"Ney" ని ఊదరా! మురళిని ఊదరా!
విలపించెను నే (Ney) మూలం వీడిన బాధతో
ఆ బాధలోనే దాగి ఉన్నది దైవ శ్వాస
వెదురు తెగిపడిన వేళ పుట్టేను నాదం
గాయమే గానమైన రహస్యమదేనోయీ
ఓ ఆశిఖ్, "నే" స్వరమే నీ ఆత్మ పిలుపు విను
ఓ ఆత్మా, నిదురలే! అదిగో ప్రియుని పిలుపదిగో
ఎడారి గాలిలో ఆ మురళీ రవము తేలివస్తున్నది
దాహంతో అలమటించు హృదయమా విను
దూరపు తీరాన నీ మాశూఖ్ నిలుచున్నాడు
నల్లమొక్క విలపించు నాదమే నీ గాయం
ఆ గాయమే దైవం నీకొసగిన అపురూపమైన కానుక
రూమీ చెప్పాడానాడే — వేదనయే వెలుతురని
ఖాళీ హృదయంలోనే ఖుదా నివాసమని
ఫనాలో కలిసిపో, నిన్ను నీవు మరచిపో
మన్సూర్ అన్నాడు అనా అల్ హఖ్ అని
ఆ సత్యమే నీలో నిండి ఉన్నదోయీ
వెతుకుటే తెలిసిన వేళ దొరికినట్లే అనుకో
సాకీ! అందించు సుమీ ఆ దివ్య పానమును
లౌకిక మైన మత్తు కాదోయీ, ఆత్మ మత్తు కావలెనోయ్
హఫీజ్ పాడిన — "ప్రేమే మతమని...."
ఆ ప్రేమ సముద్రంలో మునిగిపోనీ నన్ను
ఓ ఫకీరా, దారి వదులు, దైవం వైపు నడువు
ఇదిగో
అతనిక్కడే
ఉన్నాడు
శ్వాసలోని శ్వాసయై.
"Ney" ని ఊదరా! మురళిని ఊదరా!
ఎల్లెమ్మ జిలేబీయము


No comments:
Post a Comment