Monday, July 11, 2016

జిలేబి తో బ్లాగ్ముఖీయం ! నారదాయ నమః !

జిలేబి తో బ్లాగ్ముఖీయం ! నారదాయ నమః !
 

మా నాన్నే ! మా నాన్నే !

వంక సన్నం వాగు (ట) లావు అనబడు బ్లాగోదరుడు జిలేబి ఫాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అట ! జిలేబి తో ఫేస్ టు ఫేస్ విత్ అర్నాబ్ లా ఒక ముఖా ముఖి పెట్టాలని అందులో ఎవరైనా జిలేబి ని కొచ్చనించని చెప్పడం తో జిలేబి కి కడుపు నిండి పోయింది !


మొన్ననే రాసా, జిలేబి కి టపా కి మేటరు కరువై ఓ నెలరోజుల బాటు టపా ఏమీ లేకుండా ఆయాసం తీర కుండా  ఉండే !;

ఆ పై దేముడు బాబాయ్ కనంబడి వరమిచ్చే టపా వ్రాయటానికి ;

ఆ వరానికి కష్టే ఫలే వారు బుర్రలో గుంజు అన్నారు !

ఈ బుర్రలో గుంజు ఏమిటబ్బా సినబ్బా అనుకుంటా ఉన్నా !

గుంజు అంటే తీటా లేక రంధ్రమా ( జిలేబి కేమన్నా బ్రహ్మ రంధ్రం ఓపెన్ అయి పోయినాదా అని బహు సంతోష పడి పోయి ఆంద్ర భారతి ని కొచ్చనిస్తే గుంజు అంటే -> చిక్కి పోవు అని చూపించి నాది :) అన్నా ! కష్టే ఫలే వారు సూక్ష్మం పట్టేసారుస్మీ అనుకోకుండా ఉండ లేక పోయా ! ఎంతైనా తాత తాతే ! బామ్మ బామ్మే ! జేకే !


సరే ఇక వంక సన్నం వాగు (ట) లావు వారి ఫర్మానా కి వస్తా !

పద్మార్పిత ఫాన్స్ అసోసియేషన్ అన్న బ్లాగు చూసి హన్నా ! జిలేబి కి ఫాన్స్ అసోసియేషన్ లేక పోయినాదే అని బహు కష్టపడి దుక్ఖించి, చిట్కి వేసారి పోయా అప్పుడెప్పుడో !

ఆ కొరత తీర్చ డానికి వంక సన్నం వాగు (ట) లావు వారు ఇప్పుడు జిలేబి బ్లాగ్ముఖీయం పెట్టమనటం తో చీర్సు సహిత జిలేబి టపా కి మేటరు లభ్యం తధ్యం అన్న పేరాశ తో ఇట్లా మరో టపా బారి పడి నాది :)

బ్లాగోదరులారా ! బ్లాగోదరిణీ లారా ! కమింటు కింగు లారా ! కామింటు క్వీను లారా! ఇదే మీకు స్వాగతం ! సుస్వాగతం !

జిలేబి తో బ్లాగ్ముఖీయం ! మీరే అర్నాబ్ ! నేనే ఆపొసిట్ చైర్ లో కూర్చున్న 'అంబో' అనబడు గెస్టు :)

జిలేబి కి కష్టం కలిగించ కుండా వంక సన్నం వాగు(ట) లావు వారు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేశారు కూడానూ :)

We, the fans of “జిలేబి”, wish to conduct an interw with you. Be pleased to consider.
Let us follow the following guide lines.
1.Let the interview be in the form of questions and answers. (అబ్బా ! జిలేబి కి జోష్ వచ్చేసే !)

2.Please open a post by name MY INTERVIEW WITH PUBLIC in your own blog, or with your favourite title “ Naradaayanamah”.


The questions will be posted in the comment box, the replies also to be in the form of reply comment.

4. జిలేబి, Please answer all questions. This interview may continue for days. Any question irritating you, you are at liberty to skip, but at the same time answer that you are ‘’skipping’’ the question. 
For skipping the question జిలేబి need not give any reason; No reasons should be asked by questioners;


5. This is for fun and as you are much interested in fun let us enjoy.

6.Let the interview to be conducted in telugu  ; మా నాన్నే మా నాన్నే టెల్గూ అంటే ఎంత మక్కువ :)


7.I also wish to remain incognito, you are at liberty to add conditions before starting the interview.
(వంక సన్నం ఇంకాగ్నిటో అనబడు ఇంకిన అగ్ని కాదా ! జేకే !)


కాచుకోండి జిలేబి దెబ్బ ! సత్తే పే సత్తా !

జిలేబి తయారు ! హాట్ హాట్ !

వడ్డనలకి వెరవం !


చీర్స్
జిలేబి 
శుభోదయం !

Saturday, July 9, 2016

దేముడు బాబాయ్ :)

దేముడు బాబాయ్ :)
 
రాముడిని వెతుకబోవ దేముడు కనబడెన్ !

ఈ మధ్య బ్లాగులో దేముడు బాబాయ్ ఎక్కువ గా కనబడటం మొదలెట్టడం తో బెత్తం మేష్టారు దేముడు లో ము గాదోయ్ వు ఉండాలోయ్ అంటూ వెనుక బడేరు :)

గురువు గారి వెనుకే శిష్య పరమాణువు గూడా బడేను !

ఈ ము కారము ఎట్లా వచ్చి ఉండ వచ్చు ? అని ఆలోచిస్తే ఓ మోస్తరు కాముడు అన్న పదం గుర్తు కొచ్చింది !


కాముడు కాముడు అంటూ కావుడు కావుడు అనటం కూడా కద్దు అనుకుంటా :)


అట్లా ముకారము వు కారము అయినట్టు యిక్కడ వు కారము ము కారమయి పోయిందేమో అను కున్నా !

మొత్తం మీద చాలా రోజుల తరువాయి టపా వ్రాత కి మోక్ష మొచ్చేను !

ఈ మధ్య ఒక నెల రోజుల బాటు కమింట్ల తో నే భుక్తా యాసం గడిచి పోయింది !

ఈ నేపధ్యం లో ఈ దేముడు బాబాయ్ కనబడి జిలేబి నీ మొర ఆలకించితి ! నీ టపా కు మేటరు గా వచ్చితి ;

బంతాట ఆడేసు కో అన్నాడు !
మా ఏడు కొండల పెరుమాళ్ళు ఇంత దయ తలిచే డన్న మాట !

దేముడా ! నీకు జోహారు !


సో, బ్లాగు మిత్రోదరు లారా ! ఈ దేముడు బాబాయ్ ఎట్లా వచ్చి ఉంటా డను కుంటారు ?


చీర్స్
జిలేబి

Friday, June 10, 2016

మాలిక లో మీ టపా టాప్ లైన్ లో రెండు మూడు రోజులు కనబడాలి అంటే ఏమి చెయ్యాలి ! :)

మాలిక లో మీ టపా టాప్ లైన్ లో రెండు మూడు రోజులు కనబడాలి అంటే ఏమి చెయ్యాలి ! :)


ఈ మధ్య వరస బట్టి మన సో కాల్డ్ అహ్మద్ చౌదరి (!?) బ్లాగు లు సాక్ష్యం + కసక్ writes మా మాలిక లో టాప్ లైన్ లో ఉంటా వుంటే ( ఈ రోజు కూడా ఉంది :) మిగిలిన లేటెస్ట్ అప్డేట్ అయిన ఏ బ్లాగు అయినా స్క్రోల్లింగ్ లో దాని క్రిందే ఉండే లా కని పిస్తుంది !

వార్నీ ఏమి మాయ జేసినాడు అహ్మదు అని రెండు మూడు రోజులు వరసబెట్టి గమనిస్తే అర్థమయి పోనాది :)

అబ్బోడు ఓ టపా కొట్ట గానే అది మాలిక లో స్క్రోల్లింగ్ వచ్చేసాక దాన్ని మళ్ళీ అప్డేట్ మోడ్ లో ఫ్యూచర్ డేట్ లో అప్డేట్ చెయ్యటం మొదలెట్టేడు !

హద్దరి బన్నా ! ఇదన్న మాట బగ్గు మాలిక లో అనుకుని సరే పోన్లే మనమూ ఓ రాయి వేసి  చూద్దామని నా టపా నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం అన్న టపా లాస్ట్ శని వారం పెట్టింది మళ్ళీ అప్డేట్ మోడ్ లో బెట్టి ఫ్యూచర్ డేట్ అంటే ఇవ్వాల్టి తారీకుకి (ఇది తారీకే :) తారీఫు కాదు జేకే ! ) అప్డేట్ చేసి గమనిస్తా ఉంటె ఆ టపా స్క్రోల్లింగ్ లో మాలిక లో ఇవ్వాల్టి దాకా టాప్ లైన్ లో నాట్య మాడింది :)

హన్నా ! మా లక్కు పేట రౌడీ నిదుర లే ! అని ఓ సూచనా ప్రాయం గా కామెంటు కందం కూడా ఒక్కటి ఇచ్చుకున్నా !

ప్చ్ ! అన్న రౌడీ చూసారో లేదో తెలీదు !

సో ఈ టపా !
మీ టపా మాలిక్ లో స్క్రోల్ టాపర్ చెయ్యా లనుకుంటున్నా రా ! అయితే వెంట నే పై చెప్పిన విధం లో ప్రొసీడ్ అయి పోండీ !


నారదాయ నమః !

చీర్స్
జిలేబి

Wednesday, June 8, 2016

నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !

 
నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !
 
కాస్తా విను చిన్నమ్మా !
విస్తార మయినది లోక విస్మయ రీతుల్
చూస్తున్న మేర కలయే !
నాస్తిర్లోకం జిలేబి నాటక రంగం !



శుభోదయం!
జిలేబి

Thursday, June 2, 2016

జూన్ రెండన 'తారీఫు' !

జూన్ రెండన తారీఫు ! 

 
ధర్మ పక్షము నాడిగా ధర్మ మార్గ
మందు జనులెల్ల నుత్సాహ మతిశయింప
తెలుగు గడ్డకు రెండన తీరు లొచ్చె!
జూను రెండవ తారీకు చుక్క లొచ్చె
!
 
కర్మ మార్గపు దారిన  కాంగిరేసు
పూని విభజింపగ జనుల వునికి తెలిసె
బాగు పడుదురు మునుముందు  భారతీయ
జనుల మాటకు విలువయు జాల కలిగె !
 
చిన్న రాష్ట్రాల  పాలసీ చిగుర తొడిగె
దేశమున కిది మేలు సందేశము యన 
నేడు తెలుగు వారి పలుకు నేర్పు  తెలిసి
భాజపా కూడ  జతగట్టి  భాగ మయ్యె !
 
దుష్ట పార్టీలనిరి వారు తోడుదొంగ
లనిరి తప్పేమియునులేదు రాజకీయ
నాటకము! జన వాహిని నాడి తెలియ
గుండె దిటవు గలిగి తెలంగాణ తెచ్చె!
 
బాట  యిదికాదని జనులు భావ గీతి
గ యిక తప్పొప్పుల సరితూకమును వలదు !
రాష్ట్రమునకు నేడు వలయు రాజ మార్గ
ము! శరవేగము బోవలె ముందు సాగ

యింపుగా వచ్చినది వారి  యిచ్చ ! తెలివి 
గలిగి యాంధ్రుడు మేలగు కాల మిచ్చు
విభవమొప్పార సత్కీర్తి ప్రభలు తోడ
తేజరిల్లవలె  భువిని  దిక్కులదర!

తెలుగు వారి విజయములు దేశమునకు
నాత్మశక్తి యొసంగుచు నవత  నిచ్చు 
కాల గతిలోన మనకెల్ల!   కరుణ జూపు 
ధర్మపరులకు దైవమే దారి చూపు

కాన పునరంకితులు కండు జూను రెండు
నవ తెలంగాణ రాష్ట్రము నాది యనగ
నవ నవోజ్వల దివ్యాంధ్ర నాది యనగ
చెప్పి ఘనదీక్ష బూనుడీ చిత్తములను!
 
తెలుగు తేజమా యీదీక్ష తీసు కొనుము
తెలుగు వీరుడా యీదీక్ష తీసు కొనుము
తెలుగు యామినీ యీదీక్ష తీసు కొనుము
అందరీ దీక్ష గొనవలె  యనె జిలేబి ! 
 
శుభోదయం!
చీర్సు సహిత
సావేజిత
జిలేబి

Wednesday, May 25, 2016

శ్రీ కష్టే ఫలే వారికి వివాహ దిన వార్షికోత్సవ శుభ సందర్భం గా - 'వడి యాలు' - 'కండ' కావ్యం !

శ్రీ కష్టే ఫలే !- వడియాలు - 'కండ' కావ్యం !
 
బ్లాగ్ గాంధీ కాలక్షేపం కబుర్లు శ్రీ  శర్మ గారు,
 
మీ మే ఇరవై అయిదు తారీఖు  తారీఫ్ :)

మీ జీవితం లో 'బంగారం' మీ శ్రీమతి ప్రవేశించిన దినం ఇవ్వాళ (సరియనే అనుకుంటాను!)
ఇది సరిగ్గా ఓ యాభై నాలుగు సంవత్సరాల మునుపు జరిగినట్టు మీ బ్లాగ్ లో చదివి నట్టు గుర్తు.
సో , మీ కిదే , యాభై నాలుగు వసంతాల గ్రీటింగ్స్!
మీ జీవితం అమోఘం. మీ జీవితం లో జరిగిన సంఘటన ల ఆధారం గా మీరు బ్లాగ్ లో సహృదయులై    మీ జీవిత అనుభవాలను టపాల ద్వారా   పదుగురి తో పంచుకోవడం, తద్వారా మీరు పదిమందికి మార్గదర్శకులు గా ఉండడం ఈ పంచ దశ లోకం లో జరిగిన అపురూప విశేషం.
ఈ సందర్భం గా మా గురువులుంగారు శ్రీ శ్రీ పాద వారి చలువ గా మీ వడియాల టపా  స్ఫూర్తి గా 'కండ' కావ్యం సమర్పయామి :)


శ్రీ కష్టే ఫలే బ్లాగు లోని వడియాల టపా ఈ 'కండ' కావ్యానికి స్పూర్తి !

****

కష్టే ఫలే -వడియాలు -'కండ' కావ్యం !
---------------------------------
 
బండగ గాడిద గంపెడు
తిండియు వోలెన్ తినంగ దిటవు గలుగునా !
నిండుగ, చూపుకు బాగగు,
మెండగు, రుచికర జిలేబి మేలిమి, వలయున్ !  
 
కండలు ఊరక పెంచిన
దండగ ! మేధా జిలేబి ధారణ వలయున్
గుండెలు తీసిన బంటుకు
దండము  వేయ మనిషికి నిదానము వలయున్ !
 
గ్లాసెడన కొట్టు పిండి
ధ్యాసగ నుప్పు జిలకరయు తగు కారములున్
ఆ సెగ నెసరున నీళ్లున్ 
ఆశగ  బెట్టె నిట నొజ్జ మాచన జూడన్
 
మరియొక గ్లాసెడు నీళ్ళన
నురగగ  పిండిని గలుపుము ఉండలు గాకన్
మరిగిన నీళ్ళన పోయుడు
సరిసరి కారపు దినుసును చక్క గలుపుమా !
 
దరి నుండుము సరి కలుపుము
మరి యుండలు కట్టక మరిమరి కలుపవలెన్
సరి జూచి గరిట జారుగ
తిరికగ  ముద్దయునుగాక దించు జిలేబీ!
 
యిదియొక కళ !సాఫ్టుస్కి
ల్లిది!  తెలుసుకొను వడియాల లీలను గను!స
న్నదయిన తడిబట్టను పిం
డదగును ! ఎండన పరిచి బడయ వలయు గనన్ ! 
 
నాలుగు పక్కల రాళ్ళను
వీలుగ, బట్ట యెగురకను, వేగిర  నిడుమా !
గోలుగ ఉడికిన పిండిని
వాలుగ పెట్టుకుని వెళ్ళవలెను జిలేబీ !
 
ఎండల వాటుగ వడియం
ఎండును, మధ్య తడిపచ్చి ఎంచక మరు నా
డెండన నిడుమా వాటిన్
మెండుగ యగునే  జిలేబి మేటి వడియముల్ !
 
ఆపై వాటిని తియ్యడ
మో? పై బట్టను వడియము మొత్తము లోనన్
కోపుగ ఉండునటుల జే
యన్! పై నీళ్ళచిలికి వడియాలను మీటన్ !
 
చకచక వచ్చును నొకటొక
టిగ, యొక  పళ్ళెము న యుంచు ! టీచరు జెప్పెన్ !
నికరముగ వడియముల మరి
యొక దినమున నెండ బెట్ట యోగ్యము వినుమా
 
చక్కగ నారగ వాటిని
టక్కని డబ్బా నిడవలె టపటప యనగన్ !
మిక్కిలి ముదము జిలేబీ !
చెక్కితి వీ కండ కావ్య చెణుకుల నిచటన్ ! 
 
శ్రీ మాచన వడియముల ట
పా మూలము గొని జిలేబి పద్యము గూర్చెన్ !
రామా ! ఆ దంపతులకు
నీ మాటగ యీ దినమున నిధియన నిత్తున్ !
 
 
శుభాకాంక్షల తో
చీర్సు సహిత
జిలేబి
 

Tuesday, May 24, 2016

ఫైర్ బ్రాండ్ జిలేబి !

Fire Brand Zilebi !




చీర్స్
జిలేబి 

Tuesday, May 17, 2016

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి - విన్నపాలు !

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి - విన్నపాలు !

అయ్యా! యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు !

మీరీ  బ్లాగ్లేఖ చదువుతారో లేదో తెలియదు !

పై బడి తెలుగు బ్లాగు లోకపు కబుర్లు జనవాహిని లోకి వెళతాయో లేదో కూడా తెలియదు ! (ఇది మరో క్లోజేడ్ సిర్క్యూట్ జాలమేమో అన్న అనుమానం కూడాను !:)

అయినా చెప్పాలని అనిపించింది కాబట్టి !

ఈ మధ్య మీరు నిర్వహించిన లోక్ నాయక్ పురస్కార సభా  కార్యక్రమాన్ని యు ట్యూబ్ లో చూడడం కాకతాళీయం గా జరిగింది !

పురస్కారాన్ని మహా సహస్రావధాని ధారణా బ్రహ్మ రాక్షస శ్రీ గరికిపాటి నరసింహా రావు వారికివ్వడం ముదావహం !

శ్రీ గరికిపాటి వారు ఆ సభలో చేసిన ప్రసంగం వారి అమోఘ ప్రతిభా పాటవానికి మచ్చు తునక !

సరే , అంతా బాగున్నది ఈ పాటి దానికి విన్నపాలు ఏమిటీ అంటారా ?  అవధరించండి !

ఒక పురస్కార గ్రహీత ని పిలిచి అదిన్నూ  శ్రీ గరికిపాటి లాంటి సహస్రావధాని వారిని పిలిచి , వారిచే   ఒకటిన్నర గంట సేపు బాటు ప్రసంగం చేయించి వారు నిలబడి మంచి నీళ్ళు కూడా తాగ నిచ్చే వీలు లేకుండా మాట లాడ జేయించడం ఎంతవరకు సబబు ?

సభా మర్యాద గా వారిని సుఖాసీనుల జేసి , వారికి తగు మర్యాద ఇచ్చి, మీరందరు  కూడా హాయిగా వారి ముందు కూర్చుని  ప్రసంగాన్ని ఆస్వాదించి ఉంటే , చూసి ఉంటే  ఎంత బాగుండేది ?  ఈ సహృద్భావం చూపడం సభా మర్యాద గాదా ?

ఒక్క సారి ఆలోచించి చూడండి !

శ్రీ గరికి పాటి వారు వారు మంచి నీరు తాగడానికై సైగ చేస్తే , అడిగితే,  ఆ తెచ్చిన వ్యక్తి మంచి నీళ్ళు వెనుక కుర్చీ పై పెట్టేసి వారు తాగడానికి సౌకర్యం కలిగించ కుండా చేయడం ఎంత వరకు సబబు ?

వారు మాటల మధ్యలో ఖచ్చితం గా నీరు త్రాగడం ఎన్నో సభల్లో మనం చూడ వచ్చు ; మాట్లాడే వారికది అవసరం . ఆ వేగం లో మాట్లాడే టప్పుడు గొంతుక పిడచకట్టుకు పోవడం సర్వ సాధారణం !

అట్లాంటి ది మీరు సన్మానానికి పిలిచి వారిని ఇట్లా చెమటలు కక్కించే లా వారి చేత నిలబడి ప్రసంగం చేయించడం ఎంత వరకు సబబు ? *ఈ క్రింది వీడియో లో ప్రస్ఫుటం గా స్వేదం తో తడిసిన శ్రీ గరికి పాటి వారి క్లిప్పింగ్ చూడ వచ్చు );

యిది యేమి సభా మర్యాద ? స్వేద సేద్యము చేయకున్న కవివరులకు పురస్కారము దక్కునా అన్నట్టు ఉన్నది :)

ఈ టపా  వ్రాసినందు వల్ల అయిపోయిన కార్య క్రమానికి జరిగే లాభం ఏమీ లేదు అని తెలుసు ,అయినా వ్రాస్తున్నది ఎందు కంటే , రాబోయే  ఉత్సవాల లో నైనా సన్మాన గ్రహీత లకు ఉచిత స్థానాన్ని ఇస్తారనే నమ్మకం తో !.

మీరు పిలిచే సన్మాన గ్రహీత లు ఎట్లాగూ అరవై వసంతం దరిదాపుల్లోని వారే ఉంటారు ఖచ్చితం ఇది మన సంప్రదాయం పాటించండి !

ఇట్లాంటి సుదీర్ఘ సంభాషణ ఉన్నప్పుడు మీరు కూడా హాయిగా వారి ముందు వైపు కూర్చుని ఆస్వాదించండి వారి పాండిత్యాన్ని !

వేదిక మీద నిలబడి మాట్లాడే వారికి వీలుగా మంచి నీటి కమండలం కాకున్నా కనీసం వాటర్ బాటిల్ నైనా వీలుగా పెట్టండి !

ఒక సభలో గరికిపాటి లాంటి వారు మంచి నీళ్ళు తాగకుండా ఒకటిన్నర గంట సేపు వారి ధాటి కి మాట్లాడటం అంత సుళువైన విషయం కాదు !

నాకు తెలిసినంత వరకు యిదే అట్లాంటి వారి మొదటి సభ అయి ఉంటుంది అనుకుంటా ! ఆ క్రెడిట్ యార్ల గడ్డ వారికే దక్కే ! జేకే !


కార్య నిర్వాహకులు గా ఉన్న మీరు పని ఒత్తిడి లో మరవటం సహజమే !

అయినా కనీసం రాబోయే మీ సభ ల లో నైనా ఈ కనీస సభా మర్యాద పురస్కార గ్రహీత ల బాగోగులు వేదిక పై చూడ వలసినది గా విన్నపాలు !

సన్మాన గ్రహీత లు నిలబడే మాట్లాడా లనుకునే పక్షం లో కనీసం వారి దగ్గిర వీలుగా త్రాగడానికి మంచి నీళ్ళైనా ఉంచండి ; కనీస మర్యాద ఇదే వారికి మనమివ్వడం.

శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అద్భుత ప్రసంగం ! లోక్ నాయక్ పురస్కార గ్రహీత గా వారి ప్రసంగం క్రింది లింక్ లో ఒక గంట పది నిముషాల దాపుల్లో నించి మొదలవు తుంది ! వీలు చేసుకుని వినండి !

చెమటలు ధారా పాతము
గ, మన గరికి పాటి వారి కంఠపు శోషన్
విమలాకృతియన పద్యము
లమరెను నరసింహము ! కవి లాఘవము గనన్ !
 
ఆణి ముత్యపు బిందువు లనగ నచట
నయ్య వారికి తలపయినమరె; కొంచు
చెణుకులవి యన కవివర్య చెంప తడిసె
యార్ల గడ్డ లక్ష్మీప్రసాధ్యాత  చలువ ! :)
 

శ్రీ గరికిపాటి వారు తమ బట్ట తల మీద చెణుకులు ప్రతి సభ లోనూ వేస్తూంటారు ! అట్లాంటి వారి బట్ట తల మీద ఆణిముత్యాల్లాంటి స్వేద బిందువులను తెప్పించిన యార్లగడ్డ వారు మరెంత గొప్ప వారు :)

క్రింది యు ట్యూబ్ లింక్ లో శ్రీ గరికిపాటి వారి ప్రసంగం సుమారు ఒక గంటా పది నిముషాల ప్రాంతం నించి మొదలవు తుంది ! హాట్సాఫ్ టు శ్రీ గరికిపాటి !



చీర్స్
జిలేబి

Wednesday, May 11, 2016

ఈ రోజు వచ్చె జిలేబి వేడిగా :)

ఈ రోజు వచ్చె జిలేబి వేడిగా :)
 
బ్లాగ్వీరుల కు బ్లాగ్వీరాంగణలకు శుభోదయం !
 
ఈ రోజు వచ్చెను
జిలేబి వేడిగా
తూరుపు తెల్లారకముందే
ధారాధరము లా !
 
కామెంటులు కురిసేనా
బ్లాగుల చెమక్కుల చమ్కీల తో  !
వాడిగ జిలేబి
తియ్యందనాల ట్వీటు ల తో !
 
తక్కువ కాని టపాలతో  
తగ్గని కామింట్ల మేళము తో
అగణిత మౌ సిరి నగవులు
బ్లాగ్ లోకమంతా పరేషాన్ !
 
 
హాటు హాటు పాటలతో
స్వీటు స్వీటు జిలేబి
వెచ్చని వెన్నెల
కొల్లలై వచ్చెను వచ్చెను
 
పరాక్ బహు పరాక్ :)
 
 
చీర్స్
జిలేబి