వర్షాకాలం, ఈ ఇంటిమీది కాకి ఆ ఇంటిమీదికి వెళ్లలేదు. ముసురు. రెండురోజులై కొంచెము తెరిపియిస్తోంది. కోడి పందాలు; పాటేళ్ళపోట్లాటలు: పులితో కుస్తీలు~~ గరిడీసాములు మొదలైన విద్యలు జరగడం మొదలయ్యేయి. బోనులో పులిని వదరి కుస్తీపడుతూ ఉండే రోజులు. అందుచేత పులివేట ఎక్కువగా ఉండేది.
వర్షం వచ్చిన దగ్గరనుంచి రాజుగారికి కొంచెం సుస్తీగా ఉంది. ఆరోజునే దర్బారు తీర్చిఉన్నారు. ఆయన పులి వేటలో నేర్పరి.
"మహాప్రభూ ! నే నొక జ్యోతిష్కుణ్ని."
"ఇప్పుడు అవుసరం లేదు. కందా లో భోంచేస్తూ ఉండండి."
"వైద్యరత్నంగారు శరీరానికి కేవలం మందులే కావాలంటారా " అని రాజుగారు అడిగేరు.
"అవును. అందులోనూ వనమూలికలతో తయారు చేసే మందు గుణం పిలిస్తే పలుకుతుంది. ప్రాణం పోతూన్నవారికి యివ్వగా బాగైనవా రున్నారు. సంజీవకరణి, సంధానకరణి అమోఘమైన వనమూలికలు."
"ఉపవాసం వుంటే ఏమందూ అక్కరలే దంటారు."
"అది అలవాటు చేసుకుంటే అక్కరలేదు."
"పరిపాలన ఉపవాసంలో సాగుతుందా?"
"తమబోటివారికి కాదు. ఉపవాసము అంటూ, రేపు కూడా నిరాహారంగా ఉంటే మంచిది, ఎల్లుండినుంచి భోజనం చెయ్యవచ్చు. వర్షం తగ్గుతుందని పంచాంగంలో ఉంది" అన్నారు వైద్యరత్నంగారు.
"వర్షం తగ్గకపోతే ఉపవాసమేనా" అన్నారు రాజుగారు.
రత్నంగారు ఏదో చెప్పబోయేరు.
రాజుగారు వినిపించుకోక, సిద్ధాంతిగారితో. —"ఏమండీ నేను రేపు అన్నం తింటానా? లేదా?"
"పొడన్నము... పచ్చడి తింటారు ప్రభూ"
కోసం వచ్చింది రాజుగారికి "నిజం కాకపోతే మీకు శిక్ష.."
"శాస్త్రం అబద్ధం కాదు ప్రభూ!"
వంటవాణ్ని పిలిపించి తొమ్మిది పిండివంటలు చెయ్య మన్నారు.
తెల్లవారింది. కొంచెం వర్షంగా ఉంది. పశువులను పైని కట్టి ఉండగా పెద్దపులి ఒకటి వచ్చి ఒక పశువును ఎత్తురుపోయింది అని మిరపకాయ టపాద్వారా ఫిర్యాదు వచ్చింది.
రాజుగారు బయలు దేరడానికి సిద్ధంగా ఉన్నారు. గాలి సాగింది. రాజుగారికి పట్టుదల ఎక్కువైంది. ఇరవై మైళ్ళ దూరం ఆడవి. దారంతా వెతికిస్తూ అడవి చేరేరు. వర్షం ఎక్కు ఎక్కువైంది. డప్పులు కొట్టించారు. పులి కనిపించింది. వెంబడించారు రాజుగారు. వర్షం జోరైంది. పులిని తరుముతూ ఉన్నారు రాజుగారు. ఎంతదూరం వెళ్ళిందీ తెలియలేదు. మనిషి మనిషీ కనిపించడం లేదు. సర్దారును కేకేసేరు. అందలేదు. పచ్చగా పులి కనిపించింది.
కొట్టేరు. మీదికి రాబోయింది దెబ్బ బాజూటయి, తప్పించుకొని మళ్ళా కొట్టారు. కింద పడ్డది.
కనుచూపు మేర ఏమీ కనిపించలేదు.
కొంతసేపు నడిచి ఆయాసంతో ఒక చెట్టుక్రింద కూర్చున్నారు. నిద్ర పట్టింది. కొంతసేపటికి తెలివొచ్చింది. వర్షం వెలిసింది. ఆకలి తీవ్రంగా ఉంది.
సూర్యబింబంకోసం చూచేరు. రాత్రికి యాముంది. లేచి కొంత సేపు నడిచేరు. దూరాన గుడిసెలు కనపడ్డాయి. ఆయాసంతో బయలు దేరేరు. గుడిసెలో దూరి "అవ్వా! ఆకలి వేస్తోంది.... వేటకు వచ్చేను. పులి చచ్చింది." అన్నారు.
"బతికేము — నీకడుపు చల్లగ — నీయిల్లు వెయ్యిళ్ళ మొదలై...." అంటూ, "మూడుగంటలైంది..... పొద్దుట పది గంటలకి వండిన వంట..." అని చెప్పుతూ "ఒట్టి అన్నము ఎలాగ పెట్టను" అనుకొని, "గరికె చిగుళ్లు ఒంటికి మేహ శాంతి అని వేదాల్లోకూడా చెప్పేరు అని మావారు పచ్చడిచేయించుకొని తినేవారుకదా" అని వెంటనే గరిక చిగుళ్లు తెచ్చి పచ్చడి చేసి పెట్టింది.
రెండు కలశాలు తిన్నారు. హైరాణా తగ్గింది. సిద్ధాంతిగారి మాటలు జ్ఞాపకం వచ్చి పక్కున నవ్వుకున్నారు.
"ఎందుకు నవ్వుతున్నావు? పచ్చడి బాగులేదా ? ఏమీ లేక గరికాలు తెచ్చి పచ్చడిచేసేను."
రాజుగారికి ఆశ్చర్యం, అభిమానం రెండూ కలిగేయి. అవ్వ ఆదరానికి మురిసిపోతున్నారు.
ఇంతట్లోకి రాజుగారి సేన వెతుక్కుంటూ వచ్చింది.
అవ్వ కొయ్య అయి పోయింది. అంతా బయలుదేరేరు దేవిడీకి. సిద్ధాంతిగారికి గొప్ప బహుమానం ఇచ్చి ఆస్థాన విద్వాంసులుగా నియమించేరు.
అవ్వకి ఒక మాన్యం యిచ్చేరు. దానికి “గరికవలస" అని పేరు పెట్టేరు. ఇప్పటికీ అదే వాడుక.
రచయిత
నిడుదవోలు సూర్యనారాయణ.
సేకరణ
జిలేబి


No comments:
Post a Comment