ఈ మధ్య బాపురే రమణీయం శ్రీ రామ రాజ్యం వారి అర్ధ శత (వందకి పరుగులిచ్చేందుకు కొంత పుష్ అప్ ) వేడుకలని తీరిగ్గా 'నిల్చొని' చూసాను. నిల్చొని అనడం ఎందుకంటే , standing ovation అన్న మాట. ఒక్కింత మర్యాద.
ఈ తీరికైన వ్యాపకం లో ఆఖరున (బాలయ్య మొదటే మాట్లాడితే ఆ పై జనాలు ఎవరూ ఇక ఉండరని తను ఆఖర్లో మాట్లాడను కున్నారో, కాకుంటే, మట్టి బుర్రలు ఆఖర్న మాట్లాడడమే బెష్టు అనుకున్నారో తెలీదు గాని ) బాలయ్య మాట్లాడాడు.
స్టేజీ ని ఈ వైపు నించి ఆ వైపుకి 'జానా' పెడుతూ సింహం లా తిరుగుతూ ఒక్కింత గ్రాంధికమూ, గ్రామ్యమూ కలిపి మాట్లాడడం మొదలెట్టాడు, సామి రంగా, జిలేబి కి కాంపిటీషన్ కోచ్చేసాడే సుమా బాలయ్య కూడా అని నేను హాశ్చర్య పోయాను సుమా.
ఎందుకంటే, ఆ మధ్య మా భారారే (ఇంకా 'మా' భారారే వారే అను కుంటున్నా, !) ఆయ్ అందరూ హారం పత్రికకి సంక్రాంతి లోపే కథలూ గట్రా పంపించండి అంటే, నేనూ సై అని, భారారే , ఏప్రిల్ ఒకటో తారీకులో గా సంక్రాంతి కి ఆర్టికల్ పంపిస్తానని వాక్రుచ్చాను. వారు ఓ కోడా జాడిన్చేరు, ఆయ్ జిలేబి రమ్ము ఏమైనా తాగారా, ఏప్రిల్ లో ఏమిటి సంక్రాంతి అని !
ఇట్లాగే మా బాలయ్య కూడా, ఈ శ్రీ రామ రాజ్య అర్ధ శత మహోత్సవ వేడుకలలో, 'రాబోయే ఉగాది కి, గొబ్బిళ్ళు, నవ ధాన్యరాసులూ. అంటూ 'వాక్రుచ్చడం ' తో ముచ్చటేసి, బాలయ్యా , శభాష్, నువ్వూ జిలేబి కి సరి సమానమైన వాడవే నోయి అని నేను ముచ్చట పడి పోయా ! మొత్తం మీద, జిలేబి కి 'టెలీపతీ' ఉందండోయ్ !
విన్నపాలు వినవలెను వింత వింత లు - మధ్య లో ధబాల్మని మీ టపాలు ఆపెయ్యడం ఏమీ బాగోలేదు.
కామెంటులు రాసే వారు కోకొల్లలు. కాని సత్తా ఉన్న టపా రాసే వారు కొంత మంది మాత్రమె. అందులో నాకు తెలిసిన ముఖ్యమైన వారు మీరు. మీలాంటి వారు రాసే టపాలని చదవడానికి ఎంతో మంది ఉండవచ్చు.
అర్థం పర్థం లేని కామెంటు లకి వెరచి మీరు టపా ఆపు చెయ్యడం నాకు బెష్టు బుర్రలు చెయ్యాల్సిన పనిలా అని పించడం లేదు.
సో, మీరు ఈ విషయమై ఆలోచించి సరియైన ఒక నిర్ణయానికి వచ్చి టపాలు మళ్ళీ పునః ప్రారంభించాలని జిలేబీ విన్నపం.
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...