"స్వామీ మిత్రత్వ వచస్శ్రీయుత చతుర వినోదపు పాయసానంద స్వామీ జీ కీ " ఓ భక్త పరమాణువు ఊపందు కున్నాడు !
మరో భక్తుడు జై జై జై అంటూ నినాదాలిచ్చేడు!
దాంతో భక్త పరమాణువుల సంఘం జోషందు కుంది.
ఆ పవిత్ర కృష్ణా తీరాన ఆకాశం దద్దరిల్లింది !
ఇరు రాజ్యాల రాజులతో మహా పొత్తు గల్గి స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అన్న నానుడి కి ప్రతీక గా , మారు పేరుగా మిత్రత్వ బిరుదాంకితు లైన స్వామీ జీ తమ రఫ్ పెప్పర్ గెడ్డం తడి మేరు !
అనుగ్రహ సంభాషణం మొదలెట్టి నారు !
జనాలు తండోప తండంబులు గా వేంచేసి ఉన్నారు ! ఇవ్వాళ మీ కందరికీ జిలేబీ ప్రసాదం గా అంబాళ్ కు నైవేద్యంగా సమర్పించు కున్న ఖీరు తో బాటు స్వీకరించి గాని మీరు వెళ్ళ కూడదని "కట్టళై " పెట్టి నారు స్వామీ వారు !
వారి పరమానంద శిష్యుడు మరో మారు ఊపందు కున్నాడు ! జై బోలో స్వామీ ....
వారు చతురులు ! ప్రస్తుతం రేపటి నుంచి చాతుర్మాస్య వ్రతం లోకి వెళ్ళ బోతున్నారు ! అందుకే "చాటురా" నందా బిరుదాంకితు లై , భక్త జన సందోహం చేత 'చతుర' స్వామీ జీ గా పేరు గడించినారు !
ఎక్కువ గా ఆయాసం ఆయన్ని పట్టి పీడించేది ! అదిన్నూ పాయసం తాగేక మరీ ఎక్కువయ్యేది ! దాంతో వారు బెనారెస్సు కెళ్ళి పాయసాన్ని త్యజించినారు ! అప్పటి నుంచి వారికి పాయసానంద బిరుదు కూడా దక్కింది !
వారి మాటే ఒక వినోదం! వారు మహా వినోదానందులు ! ఆనందం ఫాస్టు ఫుడ్డేతి వ్యాజనాత్ అని వారి ఆశ్రమం ఛాయలలో జిలేబీ ఫాస్టు ఫుడ్డు స్టాల్ ప్రముఖ స్థానం కల్పించి వినోదానంద స్వామీ బిరుదును గాంచి నారు !
ఇట్లా ఎన్నెనో బిరుదులు గలిగిన మా స్వామీ వారికి, పాతకులారా ! సారీ, పాట(ఒత్తు ట) కులారా ! చదువరులారా ! మీరు కూడా ఓ మారు జై కొట్టు డీ !
అప్పుడప్పుడు టెలిఫోన్ చేస్తుంటే మీరు "కాల్చేసినవారు" మాట్లేడే పరిస్థితుల్లో లేరని " ఆవాజ్" విని మా అయ్యరు గారితో చెబ్తే ( ఆయన ' కవి ' కష్టేఫలి వారిలా :)) ఓయ్ జిలేబి నువ్వు "కాల్చేస్తే " వాళ్లింకా యెట్లా మాట్లాడతారే అంటూ బోసి నవ్వు నవ్వే జంబునాథన్ కృష్ణ స్వామిగారు ఇవ్వాళ పిలిచి " ఇదిగో చూడు మోడీ గారికి సలహాలు కావాలంటా టోల్ ఫ్రీ నెంబరు ఇదీ ఫోన్ చేసి నా సలహాలు చెప్పు అన్నారు
సరే పెద్దాయన చెప్పేరు కదా అని మోడీ జీ ఇవిగో మా అయ్యరు గారి సలహాలని టోల్ ఫ్రీ నెంబరు కు ఫోన్ చేస్తే ఎంతకీ కలవదే మరి :) ఫ్రీ నెంబరు ఆల్ వేస్ బిజీ :)
వామ్మో ! దేశం లో ఇంత మంది సలహాలిచ్చే వారున్నారే
అని మురిసి పోయా ! ఆ మాటే మా అయ్యరు గారితో అంటే " ఒసేయ్ మొద్దూ దేశంలో సలహాలిచ్చేవారు మాత్రమే ఉన్నారని ఓ నవ్వు నవ్వేసి పోన్లే నెంబరు బిజీ గా వుంది అదే పది వేలని ఊరుకునేసేరు :)
ఊతంబెవ్వడు అంటూ జోష్ తో మొదలెట్టేసి యతి స్థానం లో
చిక్కుకుని కుస్తీ పడి గూఢోత్ముడు అన్న పదాన్ని ఆంధ్ర భారతి లో 'డిస్కవర్' చేసేసి వేసేసు కున్నా :)
మామూలుగా గూఢ + ఆత్మ - గూఢాత్మ విని ఉన్నాము గాని గూఢోత్ముడు అన్నది చాలా తక్కువ.
ఏదో బాగుందే అనుకుని కిట్టించేసి ( యతి కోసం తంటా లు :)) వేసేస్తే కంది వారు సందేహం లేవ దేసేరు - గూఢోత్ముడు ఏమిటి అని :)
మనకేమి తెలుసు ! ఏదో ఆంధ్ర భారతి ఉవాచ కాబట్టి సరియే అయి వుండా లనుకుని అట్లే వదిలేసా .
ఈ పద్యాన్ని అట్లే మన బ్లాగు లో వేసేసు కుంటే అదే ప్రశ్న ని శ్రీ మాన్ లక్కాకుల వారు కూడా అదే ప్రశ్న లేవ దీయటం తో
అరె యిదేదో మరీ చిక్కు సమస్యే కామోసు అనుకుని గూగులిస్తే
(पृषोदराऽदीनि यथोपदिष्टम् )
పృషోదరాదీని యథోపదిష్టమ్ !
పాణిని - అష్టాధ్యాయి - సూత్రము - 6-3-109 అంటూ కొంత 'జిలేబి' మయము గా ఒకటి కనబడింది.
యేమి దీని అర్థము అనుకుని మళ్ళీ ఆంధ్ర భారతి ని అడుగ గా
పృషోదరుడు - అనగా వాయుదేవుడు ( బాన కడుపు గలవాడు కామోసు :) అన్న దీన్ను, ఉపదిష్ట అంటే తెలుపబడినది అన్న అర్థమూ కనబడినది :) అంటే పృషోదర గట్రా లాంటి పదాలు పండితులు వాడేరు కాబట్టి వాటిని సరియే అని తీసు కోవాలని పాణిని ఉవాచ :)
(జిలేబి ఏ పదం రాస్తే అదే సరి కామోసు : జేకే - సూక్షి పదం లా :)
మొత్తం మీద దీని అర్థం ఏమిటంటే 'సో కాల్డ్ పండితులు వ్యాకరణ సూత్రానికి కట్టు బడని కొన్ని ప్రయోగాలు 'వారు చేసేరు' కాబట్టి అట్లాంటివి సరియే అని అనుకోవాలి అని అర్థమని భాష్య కారులు తెలిపేరు
ఈ గూఢోత్ముడు అన్న పదం బై ది వే కఠోపనిషత్ లో వస్తుంది
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...