ప్రకటన!
మా బ్లాగుకు కామెంటు కొట్టుటకు సరికొత్త
'కామెంటు' దారులు కావలెను.
ఆలశించిన ఆశా భంగం.
త్వర పడండి ! వేగిర పడండి !
కామెంటు కో కాణీ మీకు ఇనాము !
భలే మంచి చౌక బేరము !
పది కామెంటు కొట్టు వారలకు ఒక కొత్త టపా ఉచితం!
కామెంటు దారుల పేరుతొ 'బ్లాగు' దేవునికి లక్షార్చన !
(ఇది కొత్త కామెంటు దారలకు జిలేబీ అందించు సరికొత్త జాయినెర్స్ ఫ్రీబీ!)
ఈ సదుపాయము జిలేబీ టపా లకు కామెంటు కొట్టిన వాళ్ళకు మాత్రమే !
(అబ్బా అన్నీ కొత్తవి వచ్చేసాయి, ఈ కామెంటు దారులు మాత్రం పాతవారేనా మరి?)
ఇంతకు మునుపు టపా కి కామెంటు కొట్టినవాళ్ళు కొత్తగా కామెంటు కొడితే,
వారికి కామెంటు కు పది కాణీ లు బకాయ్!
(ఇది పాత కామెంటు దారులకు జిలేబీ'స్ స్పెషల్ లాయల్టీ ప్రోగ్రాం!)
చీర్స్
జిలేబి.
Nenochesa
ReplyDeleteస్వర్ణ మాలిక గారు,
Deleteమీకో కాణీ స్వర్ణం బహుమానం!
జిలేబి.
ఇది గమనించారా?
ReplyDeleteమీ పేరుని బ్రహ్మానందం వాడేసుకున్నాడు.
సినిమాపై కేసు వేస్తున్నారా?
కేసు నెగ్గాక ఇక్కడ కామెంటినవాళ్ళందరికీ జిలేబీల పార్టీ ఇవ్వాలి.
బోనగిరి గారు,
Deleteఆల్రెడీ కేసు వేసేసామండీ !
http://varudhini.blogspot.com/2012/08/blog-post_6.html
చీర్స్
జిలేబి.
జిలేబి గారూ!
ReplyDeleteఇది చాలా అన్యాయం, అన్యాయం, అన్యాయం
అధ్యక్షా! కొత్తవారికి డబ్బులిచ్చి పాత వారికి బకాయిలు పెట్టడం, కొత్తగా పధకాలు ప్రవేశపెట్టడం ఖండిస్తున్నా! అధ్యక్షా నేను చెప్పొచ్చేదేమంటే..........కొత్త కామెంటు దారుల్ని ఇలా రాయితీలిచ్చి లోబరుచుకోవడం ....మరి...ఖండిస్తన్నా...ఏట్రా సెగెట్రీ అంతేనా..
అధ్యక్షా,
Deleteమా కష్టే ఫలే వారికి ఓ పది పరకణీలు బకాయి పెట్టండి!
చీర్స్
జిలేబి.
ఇలా కామెంటుకో కాణీ పధకం ప్రతీ బ్లాగరూ ప్రవేశపెడితే, కామెంటీరులకు కొత్త ఆదాయమార్గం షురూ అయినట్టే.
ReplyDeleteదంతులూరి కిశోరా వారికి,
Deleteవెయ్యండి ఒక ఇరవై నాలుగు క్యారట్టు స్వర్ణాభరణం!
చీర్స్
జిలేబి.
నేను కొత్తో పాతో:-)
ReplyDeleteసృజన గారికి,
ReplyDeleteపది కాణీలు బకాయ్!
చీర్స్
జిలేబి.
కానీ, కాణీ లు చెల్లడం లేదు కదండీ
ReplyDeleteకామెంటుదారుల్లో ఉత్తి పోషకులు , రాజ పోషకులు, మహా రాజ పోషకులు లాంటి గ్రేడ్స్ ఏమైనా ఉన్నాయా? తెలియ చేయవలెను. నేను ఏ కేటగరీ?
ReplyDeleteకామెంటుదారుల కామెంటు దారులు రహదారులేనా దొంగ దారులు అనుమతిస్తారా? ....దహా.
బులుసు గారు,
Deleteదొంగ దారులు కుదరవు.
ఖబడ్దార్, మీరెవ్వరో, ఎక్కడ్నించి రాస్తున్నారో అన్నీ మాకు తెలుసు! - టపా చూడవలె!
బులుసు గారికి ఇరవై కాణీలు బకాయ్!
చీర్స్
జిలేబి.
ఇహనుంచి నేను బ్లాగులు రాయడం మానేసి జిలేబీ గారికి కామెంట్లు కొట్టి బతకదల్చుకున్నా
ReplyDeleteపంతుల వారు,
Deleteఅత్యంత ఆహ్లాద కరమైన నిర్ణయం!
(బ్లాగులు మాత్రం రాయడం మానకండెం మరి! ఒయాసిస్సు మీ బ్లాగ్ టపాలు )
పంతుల గారికి ముప్పై కాణీలు బకాయ్
జిలేబి.
జిలేబీ గారికి బకాయి పడనున్నను సరే .. నేను కామెంట్ పెట్టి తీరుదును . అదియును ఒక విశేషమున చేతనే! ఆమె వ్రాసిన ఠపా మాకు అర్ధమై ఉన్న యడలనే
ReplyDeleteఆమె అర్ధం గాకుండా వ్రాసినదని మా మట్టి బుర్ర ..తలంచిన ఏమి చేతును!? :(
వనజ వనమాలీ గారు,
Deleteఅబ్బా, ఇంతకీ ఈ టపా ముక్క అర్థమైనట్టా కానట్టా!(మరీ సస్పెన్స్ అయి పోయెనే!)
వనజ గారికి, మిట్టల్ 'స్టీల్' కాణీలు !
చీర్స్
జిలేబి.
మనోళ్ళు, అదేనండి కామెంటు చేసీవోళ్ళ సంగం ఇవరాలు రేపు నా బ్లాగులో సూడండి. ఉజ్జమమే, లెగండి.అక్కులు సాదించుకోవాలంటే ఉజ్జమమే మారగం.
ReplyDeleteకష్టే ఫలే గారు,
Delete'ఆవలోడు కార్తిరిక్కిరోమ్ !
చీర్స్
జిలేబి.
This comment has been removed by the author.
ReplyDeleteచిన్ని గారికి,
ReplyDeleteఇట్లా కామెంటు కొట్టి సెల్ఫ్ 'డిలీట్' కొడితే నలభై కాణీ లు బకాయ్!
చీర్స్
జిలేబి.
sarikothaga commentu kottavalayunu anaruga...anduke ila kotta :P
ReplyDelete