Tuesday, May 17, 2016

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి - విన్నపాలు !

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి - విన్నపాలు !

అయ్యా! యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు !

మీరీ  బ్లాగ్లేఖ చదువుతారో లేదో తెలియదు !

పై బడి తెలుగు బ్లాగు లోకపు కబుర్లు జనవాహిని లోకి వెళతాయో లేదో కూడా తెలియదు ! (ఇది మరో క్లోజేడ్ సిర్క్యూట్ జాలమేమో అన్న అనుమానం కూడాను !:)

అయినా చెప్పాలని అనిపించింది కాబట్టి !

ఈ మధ్య మీరు నిర్వహించిన లోక్ నాయక్ పురస్కార సభా  కార్యక్రమాన్ని యు ట్యూబ్ లో చూడడం కాకతాళీయం గా జరిగింది !

పురస్కారాన్ని మహా సహస్రావధాని ధారణా బ్రహ్మ రాక్షస శ్రీ గరికిపాటి నరసింహా రావు వారికివ్వడం ముదావహం !

శ్రీ గరికిపాటి వారు ఆ సభలో చేసిన ప్రసంగం వారి అమోఘ ప్రతిభా పాటవానికి మచ్చు తునక !

సరే , అంతా బాగున్నది ఈ పాటి దానికి విన్నపాలు ఏమిటీ అంటారా ?  అవధరించండి !

ఒక పురస్కార గ్రహీత ని పిలిచి అదిన్నూ  శ్రీ గరికిపాటి లాంటి సహస్రావధాని వారిని పిలిచి , వారిచే   ఒకటిన్నర గంట సేపు బాటు ప్రసంగం చేయించి వారు నిలబడి మంచి నీళ్ళు కూడా తాగ నిచ్చే వీలు లేకుండా మాట లాడ జేయించడం ఎంతవరకు సబబు ?

సభా మర్యాద గా వారిని సుఖాసీనుల జేసి , వారికి తగు మర్యాద ఇచ్చి, మీరందరు  కూడా హాయిగా వారి ముందు కూర్చుని  ప్రసంగాన్ని ఆస్వాదించి ఉంటే , చూసి ఉంటే  ఎంత బాగుండేది ?  ఈ సహృద్భావం చూపడం సభా మర్యాద గాదా ?

ఒక్క సారి ఆలోచించి చూడండి !

శ్రీ గరికి పాటి వారు వారు మంచి నీరు తాగడానికై సైగ చేస్తే , అడిగితే,  ఆ తెచ్చిన వ్యక్తి మంచి నీళ్ళు వెనుక కుర్చీ పై పెట్టేసి వారు తాగడానికి సౌకర్యం కలిగించ కుండా చేయడం ఎంత వరకు సబబు ?

వారు మాటల మధ్యలో ఖచ్చితం గా నీరు త్రాగడం ఎన్నో సభల్లో మనం చూడ వచ్చు ; మాట్లాడే వారికది అవసరం . ఆ వేగం లో మాట్లాడే టప్పుడు గొంతుక పిడచకట్టుకు పోవడం సర్వ సాధారణం !

అట్లాంటి ది మీరు సన్మానానికి పిలిచి వారిని ఇట్లా చెమటలు కక్కించే లా వారి చేత నిలబడి ప్రసంగం చేయించడం ఎంత వరకు సబబు ? *ఈ క్రింది వీడియో లో ప్రస్ఫుటం గా స్వేదం తో తడిసిన శ్రీ గరికి పాటి వారి క్లిప్పింగ్ చూడ వచ్చు );

యిది యేమి సభా మర్యాద ? స్వేద సేద్యము చేయకున్న కవివరులకు పురస్కారము దక్కునా అన్నట్టు ఉన్నది :)

ఈ టపా  వ్రాసినందు వల్ల అయిపోయిన కార్య క్రమానికి జరిగే లాభం ఏమీ లేదు అని తెలుసు ,అయినా వ్రాస్తున్నది ఎందు కంటే , రాబోయే  ఉత్సవాల లో నైనా సన్మాన గ్రహీత లకు ఉచిత స్థానాన్ని ఇస్తారనే నమ్మకం తో !.

మీరు పిలిచే సన్మాన గ్రహీత లు ఎట్లాగూ అరవై వసంతం దరిదాపుల్లోని వారే ఉంటారు ఖచ్చితం ఇది మన సంప్రదాయం పాటించండి !

ఇట్లాంటి సుదీర్ఘ సంభాషణ ఉన్నప్పుడు మీరు కూడా హాయిగా వారి ముందు వైపు కూర్చుని ఆస్వాదించండి వారి పాండిత్యాన్ని !

వేదిక మీద నిలబడి మాట్లాడే వారికి వీలుగా మంచి నీటి కమండలం కాకున్నా కనీసం వాటర్ బాటిల్ నైనా వీలుగా పెట్టండి !

ఒక సభలో గరికిపాటి లాంటి వారు మంచి నీళ్ళు తాగకుండా ఒకటిన్నర గంట సేపు వారి ధాటి కి మాట్లాడటం అంత సుళువైన విషయం కాదు !

నాకు తెలిసినంత వరకు యిదే అట్లాంటి వారి మొదటి సభ అయి ఉంటుంది అనుకుంటా ! ఆ క్రెడిట్ యార్ల గడ్డ వారికే దక్కే ! జేకే !


కార్య నిర్వాహకులు గా ఉన్న మీరు పని ఒత్తిడి లో మరవటం సహజమే !

అయినా కనీసం రాబోయే మీ సభ ల లో నైనా ఈ కనీస సభా మర్యాద పురస్కార గ్రహీత ల బాగోగులు వేదిక పై చూడ వలసినది గా విన్నపాలు !

సన్మాన గ్రహీత లు నిలబడే మాట్లాడా లనుకునే పక్షం లో కనీసం వారి దగ్గిర వీలుగా త్రాగడానికి మంచి నీళ్ళైనా ఉంచండి ; కనీస మర్యాద ఇదే వారికి మనమివ్వడం.

శ్రీ గరికిపాటి నరసింహా రావు గారి అద్భుత ప్రసంగం ! లోక్ నాయక్ పురస్కార గ్రహీత గా వారి ప్రసంగం క్రింది లింక్ లో ఒక గంట పది నిముషాల దాపుల్లో నించి మొదలవు తుంది ! వీలు చేసుకుని వినండి !

చెమటలు ధారా పాతము
గ, మన గరికి పాటి వారి కంఠపు శోషన్
విమలాకృతియన పద్యము
లమరెను నరసింహము ! కవి లాఘవము గనన్ !
 
ఆణి ముత్యపు బిందువు లనగ నచట
నయ్య వారికి తలపయినమరె; కొంచు
చెణుకులవి యన కవివర్య చెంప తడిసె
యార్ల గడ్డ లక్ష్మీప్రసాధ్యాత  చలువ ! :)
 

శ్రీ గరికిపాటి వారు తమ బట్ట తల మీద చెణుకులు ప్రతి సభ లోనూ వేస్తూంటారు ! అట్లాంటి వారి బట్ట తల మీద ఆణిముత్యాల్లాంటి స్వేద బిందువులను తెప్పించిన యార్లగడ్డ వారు మరెంత గొప్ప వారు :)

క్రింది యు ట్యూబ్ లింక్ లో శ్రీ గరికిపాటి వారి ప్రసంగం సుమారు ఒక గంటా పది నిముషాల ప్రాంతం నించి మొదలవు తుంది ! హాట్సాఫ్ టు శ్రీ గరికిపాటి !



చీర్స్
జిలేబి

Wednesday, May 11, 2016

ఈ రోజు వచ్చె జిలేబి వేడిగా :)

ఈ రోజు వచ్చె జిలేబి వేడిగా :)
 
బ్లాగ్వీరుల కు బ్లాగ్వీరాంగణలకు శుభోదయం !
 
ఈ రోజు వచ్చెను
జిలేబి వేడిగా
తూరుపు తెల్లారకముందే
ధారాధరము లా !
 
కామెంటులు కురిసేనా
బ్లాగుల చెమక్కుల చమ్కీల తో  !
వాడిగ జిలేబి
తియ్యందనాల ట్వీటు ల తో !
 
తక్కువ కాని టపాలతో  
తగ్గని కామింట్ల మేళము తో
అగణిత మౌ సిరి నగవులు
బ్లాగ్ లోకమంతా పరేషాన్ !
 
 
హాటు హాటు పాటలతో
స్వీటు స్వీటు జిలేబి
వెచ్చని వెన్నెల
కొల్లలై వచ్చెను వచ్చెను
 
పరాక్ బహు పరాక్ :)
 
 
చీర్స్
జిలేబి
 

Friday, April 15, 2016

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !


శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !
 
బ్లాగు లోకానికి !
 
అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు !
 
 
 
సీతాయాం పతి !
 
చిత్రం - దిహిందూ ఫేమ్ శ్రీ కేశవ్
 
Sita's Rama in Privacy :)
 
 


ఒక తండ్రి మువ్వురమ్మలు
నికరము నాల్గన కొమరులు నిచ్చట జూడన్
ఒక నీశుడు మూడు గుణము
ల కలువ  వేదంబు నాల్గు లచటన గంటిన్ !
 
జిలేబి
 
 

Thursday, April 14, 2016

ఏమి చేయవలెనో చెప్పుమందువా !

 




       




      
ఏమి చేయమందు ఈశ్వరా !

ఏమి చేయ వలనని నన్నే
అడిగిన నేనేమి చేతును మానవా !


 
తెల్లవారినది మొదలు కల్లలాడు బ్రతుకాయె

దానికి కారణంబెవరు ? మానవా ?

నెల్లప్పుడు  నా కిచట నెవరి నే మందునయా

నెవరి నేమనుటకు నీకేమి అధికారము గలదు ?
అనవలయు నన్న ఈశుడొక్కడే నీ కాధారంబుగాద ?

అల్లకల్లోలవార్థి యైనది నా చిత్తము
చల్లగా నిన్ను తలచజాలు వీలేదయా

చిత్తమది నీదను మాట వదులుము మానవా
ఇంకను నాచిత్తము అనిన నేనేమి చేతును ?
నా నీ లు ఉండ నీవు నీవే గాదా నేనెక్కడ యిక ?
 


ఏ వారికి హితుడనో ఎరుగరాని లోకమున
నా వారని యెవ్వరిని నమ్ముకొని యుందురా

ఎవరు నీవారని లోకము నకు వచ్చినాడవు ?
నమ్మి ఎవరిని వచ్చినాడవు ? ఆ నమ్మకము
వీడి నీ వెవ్వారిని నమ్మ వలయు ?

ఈ వసుధ మీద వీర  లెఱుక గల్గి యున్నారని
నీ వారని యెవ్వరిని నేను తెలిసికొందురా
 


అందరు నావారే గాదా మానవా ? నన్ను వలయు
నన్న వాడివి మధ్యవర్తి నేల తెలిసి కొనవలయు ?
నన్నెరుక గొనుమా ! నన్నెరుగ నేనే నువ్వు !


మస్తకము దురూహల మయమాయె విసివితిని
దుస్తులవలె తనువులను త్రోసిత్రోసి విసివితిని
పుస్తకముల పరమసత్యమును వెదకి విసివితిని
ప్రస్తుతకర్తవ్య మేమొ బాగుగా తెలుపరా
        


తత్పర పరాత్పరాత్పర
మత్పర చిత్పరమువోలె మారుతి నాత్మన్
సత్పుర రాముని సన్నిధి
తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్ !

శ్రీ శ్యామలీయం వారి టపా చదివాక

శివోహం !

జిలేబి




Wednesday, April 13, 2016

వాకిట వేచిన జిలేబి !

వాకిట వేచిన జిలేబి !
 
రేఖా చిత్రం పొన్నాడ !
 
 
వాకిట జిలేబి ఓరగ
దాకుని వేచెను గదోయి తాపము తోడన్ !
ఆ కురు లందము గాంచన్
తూగెను ప్రేమికుడు మన్మధుని గానయటన్ !
 
చీర్స్
జిలేబి

Saturday, April 9, 2016

జిలేబి త్రిభంగి :) - భంగు తాగక నే కిక్కు నిచ్చు :)


జిలేబి త్రిభంగి :) - భంగు తాగక నే కిక్కు నిచ్చు :)


వడివడి చదువగ పదముల నటునిటు గుదురుగ వేసితి యీ వ్యాఖ్యను ఓ వాద్యమ్ముగ గావన్ !
బడబడ నటునిటు తిరుగుచు చకచక పనులను చాకువలే భార్యయు గాపాడన్, మరి సోఫా
నటునిటు జరుపుచు కుదురుగ జలజల నడకలు గూడన, “ఓహ్! నా,పని రాణమ్మా ” యని ఓ నా
డటు బిలువ మరి మురిపెము గొనెను గద! పెనిమిటి తోడను నీ డంగగు పాడన్రా యన, “పోడా”
సడి వలదని యరవపు సరి చెణుకుల విసిరె జిలేబి! సదా సౌమ్యము గా సాగాల మదీశా !


***

కుదురుగ నొకరికొకరు నిటు పరిమితముగ గదియే గుడిగా కూర్చుని నీకున్నూ మరిమాకూ
యిది సరస సమయమనుచు గడుపుదము విను !రమణీ !నిజమే ఈ రవి సాయిత్తే మనదోయీ !
విధిగను వినుదము నతని పలుకులను !మనలకు మేలుయనన్ వీరుడు గావించే నిది సువ్వీ !
గదిన మనము కులుకు చిలుకలవలె పరవశముగా నిటు యీ కాలము ఓంకారంబని రాగా
ల ధునిగ కలకలముల గనగ సరసపు పలుకులన్ మురిపాలాటల వేళాయే జవరాలా !



జిలేబి
(త్రిభంగి)

Friday, April 8, 2016

ఉగాది జిలేబీయం !

ఉగాది జిలేబీయం !
 
న్నది ఒక్క భూమి
గానము చేతము రండి
దినము ప్రతిదినము
జిగజిగ లాడు నది వోలె
లేమిని పారద్రోలి
బీరపు నడకన
యందరి జీవనము
శుభస్కరము
గానన్ !
 
అందరికీ
దుర్ముఖి నామ సంవత్సర
శుభాకాంక్షలతో
జిలేబి
 
వినుమ! జిలేబీ ! తొలగును 
జనగణ బాధాకరము! వసంతము వచ్చెన్,
మన యధినాయకులు తెలివి
గొని యెల్లర మేలుగూర్చగోరిన మేలౌ !
 
ఇదిగో వచ్చెను దుర్ముఖి !
ఇదియెల్లరికిని శుభముల నిచ్చును జూడన్!
పదవే యుగాది ముగ్గులు
విధముల వాకిట జిలేబి విరివిగ వేయన్ !
 

Thursday, April 7, 2016

ఫ్లేవర్స్ అమెరికన్ ఇండియన్ సినిమా !

ఫ్లేవర్స్
 
అమెరికన్ ఇండియన్ సినిమా !
 
ఈ చిత్రం లోని హీరొయిన్ ని
ఈ మధ్య కమలహాసన్
విశ్వ రూపం చేసాడు :)

 
చీర్స్
జిలేబి
 

కాలం లో కరిగి పోయిన కవిత !

కాలం లో కరిగి పోయిన కవిత !
 
!
 
జిలేబి

Saturday, April 2, 2016

కవివరుల్ ఆదరించిరి !

కవివరుల్  ఆదరించిరి !
 
 
శ్రీ ఫణీంద్ర గారికి !
 
నెనర్లు !
 
అతడు ఫణీంద్రు డాంధ్రుడు !
అతడనియె "అ-ఆ-ఇ-ఈ" లె అందరివి యటన్ !
అతని కవితలన్ జోదును
అతులిత మధురిమ, సుధామయ రసము గంటిన్ !
 
జిలేబి

 

Friday, April 1, 2016

స్త్రీ స్థాయి తత్వాలు :)


స్త్రీ స్థాయి తత్వాలు :)
 
మగవాణ్ణి నమ్మబోకు వనితా
అగచాట్లను పొందబోకు వనితా
 
బిరుసు గలిగి యుండవే వనితా
అలసి సొలసి నతనేవచ్చు వనితా
 
బూచిజేయు నాతడు వనితా
నమ్మినావ నరకమేను వనితా
 
సన్నాసి కి సుద్దులేల వనితా
సంసారి కి ముద్దులిమ్మ వనితా
 
నమ్మితీవు మగడని వనితా
పదారు వేలవాడే వనితా
 
సూరీడని వెంటబోకు వనితా
సుర్రుసుర్రు నినుగాల్చు వనితా
 
ముద్దు జేసి మోహమను వనితా
వద్దు వాడి భ్రమల బడకు వనితా
 
వగచి వచ్చు వీరువోలె వనితా
వగలు పోవు వాడిపోవ వనితా
 
రంగు జూచి మోసపోకు వనితా
రకతమాంసము తినునతడు వనితా !
 
ఒంపు నీదను యింటజొచ్చు వనితా
చంపు ఆపైన నిను గూడను వనితా
 
మెరమెచ్చున బడితీవా వనితా
మరమత్తు జేయునిన్ను వనితా
 
కొంగు బట్టవచ్చుగాన వనితా
కొండముచ్చు నాతడే వనితా
 
పసిడి మేను పట్టిజూడ వనితా
పరమ చేటును జేయును వనితా
 
సిగ్గు వీడి సరసమేల వనితా
ఒగ్గు వగల జిక్కబోకు వనితా
 
మగాడంటే నరకమేను వనితా
గాదిలోన సుఖము లేదు వనితా
 
ఓరజూపు మీటునిన్ను వనితా
కోడెత్రాచు నాతడే వనితా
 
మగవాడి మాటలెపుడు వనితా
అబద్దాల మూటలేను వనితా
 
మగవాణ్ణి దరిజేర్చకు వనితా
మైలు దూరానబెట్టు వనితా
 
జిలేబి మాటలన్నీ వనితా
జిగేలు మనుమూటలే వనితా !


చీర్స్
జిలేబి
(పరార్!)

Thursday, March 31, 2016

శోధిని ! సరిక్రొత్త తెలుగు అగ్రిగేటర్ - బ్లాగిల్లు వారి నించి !

శోధిని !
 
సరిక్రొత్త తెలుగు అగ్రిగేటర్ - బ్లాగిల్లు వారి నించి !
 
బ్లాగిల్లు శ్రీనివాస్ గారి
 
శోధిని అగ్రిగేటర్ 
(Its more than an aggregator!)
 
link
 
శోధిని వచ్చెను తెచ్చెను
మీదగు మీ శ్రీనివాసు  మీరును జూడన్ !
మోదము!  తెలుగుకు చేవగ
కాదగు సంకలిని వచ్చె గదవే జూడన్ !
 
త్రీ చీర్స్
జిలేబి

Tuesday, March 29, 2016

బ్లాగిల్లు శ్రీనివాస్ గారి కి - అవిడియాలు !

బ్లాగిల్లు శ్రీనివాస్ గారి కి - అవిడియాలు !


ఈ మధ్య జిలేబి వదన అగ్రిగేటర్ అంటూ జిలేబి తూచ్ అని ఓ స్టాప్ గేప్ బ్లాగ్ లిస్టింగ్ పెట్టింది ఆఖరి గరిక మా మాలిక గూడా మొరాయించటం తో !

బ్లాగిల్లు శ్రీనివాస్ గారు కామింట్ లాడుతూ శుభ సూచకం ఇచ్చారు ! - రాబోయే ఉగాది పండగ నాటికి వారి చలువ తెలుగు బ్లాగు లోకానికి మరో సరి క్రొత్త అగ్రిగేటర్ వస్తుందని !

హమ్మయ్య అనుకున్నా !

సో ఈ రాబోయే అగ్రిగేటర్ కోసం ఎదురు జూస్తో

ఈ అగ్రిగేటర్ కి సలహాలు ఏమన్నా ఇచ్చే దైతే ఇక్కడ ఇవ్వగలరు !
జిలేబి సలహాలు

చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తో శ్రీనివాస్ గారిని పరేషాన్ జేయ దలచు కోను !
లేటెస్ట్ స్క్రోల్లింగ్ పోస్ట్స్ + కామెంట్స్ (ఇది ముఖ్యం జిలేబి కి మరీను :) లిస్టు జేస్తే అదే ఇప్పటి పరిస్థుతుల్లో గొప్ప సహాయం తెలుగు బ్లాగు లోకానికి !

డబ్బులిచ్చి లిస్టింగ్ జేసుకోవాలా ? ఊహూ ! వలదు వలదు !

అగ్రిగేటర్ గూగుల్ ప్రకటనల మాధ్యమం ద్వారా గాని మరి ఏవిధమైన మాధ్యమం ద్వారా గాని డబ్బులు గిట్టు బాటు అయితే చేసు కోవచ్చా ? తప్పక చేసుకోవచ్చు అనుకుంటా నా వరకైతే నవ్య వార పత్రిక స్టైల్ అదే ! ఆ టెంప్లెట్ బ్లాగ్ అగ్రిగేటర్ ఫాలో అయితే సైడ్ బార్స్ ప్రకటనల కి ఉపయోగ పడొచ్చు ! దస్కం అగ్రిగేటర్ కి వస్తే మహద్భాగ్యం !

రండి సరి కొత్త తెలుగు బ్లాగు రాబోయే బ్లాగు కి స్వాగతం పలుకుదాం !

మీ సలహాలు అవసరం ! కామింటు రూపేణా గాని వారి ఈ మెయిల్ కి గాని తెలియ జేస్తారని ఆశిస్తో !

కోట్ :

జిలేబీ గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు. తెలుగు బ్లాగర్లకు ఓ వేదిక లేకపోవడం నాకూ బాధగానే ఉంది . బ్లాగిల్లు మూతపడిన తరువాత కూడలి , ప్రస్తుతం మాలిక ... ఇక తెలుగు బ్లాగర్లకు ఏమీ మిగల్లేదు అనే అనుకోవాలి.
మీ అభిమానం కొనసాగితే త్వరలోనే మరో ఆగ్రిగేటర్ రావచ్చు . ఉగాదికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను.
ఎలా ఉండాలి అనే దానిపై మీ సలహాలు నాకు మెయిల్ చేయండి. srinivasrjy (ఎట్) gmail dot com

శ్రీనివాస్  క
అన్కోట్

చీర్స్
జిలేబి

Monday, March 28, 2016

It is It !

It is It
 
The sort of it is It
The it of it is It
The all of it is It
---Semple
 
 
 
 
 
 
 
 
Freedom
 
The past is frozen
The future is melting
The present is weather
 
---HawaH
 
With a feather
the Universe is untangled
 
---Will Duprey
 

Friday, March 25, 2016

జిలేబి వదన ! సరికొత్త బ్లాగు అగ్రిగేటర్ !

జిలేబి వదన ! సరికొత్త బ్లాగు అగ్రిగేటర్ !
 
బ్లాగిన బ్లాగరుని గ్రక్కున బట్టన్ !
కామింటిన కామెంటరు ని గ్రక్కున బట్టన్ !
త్వరితము చూడుడు జిలేబి వదన



సరికొత్త అగ్రిగేటరు ! లింకు క్రింద ఉన్నది !
చిత్రము నొక్కుడు !
చిత్రము గణగణ
జూడన జిలేబి వదన !
 
జిలేబి వదన ! అగ్రిగేటర్ !

 
చీర్స్
జిలేబి
(తూచ్!)

Tuesday, March 22, 2016

ఇట్స్ టైం ఫర్ కాఫీ విత్ అయ్యర్ :)

ఇట్స్ టైం ఫర్ కాఫీ విత్ అయ్యర్ :)



అయ్యరు గారందించిన కాఫీ సిప్ జేస్తో 'అహా' కుంభకోణం డిగ్రీ కాఫీ బాగుందండోయ్' అంటే ,

ఏమోయ్ జిలేబి ఈ మధ్య మరీ బిజీ బిజీ అయి పోయేవ్ ? అన్నారు కుశలము విచారిస్తో !

వారు నా కుశలాన్ని విచారించే పధ్ధతి ఇదే గా మరి అనుకుంటూ

ఏముంది లెండి ! ఈ మధ్య పద్య రచనల మీద పడ్డా ! మీకు తెలుసుగా ఒక పదం కుదిరితే మరో పదం కుదరదు ! పోనీ  పాదం కుదిరింది అని ఆనందం తో మీరిచ్చిన కాఫీ సిప్ జేస్తే మరో పాదం రాలె ! ఇట్లా కుస్తీ ల తో నే సరి పోతోందండోయ్ - చెప్పా !

ఓహో ! నత్త బాధ లన్న మాట ! హిందూ పేపరు లో తల బెట్టి న్యూసు చదువుతో అన్నారు !

అయ్యర్ వాళ్ ! ఈ పద్యాల గోళం లో పడి ఈ మధ్య దేశం లో ఏమి జరుగు తోందో తెలీక పోయే ! ఏమిటి దేశం ఖబుర్లు అన్నా ! అర్రెర్రే ! బడ్జెట్ సీసన్ కూడా అయిపోయే వాటి మీద కూడా జిలేబి ఏమీ కామెంటరీ వ్రాయక పోయెనే అనుకుంటూ !

ఆ ఏముంది లే జిలేబి దేశం లో ఆర్ట్ అఫ్ లివింగ్ వాడు గ్రాండ్ స్కేల్ లో కల్చరల్ ఈవెంట్ పెడితే హిందూ వాడు దాంట్లో ఎక్కువ రంద్రాన్వేషణ పెట్టాడు !

అంటే !

నెగటివ్ పాయింట్స్ అన్నీ పట్టు కొచ్చి అబ్బే ! వీళ్ళకి ఈవెంట్ మేనజ్ మెంట్ తేలీదని తేల్చి పారేసాడు !

ఓ !

అంతే కాదు ! రవిశంకర్ మొదట్లో పొలిటికల్ లీడర్ లా మాట్లాడ ప్రయత్నించి తాను ఆధ్యాత్మిక గురువు అన్న మాట గుర్తుకొచ్చిందేమో సరిదిద్దు కుని హృదయం తో మాట్లాడటం మొదలెట్టాడు !

ఓ !

అదే మీటింగు లో మోడీ వాళ్ళ కి కావలసినంత జోష్ భరీ మస్త్ భారీ స్లోగన్ లు అందించాడు కూడా ! ఏ ఓ ఎల్ అంటే ఏమిటి అంటూ వాళ్ళ కే వాళ్ళ గురించి తెలీనిది చెప్పాడు :)

ఓ ! మన మోడీ గారేం చేస్తున్నా రండీ  ఇంకా !

వారా ? ఈ మధ్య ఒక సూఫీ కాన్ఫెరెన్స్ లో వాళ్ళు మస్త్ ప్యార్ భరీ ఉర్దూ లో రాగం తీస్తో మాట్లాడితే , తన ఫేవరైట్ భాష హిందీ లో జబర్దస్త్ వాయించ కుండా అరువు ఆంగ్లం లో వాళ్ళ కి మెసేజ్ ఇచ్చాడు ప్రసంగం లో !

ఏమని ?

అల్లాః హి రహ్మాన్ అవుర్ రహీం హై ! అని !

వారెవ్వా ! ఇంకా ?

ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు గాని ఏమిటి ఇవ్వాళ నా మీద పడ్డావ్ ? కాఫీ బావుందా ? 

కాఫీ బ్రహ్మాండం ! ఇంతకీ అయ్యర్ వాళ్ ఈ మధ్య ఒక పద్యం వ్రాసా ! చదివి వినిపించ మంటా రా !

అయ్య బాబోయ్ ! జిలేబి ! ఎన్నై విట్టుడు ! ఎనక్కు వేండామ్ ఉన్ పద్యం !

అయ్యర్ వాళ్ మళ్ళీ గోముగా మరో మారు పిలిచా !

ఇదిగో జిలేబి నీకు పనీ పాటా లేదు ! అట్లా గాదు గా నా కైతే !

వంటా వార్పూ నా మెడ కి అంట గట్టావ్ ! ఆఫీస్ పనంటూ !

ఆఫీస్ పని ఏమి నిర్వాకం చేస్తా ఉన్నావో మన మురుగ ప్పెరుమాళ్ కే ఎరుక ! ఎప్పుడు జూసినా ఒకటి రెండూ ఒకటి అంటూ గణా లని గుణిస్తో ఉన్నావ్ తప్పించి ఆఫీసు పనీ ఏమీ చేసినట్టు  దాఖలాలు లేవు ! పనీ పాటా లేక పోతే వంటా వార్పూ చెయ్య కూడదు నాకు మరి కొంత రిలీఫ్ కూడా !

అయ్యర్ వాళ్ అయం వెరీ వెరీ బిజీ ! మరో కప్పు కాఫీ బట్రాండి ! హుకూం జారీ చేసా !

హుసూరు మని హుజూర్ అని అయ్యర్ గారు మళ్ళీ వంట గది ముఖం పట్టేరు !

హమ్మయ్య! ఇట్లాంటి అయ్యరు గారు ఉన్నంత వరకు మన టైం పాస్ కి డోకా వచ్చింది ఏమీ లేదను కుంటూ  మళ్ళీ భారీ శరీరాన్ని కరిగించు కోడా నికి పద్యాల తో కుస్తీ పట్టటం మొదలెట్టా తూలికా రమణి చెప్పిన కిటుకు యిదే గా మరి ! జాలం మీద పడి బరువు తగ్గించు కో అని సరి కొత్త తెకినీకు అన్న మాట :)

చీర్స్
జిలేబి

Monday, March 14, 2016

నడుమున చేతులు జేర్చన్ !

నడుమున చేతులు జేర్చన్ !
 
రేఖా చిత్రం శ్రీ పొన్నాడ !



నడుమున చేతుల జేర్చన్
సడి సడి జేసెను కురులను సరసపు మోమున్
ఒడి తడి వేదిక నయ్యెన్
విడివడని ఒడులు ఒడుపుగ విరహము దీర్చెన్
చీర్స్
జిలేబి

Sunday, March 13, 2016

మన మోహన జిలేబి యాగం :)

 
శ్యామల తాడిగడప రా
యా! మన మోహన జిలేబి యాగము నందున్
ఆ మాస్టారి అనుకరణ
నే మది గొనినిటు బుడిబుడి నేర్చితి గనుమా
****
కందివరుల కొలువున నే
బొందితి ఆదరణ, నాదు పొడిపొడి పలుకున్
అందముగ జేసి నేర్పిరి
కందము, కవి శంకరయ్య కవనపు రాజుల్
***

చందము సాఫ్టున మరిమరి
డెందపు అమరిక నిఘంటు డేటా బట్టన్
అందపు బ్లాగుల కామిం
ట్లందరి జేరెను జిలేబి టపటప వేసెన్ !
***
వేసిన కామింట్ల చదివి
ఆశీస్సులనిచ్చిరి గద,  ఆ దరువు గనన్
కాసిని తెలుగును నేర్చితి
మా సిరి యిదియే జిలేబి మాటన్ గనుమా !
***
సరళపు చెలువపు తెలుగున
గిరగిర పలుకుల నడకల కిటుకుల లక్కా
కు రచనల జూచి నేర్వన్
కరముగ శ్రీపాద గురువు కరుణన గంటిన్ !
****
మత్త గజం తికజం శివ
మెత్తగ జాంజాం గిరిగిరి మేనియు జుట్టెన్
కొత్తగ జిలేబి కందము
మత్తగు వాసన, గుభాళి , మా దరి గాంచెన్
***
బీజాం గిరిరాజ తనయ
పూజనువాసన జిలేబి పూరణ గాంచెన్
మా ఝరియిన్ గువ గువలా
డే జాము గుభాళి శంభుడే గొని తెచ్చెన్ !
***
చింతన గనుమా ! మిడిమిడి
బొంతర! నిమ్మది నెటుగొనె ?  బొగ్గు యగుదువే
వింతగు మా పెనిమిటులకు
కొంత తెలియ ! కీచక! తొలగుము వెలగమురా
***
మాలిని మధురిమ జూడన్
స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై,
బాలిక లకు నేర్పవలెన్
కాళిక మెరుపున్ జిలేబి కరుణయు గూడన్
***
సదనము నిదియే కవివర
కదనము జేయన్, కవనపు కందివరు సభా
సదు లార మీరు కవితా
మధువును గ్రోలెదరు దైవమందిరమందున్ !
***
ఊహా గానము జేసిరి వేదము ఊపిరి మీరగ  పారులు పాడన్
ఆహా మాచన జెప్పెను జూడర ఆ దరువు నిత్య సత్యము జూడన్
ఓహో తెలిసెను వేదము మేటిర ఓపిక గూడగ సామము పాడన్
ఔహా అనునవి వాడుక ఊహా ఔరా ఆయెను గదరా జూడన్
***
కథవిను మాచన జెప్పెన్
పథమున బోవన ధబిల్లు పాగెము లేకన్
అధకిమ్ రైలున కంకెర
నిధనము జేయగ విధి యిది నిక్కము సుమ్మీ
 
 
చీర్స్
జలేబి 
 

Thursday, March 10, 2016

మూసిన కనుతీరు జూడన్ :)

మూసిన కనుతీరు జూడన్ :)
 
రేఖా చిత్రం పొన్నాడ !



మూసిన కనుతీరుగ నిను
జూసితి వేణీ జిలేబి జూడగ మెరిసెన్
వ్రాసితి నిచటన్ కందము
నీ సిరి సబల సిరి గదవె నీల చకోరీ
 
జిలేబి

Tuesday, March 8, 2016

అయ్యో పాపం ఏకేశ్వరుడు :)

అయ్యో పాపం ఏకేశ్వరుడు :)

మా దేవుడు ఏకేశ్వరుడు

అవునా పీతాంబరధారి యా ?

అబ్బే దిగంబరి .

ఎట్లా ఉంటాడో ?

మీరంతా మూఢులు ;  దేవుడు ఎట్లా ఉంటాడు అంటా రేమిటి ? అమూర్తి వాడు ; మా ఏకేశ్వరుడు నిరాకారి ;

అయ్యో పాపం ! ఏమన్నా ఆహారం పానీయం, ప్రసాదం గట్రా పుచ్చుకుంటా డా ?

ఛీ ఛీ మీరంతా చీడ పురుగులు ; ఎప్పుడు  ప్రసాదం, తిండి యావే నా ? మావాడు ఏమీ తినడు ;

ప్చ్; బక్క చిక్కి డొక్క లేని వాడన్న మాట ;  ఎక్కడ ఉంటాడో ?

ఎక్కడైనా ఉంటాడు గాని మీకు కనిపించడు ; వినిపించడు ;

ఈ నల్లని రాళ్ళ లో ? పాముల పుట్ట లో ? నీలి మేఘం లో ?

చెప్పాగా మీరు మూఢులు  అని; మీదంతా మూఢ భక్తి ; ఛీ ఛీ రాళ్ళ లో ఉండట మేమిటి ?  పాములా ? ఛ ఛ అంతా చాదస్తం ; మీకు బాగా బ్రెయిన్ వాష్ చేసేసారు ;

పోనీ మనుషుల్లో ? జంతువుల్లో ?

ఛీ ! వెధవాలోచన ; మీరంతా పాపులు !

మరీ ఇంత కనిపించ కుండా ఎక్కడ దాక్కున్నా డబ్బా ?

మావాడు స్వతంత్రుడు ;  ప్రత్యేకము గలవాడు ;

అంటే ? వాడొక్క డే కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ ఉంటా డా ? మరీ అసంఘ జీవి యన్న మాట !

ఛీ ఛీ ! వాడు మీతో కలవడు ; మీరంతా భ్రష్టు పట్టి పోయారు

మీకు ఏమీ తెలియదు ; మా దేవుడు ఏకేశ్వరుడి గురించి ; మీ బుర్ర లంతా వట్టి మట్టి బుర్రలు !

నీ పేరేందబ్బాయ్ ?

అవివేక్ :)

ఓ, small brain అన్న మాట :) పేరు బాగుందబ్బాయ్ :)


చీర్స్
జిలేబి

Thursday, March 3, 2016

అంబ పలుకుమా ! జగదంబ పలుకుమా !

అంబ పలుకుమా ! జగదంబ పలుకుమా !


రేఖా చిత్రం పొన్నాడ !
 
ఔరా ! చూడన ముద్దుర !
హోరాహోరి నటు మాట హోరుగ జేసెన్ !
గోరీ లాయెను చదువుల్
ఓరీ , పలుకు జగదంబ నోటి పలుకురా  



చీర్సు సహిత
జిలేబి

Wednesday, February 24, 2016

ఎండ వేడిమి

ఎండ వేడిమి
 
ఉస్సురుస్సు రంటూ
కుర్చీ లో కూల బడ్డా
కూల్ నెస్ ఏమన్నా
వస్తుందేమో అనుకుంటూ
 
కుర్చీ విరిగింది సరి
కూల్ నెస్ ఏమీ రాలె
 
ఎండ వేడిమి మరీ సుమీ !
 
సూరీడు మండి పోతున్నాడు
కూసింత కోకో కోలా తీసుకు రండీ :)
 
 
చీర్స్
జిలేబి

Monday, February 22, 2016

ముసురు పట్టిన ఆకాశం

ముసురు పట్టిన ఆకాశం
 
ఆకాశం ముసురు పట్టింది
నాకు ఇవ్వాళ అందుకే
మనసేం బావో లేదు
అనుకున్నా
 
వర్షం జోరున కురిసింది
ఆకాశం తేట బడింది
మనసు వర్షం లో తడిసి
ముద్దయ్యింది తేలికయ్యింది
 
శరీరం లో ఎనభై శాతం
నీరుందంటే మరి యిట్లాగే
కదా ప్రకృతి తో
తనూ ప్రతిధ్వని స్తుంది !
 
శుభోదయం
జిలేబి

Friday, February 12, 2016

చెప్పాలి వర్సెస్ చెప్పాలె - Story continues !

చెప్పాలి వర్సెస్ చెప్పాలె - Story continues !

మా బ్లాగు గరువు శ్రీ శ్యామలీయం వారు మాకో కితాబు ఇచ్చారు (కితాబే అనుకుంటున్నా  జేకే !)

నిరంతర వ్యాఖ్యా ప్రకటన కుతూహల నయనీ (ఆ ఆఖరు కితాబు పదం నాకై నేను జోడించు కున్నది కొంత ఈ మధ్య జవ్వని కన్నుల మీద పడటం మూలాన !:)

నివ్యాప్రకులా అని గాని నివ్యాప్రకున అని షార్ట్ కట్ గా రాసేసు కోవచ్చు సావేజిత ఆగా ,చీర్స్ లాగా :)

సరే ఇక మేటరు "కోస్తాము" చెప్పాలె వర్సస్ చెప్పాలి :)

శ్రీ ఫణీంద్ర గారు టపా ని మామూలుగా వ్రాసు కుంటూ వచ్చి ఆఖరు వ్యాక్యం లో చెప్పాలె అన్న పదాన్ని ఉపయోగించారు. 

వారు మొత్తం టపా ని అట్లా వ్రాసి ఉంటే ఆ పదం నివ్యాప్రకున  కళ్ళకు (మళ్ళీ కళ్ళు సుమీ :)  కనిపించేది గాదు !

ఆ టపా ఆఖరు వాక్యం లో వారలా ట్విస్ట్ ఇవ్వడం తో కవి చమత్కృతి  చెప్పాల్సినది గట్టిగా చెప్పినట్టు నాకనిపించింది ;

సో , వారికి కితాబు గా "మీ టపా మొత్తం లో ఆ చెప్పాలె బాగుందండీ !" అన్నా ;

వారన్నారు

“చెప్పవలె” అన్న గ్రాంథిక క్రియారూపానికి తెలంగాణ ప్రాంతీయులు ప్రయోగించే “చెప్పాలె” అన్న వ్యవహార రూపం దగ్గరగా ఉంది. “చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు. ఆ ప్రయోగంలోని “లి” అన్న అక్షరంలో ఇకారం ఎక్కడ నుండి వచ్చిందో ఆ పరమాత్మునికే తెలియాలె.

వ్యవహార పరం గా చెప్పాలె దగ్గిర ఉన్నది అన్నది లాజిక్ పరం గా సరిగ్గా ఉంది ;

చెప్పాలి అన్నదానికి ప్రమాణము కనిపించదు అని ; ఇదీ లాజిక్ పరం గా సరిగ్గా ఉందో లేదో మరి నాకు తెలియదు ; ఎందుకంటే ప్రమాణం అన్నది దేన్నంటా రో అన్న దాన్ని బట్టి ఇది మారొచ్చు అనుకుంటా 

మామూలు గా అనిపించ లేదు గానీ వారీ ప్రశ్న వేసాక అవునబ్బా సినబ్బా యిది మంచి 'లా' "చిక్కు" ప్రశ్నే మరి అనిపించింది. 

ఆ పై వారు పరమాత్మ ని కే తెలియాలె అన్నారు ! సరి ఇదీ సెహ భేషు మాట ! మనకు తెలియనివి తెలిసిన వాడు ఒకడు కలడు అనుకోవడం సమంజసమే ! మంచిదే గా !

దీనికి మా గురువులుం గారు టపా వ్రాసేరు ;  టపా లో వారు "చెప్పాలి" అన్న అక్షరం లో ఇకారం (వికారము గానిది ఇకారము అనుకుంటా ! జేకే !) ఎట్లా వచ్చి ఉంటుందో అన్న శ్రీ ఫణీంద్ర గారి సంశయాన్ని నివృత్తి చేయ లేక పోయారని పించింది (ఆ టపా వ్యాఖ్యలు చదివినాక నాకనిపించినది అది )

సినబ్బా నీ ఒక్క వాక్యం ఇంత పెద్ద టపా పెట్టించే గురువులుం గారి చేత అని అనుకున్నా ఏమన్నా నారదా అనొచ్చా అనుకుంటూ :) జేకే !

వారు అప్రూవల్ వ్యాఖ్య ల బురఖా వెనుక దాగి పోయేరు కాబట్టి నారదా అన్నా ప్రయోజనం శూన్యం అనుకుంటూ ఇప్పటి ఈ టపా కడుతున్నా !

ప్రశ్న శ్రీ ఫణీంద్ర గారిది చాలా ఆలోచింప జేసే ప్రశ్న అనుకుంటున్నా నావరకు ! తెలిసిన వాళ్ళు చెప్ప వచ్చు !

=
చెప్పాలి అన్న పద ప్రయోగం లో “లి” అన్న అక్షరంలో ఇకారం ఎట్లా వచ్చి ఉండ వచ్చు ?


నివ్యాప్రకున
జిలేబి
నీదు నిరంతర వ్యాఖ్యలు
నీదు కలహ నారదాయ నిరుపమ దరువూ
నీదు ప్రకటన కుతూహల
మూ దురదయు నేమి విషమము జిలేబి భళీ :)


 

Thursday, February 11, 2016

దేవార వోరీలె దేవార వోరీలె :)

 
దేవార వోరీలె దేవార వోరీలె
దేవ జిలేబీ  గోరీ హో
దేవ జిలేబీ గోరీ హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవార వోరీలె దేవార వోరీలె
దేవ బ్లాగమ్మా గోరీ హో
దేవ బ్లాగమ్మా గోరీ హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ రాజన్నా గోరా  హో
దేవ రాజన్నా గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ శ్యామన్నా  గోరా హో
దేవ శ్యామన్నా గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ ఫణన్నా   గోరా హో
దేవా ఫణన్నా  గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ మాచన్నా గోరా హో
దేవా మాచన్నా గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే
 
దేవారా వోరీలె దేవారా వోరీలె
దేవ శంకరన్నా    గోరా హో
దేవా శంకరన్నా   గోరా హో
 
త్యామీ కొలసే త్యామీ కొలసే
 
హీరా మాణీక జోడీలే
హీరా మాణీక జోడీలే

 
(ఆరె జానపద గేయ సరళి)
 
జాణ
జిలేబి

Tuesday, February 9, 2016

బండెనక బండి కట్టి :)

బండెనక బండి కట్టి :)
 
బండెన్న బండి కట్టి
పదహారు బళ్ళు కట్టి
నీవేడ ఉంటి వయ్యో
బండోళ్ళ గురువు లయ్యో
 
బండెనక బండి మీద
పదహారు బళ్ళు మీద
పడుసూల పలుకులాట
పలుకూల పలువరుస
 
నీవేడ ఆగితయ్యో
బండోళ్ళ గురువులయ్యా
 
నీవేడ నిలిచితయ్యో
బండోళ్ళ గురువులయ్యా
 
బండెనక బళ్ల దారి
బళ్ళెళ్ళే ముళ్ళ దారి
దారెంతో దూర మల్లె
బారమయెర రాదారి
 
నీవేడ కునికెదవో
బండోళ్ళ గురువులయ్యా
నీవేడ ఓరిగితయ్యో
బండోళ్ళ గురువులయ్యా
 
(డా: అనసూయా దేవి గారి జానపద గేయాలు పుస్తకము నించి)
 
జిలేబి

Monday, February 8, 2016

గోదారి జవ్వని కన్నులు !

గోదారి జవ్వని కన్నులు !
 

భువి యంతా  తనదై
చేసుకుని ఉన్నాయి
జవ్వని కన్నులు
ఎర్రజేయుచు సంరక్త లోచని
రక్తాంత లోచని  
పొగరెక్కిన కళ్ళు
కళ్ళు తిరిగి పోవు కళ్ళు
కాటుక కళ్ళు
భీత హరిణేక్షణ !
అరమోడ్పు కళ్ళు
అర్ధ నిమీలిత నేత్రీ
నిమీలిత నేత్రీ
విశాల నయనీ
విశాలాక్షి
పంకజాక్షి  
బరువున మూత బడ్డ కళ్ళు
కలువ కళ్ళు
తామర కళ్ళు
-పద్మపత్ర నయని -
-పద్మదలాయతాక్షి
గంభీర మైన కళ్ళు
రమ్యమైన కళ్ళు
పిల్లి కళ్ళు
ఆవు కళ్ళు
చెంపకు చారడేసి కళ్ళు
మరీ
చిలిపి కళ్ళు :)
 
శుభోదయం
జిలేబి


 

Sunday, February 7, 2016

గోదారి కతలు - "Go" దారే :)

గోదారి కతలు - "Go" దారే :)

"என்ன ஜிலேபி ரொம்ப தீவிரமா எதோ ராஸ்தா உண்டாவ் " ?

"ஒன்னும் இல்லிங்கோ - ஈ மத்ய கோதாவரி ரொமபவே பிளுச்தொந்தி"

எதுக்கு ?

என்னவோ தெரிய வில்லை

அப்படியா ?

அப்படி தான்

சரி

சரி

நீ எழுது -> முத்துக்களோ கன்னம் முத்தமிழோ கிண்ணம்

எழுதினேன் 

எழுதினேன்

எழுதிக்கொண்டே இருக்கேன் :)


சீரஸ்
ஜிலேபி

Saturday, January 30, 2016

ఇంద్ర జాలం ! - Indra's Net !

ఇంద్ర జాలం ! -

Indra's Net !



A Book that every Indian must read
 
Originating in the Atharva Veda, the concept of Indra’s Net is a powerful metaphor for  inter-relatedness.
This book invokes Indra’s Net to articulate the open architecture, unity and continuity of Hinduism.
 
 
cheers
Zilebi
 

Monday, January 25, 2016

లవ్వాడు కుందాం రండి :)

లల్లాలు లుంలాం లంలి  :)
 
లో ! లలల
లోల ? లిలలో
లెలలో లలలో
లోలోల లలలో ?
 
లోలా ! లా లో లా
ల ల లా లా లో ల !
లీలా లా లా లా
లో లీ లో లా
 
లల్లాలు లుంలా  లా :)
 
లులోలలం
 లిలిలి  
లిలేలి :)

Friday, January 22, 2016

నడి రేయి నగరాజు బండి

నడి రేయి నగరాజు బండి
 
నగరం లో పురాన్ని విడిచి
స్వంతింటికి దారి పట్టా  
అలజడి ఉన్నా నిర్భయం గా
అక్కడి  మహామహుల
నెదురు కోడానికి కలవడానికి
 
నడిరేయి నగరాజు బండి
పట్టా సుదూరదేశాలకు
నా స్వప్నం సర్వస్వం
హస్త పేటిక న మూట గట్టి
 
ద్వారబంధం తెంచుకు
ఆకసానికి ఎగిరాను
నామది పిలుపు  
నాది గా అనాదిగా 
 
నడిరేయి గంట గణగణన
టంచను బండి నెక్కా
ఆలోచిస్తో స్వప్న జగత్తు
నక్షత్ర పుర వీధి లోనికి  
 
ఎవరూ ప్రయత్నించని  మార్గం
నాదైనది సుగమ్యం గాకున్నా
స్వప్నం సొగసుగ సాక్షాత్కరిస్తే  
మరి స్వప్నానికి విలువేది ?
 
నా విఫలాలే నా యెద 
ప్రతీక నా కలికితురాయి
 
నడిరేయి నగరాజు బండి
నన్ను సాగనీ నీతోడు
నేనెరుగని సుదూర తీరాలకు
నీవే చూపించు మార్గం  
నను గమ్యానికి జేర్చు నీవే
 
శుభోదయం
జిలేబి

Wednesday, January 20, 2016

A covered call option strategy on SBI Stock

A covered call option strategy on SBI Stock February 2016 Expiry  

With expiration date coming nearer next week for January option expiry we can see some volatility today/ tomorrow on stocks getting adjusted for their value.

As we see yesterday NSE zoomed a bit positive and it being observed SBI Stock at 52 week low prices can there be a possibility to explore a covered call strategy for February expiration date ?

The current SBI Stock price is about Rs 183.

We see the following call option prices ->

180 CALL Feb 2016 expiry Rs 12.50 buy price
190 CALL Feb 2016 expiry Rs. 7.50 sell price

If we buy 180 call and simultaneously sell 190 call we make an investment of 5 Rs. (12.5-7.5) ; The option lot is 2000 stock; so investment 5x2000 = 10,000/- Rs. This is the maximum loss;

Maximum profit is when stock for February closes above Rs.190/- by February expiry ie., 10x2000 = 20,000/- less investment Rs.10,000/- = Max profit of Rs.10,000/-.

So maximum profit of Rs.10,000 or max loss of Rs.10,000/- is the possibility;

What is the probability as of date for stock closing above Rs.190 ? Delta is about 0.40 So probability is about 40 percent; Even for 180 call the delta is about 60 percent ;

We can do little bit adjustment here by selling 165 put for current price of Rs.3/- thus minimizing the exposure to only Rs 2 per stock if we are happy to buy SBI Stock at a cost below Rs.165 definitely by February expiry.

cheers
zilebi