Tuesday, May 12, 2026

లంకావతార సూత్రం - గుణభద్ర

 

లంకావతార సూత్రం - గుణభద్ర - బోధిధర్మ

లంకా శిఖరాన బుద్ధుని వేల మణి మందిరాలు
కనిపించిన మరునిముషములో మాయమాయె
ఇది మనసే నీ మనసే మన మనసే  మరేమీ లేదు
సర్వదా నిలచిన సూర్యుని నిశ్శబ్దము నీవే





లోపలి ప్రవృత్తిని తెలుసుకొనవోయీ —
ఆ తీరానికి చేరవు మాటలు మన మాటలు
మహామతి  నూట ఎనిమిది ప్రశ్నలు
మనోఫలకపు తెర తొలగినపుడు
ఎనిమిది నదులు ఒకే సముద్రంలో కలిసి పోయె
సర్వదా నిలచిన సూర్యుని నిశ్శబ్దము నీవే

నీ  చేతనలో కర్మ విత్తనాలు సంసార బంధాలు
ఆ లోతైన సముద్రంలోనే బుద్ధుని అంకురార్పణ కూడా
శాశ్వతమూ కాదు, నశ్వరమూ కాదు-
ప్రశ్న, సమాధానం ఏదీ సరికాదు కాదు సుమా
సర్వదా నిలచిన సూర్యుని నిశ్శబ్దము నీవే



పురాతన పట్టణపు దారి ఎవరోయి నిర్మించారు
ధర్మత సూర్యకాంతిలా స్థిరంగా చీకటిలో నిలచెను చూడు
బుద్ధుడెవడని  యేమిటని అడగకు
సర్వదా నిలచిన సూర్యుని నిశ్శబ్దము నీవే


బోధిసత్వుడు ఆనందానికి చేరువలో — వెనుతిరిగాడు
నిర్వాణమే నిలయంగా  , ప్రపంచంలోకి వచ్చాడు
దుమ్ము కింద పట్టు ధవళకాంతి; ఆలయ దృష్టి నిర్మలమాయె
సర్వదా నిలచిన సూర్యుని నిశ్శబ్దము నీవే

తథాగత గర్భమూ, దుఃఖ మూలమూ — ఒక నాణేనికిరువైపులు
వాహనాలన్నీ వాహనాలు కావు; మూడు తెప్పలూ తీరాన నిలచాయి
కరుణయె నీలో — అణువ‌ణువున నాదమయినపుడు
సర్వదా నిలచిన సూర్యుని నిశ్శబ్దము నీవే

నూట ఎనిమిది ప్రశ్నలు అడిగి విడిచేవు
చిత్రాన్ని విడువు, ధారణి వెలుగును విడువు
నీలో ఆ నిర్వాణ క్షణమదిగో
పేరు లేకుండా, మెల్లగా, నిశ్శబ్దంగా...
సర్వదా నిలచిన సూర్యుని నిశ్శబ్దము నీవే.



జిలేబి

No comments:

Post a Comment