సరసానికి అడగ లేదా ప్రశ్న - సీరియస్ మేటర్ - నీ ఒడ్డాణం బరువెంత ?

దేవేరి ఈ మారు ముక్కు పుటాలు ఎగరేసింది .

హు హు ! ఇప్పుడు మా మీదే మీ కన్నులా ! మా ఒడ్డాణం బరువు ఇప్పుడు కావాల్సి ఒచ్చిందా వీరికి ! ఎంత దాకా వచ్చింది విషయం !

ఎందుకో రిజర్వ్ బ్యాంకు వారికి మా ఒడ్డాణం బరువు ? దేవేరి కౌంటరు వేసింది

స్వామీ వారు విసుగ్గా మొగం పెట్టేరు

'ఆ భోళా శంకరుణ్ణి చూడు - ఏమీ పట్టించు కోడు - ఆ పార్వతమ్మ ఏదో అట్లా సాదా సీదా  చీరల తో , పుర్రెల ఆశామి తో గడిపేస్తుంది . మరి  నీవేమో మెడ నిండా నగలు దింపితివి - ఇప్పుడు ఈ తాఖీదు ' స్వామీ వారు 'ఇదేమి ఖర్మ రా బాబు, ఈ రీజర్వ్ బ్యాంకు వారి కొర్రీ ' అని విసుక్కున్నారు

దేవేరి మరో మారు ముక్కు పుటాలెగుర వేసింది - వెంకన్న బాబు వై లచ్చి లేక కుబేరుని స్వామీ వారు వద్ద బకాయి పడ్డ విషయం వారికి గురుతు కి తెద్దామనుకుని  అనుకుని పోనీ లే మన స్వామీ వారే కదా అనుకుని వదిలేసింది దేవేరి .

దేవీ ఇప్పుడేం చేద్దా మను కుంటు న్నావ్ ? స్వామీ వారి ప్రశ్న

'ఒడ్డాణం త్రాసు లో పెట్టి బరువు చూడాలా ? రీజెర్వ్ బ్యాంకు వారి వద్ద సరిఐన త్రాసైనా ఉందా !' అమ్మవారి రిటార్టు

***********

జిలేబి ఉలిక్కి పడి నిద్ర నించి లేచింది !

అమ్మో అమ్మో దేవేరి వారి ఒడ్డాణం బరువే ఎంత అని రిజర్వ్ వారు కొచ్చెనించి నపుడు , ఇక దేశం లో ని జిలేబీ ల గతి ఏమి గాను అనుకుంటూ భోషాణం తెరిచి ఓ మారు తన నగా నటరా అంతా కనుల పండువ గా ఒక్కమారు చూసు కుని 'ప్చ్ ప్చ్ వీటి లెక్కలు కూడా ఎప్పుడో అప్పుడు ఈ రీజేర్వ్ బ్యాంకు వారు అడుగు తారేమో మరి ' అనుకుని వా అని బోరుమంది సగం నిద్ర లో !
అయ్యరు గారు ఉలిక్కి పడి నిద్ర లేచారు !

జిలేబి ఏమయ్యింది ?

మన నగలన్నీ ఇక మనవి కావండి !

అయ్యరు గారు చికాగా మొగం పెట్టి 'చ చ తెల్లారి గట్రా హ్యాపీ గా నిద్ర పోక ఇదేమి గోల్డు మోహమో ఈ ఆండాళ్ళ కు అంటూ మరో వైపు తిరిగి పడు కునేరు !

 జిలేబీ లు ! తస్మాత్ జాగ్రత్త మూడు తలల సింహం పొంచి ఉండి మిమ్మల్ని చూస్తోంది మీ  ఒడ్డా ణా ల ని లగేసు కోవడానికి !!

చీర్స్
జిలేబి
(I like two kinds of gold !- One domestic and the other imported!)

RBI query on temples’ gold stocks sparks protest in Kerala ---> The Hindu Business Line వారి వార్త చదివేక !

Tuesday, September 3, 2013

బులుసు వారి 'ఇంటి మొగుడు' కి జిలేబి హాట్ ఫిక్స్ !

బులుసు వారి 'ఇంటి మొగుడు' కి జిలేబి హాట్ ఫిక్స్ !

ఇంటి మొగుడు - రైల్ ప్రయాణం లో 'పద' నిషాలు ! - భాగం మొదటి ఇక్కడ చదవాలి !

భాగం రెండు (ఇది జిలేబి హాట్ ఫిక్స్ - సరదా కి మాత్రమె!)

*****


హమ్మయ్య సక్సెస్ఫుల్ గా మరో మారు ప్రయాణం లో కథలు వినిపించేసా అనుకుంటూ హైదరాబాద్ నగరం లో రైలు బండి దిగా .

'ఏమండీ ' అన్న కేక వినిపించడం తో తల తిప్పి చూసా . ఒక ముదిత . ఎవరో మరీ జిలేబీ లా ఉంది - అబ్బే మనలని కాదని అడుగు ముందు కేసా .

ఏమండీ మిమ్మల్నే అంటూ గబ గబా దగ్గిరికి వచ్చేసిందా విడ

నా వెనుకే దిగిన ఆ రైలు ప్రయాణం లో నా కథ విన్న మొగుడూ పెళ్ళాం - లో మొగుడు  'ఆ ఏమోయ్ ఇంటి మొగుడు ' మీ కోపమావిడ కి నీ మీద ఎంత కోపమైన ప్రేమో చూడు - స్టేషన్ కి నీ కోసం వచ్చేసింది ' అన్నాడు

నా పిండా కూడు నా పెళ్ళాం ఏమిటి ? ఈవిడెవరో నన్ను కాదు పిలుస్తోంది అనుకుంటూ మరో అడుగు వేసా.

ఆ ముదిత 'ఏయ్  వెంకట్ ! ఎంత నా మీద కొపమైనా - నేను మిమ్మల్ని కోపగించి పెళ్లి చేసుకున్నా నేనెవరో తెలీనట్లు అట్లా వెళ్లి పోవడమేనా అంటూ ముక్కు చీది  కళ్ళ లో నీళ్ళు జలజలా పారేసు కుంది !

అబ్బే మీరెవరో నాకు తెలీదండీ అనబోయా !

పక్కనే ఉన్న మొగుడూ పెళ్ళాం నా ముందు కొచ్చారు .

'ఏమోయ్ వెంకటేశ్వర్లు - ఇది మీ విరసం లో సరసమా ' అన్నారు !

నా బొంద విరసం లో సరసం ఏమిటి ? విరసం గురించి నాకేం తెలుసు అనబోయి హ్హి హ్హి అన్నా .

ఆ ముదిత నా దగ్గిరకొచ్చి నా చేయి పట్టే సుకుని 'పదండి ' ఇంటి కి వెళ్దాం అంది '

అయ్య బాబోయ్ ఇదేదో నా కొంప మునిగేట్టు ఉందే  అనుకున్నా .

ఇక ఊరుకుంటే లాభం లేదని-

;అబ్బే , మీరెవరో నాకు తెలీదండీ ' వేరే ఎవరైనా మీ వారై  ఉంటారు ! మీ కేమన్నా నిద్రలో నడిచే అలవాటుందా ' అంటూ రివ్వున పారి పోవా లనుకున్నా గాని ఆవిడ పట్టిన చేయి ఉడుం చేయి లా ఉన్నది వదుల్చు కోవడానికి కుదరట్లే !

'ఓర్నాయనో ! ఓలమ్మో నా మొగుడు నన్ను ఒగ్గేస్తున్నాడు  అంటూ అ ఆవిడ ఆరున్నొక్క రాగాలు పట్టేసు కోవడం తో నాకు కాళ్ళు చేతులు ఆడ లెదు.

రైలు ప్రయాణం లో కథలు చెబితే ఇట్లా నిజమయ్యిమ్దేమిటి చెప్మా అనుకున్నా .

బింకంగా మళ్ళీ మరో మారు 'మీరెవరో నాకు తెలీదు' అన్నా

పక్కనే ఉన్న మొగుడూ పెళ్ళాం ఊరు కుంటే నా ! 'ఇదిగో వెంకటేశ్వర్ల్లూ - అట్లా పెళ్ళాన్ని నువ్వెవరో అంటా  వేమిటయ్యా  ! అన్నారు నన్ను ఆవిడ దగ్గిరకి తోస్తూ .

అంత లో సీను  మరీ ఘోరమై పోయింది .

రైల్వే స్టేషన్ లో ఓ  ఆడది కళ్ళ  నీళ్ళు పెట్టు కుంటే జనాలు ఊరుకుంటా రా ! అదీను జిలేబి లాంటి ముదితల్ కళ్ళ నీళ్ళు జూస్తే జనాల కళ్ళ లో నిప్పు కణికలు రాలవూ మరి ?

పెద్ద గుంపు చేరి పోయింది మా చుట్టూ .

నాకు పై ప్రాణాలు పై పైనే పోయేటట్టు అనిపించింది .

ఇంతలో ఎక్కణ్ణుంచి వచ్చాడో గాని ఒక పోలీసు ధబీమని ప్రత్యక్షమై ఏమయ్యింది అంటూ రంగం లో దిగాడు .

కొస ప్రాణం ఇక మరీ పై పైకి పోయింది

ప్రక్కనున్న మొగుడు పెళ్ళాలు నా సో కాల్డ్ వైఫ్ తరపున వకాల్తా పుచ్చేసు కున్నారు !

నా పని గోవిందా గోవిందా అయ్యేటట్టు ఉంది అనుకుని ' పోలీసు సార్  పోలీసు సార్  ' అంటూ కథ మొత్తం చెప్ప బోయా

నీ ...లం  ... . ఆండోళ్ళ  మీద ఇట్లా కంప్లింటా .. నడు  పోలీసు టాణా  కి అంటూ నా రెక్క పుచ్చు కుని బర బరా లాక్కె ళ్ళా డు  నన్ను ఆ పోలీసోడు .

సార్  సార్ నా మాట వినండి అంటూ ఉంటే విని పించు కుంటే నా !

కొంత దూరం వెళ్ళాక ఆ ఇప్పుడు చెప్పవోయ్ అన్నాడు పోలీసు వెంకట సామి

కథ మొత్తం జెప్పా .

నీ కథ ని నే నమ్మాలా అన్నాడు

అవ్ అన్నా

నమ్మితే నాకేమి లాభం అన్నట్టు జూసాడా వెంకట సామి

నా ధోతీ లోని నిజారు డ్రాయరు జేబు లో డబ్బు లున్నా యని వీడికేట్లా తెలుసు చెప్మా అని హాశ్చర్య  పోయా .
అబ్బా ఈ పోలీసోళ్ళది మరీ ఎక్స్రే కళ్ళు సుమీ అని అనుకో కుండా ఉండ లేక పోయా !

ఇది హాశ్చర్య  పోవడానికి సమయమా !

వెంటనే వీణ్ని  వదిలించు కుంటే గాని నా ప్రాణం గట్టేర దు అన్నట్టు అయ్యింది నా పరిస్థతి .

పోలీసోడి కి నాకూ మధ్య జరిగిన అగ్ని పరీక్ష లో నా నిజారు డ్రాయరు జేబు ఖాళీ !

పోలీసోడు మాయమై పోయేడు !

హమ్మయ్య ! అనుకుని నిట్టూర్చి కూసింత గర్వంగా తలెత్తి సంతోష పడి ఎంతైనా హుషారు గా తప్పించేసు కున్నా కథల్జేప్పిన దానికి నికరం గా నిజారు ఖాళీ ఖర్చు పది వేలరూపాయలు కళ్ళ  ముందు కనిపించినా అది నా పరువూ ప్రతిష్టల ముందు తక్కువే  అనుకుని జమాఖర్చులు లెక్క వేసుకుని నేనే లాభం పొందా నానుకుని తలెత్తు కుని స్టేషన్ బయట కు వచ్చి 'ఆటో ' అన్నా .

*************

'నీ  సిగ దరగా  ! ఎంకీ ఏమి చక్కగా యేషం  గట్టినావే అన్నాడు ఆ పోలీసోడు ఆ ఆడ దాన్ని జూసి ఆవిడ చేతిలో రూపాయ నోటులు  కుక్కేస్తూ .

'ఎంకట సామీ ! పదేలు కుదేసావ్ నా మొగుడి కాడ ! నాకు మాత్రం రెండే లే నా ?' ఆ పూబోడి కసిరింది ఎంకట సామిని " నేనే కదా అట్లా రైలు నించి నీకు ఎస్ ఎమ్ ఎస్ కొట్టి కథ జెప్పి వాణ్ని ఫిక్స్ జేసింది ?  ఆ పోర గాణ్ణి రెండు మూడు సార్లు రైల్లో చూసా. ప్రతి సారి ఏదో కథ జెప్తుండు ఈ సారి రంజు గా కధ జెప్పిండు . జెప్పిండు కదా అని నేనే కదా ఈ ప్లాన్ వేసా నాకు చేరి సగం ఇవ్వాలి"

అవున్లేవే ! అయినా ఈ పోలీసు వేషం కట్టి ఎంత రిస్కు దీసుకున్నా ననుకున్నావ్? నిజం పోలీసోడు ఎవడైనా నన్ను జూసి ఉంటే నా గతేం గాను ? అని వాడు  ఒక చేయిని మీసాల మీద కి పోనిచ్చి మరో చేయిని ఆ పోరదాని ఎద మీదికి పోనిచ్చి -  రేతిరి కి ఇంటికి రావే పెండ్లా మా '' అన్నాడు నవ్వుతూ .

*************

ఆటో ఎక్కి తల టీవి  గా పెట్టి ఆటో వాడి తో ధీమా గా అన్నా - "అమీర్పేట్ వెళ్ళ వోయ్" అని.

స్టేషన్ దాటి ఆటో టర్న్ అవుతూంటే ఆ పోలీసోడు ,  నా సో కాల్డ్ పెండ్లాం జేతిలో రూపాయలు కుక్కడం జూసి వామ్మో వామ్మో ఇంత మోసమా అనుకుని నోరు తెరిచేసా ! ఆటో వాడు రయ్యి మన్నాడు లేకుంటే నా  వీళ్ళ పని బట్టి ఉండనూ మరి !



చీర్స్
జిలేబి