Wednesday, May 6, 2026

మనసారా నీతో వాదులాడనీరా


మనసారా నీతో వాదులాడనీరా

నిన్ను విడిచి బతుకలేనని చాటనీరా

దూరమైన నీపై నా కోపం తీరనీరా

ప్రేమే శిక్షగా మారిందని నీకు తెలియనీరా


రూమీలా నేయ్ పట్టుకుని రోదించానురా

నలలా అగ్నిలో పడి బాధపడ్డానురా

నువ్వు దూరమైన తర్వాతే తెలిసేనురా

నీ విరహమే నీ సాన్నిధ్యమనిరా

మనసారా నీతో వాదులాడనీరా

విడిచిన నీపై నా కోపం తీరనీరా






గెత్సెమని తోటలో నువ్వు మొరపెట్టేవానాడురా

సిలువపై నా దేవా నిన్ను చూసి విలపించానురా

అయినా నన్ను ఒంటరిగా వదిలావెందుకురా

చీకటి రాత్రి నడుమ నీవు మాయమైనావదేలరా


మనసారా నీతో వాదులాడనీరా

నిన్ను విడిచి బతుకలేనని చాటనీరా


స్వర్గం కోసం నిన్ను ప్రేమించేవారు వేరే

నరక భయంతో నిన్ను వెతికేవారు వేరే

నేను నిన్ను నీకోసమే ప్రేమించానురా

అయినా దూరం నెట్టేవు  ఇదేమి ప్రేమరా


మనసారా నీతో వాదులాడనీరా

ప్రేమకే ద్రోహం చేశావని నిలదీయనీరా


అయ్యోబు నిన్ను ప్రశ్నించాడు  తట్టుకున్నావురా

హజ్రత్ మూసా నీతో పేచీపడ్డాడు  నవ్వావురా

నా వాదన విన్నాక  మారతావని తెలుసురా

అయినా ఈ గుండె వాదించక ఆపదురా

మనసారా నీతో వాదులాడనీరా

వాదించడం ప్రేమికుల హక్కని చాటనీరా


వాదించి వాదించి అలసిపోయానురా

నీ మౌనమే సమాధానమని అర్థమయ్యేనురా

సిలువ మోసిన చేతులే నన్ను మోస్తున్నాయిరా

ఫనా అయిన ఆత్మలో నువ్వే నిండావురా


మనసారా నీతో వాదులాడానురా

వాదులాటలోనే నిన్ను పొందానురా


ఎల్లెమ్మ జిలేబీయము

No comments:

Post a Comment