ఒక అవ్వ జిలేబీలు అమ్మేది
ఆ దరిదాపుల్లో ఎగిరే కాకి ఒకటి
అప్పుడప్పుడు జిలేబి వాసనల్ని పసిగట్టేది
కాకి కి అవ్వ వేడైన వడలు వేసిన కథలు తెలుసు కానీ
జిలేబీలు చుట్టే అవ్వ దగ్గిర నించి జిలేబి లు ఎలా
లాగాలో తెలియలేదు.
అవ్వా అవ్వా, ఐ హేట్ జిలేబీలు అంది కాకి
పోనీలే అమ్మీ, జిలేబి లు వంటికి , పంటికి , కంటికి
మంచిది కాదులే అని ఓ మాంచి వేడైన జిలేబి ని
పక్కన పెట్టి నిద్ర పోయింది అవ్వ .
కాకి వేడైన జిలేబి ని ముక్కున కరుచు కొని పైకేగురుతూ
కావు కావు మన్నది.
ఇంకే ముంది జిలేబి జారి పడ్డది.
నేనప్పుడే చెప్పాను గా జిలేబి పంటికి మంచిది కాదని అంది
అవ్వ నిదుర మాని.
నిజం, ఐ హేట్ జిలేబి అంది కాకి ,
నాట్ బికాస్ ఐ లవ్ వడ, బట్
కాలం మారినా కథలు మార కూడదు, అందుకని.
కథ కంచికి , మనమింటికి.
చీర్స్