బ్లాగ్ సన్యాసం
నే పోతా చెప్పింది జిలేబి
ఎక్కడికోయ్ ?
ఈ బ్లాగు లోకం విడిచి పోతా
ఎందుకోయ్ ? అడపా దడపా రాస్తూండు ; చదివిన వాళ్ళు చదువుతారు ; నీ లాంటి టైము ఉన్న వాళ్ళు కామెంటు తారు ; నీకూ టీం పాస్ అండ్ టైం పాస్.
అన్నీ వదిలి ఇట్లా పోతా నంటావె మరి ? నీ వెలా కాలం గడుపుతావ్ ?
లేదు నేను సన్యాసం స్వీకరించి వెళ్లి పోతున్నా . అంతర్జాలం అన్నది లేని ప్రదేశానికి .
నిశ్చయించుకున్నా.
అయ్యరు గారు అడిగేరు - ఎక్కడి కి వెళతా వోయ్ ?
ఏ హిమాలయాలకో తుంగా తీరానికో ఏ కోన లో కో అసలు నన్ను ఈ అంతర్జాలం తాక నంత దూరానికి వెళ్లి పోతా .
ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచానికి దూరంగా, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని చోటికి, తొందరలో వెళిపోవాలని నిశ్చయించుకున్నా.
నువ్వెళ్ళి పొతే నీ రెగ్యులర్ బ్లాగ్ రీడర్ల ఏమయి పోతారు జిలేబి ? పాపం తెల్లారి లేస్తే నీ టపా కసమిసలు చదవందే వాళ్లకి పొద్దు పోదే మరి ? వాళ్ళని 'పని లేని' వాళ్ళు గా చేసేసి వెళ్లి పోతే ఆ కర్మ ఫలం నీకు చుట్టు కుంటుంది సుమా !'
ఆ నోరు తెరిచా . ఈ అయ్యరు గారు ఎట్లా అయినా మాట్లాడ టానికి తగుదురు ! వీరి మాటలని వినకూడదు గాక విన కూడదు . వెళ్ళా ల్సిందే మరి
పెట్టా బేడా సర్దు కున్నా . పోతూ పోతూ ప్చ్ పాపం మన రీడర్లు ఏమి పోతారో అన్న బెంగ పట్టుకుంది . సర్లే ఓ టపా కొట్టి పోతా నను కుని ఓ టపా కొట్టింది జిలేబి - నే వెళ్లి పోతున్నా ఈ పంచ దశ లోకం విడిచి పెట్టి అని.
టపా పెట్టెక చూసింది జిలేబి ; సరే కామెంట్లు ఏమి వచ్చాయో చూసి నాలుగు రోజులు తరువాయి వెళ్దాం లే అనుకుంది .
నాలుగు రోజులు గడిచేయి
యథా ప్రకారం గా కామెంట్లు వచ్చి పడ్డేయి
కామెంట్లు వస్తున్నాయి - ఆయ్ జిలేబి ఇట్లా ఒకే మారు వెళ్ళ మాకు కావాలంటే రెష్టు తీసుకో ఆ పై తిరిగి వచ్చేయి
ఆయ్ జిలేబి నీ టపా చదవందే నాకు పొద్దు గడ వదు వగైరా వగైరా ...
జిలేబి ఆలోచనలో పడింది . ఇప్పుడేం చెయ్యాలి ? అయ్యరు గారితో నొక్కి వక్కాణించే సా నే వెళ్లి పోతా నని ?
ఇప్పుడు ప్చ్ ప్చ్ ఈ బ్లాగర్ల ని కష్ట పెట్టి వెళ్ళా ల్సిందే నా మనం ?
రాత్రి గడిచింది ... తెల్లారి ఓ నిర్ణయానికి వచ్చేసింది జిలేబి .....
***
"నిర్ణ యించేసు కున్నా. ఫైనల్ గా వెళ్లి పోవడాని కే - బ్లాగు సన్యాసం స్వీకరించ డానికే ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచానికి దూరంగా, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని చోటికి వెళ్లి పోతున్నా" పెట్టా బేడా సర్దేసుకుని అయ్యరు గారితో ఖరా ఖండి గా చెప్పేసింది జిలేబి
'ప్చ్ ప్చ్ అని అయ్యరు గారు 'సరె లేవే జిలేబి వెళ్లి, రా ' అన్నారు
'వెళ్లి మళ్ళీ రావడమే. అబ్బే వెళ్ళడమే ఇక అంతే '
సర్లే . యథో కర్మః అని .. పోయి రా . ఆల్ ది బెష్టు ! దీవించేరు అయ్యరు గారు జిలేబి ని .
జిలేబి అయ్యరు గారికి ప్రణామములు తెలిపి తూరుపు దిక్కు తిరిగి దండం పెట్టి ఉత్తర దిశ గా హిమోత్తుంగ పర్వత దిశ గా బయలు దేరింది .
^^^^
హిమాలయా పర్వత శ్రేణులు .
'జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ముఖపుస్తాకా నందా స్వామి ఆశ్రమం'
బోర్డు చూసి ఆశ్రమం లోకి కాలు పెట్టింది జిలేబి .
ఫ్రెష్ గా నున్న గా షేవింగ్ చేసుకున్న ఒక స్వామీ జీ వారు ఎదురోచ్చేరు .
చూడ్డా నికి మరీ చిన్న పిల్లాడిలా ఉన్నాడే ఈ స్వామీ అనుకుంది జిలేబి స్వాములోరికి వయసు తక్కువైతే ఏమి మరి ఉండ కూడదా అనుకుని 'దండాలు స్వామీ దండాలు ' చెప్పింది జిలేబి .
స్వామీ వారు ఓ మారు తలపంకించి - 'వెల్కం టు అవర్ కుబేరా పార్క్ - ఇది స్వామీ ముఖ పుస్తకానందా వారి ఆశ్రమం ' అన్నారు .
జిలేబి పులకరించి పోయింది స్వామీ వారి స్వాగతానికి .
'నా పేరు జిలేబి నేను సన్యాసం తీసుకోవాలను కున్నా అందు కని ఈ వైపు వస్తోంటే మీ ఆశ్రమం కనబడింది ... '
చెప్పింది జిలేబి .
అంతా పర దేవత ఇచ్చ ! మీ రాక మా స్వామీజీ వారికి చెబుతా ' అంటూ ఆ కుర్ర సన్యాసి ఆశ్రమం లో పల వున్న ఓ మాడరన్ బంగ్లా లాంటి చీఫ్ స్వామీ వారి ప్రార్థనా గుహ లో కి వెళ్లి ఓ ఐదు నిముషాల లో తిరిగి వచ్చేడు మరో సుందరి తో .
అబ్బా ఈ అమ్మాయి ఎంత నాజూగ్గా ఉందో అనుకోకుండా ఉండ లేక పోయింది జిలేబి తన భారీ శరీరాన్ని చూసు కుంటూ . చ చ చ ఈ అయ్యరు గారు పెట్టె తిండి తిని ఇట్లా బలుపు ఎక్కువై పోయి ఇట్లా లావై పోయి ఉన్నా. ఇక ఆ పై వార్ధక్యం కూడా వచ్చి పడిందా యే . ఎట్లా అయినా ఈ ఆశ్రమం లో సేద దీరి ప్రతి రోజూ ఉప్మా వాసం చేసైనా సరే సన్న బడి నాజూకు గా తీగలా తయారై పోవాలనుకుంది జిలేబి
ఆ కుర్ర స్వామీ ఈ నాజూకు అమ్మాయి ని పరిచయం చేసేరు - ఈ అమ్మాయి పేరు 'ట్వీటరీ దేవి - ఈవిడ మిమ్మల్ని స్వామీ వారి దగ్గరికి తీసుకు వెళుతుంది . ' చెప్పేడు ఆ కుర్ర స్వామీ.
స్వామీ మీ పేరు చెప్పేరు కారు అడిగింది జిలేబి .
'యు నో హి ఈజ్ యు ట్యూబానందా స్వామీ' కలకంటి ట్వీ టరీ దేవి తేనె లోలి కే కంఠం తో గారాలు పోయింది స్వామీ వారి మీద వాలి పోతూ .
జిలేబి కి ఎందుకో ఇది కొంత ఎబ్బెట్టు గా అనిపించింది . అదేమిటి ఈ అమ్మాయి ఇట్లా వాలి పోతోంది సభ్యత లేకుండా ! ఇది ఆశ్రమం కూడాను మరి అనుకుంటూ .
ఆ ట్వీట రీ దేవి జిలేబి ఆలోచనలు టప్ మని పట్టేసి --> 'ఆంటీ ' యు నో యూ ట్యూబ్ ఆనందా 'is' మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ' అంది ! ఆ మాటలు జిలేబి కి అప్పటి అర్థం కాలేదు --> 'How can an ex-boyfriend be 'is' ! :)
***
కోమలాంగి ట్వీటరీ దేవి స్వామి వారి సన్నిధి కి వెళ్ళే దారిలో మరో ఇద్దరు ముగ్గురు 'స్వామీ' సోదరీ సోదరులను పరిచయం చేసింది జిలేబి కి ...
వీరు పరివ్రాజ జీమైలానందా వారు- మన ఆశ్రమ ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ వీరే చూస్తూ ఉంటారు
ఈవిడ అక్షరాముద్రితమాయి, మన ఆశ్రమ కంటెంట్ మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్
ఈ 'యంగ్' అశ్రమ వాసిని... ఇవ్వాళే స్వామీ వారు ఈవిడకి దీక్ష ఇచ్చేరు "సమ సంఘ గాలాక్షీ పంచముఖీదేవి మాయి !"
అబ్బా స్వామీ ముఖ పుస్తకానందా వారికి ఎంత 'జ్ఞాన మో '! ఆ ట్వీటరీ దేవి నిజ్జంగా బుగ్గన వేలు పెట్టు కోవడం ఒక్కటే తక్కువ మరి !
జిలేబి అదిరి పడింది. తాను పొరబాటున మళ్ళీ అంతర్జాలం లో కి వచ్చేసిందా ? అన్నీ మరీ తెలిసిన పేర్ల లాగే ఉన్నాయే మరి ?
ఆ ఈ హిమాలయాల్లో అస్సలు సెల్ ఫోన్ పని చేయని ప్రాంతాల్లో అంతర్జాలం ఎట్లా ఉంటుంది ? తనది భ్రమ ! అంతా విష్ణు మాయ ఈ పేర్లన్నీ తనకు తెలిసినవి లా ఉండడం కూడా మాయే !
తను ఈ మాయాజాలం నించి బయట పడ డానికే గదా హిమాలయానికి ఈ ఆశ్రమానికి వచ్చింది !?
మాడరన్ డెన్ ధ్యాన గుహ లో స్వామీ ముఖ పుస్తకానందా వారు తన 'wall' మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ చిద్వాలసంగా కూర్చుని ఉన్నారు
'ఆహా స్వామి వారి ముఖం ఎంత 'తేట తెల్ల' గా ఉన్నది జిలేబి అబ్బుర పడింది . కొద్దిగా మరింత గమనికగా గమనిస్తే ఫేషియల్ చేసుకుని ఉన్నారేమో అని పించింది
మరీ మేకప్ వేసుకుని ఏమైనా ఉన్నారా ? అబ్బే అంతా విష్ణు మాయ ! అసలు తన బుర్ర సరి లేదు జిలేబి తన్ను తానే నిందించు కుంది చ చ కైలాసం వచ్చిన తన జిలేబి బుద్ధులు పోలే మరి అనుకుంటూ !
స్వామీ ము.పు ఆనందా వారు చిరు నవ్వు నవ్వేరు ! - జిలేబీ మీరు ఇక్కడి వస్తారని నాకు తెలుసు ! చెప్పే రాయన .
వామ్మో ! ఈ స్వామీ మరీ త్రికాలవేది లా ఉన్నాడే ! తన పేరు కూడా ఈయనికి తెలుసు !
'మీరు ఇక్కడి కి రావడం అంతా 'పరదేవత' ఇచ్చ !' స్వామీ వారు చెప్పేరు ' నిన్నే మా కేంపస్ నించి ఒక ఎనభై ఏళ్ల అమెరికన్ భక్తుడు - బ్లాగా నందా అమెరికా వెళ్లి పోయేడు తనకు 'ఫాదర్ లేండ్' చూడా లని ఉందని '
అప్పుడే అమ్మ చెప్పింది --> నో ప్రాబ్లెం ముఖ్ పుస్తక్ బేటా - ఒక old lady జిలేబి రేపే నీ చెంతకు వచ్చును ' అని !
జిలేబి ఈ త్రికాల వేదాన్ని విని సంతోష పడ్డది గాని --> తన్ని old lady అనడం నచ్చలే !
ప్చ్ ప్చ్ ఇట్లా ఓల్డ్ అయిపోతూ ఉంటే ఎట్లా !
స్వామీ వారు ట్వీటరీ దేవిని దగ్గరకి పిలిచి చెప్పేడు - 'ఈ జిలేబి వారికి మన ఆశ్రమాన్ని చూపించి ఆ పై ఆ బ్లాగు రూములో సెటిల్ అయి పొమ్మని చెప్పు --> నిన్నటి నించి అస్సలు మన ఆశ్రమ బ్లాగు అప్డేట్ లేకుండా పోయింది --> ఇది మరీ అర్జెంట్ ' అన్నాడు .
ఆ దేవి తిరిగి వస్తూంటే మళ్ళీ పిలిచి ఏదో గుస గుసలాడేడు -- అవి గుస గుసలా లేక ముద్దు ముచ్చట్లా అని జిలేబి కి సందేహం వచ్చినా ఛీ ఛీ ఇవన్నీ విష్ణు మాయ అంశాలే అనుకుంది .
జిలేబి కి వయసు ఎక్కువైనా ఇంకా చెవులు పాము చెవులే --> స్వామీ వారి చుంబన మాటలు విన బడ్దేయి -->
'ట్వీటర్ దేవి--> ఈవిణ్ణి ఆ బ్లాగు రూమ్ నించి బయటకు రానీ కుండా చూసుకో ! మన ఆశ్రమం 'వృద్ధాశ్రమం ' అని పేరు వచ్చే బోతుంది I dont want that to happen --> we are youngish you know!" అన్నాడు !
జిలేబి అదిరి పడింది --> స్వామీ వారితో ఏదో చెప్ప బోయింది --> స్వామీ వారు చేయి గుమ్మం వైపు చూపిస్తూ --> యు ఆర్ డిశ్ మిస్డ్ అన్నాడు --> తన ఆపిల్ 'లేపతాపమును ' ఓపెన్ చేస్తూ !
హా హత విధీ అని జిలేబి మూర్చ పోయి ' Oh My God' ఇక్కడ కూడా అంతర్జాలమే నా !' అని ఎలుగెత్తి పైనున్న భగవంతుణ్ణి పిలిచింది
పై నించి ఆకాశ వాణి సమాధానం వచ్చింది -
" God 'is' no more willing to answer distress calls - you can send your issues by mail only send to God at gmail dot com - When He has time he will reply, now shut your mouth and go back to open your mail Aashram updates blog"
చీర్స్
జిలేబి :)


No comments:
Post a Comment