Saturday, August 24, 2019

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు



శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు !



చిత్రము కాపీరైటు - శ్రీకేశవ్ ఆఫ్ హిందూ ఫేమ్‌



శుభాకాంక్షలతో

జిలేబి

Friday, August 2, 2019

కాఫీ కా మింటు రుచియె కాఫి జిలేబీ :)


కాఫీ కా మింటు రుచియె కాఫి జిలేబీ :)

బీరమ్మినోడు యూకె పోనాడు
కాఫీ అమ్మినోడు కాలవాహినిలో కరిగిపోనాడు
చాయ్ అమ్మినాయిన దేశాన్ని నిలబెడుతున్నాడు !
అయ్యలారా అమ్మలారా
మీ డ్రింకు మీ జీవితాన్ని 
నిర్ధారిస్తోంది.
జర బద్రం :)


జిలేబి


Monday, July 15, 2019

చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ జై :)



చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ జై :)
 
 
 
"స్వామీ మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ " ఓ భక్త పరమాణువు ఊపందు కున్నాడు !
 
మరో భక్తుడు జై జై జై అంటూ నినాదాలిచ్చేడు!
 
దాంతో భక్త పరమాణువుల సంఘం జోషందు కుంది.
 
ఆ పవిత్ర కృష్ణా తీరాన ఆకాశం దద్దరిల్లింది !
 
ఇరు రాజ్యాల రాజులతో మహా పొత్తు గల్గి స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్న నానుడి కి ప్రతీక గా ,  మారు పేరుగా మిత్రత్వ బిరుదాంకితు లైన స్వామీ జీ తమ రఫ్ పెప్పర్ గెడ్డం తడి మేరు !
 
అనుగ్రహ సంభాషణం మొదలెట్టి నారు !
 
జనాలు తండోప తండంబులు గా వేంచేసి ఉన్నారు ! ఇవ్వాళ మీ కందరికీ జిలేబీ ప్రసాదం గా అంబాళ్ కు  నైవేద్యంగా సమర్పించు కున్న ఖీరు తో బాటు స్వీకరించి గాని మీరు వెళ్ళ కూడదని "కట్టళై " పెట్టి నారు స్వామీ వారు !
 
వారి పరమానంద శిష్యుడు మరో మారు ఊపందు కున్నాడు ! జై బోలో స్వామీ ....
 
వారు చతురులు ! ప్రస్తుతం రేపటి నుంచి చాతుర్మాస్య వ్రతం లోకి వెళ్ళ బోతున్నారు ! అందుకే "చాటురా" నందా బిరుదాంకితు లై , భక్త జన సందోహం చేత 'చతుర' స్వామీ జీ గా పేరు గడించినారు !
 
ఎక్కువ గా ఆయాసం ఆయన్ని పట్టి పీడించేది ! అదిన్నూ పాయసం తాగేక మరీ ఎక్కువయ్యేది ! దాంతో వారు బెనారెస్సు కెళ్ళి పాయసాన్ని త్యజించినారు ! అప్పటి నుంచి వారికి పాయసానంద బిరుదు కూడా దక్కింది !
 
 
వారి మాటే ఒక వినోదం! వారు మహా వినోదానందులు ! ఆనందం ఫాస్టు ఫుడ్డేతి వ్యాజనాత్ అని వారి ఆశ్రమం  ఛాయలలో జిలేబీ  ఫాస్టు ఫుడ్డు స్టాల్  ప్రముఖ స్థానం కల్పించి వినోదానంద స్వామీ బిరుదును గాంచి నారు !
 
 
ఇట్లా ఎన్నెనో బిరుదులు గలిగిన మా స్వామీ వారికి, పాతకులారా ! సారీ,  పాట(ఒత్తు ట) కులారా ! చదువరులారా ! మీరు కూడా ఓ మారు జై కొట్టు డీ !
 
స్వామీ మిత్రత్వ వచస్ శ్రీయుత చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ !
 
జై
జై జై
జై జై జై !
 
 
 
చీర్స్
 
జిలేబి
 

Friday, July 12, 2019

మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసమ్ము :)





మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసమ్ము :)


వావ్ ! మరీ జిలేబీయమే యిది :)


ఎంజాయ్ మాడి :)


జిలేబి

Sunday, June 16, 2019

టోల్ ఫ్రీ నెంబరు బిజీ గా వున్నది :)


టోల్ ఫ్రీ నెంబరు బిజీ గా వున్నది :)

అప్పుడప్పుడు‌ టెలిఫోన్ చేస్తుంటే మీరు "కాల్చేసిన‌వారు" మాట్లేడే పరిస్థితుల్లో లేరని " ఆవాజ్" విని‌ మా‌ అయ్యరు గారితో చెబ్తే ( ఆయన ' కవి ' కష్టేఫలి‌ వారిలా :)) ఓయ్‌ జిలేబి నువ్వు "కాల్చేస్తే " వాళ్లింకా యెట్లా‌ మాట్లాడతారే అంటూ బోసి నవ్వు నవ్వే జంబునాథన్ కృష్ణ స్వామి‌గారు ఇవ్వాళ పిలిచి " ఇదిగో చూడు మోడీ గారికి సలహాలు‌ కావాలంటా టోల్ ఫ్రీ నెంబరు ఇదీ ఫోన్‌ చేసి నా సలహాలు చెప్పు అన్నారు


సరే పెద్దాయన చెప్పేరు కదా అని‌ మోడీ జీ ఇవిగో మా‌ అయ్యరు గారి సలహాలని టోల్ ఫ్రీ నెంబరు‌ కు‌ ఫోన్ చేస్తే ఎంతకీ కలవదే మరి :) ఫ్రీ నెంబరు ఆల్ వేస్ బిజీ :)


వామ్మో ! దేశం లో ఇంత మంది సలహాలిచ్చే వారున్నారే
అని మురిసి పోయా ! ఆ మాటే మా అయ్యరు గారితో అంటే  " ఒసేయ్ మొద్దూ దేశంలో సలహాలిచ్చేవారు మాత్రమే ఉన్నారని ఓ నవ్వు నవ్వేసి పోన్లే నెంబరు‌ బిజీ గా వుంది అదే పది వేలని ఊరుకునేసేరు :)


మీరూ ప్రయత్నిద్దురూ :)

మోదీ కి ఐడియా లివ్వండి

టోల్ ఫ్రీ - 1800 117 800


Best of luck :)



చీర్స్
జిలేబి



Thursday, June 13, 2019

నగరి నారి రోజా భళారే :)


నగరి నారి రోజా భళారే :)



అలుగగ యేఐ సీసీ
ములుగుగ వచ్చెన్ జిలేబి ముదితకు ప్రియమై
వెలుగున్ మా రోజా యిక
తళుకుల తోడై భళిభళి తరుణమ్మిదియే :)

జిలేబి

Saturday, April 6, 2019

శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !




బ్లాగ్ వీక్షకులకందరికి
శ్రీ వికారి నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు !
 
 
శ్రీలు పొంగ గాను శ్రీవికారి శుభముల్
విరివి గాంచు గాక విదురులార !
కామనలివి యేను కవివరు లార! పు
రికొను గాక నెల్లరి కవనములు!

శుభాకాంక్షలతో



జిలేబి

Monday, March 4, 2019

పృషోదరాదీని యథోపదిష్టమ్ ! (पृषोदराऽदीनि यथोपदिष्टम् )




పృషోదరాదీని యథోపదిష్టమ్ !
 
(पृषोदराऽदीनि यथोपदिष्टम् )



మొన్న ఓ శార్దూలం సమస్యా పూరణ మై వస్తే ,

ఊతంబెవ్వడు అంటూ జోష్ తో మొదలెట్టేసి యతి స్థానం లో
చిక్కుకుని కుస్తీ పడి  గూఢోత్ముడు అన్న పదాన్ని ఆంధ్ర భారతి లో   'డిస్కవర్' చేసేసి వేసేసు కున్నా :)


మామూలుగా గూఢ + ఆత్మ - గూఢాత్మ విని ఉన్నాము గాని గూఢోత్ముడు అన్నది చాలా తక్కువ.
ఏదో బాగుందే అనుకుని కిట్టించేసి ( యతి కోసం తంటా లు :)) వేసేస్తే కంది వారు సందేహం లేవ దేసేరు - గూఢోత్ముడు ఏమిటి అని :)

మనకేమి తెలుసు ! ఏదో ఆంధ్ర భారతి ఉవాచ కాబట్టి సరియే అయి వుండా లనుకుని అట్లే వదిలేసా .

ఈ పద్యాన్ని అట్లే మన బ్లాగు లో వేసేసు కుంటే అదే ప్రశ్న ని శ్రీ మాన్ లక్కాకుల వారు కూడా అదే ప్రశ్న లేవ దీయటం తో

అరె యిదేదో మరీ చిక్కు సమస్యే కామోసు అనుకుని గూగులిస్తే

(पृषोदराऽदीनि यथोपदिष्टम् )



పృషోదరాదీని యథోపదిష్టమ్ !

 పాణిని  - అష్టాధ్యాయి -  సూత్రము - 6-3-109 అంటూ కొంత 'జిలేబి' మయము గా ఒకటి కనబడింది.

యేమి దీని అర్థము అనుకుని మళ్ళీ ఆంధ్ర భారతి ని అడుగ గా

పృషోదరుడు - అనగా వాయుదేవుడు ( బాన కడుపు గలవాడు కామోసు :) అన్న దీన్ను, ఉపదిష్ట అంటే తెలుపబడినది అన్న అర్థమూ కనబడినది :) అంటే పృషోదర  గట్రా లాంటి పదాలు పండితులు వాడేరు కాబట్టి వాటిని సరియే అని తీసు కోవాలని పాణిని ఉవాచ :)

 (జిలేబి ఏ పదం రాస్తే అదే సరి కామోసు : జేకే - సూక్షి పదం లా :)

మొత్తం మీద దీని అర్థం ఏమిటంటే 'సో కాల్డ్ పండితులు వ్యాకరణ సూత్రానికి కట్టు బడని కొన్ని ప్రయోగాలు 'వారు చేసేరు' కాబట్టి అట్లాంటివి సరియే అని అనుకోవాలి అని అర్థమని భాష్య కారులు తెలిపేరు

ఈ  గూఢోత్ముడు అన్న పదం  బై ది వే కఠోపనిషత్ లో వస్తుంది

एष सर्वेषु भूतेषु गूढोत्मा न प्रकाशते ।दृश्यते त्वग्रयया बुद्धया सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥१२॥

(కఠోపనిషత్ 1-3-12)

హమ్మయ్య జిలేబి నీవు కూడా పండితుల జాబితా లోకి ఎక్కి పోయేవనుకున్నా :)


పృషోదరాదీని యథోపదిష్టమ్ !


చీర్స్
జిలేబి
పిశాచి

(పిశాచి కూడా జగణమే అది కూడా ఈ కోవలోకి వస్తుందట :  ఓపిక వుంటే ఈ యూట్యూబు వాచ్ చేయుడీ !)





ఊతంబెవ్వడు? ప్రత్యగాత్మగను గూఢోత్ముండుగా నంతరా
త్మై తావన్నది లేక కందువగ క్షేత్రంబై నిరాకారుడై
వాతాహారవిరోధి నెక్కి యజుడై, బ్రహ్మై, జిలేబీయమై
సీతా! వల్లభుఁ డిందుశేఖరుఁడు వాసిం గాంచెఁ గంసారిగన్!


జిలేబి

 

Monday, February 11, 2019

టపా హెడ్డింగుల కలబోత :)



చాన్నాళ్ళ తరువాయ్ :)
 
టపా హెడ్డింగు ల కలబోత - :)


పాటతో నేను :   విరిసే ఘుంఘుం...కష్టేఫలి :   కారకోరం హైవే

 సాహితీ నందనం :   నా కుంచె రంగులు…-idiprapancham ఇదీ ప్రపంచం :   మోడిఫైడ్ రైతుబంధు స్కీమ్‌లో ఈ మతలబులు చూడుడి

 చిత్రకవితా ప్రపంచం :   తిక్కన భారతంలో పలుకులపొందు -సరిగమలు... గలగలలు :   తెలుగంటే గోంగూర.. తెలుగంటే గోదార


శ్యామలీయం :   వ్యాఖ్యావ్యాసంగానికి స్వస్తి పలుకుతున్నాను-కాలక్షేపం-    జుట్టు సమస్యలకి చెక్ చెప్పేయండీ.

వసుంధర అక్షరజాలం :   మన తెలుగు చరిత్ర-శారద విభావరి :   కాలక్షేపం

Top Stories :: :   మెట్రో రైల్వే స్టేషన్ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్... లిఫ్ట్‌ల్లో అధర చుంబనాలు
హరిసేవ :   చెడ్డీ గ్యాంగ్ ....... కండువా గ్యాంగ్

Sakshyam Magazine :   అల్లాహ్ దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలా? 50,000 సంవత్సరాలా? - Md Nooruddin--- సాహితి :   తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ . . . తుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్



ఆపాత మధురాలు ♪♥♪ :   ఏమనెనే .. చిన్నారి ఏమనెనే-నగ్నచిత్రం :   తెలంగాణలో బయోపిక్‌లు ఎందుకని రావు?


చీర్స్
జిలేబి
మీకూ ఇట్లాంటి వి కనబడి తే షేర్ చేద్దురూ :)


 

Wednesday, January 23, 2019

కొండలు గాలి తాకిడికి కొట్టుకు పోయె :)



కంది వారి సభలో "కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!" సమస్యా పాదాన్ని ఇస్తే,
అబ్బే ఇదేదో తెలిసిన పాదం లా వుందే అనుకుని చట్టని కొట్టు కొచ్చి ఇలా పూరించా :)

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తి ....

అబ్బ! ఇక్కడి దాకా బాగుంది :) ఇంక ఎట్లా ఫిట్టింగు పెట్టడటం సమస్యా పాదానికి అనుకుని ఆలోచిస్తా వుంటే ,  తాళ్ళ పాకవారి పద్య పాదం  (అని అనుకున్నా కాని క్షేత్రయ్య అని ఆంధ్ర భారతి ఉవాచ ) "సఖియ నీ చన్గవలు సంగటి కొండలందురుగాని కొండలైతే-కోట తలుపులేవే" అన్నది గుర్తు కొచ్చి ఆహా ఇదేదో ఫిట్టించేస్తే బాగుంటుందనుకుని, ఆ పై అసలే పండిత సభ కాబట్టి కొంత బెరుకు పుట్టుకుని మార్చేసు కుని రాసి వేసేసా :)


ఘటుండు రాము డా
మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!

పూర్తి గా :)

భండన భీముడార్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండ కళాప్రచండ భుజ తాండవ కీర్తిఘటుండు రాము డా
మండప మందు విల్లు తునుమాడగ నాదము పిక్కటిల్లగా
కొండలు, గాలి తాకిడికిఁ గొట్టుకుపోయెను దొర్లుచున్ వడిన్!

కొట్టు కొచ్చినవి రెండు పాదాలు (దాశరధీ కరుణా పయోనిధీ :) సమస్యా పాదం ఒకటి, మన కిట్టింపు పాదం ఒకటి వెరసి వాహ్ క్యా బాత్ హై వృత్తం తయార్ జిలేబి తయార్ అనుకున్నా :)

దీని పై కంది శంకరుల వారు :-

జిలేబి గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు.
ఇది మీరు వ్రాసిందేనా? సందేహమే! అంటూ ఒక స్మైలీ పెట్టేరు :)

సరే అందుకని మరో ఉత్పలము రుబ్బి నాము :)

ముట్టగ కైపదంబొకటి ముంగట శంకరుకొల్వులోనటన్,
కొట్టున కొట్టుకొచ్చె తను కొంచెమకో? భళి రెండు పాదముల్!
కట్టె జిలేబి పాదము ను గట్టిగ నొక్కటి యుత్పలంబవన్
చట్టని వేసె కొల్వున సజావుగ నాల్గన వృత్తపాదముల్!
అని - మొదటి ఉద్దేశం గురించి ఇలా అన్నా :)

కంది వారు,

మండప మందు విల్లు తునుమాడగ జానకి చన్నుగుబ్బలా కొండలు... అని రాస్తా మనుకున్నా ! అసలే పండితుల సభ యేమంటారో అని భయపడి కొంత నాదపు పిక్కటిల్లుతో సర్దేసా! ( తాళ్ళపాక వారి చన్గవలా సంగటి కొండలు పాదము గుర్తు కొచ్చి)

****

దీనికి పోచిరాజు వారు వచ్చి -

జిలేబి గారు కుచ సౌందర్య వర్ణన లేని కావ్యము సంస్కృ తాంధ్ర వాఙ్మయ ప్రపంచములోనే లేదు. అతిమాత్రము వర్జనీయము.  మీ రొక తమిళ పద్యమును తెనుఁగు లిపిలో వ్రాసి తదనువాద పద్యము ప్రకటించిన చూడాలని యుందండి.

తస్సదియ్య సవాలే విసిరేరు గా అనుకుని కన్డే న్ సీతయై అన్న కంబ రామాయణ పద్యాన్ని అరవంలో చదివి మన కిష్ట మైన కందం లో కిట్టించి వేయడం జరిగినది ఆ పై పోచిరాజు వారికి 'హమారీ ఫర్మాయిష్ ' తెలిపి నాము :)

పోచిరాజు వారికి నమో నమః


పూర్తిగా సరిగ్గా అని చెప్పలేను గాని కొంతవరకు నావల్లయినంత వరకు :) ( కందంలో నాకు వీలైనంత ఫిట్టు చేయగలిగినంత వరకు :))



కనుగొంటిని సచ్ఛీలపు
మణి సీతను లంకని!తడుమనయున్ దుఃఖం
బును విడుమయ్యా! రామా
హనుమంతుడ డింగరుడ సహాయకుడనయా!

కంబరామాయణము-

கண்டனென், கற்பினுக்கு அணியை, கண்களால்,

தெண் திரை அலைகடல் இலங்கைத் தென் நகர்;

அண்டர் நாயக !இனி, துறத்தி, ஐயமும்

பண்டு உள துயரும்’என்று, அனுமன் பன்னுவான்;

**

కణ్డేన్ కర్పిణిక్కు అణియై కణ్ణాల్
తెన్ తిరై అలై కడల్ ఇలంగై తెన్ నగర్

అణ్డర నాయగ ఇని తురత్తి, యైయముమ్

పన్డు ఉళ్ తుయరుమ్, యెన్డ్రు అనుమన్ పణ్ణువాన్ !



ఫర్మాయిష్ అబ్ ఆప్ సే యహ్ హై కి ఊపర్ పద్య కీ‌ అంగ్రేజీ తర్జుమా (see below) సే ఆప్ కీ టెల్గు పద్య ఇదర్ దేఖ్నే కా‌ :)

ధన్యబాద్ !


I saw ,

the jewel of chastity,

with my own eyes

in the southern city

of Lanka

on the clear twirling wavy ocean,

lord of gods

from now on

relinquish doubts and

all your sufferings.’

said Hanuman

and continued with his details.


Awaiting your marvellous vrutta sir

పై దానికి పోచిరాజు వారి (అద్భుతః ) శైలి లో ఉత్పల మాల : -

జిలేబి గారు ధన్యవాదములు. నా ప్రయత్నమును జూచి కంబ రామాయణ పద్య భావము స్ఫురించినదో లేదో చూడండి.

చూచితి స్వీయ నేత్రముల శుద్ధ చరిత్ర వసుంధరా సుతన్
వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక నిఁకఁ దూర్ణము వీడుమ శంక నిర్జరుల్
కాచ సమర్థులం చనియుఁ గాదిలి హన్మయె పల్కెఁ గ్రమ్మఱన్

అద్భుత మైన అనువాదం - "వీచి విలాస కంపిత సువిస్తృత దక్షిణ వారిరాశి స
ద్రోచన తీర లంక " -  తెన్ తిరై అలై కడల్ ఇలంగై తెన్ నగర్ - in the southern city of Lanka on the clear twirling wavy ocean !

( తెలుగు అనువాదం - పూతల పట్టు శ్రీ రాములు రెడ్డి గారు -
వారి అనువాదం - ఇలా వుంది (క్రింది లింకులో రెండవ భాగం లో సుందర కాండ లో ) మత్త కోకిల

కాంచినాడ సతీత్వ భూషను గణ్యవర్తన జానకిన్
గాంచినాడ మదీయ దైవము గన్నులారగ లంకలో
గాంచినాడను శంక వీడుము కాంచుమా మది నెమ్మదిన్
గాంచితిన్ మరి మాటలాడితి గ్రమ్మరిల్లితి రాఘవా !

పూతల పట్ట్టు శ్రీరాములు రెడ్డి గారి - కంబ రామాయణం తెలుగు అనువాదం లింకులు :

భాగము - 1

https://archive.org/details/in.ernet.dli.2015.385206

భాగము - 2

https://archive.org/details/in.ernet.dli.2015.385207


కొండలు గాలి తాకిడికి కొట్టుకు పోయె ! మొత్తము మీద ఇప్పటికి ఇక్కడ ఆగింది :) ఇంక చూద్దాం ఏమేమి వస్తాయో అని !


చీర్స్
జిలేబి