ఈ మధ్య బలపం బట్టి బామ్మ ఒళ్లో ఏ బీ సి డీ లు నేర్చు కున్నా పాట మావయ్య రాసింది అంటే బోనగిరి గారు అబ్బే కాదండీ అన్నయ్య /తమ్ములుం గారు శాస్త్రి గారిది అని సరి చేసారు. ఓహో సిరి వెన్నల వారిదా ఆ పాట అన్నా . వెన్నలా ? వెన్నెలా అని వారు రిటార్టు ఇచ్చారు ? అబ్బే మా ఆండోళ్ళకి తెల్సింది వెన్నా, నెయ్యీ, గియ్యీ గట్రా యే ! వెన్నెలా గట్రా మగరాయుళ్ళ కే తెలుసునుస్మీ అని మనం రాసింది కవర్ జేసేసు కున్నాం :) అబ్బే ఆండోళ్లు తప్పుగా రాసినా అది సబబే అని చెప్పేసు కోవాలె ; మనకు మనమై ఎప్పుడూ మనం జేసింది తప్పు అని చెప్పుకోరాదు; చెబ్తే మగరాయుళ్ళ కి మన కి వంక బెట్ట డానికి కారణం దొరికి పోతుందిస్మీ అని బామ్మ పోతూ పోతూ చెప్పేసి వెళ్ళింది. అప్పటి నించి బామ్మ వారి ఈ స్వకపోల భట్టీయ మంత్రాన్ని జపించు కుంటూ అయ్యరు వార్ని మేనేజు చేసేసు కుంటూ వచ్చేస్తున్నా ;) అట్లాంటిది మనం తప్పుగా రాయడమా అబ్బే :) సుతరామూ తప్పు కాదు తప్పున్నర కూడా కాదు. అక్షరం పరం బ్రహ్మం ! మన తల్లోంచి, 'కీబోర్డు వాతల్లోంచి', ఘంటం ఊకదంపుడు ఏది వస్తుందో ఏదో అదే సత్యం :) అది అప్పు తచ్చై ఉండ వచ్చు గాక ! దానిని మనం సముదాయించి , అందులో నించి అర్థమును పరమార్థమును లాగి జిలేబి చెప్పిందే వేదం అని జెప్పు కోవాలన్న మాట ! సిరి అనగా ఎవరు ? శ్రీ మహాలక్ష్మి ! సముద్ర మంథనము న పుట్టినది . దాని తో బాటు వెన్న గట్రా కూడా పుట్టినది అని ఉవాచ ! అనగా సిరి వెన్నలా తోడు బుట్టువులు ! కావున సిరి వెన్నల అన్నదే సరి ఐనది ! మరి సిరివెన్నెల వారు అట్లా ఎందుకు శ్రీ చంద్రమా అని పేరెట్టేసు కున్నారు ? ఆ కాలం లో వారు జిలేబి ని సంప్రదించి ఉంటె వారు సిరి వెన్నలా అని విశ్వనాథ్ వారి కి సినిమా పేరు సరి జేసి ఉండే వారు :) ఈ తెలుగు వాళ్ళు ఇది శుద్ధ తెలుగు పదం అంటారు గారి వెన్నెల అన్నది అరవం పదం 'వెణ్' నిలా కాదూ ? వెళ్ళఅయిన నిలా తెల్లని నిలా తెల్లని చందురూడు . అట్లాగే వెన్న అన్న పదం ఎట్లా వచ్చింది ? అదిన్నూ అరవం నించే స్మీ:) వెన్నై అని అరవం. డానికి తెలు 'ఘీ' కారం ( చూడండి ఇక్కడ కూడా ఘీ అన్న హిందీ పదం ఎట్లా తెలుగు లో ఇమిడి పోయిందో :) వెన్న ! సిరి అనగా నవ్వు అని అరవం లో ; సో (ఈ మధ్య ఎవరో ఈ 'సో' అన్నది తెలుగా అన్నారు కూడాను ; కానీ ఈ సో సో ఎంత సొబగు గా ఉందో చూడండి అది కూడా తెలుగు లో పాల లో నీళ్ళ లా ఎంత గా కరిగి పోయింది ) సిరి వెన్నలా అనగా నవ్వు తో ఉన్న వెన్న ! అనగా అముల్ బట్టర్ ! సో, సీతారామశాస్త్రి గారి రచనలు కూడా అముల్ బట్టర్ అంత తియ్యందనాల టేస్టి టేస్టి :) అందుకే వారు సిరి వెన్నల సీతారామ శాస్త్రి గారే ! సిరివెన్నెల కాదు అని జిలేబి తీర్మానించు కునేసింది ! అట్టర్లీ బట్టర్లీ సిరి వెన్నలా ! కొస తునక -> బోనగిరి అనగా నేమి ? అని ఆంధ్ర భారతి వారిని 'కొచ్చనించగా' వారు జెప్పింది -> -->
పెండ్లిలో మగపెండ్లివారికి ఆడు పెండ్లివారు పంపు ఫలహారాలు అని :)
ఆడువారలకు 'ఫల' హారములు' కూర్చుట 'వెన్నతో' బెట్టిన విద్య :) ఈ శుభోదయ 'ఫల' హారమును అటులే స్వీకరించెరదని ఆశిస్తో :) నేటి కి ఫలహరముల భుక్తాయాసము తో సైనింగ్ ఆఫ్ చీర్స్ సహిత జిలేబి
సాదా సీదా గా చెప్పాలంటే రాముల వారిని పుంసాం మోహన రూపాయ అని జెప్పి మానవ మాత్రుల లో ఉండే అన్ని గుణ గణా లను వారి లో చూడ గలిగాడు కవి .
మానవు లకి ఔరా ఒక మనిషి మనీషి గా నిలబడటానికి కాల వ్యవధి లో ఎన్నేసి కష్టాలు నష్టాలు చూడ వలసి వస్తుంది అనిపించక మానదు .
మరి సీతమ్మ ? పుట్టని అమ్మ అని ఈ మధ్య ఒకరన్నారు . భూదేవి ఒడి లో నాగలి కి తగిలిన నారి . జనకాత్మజ . జానకి .
రాముల వారి తో సరి సమానంగా కష్టాలను స్వీకరించింది . నువ్వు వనవాసం చేసి రావోయ్ అని ఈ కాలం లో జిలేబిలు చెప్పగలరు .
తమ్ముడు - లక్ష్మణుడు - వాడిని ఎవరూ అడగలేదు వెళ్ళ వోయ్ వనవాసానికి అని. తనకు తానై అన్నకు తోడుగా వెళ్ళాడు .
వీటన్నిటి కి మించి ఊర్మిళ . హిందీ సాహిత్యం లో ఊర్మిళా కీ విరహ్ అనిమైథిలి శరణ్ గుప్త వారి దను కుంటా ఒక ఖండిక ఉంది . ఊర్మిళ తరపున రాసిన కవివరుల్లో వారే మొదటి వారను కుంటా . సాకేత్ అన్నది పుస్తకం పేరు .
భారతీయ భాషల్లో నే కాకుండా ప్రపంచ భాషల్లో కూడా అద్బుతం గా అనువదింప బడి , కల్పవృక్షం గా పేర్కొనబడి , విష వృక్షం గా చెప్పబడి పరి పరి కోణాల నించీ విశ్లేషించ బడినది రాముల వారి చరిత్ర .
అంతే కాదు ; మనకు దగ్గిర గా తెలిసిన కాల ఘట్టం లో త్యాగయ్య వారి చేత కొనియాడ బడి , వారి కి రాముల వారి కన్న వేరెవ్వరు లేరు అని రామాయణం మొత్తం వారి సంగీతం లో ఇమిడి మనకు ఈ నాటికీ పాటల రూపం తో ఆవిష్కరించ బడి ఉన్నది .
రాబోవు కాలం లో మరిన్ని విశ్లేషణలు పరి పరి విధాల పరిశోధనలు వాటి మీద రావచ్చు గాక.
ఎంత వచ్చినా ఏమి వ్రాసినా కాలం లో ఇమిడి పోయి వాటిని స్వకీయం చేసుకునే భారత సంస్క్రతి కళ కళ లాడు తున్న సంస్కృతీ .సజీవ సంస్కృతీ .అందులో ఇది అది అని లేకుండా అన్నీ కలిసి మహా సాగరమై మహోన్నతం గా వెలుగొందటం తధ్యం.
బలపం బట్టి భామ ఒళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకున్నా అని మావయ్య పాట వ్రాసి పోయేడు ! కామ్రేడ్ "సిరివెన్నల" (అదేనండీ సిరి వెన్నెల వారు ) వారు సొగసుగా రాసేసు కున్నారు !
దాన్ని మా బాలూ కూడా యమహా నగరి లా పాడి రంజింప చేసాడు !
కవి వరుల చేతి లో పదాలు పాదాలు పదనిసల తో పట్టు పరికిణీలు వేసుకుని పరి పరి మనలను పరిమళింప జేస్తాయి !
వారి పద పొందులు వాటి అందాలు వారికేలా వస్తుందబ్బా అని హాశ్చర్య పోవడం మాత్రమె జిలేబి వంతు !
ఈ మధ్య ప్రజ వారు తెలుగు వ్రాత లో ఇన్నేసి అక్షరాలూ ఉండాలా అని ప్రశ్నించేరు !
అక్షరాలూ ఎన్నేసి ఉన్న నేమి ? వాటిని ఎట్లా ఉపయోగిస్తున్నామో అన్నదాన్ని బట్టి అవి వాడుకలో ఉంటాయా లేవా అన్నది రూడి ( ఇక్కడే ఒక ఒత్తు పోయే! )
ఈ మధ్య ఆంగ్లం లో LOL అని రాయ బోయి లోల అని వ్రాసేనన్నారు బండి రావు గారు . ఆహా కొత్త పదం కని పెట్టేరు అని మరొక మా 'సార్' తిరగేస్తే శర్మ గారు వారి కి తాడులు వేసేరు !
బండి ర ఎట్లా వ్రాయాలో తెలీటం లేదు :)
ఆ మధ్య ఒక కార్టూన్ చూసా రిక్షా బండి వాడి ని రావయ్యో అనడానికి కార్టూనిస్టు ఒక్క పదం లో అంటే బండి ర తో కార్టూన్ వ్రాసేసేరు ! అదీ కవి పదపు పదును !
శ్రీపాద వారు శ్రీ రాముల వారిని అంటే వనవాస కాలపు శ్రీ రాముల వారిని విప్రలంభపు శృంగార యోగి అని వర్ణించేరు ! పదముల పొందిక అది !
"మన దగ్గిర చుట్టమైన రాముడు
మహావీరుడూ ,
ప్రకృతి సౌందర్య పిపాసీ ,
దుష్టశిక్షకుడూ ,
శిష్టరక్షకుడూ,
ముఖ్యం గా విప్రలంభ శృంగార యోగిన్నీ !"
గోదావరి వాళ్లకు ఆ తెలుగు అట్లా ఎట్లా వస్తుందేమో తెలీదు గాని, కష్టే ఫలే వారి టపాల్లో రెండు వాక్యాల్లో ఒక వాక్యం నానుడి తో ఉంటుంది !
శ్యామలీయం వారి టపాల్లో పద్యాల పై నున్న వెరైటీ , వారు రాముల వారి పై రాశి పోసిన పద్యాలు , (అంతే కాదు సై అంటే సై అని జిలేబి కామెంట్లు పోటీ గా వ్రాసిన జిలేబి శతకం కూడాన్ను ) - తెలుగు బ్లాగు వెలుగులు ఇంతింత కాదయా అని చెప్పుకొనక తప్పదు !
మా అరవ దేశం లో క్రేజీ మోహన్ అని ఒక రచయిత ఉన్నారు . వారి చేతిలో పదాల విరుపు ఇంతా అంతా అని చెప్పలేము ! పదాలు నాజూగ్గా విడి పోయి హాస్యాన్ని పండిస్తాయి !
బ్లాగులోకం లో నిరవధికం గా సంవత్సరాల తరబడి సమస్యాపూరణం నడుపుతున్న కంది వారు వారి టీము ఒక ఎత్తైతే ( మేమంతా హరిబాబు వారి లా పేజీ ల కొద్ది టపాలు వ్రాస్తాం - ఒక్క కామెంటూ పడదు - కంది వారేమో ఒకే ఒక్క వాక్యం వ్రాస్తారు టప టప మని ఓ నలభై కామెంట్లు ఒట్టి కామెంటులు కావు మేటరు ఉన్న మేలైన నేటి కి ఏ నాటికీ నాలుగు కాలాల పాటు నిలిచి పోయే పదాలు పద్యాలు పడతాయి ! అబ్బ మరీ ఈ జిలేబి కి కా 'మంటలు' అంటే అంత 'ఇది' యేమో తెలీదు గాని :)) - మరో ఎత్తు నెమలి కన్ను మురళి గారు - దేశం ఉన్న గొప్ప గొప్ప వాళ్ళని అందర్నీ కలగలిపి గోదారి లాక్కెళ్ళి పోతారు :) జేకే !
సంస్కృత మకరందాలు -
బ్లాగాడిస్తా వారి చమక్కులు -
పద్మార్పిత వారి పడుచుపదాలు-
ఆంధ్రామృతం వారి అద్బుత 'అరంగేట్ర' సమాచారాలు-
ఈ టైటిల్ చదివితే ఈ టపా మనవు గారిదే నబ్బా అని కళ్ళు మూసుకుని చెప్పెలాంటి టైటిల్ పెట్ట గలిగిన మనవు గారు -
సుజన సృజన లతో పదనిసల్ని మోహనం గా ఆలాపించే లక్కాకుల వారు-
బ్లాగు బర్త డే కి టపాలు రాసే స్టేజీ కి వచ్చేసిన ఒకప్పటి ఇల్లు అలకటం మరిచి పోయిన ఈగాజ్యోతీలు - అప్పుడప్పుడు శర్కర పంచె శర్కరీలు -
కౌముది కి అంకిత మై పోయిన బ్లాగిణి మణులు (మధుర వాణీ గారు వింటున్నారా ?) -
పనిలేక పిపీలిక మైన మా డాటేరు బాబు రమణ గారు -
తేటగీతి అంటూ తేటతెల్లంగా 'అటుకుల' బొంత ని స్వాహా గావిస్తున్నవారు :) -
పాటతో నేను అని సైలెంట్ గా సినీ పాటల ఒక ఖజానాని పెట్టి వాటికి లిరిక్స్ జోడించి జోహార్ అని పించే లా ఉన్న వేణూ శ్రీకాంత్ గారు -
అమృత మధనం తో దేశాన్ని మధిస్తూ బుద్ధునికి మురళి కి సంజౌతా 'ఎక్స్ప్రెషన్' ప్రయత్నిస్తున్న మా జర్నలిస్ట్ బుద్దా వారు -
పద గోళీ లాడుతో సమస్యల తో 'పూ' రణం గావిస్తున్న మా గోలీ హుమచ్చాస్త్రీ వారు - (హనుమ కీ స్త్రీ కి పొత్తు ఎట్లా అవుతుంది సినబ్బా అని హాశ్చర్య పోయా మొదట వారి పేరు చూసి !) -
మా కథా మంజరి అయ్యవారు పద్యాలు పెట్టి టపాలు గట్టి సెహ భేషు గా బ్లాగ్ విహారం గావిస్తున్న వారు -( వారి బ్లాగు టెంప్లేటు సరిగ్గా లేక నేను కామెంట లేక పోయిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి - టెంప్లేటు మార్చండి మహాప్రభో అని చెప్పినా ప్రయోజనం లేక పోయే :)
రమ్యంగా కుటీరాన అంటూ గులాబీ 'ఔట్లు' కూడా కావాల్సి వస్తే పెలుస్తాం అంటూ అలుపెరుగక ఉన్న నీ , మా , హారిక గారు :)
కన్నీటి కథ ల తో కడివెడు కహానీ లతో సమ సమాజానికి అద్దం పట్టే వనజ వనమాలీ గారు -
దేశ విదేశాల్లో ని సంక్షోభ పరిస్థితుల కి చరమ గీతం గ్రహాల భ్రమణం తో ఆలాపిస్తున్న మా భ్లాగ్జ్యోతిష్ శర్మ గారు -
ఇట్లా ఊకదంపుడు వ్రాసుకుంటూ జిలేబి కూడా ఎనిమిది సంవత్సరాలు దరిదాపుగా కలగా పులగం గా , ఈ ఒక్క సబ్జెక్టే నేను తాకుతా అనుకోకుండా అట్లా అందరిని గెలుకుతూ , అప్పుడప్పుడు డక్కా మొక్కీలు తింటూ , కొండొక చొ ఐ డోంట్ లైక్ లతో చీవాట్లు తింటూ కాలం గడిపేస్తోంది :)
ఇంతకీ ఈ టపా టైటిల్ ఏమిటి ? ఈ టపా ఏమిటి ? అంతా గందర గోళం గా ఉందిస్మీ :)
బ్లాగ్దేశం లో ఉండాలంటేనే భయం గా ఉంది - దేశం విడిచి పోతా - జిలేబి
అయ్యరు ఖాన్ గారు నాకు బ్లాగ్దేశం లో ఉండాలంటే నే భయ్యం భయ్యం గా ఉందండీ జిలేబి రావు చెప్పింది అయ్యరు ఖాన్ తో .
అయ్యర్ ఖాన్ తన విశాలమైన చాతీ ని తడుముకోబోయి తానూ చాలా సీదా సాదా అయ్యర్ ఖాన్ మాత్రమె అని గుర్తు కొచ్చి
మై డియర్ జిలేబి రావు ! నా ప్యారీ పెండ్లామా ! మనమంతా సాదా సీదా బ్లాగ్ దేశ వాసులం ! మనం అట్లాంటి మాటలు చెప్పలేం " చెప్పారు అయ్యర్ ఖాన్ గారు .
మరి ఎట్లా ఈ బ్లాగ్ దేశం లో బతికేది ? రోజు రోజు కి వైషమ్యాలు కార్పణ్యాలు , భావాల మీద బావ ల మీద, మాట మీద , సారంగం మీద వచ్చే కామెంట్ల చూస్తూంటే నాకు మరీ విపరీతమైన భయ్యం వస్తోందండీ !
జిలేబి ! ఇంతకు మునుపు ఇట్లాంటి కామింటులు అంటే సై అంటే సై అనే కామింటులు లేవా ?
ఉండే వండి ! ఒక వైపు వారు మాత్రమె ఎగ సెగ డోస్ ఇచ్చె వారు ! కాని ఈ కాలం లో సై అంటే సై అని కౌంటర్ వేయటం ఎక్కువై పోయిందండి !
సో కౌంటర్ వేయటం కొట్టొచ్చినట్టు కనబడు తోందన్న మాట ! సరే రేపు నాకు బ్లాగ్దేశం లో ని మ్యాడ్ మీడియా వారి తో బ్లాగ్ముఖీయం ఉంది - దాంట్లో వీళ్ళ తాట వదిలిస్తా ! నీ తరపు గా నేను వాళ్లకి చెబ్తా ! మా జిలేబి రావు కూడా భయపడింది అని చెప్పాడు అయ్యర్ ఖాన్ !
జిలేబి రావు కళ్ళ లో కన్నీళ్లు సుళ్ళు తిరిగేయి ! ఈ బ్లాగ్దేశం ఎంత మారి పోయింది ! చ చ ! వేరే బ్లాగ్ దేశం కి వెంటనే వెళ్లి పోవాలి !
అయ్యర్ ఖాన్ తన సైజైన చాతీ తో జిలేబి రావుని అక్కునకి తీర్చుకున్నాడు !
బావా నా లో వంట జ్ఞానమే కొరవడెనని వడ్డింపు వాస్తేదో అంతగా లేనే లేదని అల్లం దోశ లతో సాంబారు లాగించ మంటే బావా, నేను మూగనై నీ బందీ నై పోయా !
ఆలోచనలకి రూపమీయ జిలేబి గుండు అని తటిల్లత లా జిలేబి పాకం నీరు కారి పోయే లేని పెసరట్ల తో తెలుగు వంట చేయ మంటే ఆలోచనలు అవాక్కై ఆముదాన్ని తాగె !
వ్యంగ్య వ్యాఖ్యల కారప్పూసల తో వడ్డించి టిఫిను ఖాళీ ప్లేటు పెట్టి తినమంటే అల్లం మిర్చీ గా మారి కాలుతుంటే మజ్జిగెరుగని మదికన్నీరే బ్లాగ్కాలువాయే !
అల్లంమొరబ్బా ని అభిమానిస్తే అదేదో నేరమని నా తలపుల కే రంకుగట్టి బావలతో సరసమని పదాలే వేరుగా పలికి పోపు పొడి వేయిస్తూంటే విస్తరాకుల విజ్ఞానమిదేనని వినమ్రత గా నవ్వుతా !
ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను అని సినీ కవి పాట . ! నిజంగానే అట్లా అయ్యింది జిలేబి పరిస్థతి ! మొన్న శర్కరి వారు సత్యనారాయణ వ్రతం గురించి గరికపాటి వారి ప్రసంగం వీడియో పెట్టి మనకు తెలిసిన సత్య నారాయణ వ్రతం కోరికలను ఈడేర్చేది . మరి గరిక పాటి వారేమో సత్యం గురించి మాట్లాడు తున్నారు మరి అంటే , అబ్బే మగరాయుళ్ళ కి ఆండోళ్ళ కి తెలిసినంత గా వీటి గురించి తెలీదండీ అని వ్రాయటం తో మొదలెట్టి ఆ పై గరిపాటి చేయని సత్యాని కి ఇంత విలువా ! ఇంత బిల్డ్ అప్ కూడానా అని వ్రాస్తే విన్న కోట వారు ఆయ్ మీరు గరిక పాటి వారి పాండిత్యాన్ని గరిక పోచ తో పోల్చడం సుతరామూ బావోలేదు సుమీ అని ధక్కా ఇచ్చారు ! శ్యామలీయం వారేమో పొరపాటు మాటన్నారు జిలేబిగారు అన్నారు ! అదిరి పడ్డా ! ఎరక్క పోయి కామేంటాను ఇరుక్కు పోయాను అనుకున్నా ! మరీ శర్కరి వారి కామింటు బాక్సు నింపడం కన్నా మనకు ఒక టపా వ్రాసేందుకు ('టపా' కట్టేందుకు ) అవకాశం దొరికింది సుమీ అని సంతోష పడి పోయా ! సత్యాన్వేషణ అన్నది కాలా కాలం గా ప్రతి జమానా లో నూ జరుగుతున్నదే. అయితే ఏది సత్యం అన్నది , ఇదే సత్యం అన్నది నిర్ధారణ గా , చెప్పలేనిది. ఇదే సత్యం అంటే అప్పటికి అదే సత్యం కాని దాని ఆవల మరో సత్యం ఉన్నది అన్నదే న ఇతి ! ఈ క్షణం సత్యం అనుకుంటే ఈ క్షణం మాత్రమె సత్యం ఆ పై క్షణం సత్య దూరం. మార్పు చెందనిది సత్యం అనుకుంటే మార్పు లేనిదే ఈ విష్ణు మాయ లేదు. గరిక సత్యం పాటి అవ్వొచ్చు నెమో గాని సత్యం గరిక పాటి కాలేదు. అది అయితే ఇక సత్యం వేరే ఉన్నట్టే లెక్ఖ . గరిక పాటి వారు చెప్పినది 'సత్యమైన' మాట - సత్య వ్రతం చెయ్య మనడం . సత్య మేవ జయతే అనటం తో ఋక్కు ఆగలేదు - మరో తోక తగిలించు కున్నది నానృతం అని కూడాను. ఋతగుం సత్యం పరం బ్రహ్మ అంటుంది ఋక్కు . ఇందులో సత్యానికి మరో తోక కూడా ను "ఋ" త ఎందుకా తోక ? ఇప్పటి దాకా నాకైతే అనుభవైక వేద్యం కాలేదు ( పుస్తక జ్ఞానం కాకుండా) ! నారాయణ సూక్తం 'నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా' అంటుంది ఆ 'పరం బ్రహ్మ' గురించి చెబుతూ ఎండిపోయిన గరిక మొనన ఉన్న పీత వర్ణ రంగులో అణు మాత్రమై అంటూ . క్వాంటం ఫిసిక్స్ గాడ్ పార్టికల్ వైపు పరుగెడు తోంది . ఇట్లాంటి నేపధ్యం లో ఒక్క వాక్యం లో వ్రాసినది ఆ వాక్యం . ఆ గరిక పాటి అన్నది బాగా అక్కడ కుదురుకున్న మాట అయి పోయింది ! సత్యం గరిక పాటి చేయదు. చేస్తే అది సత్యం కాదు. మరి ఏ పాటి చేస్తుంది ? తెలీదు ; ఈ పాటి చేస్తుంది అని తెలిస్తే అది సత్యదూరం. జిలేబి (హమ్మయ్య ! నేటికి ఒక టపా కట్టేసా:)
మనసు--సమస్య
-
*మనసు--సమస్య*
*మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది.
సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. *
*ఎలా? అన్నది ప్రశ్న.*
...
శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !
-
Posted on ఏప్రిల్ 30, 2013 24 పాలకోసం రాళ్ళు మోయడం. “పాలకోసం రాళ్ళు
మోయడం”అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం
కోసం కష్టపడట...
శర్మ కాలక్షేపంకబుర్లు- పనసకాయ దొరికినప్పుడే………….
-
పనసకాయ దొరికినప్పుడే….……… పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నారు అని
నానుడి.. ఇదేంటో నాకు అర్ధంకాలేదు నిన్నటి దాకా. ఈ మధ్య భాగవతం మూలం చదువుతూ
పోతనగారు ...
శర్మ కాలక్షేపం కబుర్లు-1- గురు, దైవ వందనం
-
*— శర్మ కాలక్షేపం కబుర్లు—*
*Posted on సెప్టెంబర్ 23, 2011 *
*గురు, దైవ వందనం*
కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు
సాష...
పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!
-
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా
గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే
పాలకుల...
ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)
-
అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా
బాగుంటుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం.
అవ్విధముగా - ప్రవాహంలో ...