చిత్తూరు జిల్లాలో ఈ పుంగనూరు జవాను అన్న పదం ప్రచారం లో ఉంది. ఈ పుంగనూరు జవాను అన్నది ఎకసక్కం గా ఎవేర్నైన ఉద్దేశించి అనడానికి ఉపయోగించడం ఇక్కడి వాళ్ల విశేషం ! ఎవడైనా "ఒరేయ్ అయ్యగారు ఉన్నారా చూసి రారా" అని పంపిస్తే వాడు చూసి వచ్చేసి "చూసానండి" అంటారు చూడండి అట్లాంటి వాళ్ల గురించి ఈ పదం వాడకం లో ఉంది!
బ్రిటిషు జమాన లో తాసిల్దార్ ఆఫీసు లో ఓ జవాను ఉండేవాడట ! వాడ్ని "ఒరేయ్ జవాను చిత్తూరు వెళ్లి కలెక్టరు గారున్నారా చూసి రారా" అంటే వాడు ఖచ్చితింగా చిత్తూరు వెళ్లి కలెక్టరు ఉన్నారా లేదా అని చూసి ఇంకా ఎట్లాంటి వాకబు చెయ్యకుండా టపీమని తిరిగి వచ్చి ఉన్నారనో లేకుంటే లేరనో చెప్పేవాడు.
"ఒరేయ్ నేను రావచునో లేదో అడిగావారా? " అంటే వాడు తల గోక్కుని "మీరు ఆ విషయం అడగమని చెప్పలేదు కదండీ? " అనే వాడు.
ఈ కథా క్రమం గా ఈ నానుడి ఏర్పడింది. ఇది జాతియమా లేకుంటే నానుడియా యా అన్నది నాకున్న సందేహం ! ఎంతైనా పుంగనూరు చిత్తూరు జిల్లాలో ఉండడం వల్ల ఇది రాయలసీమ మాండలీకం కూడం కాక పోవచ్చు. దీని పరిధి చిత్తూరు జిల్లా వరకే పరిమితి అయి ఉండవచ్చు!
ఛీర్స్
జిలేబి