హమ్మయ్య ! నారదుల వారి పని ముగిసింది :)
యిది చాలా సీరియస్ టపా .
గుండె దిటవు చేసుకుని చదవవలె ! జేకే !
నారదుల వారి ఎట్లాంటి కార్య'కళా' 'పాము' లకున్నూ కొంత ఉపోద్ఘాతం ఉండాలి ; అంటే బ్యాక్ డ్రాప్ అన్న మాట !
క్రితం సంవత్సరం డిసెంబర్ నెల లో బ్లాగు లోకం లో ఒక అన్నానిమస్సు జిలేబి ని కస్సు మనటం తో (చాలా సున్నితం గా :) జిలేబి కూడా కస్సు మంది !
దెబ్బకు టా ! బ్లాగు లోకం ఉలిక్కి పడింది ! జిలేబి యిట్లా నువ్వు దేవ భాష మాట్లాడటం బాగో లేదు అని ప్రొటెస్ట్ చేసింది !
మా గురువులుంగారేమో ఫత్వా జారీ చేసారు - జిలేబి కి నా బ్లాగు లో కామింట డ టానికి నో ఎంట్రీ ఫార్ ఒన్ ఇయర్ !
అంతే గాకుండా ఆయన రామ నామ జపం లో మునిగి పోయారు !
అంతా మన మంచికే ! ఎవరి కో దెబ్బ కొడితే పండు ఎక్కడో రాలింది ! జిలేబి దెబ్బ కి గురుని భక్తి ప్రపత్తులు పెరిగేయి అదే పది వేలు అని నారదాయ నమః అనుకున్నా !
అప్పట్లో వారు పద్యాల మీద టపాలు పెట్టడం తో ఇదేదో బాగుందే పద్యాలు (హరి బాబు గారి మాటల్లో పజ్జ్యాలు - పిజ్జ్జాలనే పజ్జ్యాలన్నారు కామోసు !) అల్లటం నేర్చు కుందా మని వారి బ్లాగు ఫాలో అయిపోతూ వారి రామ నామ సంకీర్త నని ఆస్వాదిస్తో , పద్యాల పోటీ టపా (జిలేబి కెప్పుడూ సెటైర్ / పేరడీ లైకింగు కాబట్టి ఓ డబల్ మోస్తరు పేరడీ కామిడీ బ్లాగ్జనాల తల తినే టపా లని పెట్టేస్తో ) పెట్టుకుంటూ స్వయం పాకం లా పద్యాలతో కుస్తీ పడుతో మొత్తం మీద కంది వారి బ్లాగు లోకి జిలేబి కాలు పెట్టడటం వరకు జరిగి పోయింది ! (హమ్మయ్య ఐరన్ లెగ్గు కాదను కుంటా :) జేకే !)
ఇట్లా సజావు గా పోతున్నవి దినములు, అహో రాత్రములు (రోజులు అన్నవి గ్రామ్యం ; మేం వాడం : మేమిప్పుడు గ్రాంధికాల నే నెమరు వేస్తాం :) ) పద్యాలోయ్ పద్యాలు అంటూ బ్లాగ్లోకం హోరెత్తి టారెత్తి పోయే స్టేజీ కి వచ్చేసే టట్టు అయిపోయే ! (ఈ మధ్య ఒక కామింటు దారుడు మండి, యిదే మండి బ్లాగు లోకమంతా పద్యాల హోరు తో నిండి పోయింది అని వాపోయాడు గూడా :) పజ్జ్యాలా మజాకా !
అప్పటి దాకా రామ నామ జపం చేసుకుంటున్న అయ్య వారు సడెన్ గా మే నెల లో దారి తప్పారు ! మళ్ళీ కామింటు లోకం లో కి వచ్చి పనికి మాలిన రాజ కీయాల పై చర్చల లో పాలు గొంటూ మొట్టి కాయలు తినడం మొద లేట్టేరు !తమ బాలాగు లో రాముల వారూ గాయబ్ !
ఔరా ! విధి నెవరిని విడిచి పెట్టింది అనుకోకుండా ఉండ లేక పోయా ! సజావు గా రామ నామ జపం చేసు కుంటూ వున్న పెద్దాయన ఇట్లా రాజకీయ నాన్సెన్స్ కామింటు ల గో ల లో గురువు గారు బుక్కయి పోయెనే అనుకుంటూ సరే అనుకుంటూ కొంత హింటిచ్చా !
మే నెల ఇరవై తారీఖు !
౦౦౦