Sunday, May 3, 2026

ఇంత అల్లరి యేలరా!

ఇంత అల్లరి యేలరా 


యెహోవా! నీవెందుకయా మోము దాచితివి?

షెకీనా వెలుగు మాపై నిలువదాయేను

విలాపముతో సియోను కుమార్తె మొరపెట్టేను

కనాను భూమి, గాలి నీ పేరు మోయదాయె,

నిబంధన మూసపెట్టి నీవెచటకేగితివో —

అట్టడుగు గుండెలోన తోరా మాటలు మోస్తూ

నీ మోము చూపునకై విలపించే యూదువులము మేము.

మిద్బారు నిర్జనంలో నీ స్వరం వినబడే‌ను

ఇపుడేల మూగబోయె మా ప్రభు నీ కంఠము?

అగ్నిస్తంభమై నిలబడి నడిపిన నీవే కదా ఏల్!

కెరూబుల రెక్కల నడుమ నివసించిన దేవా —

ఈ గాలూతు చీకటిలో కనపడవేమయా?

నీ ప్రేమ హెసెద్ శాశ్వతమని నమ్మితిమి —

దాగకు, రమ్ము, నీ ముఖకాంతి చూపుమయా!


పద నిఘంటువు:

షెకీనా = దైవసాన్నిధ్య వెలుగు

తోరా = యూదు ధర్మశాస్త్రం

మిద్బారు = అరణ్యం / వనాంతరం

గాలూతు = ప్రవాసం / వనవాసం

హెసెద్ = దైవకరుణ / నిత్యప్రేమ

ఏల్ = దేవుడు (హీబ్రూ)



No comments:

Post a Comment