ఓవర్ టైం అలోవేన్స్ కోరిన ఏడు కొండల వాడు !
పాల సముద్రం ! మధ్యలో అలవోక గా కనులు మూసుకుని శ్రీదేవి కాళ్ళు సుతారం గా ఒత్తు తూంటే అట్లా తీరిగ్గా జోగుతున్నాడు మహా విష్ణువు.
డమాల్ మని వైకుంటం తలుపులు తెరుచు కుని విస విస మిస్టర్ పెరుమాళ్ళు మిస్సెస్ అలమేలు మంగా వచ్చేరు !
తన అంశ ఐన వెంకన్న ని జూసి మహావిష్ణువు - రావోయ్ - ఏమి విశేషాలు - వైకుంట ఏకాదశి బాగా జరిగిందా అంటూ కుశల మడి గేడు .
లక్ష్మీ దేవి మంగా తాయారుని ఇంటి లోపలి తీసుకు పోయింది
ఏడు కొండల వాడికి మండి పోయింది . రెండు రోజులుగా జనవరి ఒకటి, వైకుంట ఏకాదశి అంటూ తన్ను ఓవర్ టైం చేయించి దస్కం బాగా దక్కినట్టు పేపర్లో వచ్చిన వార్త చదివి అప్పుడే హాట్ హాట్ గా ఉన్నాడు నామాల సామి.
నాజూగ్గా పాదాలు వత్తు తూంటే కులసాగ్గా జోగుతున్న మహా విష్ణువు ని జూస్తే మరీ మండి పోయింది కలియుగ దైవానికి. తను రోజుల తరబడి నిల్చొని కలియుగ వరదు డై ప్రపంచాన్ని కాస్తూంటే , ఈ పెద సామి తీరిగ్గా కాళ్లార బెట్టు కుంటూ జోగుతున్నాడు !
వైకుంట ఏకాదశి అంటూ నన్ను మరీ ఓవర్ టైం గావించేసారు . ఇక నేను కలియుగ వరదు డై ఉండను . వేరే ఏదన్నా కాళ్ళు జాపు కుని ఉండే రోల్స్ అండ్ రేస్పాన్సి బిలిటీ నా కివ్వు - డిమాండ్ చేసాడు వెంకన్న .
గతుక్కు మన్నాడు మహా విష్ణువు ! వెంకన్న ఆ రోల్ చెయ్యక బోతే తానె అతని పని కూడా చేయాలి - ఎట్లా అయినా వరదన్న ని బోల్తా కొట్టించి మళ్ళీ కొండకి పంపేయాలి అనుకుని మహా విష్ణువు నిమ్మళం గా చెప్పేడు -
దానికేమి వరదా ! అట్లా గె చేసేస్తా ! మిజోరం రాష్ట్రం అని ఒకటి ఉన్నది అక్కడికి నిన్ను బదలాయిస్తా ! సాఫీ గా దినాలు సాగిపోతాయి . ఆంధ్ర దేశం ఇప్పుడు ఎట్లాగూ ఫాస్ట్ మోడ్ లో ఉంది కాబట్టి గట్టి గా నిలబడి పని జేసే ఆసామి ని ఎవర్నైనా జూసి కలియుగ వరదు ని గా పెట్టేస్తా చెప్పేడు స్వామి .
అది సరే, మిజోరం లో నిన్ను పెడితే అలోవేన్సు లు గట్రా వస్తాయి గాని , నీ కుబేరుని బకాయి తీరు తుందం టావా వెంకన్నా ? అడిగేడు మహా విష్ణువు సందేహం గా .
వెంకన్న గతుక్కు మన్నాడు . కుబేరుని బకాయి ఎప్పటి కి చెల్లు అవుతుందో తనకు లెక్కలు తెలియ వాయె ! అందరూ ఏడు కొండల పెరుమాళ్ళ కే ఎరుక అనేస్తారు గాని , ఈ కుబేరుని బకాయి మాత్రం తనకు అర్థం కాని గట్టి పిండం .
కుబేరుని బకాయి మిగులు ఎంతో నాకు తెలియదే మరి జెప్పాడు వెంకన్న .
ఐతే మిజోరం వద్దులే . పనికి రాదు నీకు చెప్పేడు మహా విష్ణువు .
పోనీ ఇట్లా కాళ్ళ రి గి పోయే లా పని జేస్తున్నా కదా అట్లీస్ట్ ఓవర్ టైం అలోవన్సు అయినా సేన్క్షన్ చేయరాదూ ?? విన్న వించు కున్నాడు పెరుమాళ్ళు .
హమ్మయ్య వెంకన్న మన దారికి వచ్చేడు అనుకుని మహా విష్ణువు సంతోష పడి - దానికేమి లే , ఓవర్ టైం అలోవన్సు నీ కిచ్చేయ మంటా దేవస్థానం వారికి ఆర్డరు పాస్ జేసెడు స్వామి -
"వెంకన్న కి ఓవర్ టైం అలోవన్సు ఇచ్చి - ఆ దస్కాన్ని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ క్రింద వెంకన్న బకాయి అకౌంట్ విత్ కుబేరా బ్యాంక్ కి జమ చేయ వలసినది గా ఆర్డినేన్సు జారీ చేయ బడినది "
చీర్స్
జిలేబి