"సీతమ్మ అగ్ని ప్రవేశం చేసి సాధించినది ఏమిటి ? ఒక్క పదం లో చెప్పా లంటే సింపతీ. తల్లి ఏట్లో దూకుంటే సంద్రం లో దూకుంటే ఆత్మ హత్య అనేవారు. అగ్ని ప్రవేశం చేసి సింపతీ కొట్టేసింది." అన్నా మా అయ్యరు గారితో.
మా అయ్యరు గారు సీరియస్ గా లుక్కి చ్చేరు ఇదేదో విపరీతం ముంచు కోస్తోందేమో అనుకుంటూ.
మిమ్మల్ని ఏమీ అనటం లేదండీ అన్నా. 'మిమ్మల్ని అని నొక్కి చెప్పడం లో 'మీ 'మగోళ్ళ ని ' అని అర్థం ధ్వనిం చేలా.
హమ్మయ్య అనుకుంటూ కొంత సేద బడ్డారు అయ్యరు గారు.
ఇంతకీ ఏమం టావ్ ? అన్నట్టు చూసేరు.
ఏమీ లేదండీ శంకరా భరణం లో ఓ కామెంటు కొట్టేను ఎప్పట్లా. చెప్పా.
ఏమని కొట్టా వేమిటి అడిగారు మా అయ్యరు గారు సీరియస్ గా.
"ఏ కాలమైనా తన కాలం కాని స్త్రీ
నాడు రామాయణం లో అగ్ని ప్రవేశం
మొన్న ఇంద్రప్రస్థం లో అగ్గి బరాటా
రేపు మరి ఎక్కడో ఈ ప్రకృతి కి బుగ్గి ?"
అట్లా ఎందుకు రాసావ్ జిలేబీ అన్నారు.
ఆ ఏముందీ, శ్యామలీయం వారి మస్కా శ్యామరామీయం రామప్రభో పాహిమాం పాహిమాం చదివా. ఆ పై కంది వారి టపా లో ఓ ఫోటో పెట్టి పద్యం కొట్టండి అంటే, ఫోటో చూస్తే అందులో ఒకావిడ అగ్ని వైపు వెళ్తోంది. మరో ఇద్దరు చూస్తున్నారు.
మనకి సింబాలిక్ గా, అగ్గి, స్త్రీ కనిపిస్తే తటాలు మని తట్టేది ఏమిటి? సీతమ్మ వారి అగ్ని ప్రవేశ ఘట్టమే కదా ? అంటే, అమ్మ వారి అగ్ని ప్రవేశానికి అంత మహత్వం ఉన్న దన్న మాట. కాదామరి ఇది 'సింపతీ వేవ్'? అన్నా.
ఈ మారు అయ్యరు గారు ఏమీ చెప్పక ఏ వైపు చెబ్తే ఏమి తంటా వచ్చునో అని ఊరుకున్నారు.
అబ్బా, ఎంతైనా లేడీస్ తెలివి వీళ్ళకు వచ్చునా అని మురిసి పోయా.
ఆల్వేస్ జిలేబీస్ ఆర్ గ్రేట్. జాంగ్రీ స్ ఆర్ నెక్స్ట్ ఓన్లీ టు జిలేబీస్ యు నో?
చీర్స్
జిలేబి.
Hmmm... Antenantara! Sympathy kosama!
ReplyDeleteస్వర్ణ మాలిక గారు,
Deleteసింపతీ కోసం కాదు. కాని అది సాధించేరు. అదీ విషయం. అందుకే కదా జిలేబీ లు ఎప్పుడూ పై చేయి గలవారు!
జిలేబి.
అబ్బా, ఎంతైనా లేడీస్ తెలివి వీళ్ళకు వచ్చునా అని మురిసి పోయా.
ReplyDelete?! ఏమంటే ఏం తంటాయో
కష్టే ఫలే వారు,
Deleteకాదా మరి! ఏ మంట కా తంటా !
జిలేబి.
పాహి రామప్రభో!
ReplyDeleteమా యమ్మ సీతమ్మవారు గత్యంతరంలేదని తలచి అగ్ని ప్రవేశం చేయటాన్నీ కలికాలంలో రాజకీయం చేసేస్తున్నారుగా!
అమ్మా జిలేబీ, సీతమ్మవారిమీదే బాణాలా తల్లీ.
శ్యామలీయం వారు,
Deleteసీతమ్మ మా యమ్మ ! శ్రీరాముడు మా తండ్రి. కాబట్టి సీతమ్మ మీద బాణం కాదు ఇది మరి ఆప్యాయత తో 'మా' కితాబు!
జిలేబి.
ento okkaa mukka ardham ayyi savale telugu lo kuda teliyani padalu unnayaa leka idi jilebi telugunaa ammo nenu telugu dictionary tondaragaa konali
ReplyDeleteప్రిన్స్ గారు,
ReplyDeleteవెంటనే వాల్మీకి రామాయణం కొని చదవండి!
జిలేబి.