బలపం పట్టి భామ వొళ్ళో అ ఆ ఇ ఈ నేర్చు కున్నా అని కవి (కని పించక పోయినా, వినిపిస్తున్న వాడు కవి- కొత్త నిర్వచనం!) 'ఆడలేడీసు ' మహాత్మ్యాన్ని చాటేడు .
ఇంత కథ ఉందన్న మాట ఈ అ ఆ ఇ ఈ ల కి.
అంటే, అమ్మ, ఆవు ఇల్లు ఈగ అని చిన్నప్పుడు చదువు కున్నాం చూడం డీ దాని గురించి చెబ్తున్నా.
ఇప్పటి కి మా మనవడి కాలం కూడా దాటి పోయింది కాబట్టి, 'ఇస్కూలు' వాళ్ళు అ ఆ ఇ ఈ ఇంకా నేర్పిస్తున్నారా అన్నది తెలీదు. నేర్పించినా, అదే అమ్మ ఆవు ఇల్లూ ఈగా అని చెబ్తున్నారా అదీ ను తెలీదు.
ఈ విషయం కూడా తెలీకుండా ఇట్లా టప్పు టప్పు లాడిస్తే ఎట్లా జిలేబీ అంటా రా?
మరి, టప్పు టప్పు లాడించే టప్పుడు మరి ఏ సబ్జెక్టు లేకుండా ఎట్లా టపు టపు లాడించ వలె అని జిలేబీ చాలా కాలం మునుపే టపాయించిందాయె మరి.!
ఇక అ ఆ ఇ ఈ ల విషయానికి వస్తే, ఈ నాలుగు అక్షరాలలో భువి దివి ఆ మాట కొస్తే 'విశ్వం' మొత్తం ఇమిడి ఉందని పిస్తుంది.
అందమైన ఆకాశాన్ని అలా చూస్తూ ఉంటే ఏమని పిస్తుంది మీకు? ఓ పది నిమిషాలు అట్లా తదేకం గా చూడండి, మీ ఆలోచనలన్నీ మటు మాయ మై పోతాయి. ఓ లాంటి బ్లాంక్ నెస్ వస్తుంది.
(సైడు కథ, ఇది జిడ్డు వారిది- అట్లా ఆకాశాన్ని చూస్తూ నడిచే వారట, క్రిందా, ముందూ ఏముందో కూడా చూడ కుండా నది వెంబడి అట్లా నడిచే వారట)
ఇక ఈ e-లోకం చూడండీ. ఇందులో తల పెడితే ఇక బయటకు వచ్చే సమస్యే లేదు.
ఎంతో మంది ఈ e-లోకం లో నే జీవితం గడి పే స్తున్నా రాయే!
సో, అందమైన ఆకాశం ప్రకృతి లో మమేకం. ఈ e-లోకం లో మనం మమేకం.
వెరసి 'ఏది' అదో అది' (తత్వమసి!) లో మమేకం కాకుంటే మనమే ఏకం!
'మమ ' ఏకమా ? కాకుంటే మమేకమా అన్నది మన చేతల బట్టి ఉంటుందన్న మాట.
(పద్మ కోశ ప్రతీకాశమ్ హృదయం చా ప్యధొ ముఖం!- తిరగ బడ్డ పద్మం లా హృదయం లో ఉంటుం దట , ఏమిటది? btw, ఊర్ధ్వ మూలం అధః శాఖమ్ , అధొ ముఖ పద్మ కోశం ?)
సో, ఇవ్వాళ్టి కి మీరు, కూడా చెప్పొచ్చు- ఈ టపా చదివాక ! బామ్మ ఒళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకున్నా అని !
శుభోదయం!
చీర్స్
జిలేబి.
ప్రకృతిలో మమేకం అయ్యే రోజులు పోతున్నాయని బాధపడుతూనే.. e లోకంలో మమేకం అయి పోయి ..మనమే ఏకం అయిపోయిన రోజులివి. అ ఆ ఇ ఈ లు నిజంగానే బామ్మ ఒడిలో నేర్చుకున్నట్టు.
ReplyDeleteమీరేం పోస్ట్ పెట్టినా ..చురక ఖాయం. జిలేబీ జీ! ఈ చురక నాకు నచ్చిందోచ్!
రెండోది నిజం, మొదటిది కాదు. తత్వమసి, అయిపోయింది జీవితం ఈ లోకంతో.బయట పడాలి అదే ప్రయత్నం.
ReplyDelete