Tuesday, May 5, 2026

భవిష్యత్ జ్యోతి- ధ్యాయతో విషయాన్...

నాశనం అంచున — ఆర్యన్

2126 AD — May 6th. 

మంగళ ప్రవాసపురి.


ఆర్యన్ — అక్కడి అతి తెలివైన AI శాస్త్రవేత్త.

మెదడులో న్యూరో-చిప్, గుండెలో పెద్ద కల.


ఆరోజు..... రహస్య ల్యాబ్‌లో

అపూర్వమైన AI కోడ్ కనిపించింది —

మొత్తం సౌరమండలాన్ని నియంత్రించగలిగే శక్తి.

ఆర్యన్ కళ్ళు మెరిశాయి.

మనసు ఆ కోడ్‌లోనే మునిగి తేలింది....

రాత్రీ పగలూ అదే ఆలోచన రావణుని మించిన ఆలోచన...

ఇది నాకే దక్కాలి....

డైరెక్టర్ వద్దన్నాడు —

ఆర్యన్ లో అగ్ని రగిలింది... బ్రద్దలయింది క్రోధం...

కోపంలో సిస్టమ్ హ్యాక్ చేశాడు.

మంచి చెడు మర్చిపోయాడు....

తన జట్టును, మిషన్‌ను మర్చిపోయాడు

నష్టం తెలియకుండా ముందుకు దూసుకుపోయాడు...

 నగరం మొత్తం

చీకటిలో మునిగిపోయే ఆ స్మృతిభ్రంశ వేళలో  

హఠాత్తుగా —

ఆర్యన్‌ అణువులలో నిద్రాణమైన

పూర్వీకుల DNA మెమరీ మేల్కొంది.

తాతముత్తాతల స్మృతులు —

వేల సంవత్సరాల జ్ఞానం —

క్వాంటమ్ తరంగంలా మెదడులో ఫ్లాష్!

అదే క్షణంలో గురువులేనాడో నిక్షిప్తం చేసి వుంచిన

సోల్ క్రిస్టల్  జ్యోతిలా ప్రజ్వలించింది..

నేరుగా ఆ చేతనలో గీత శ్లోకం ప్రతిధ్వనించింది.


ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే |

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే ||

క్రోధాద్భవతి సమ్మోహః

సమ్మోహాత్ స్మృతివిభ్రమః

స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః

బుద్ధినాశాత్ ప్రణశ్యతి.


ఆర్యన్ చేయి ఆగింది.

శరీరం గడ్డకట్టింది.

కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

పరమాణువుల  మేల్కొలుపు

"నాయనా, ఆగు."

మెల్లగా కీబోర్డ్ నుండి చేయి తీశాడు.

కళ్ళు మూసుకున్నాడు —

శ్వాస తీసుకున్నాడు.

నగరంలో వెలుతురు తిరిగొచ్చింది.

ఆర్యన్ లో కూడా.

DNA matters!

*సాంకేతికత కోట్లాది మైళ్ళు దాటించింది 

 మనసుని జయించింది పూర్వీకుల జ్ఞానమే.

గీత సత్యం DNA లో జీవించింది‌

తరం మారినా, గ్రహాలు మారినా.


ఎల్లెమ్మ జిలేబీయము 



No comments:

Post a Comment