మొదటి భాగం ఇక్కడ రెండో భాగం ఇక్కడ .....
శ్రీ కృష్ణుల వారు - కాస్త సమయం తీసుకొని నిద్ర లేచారు. చుట్టూ చూసారు. నిర్మానుష్యం. స్వాములు లేరు. తన పరివారమూ లేరు. ఓ మారు కళ్ళు మూసుకుని ప్రశాంతం గా అవలోకించి - సరే ఫైనల్ గా మళ్ళీ
ఓ మారు కర్మ భూమి లో -
ఈ మారు సామాన్య ప్రజానీకాన్ని కదలించి - మీ కష్టాలేమిటి- ఇలా స్వాములోల్లతో ప్రాబ్లెమ్స్ లో ఇరుక్కున్తారేమిటి? అని ప్రక్కన నారదుల వారు ఉంటె మంచిదని వారిని పిలుచుకొని కర్మ భూమి కి వచ్చేరు. కర్మ భూమి లో-
ఓ అమ్మాయీ, వాళ్ళ పేరెంట్స్ ఓ స్వామిజి ని కలవడానికి వెళ్తున్నారు- ఆ అమ్మాయిని నారదులవారు కదలించారు - అమ్మాయీ అమ్మాయీ ఈ స్వామిజి ని ఎందుకు కలవాలని వెళ్తున్నావు?
ఆ అమ్మాయి " ఏమో తెలీదు- మా అమ్మ వెళ్తోంది నేను వెళ్తున్న అన్నది . అమ్మా అమ్మ మీరెందుకు వెళ్తున్నారు? అంటే- అదేమో తెలీదు - మావారు వెళ్తున్నారు - నేను వెళ్తున్నాను అన్నది-
అయ్యా మీరెందుకు వెళ్తున్నారు స్వామీ? అంటే- ఆ భర్త గారు- మా ఆఫీసు లో నాకు ప్రొమోషన్ రాలే- స్వామీ వారి బ్లెస్సింగ్ ఉంటె వస్తుందేమో అన్నఆశ తో వెళ్తున్నా అన్నాడు.
మరో అయ్యని కదలిస్తే - మా ఆవిడ వెళ్తోంది కాబట్టి నేను వెళ్తున్నాను అన్నాడు.
భార్య గారు భార్య గారు - మీరెందు కు వెళ్తున్నారు అంటే- చాల కాలం నించి మాకు పిల్లలు లేరు. స్వామీ "ముద్దు బ్లెస్సింగ్" తో పిల్లల్ని పుట్టిస్తారని విన్నాము - ఆయన బ్లెస్సింగ్ తో పిల్లలు పుట్టాలని - పరవశం తో కనులు మూసుకుంది.
మరో మానవుణ్ణి కదలిస్తే- స్వామీ మా కులం వారు- ఆ పాటి మేము సపోర్ట్ ఇవ్వక పొతే ఎలా? అన్నాడు.
ఓ రాజకీయ నాయకుణ్ణి కదలిస్తే- "స్వామీ మీకు తెలియనిది ఏమి ఉన్నది? ఎక్కడ జన సందోహం ఎక్కువో అక్కడ మేముంటేనే మాకు పరపతి- మా ఇమేజ్ పెరగాలంటే - మేము ఈలాంటి 'సంఘాలని' సమాజలని తప్పక చూసి మా వచ్చే ఎన్నికలకి తయారు గా ఉండాలి అన్నాడు.
ఓ సిని తారని కదలిస్తే- అందం ఒక్కటే కాదు స్వామీ మా ఫీల్డ్ కి కావాల్సింది- కాస్త పరిచయాలు - కూడా- ఇట్లాంటి పరిచయాలు - ఈ లాంటి క్లబ్బుల్లో మాకు చిక్కుతాయి అంది గుంభనగా.
ఓ విదేశీయుణ్ణి అడిగితె- యోగం భోగం ఈ కర్మ భూమిలో దొరుకుతాయి అన్నాడు.
ఓ కాటి కి కాలు చాపుకున్న ముసలి వాణ్ని అడిగితె- "వచ్చే జన్మలో నేను ఎవెర్ యంగ్ గా" ఉండాలని స్వామీ వారి బ్లెస్సింగ్ కోసం వెళ్తున్న అన్నాడు.
ఓ కుర్రకారు- అక్కడ నా వయసు అమ్మాయిలూ ఎక్కువ వస్తారు- కాలేజి తరువాయి ఇక్కడే మా కాజోల్ ని మేము వెతకాలి అన్నాడు.
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ - ఆన్ సైట్ రావాలని - బ్లెస్సింగ్ కావాలన్నాడు.
ఓ మీడియా వాణ్ని అడిగితె- స్వామీ మా ప్రజలకి ఇరవై నాలుగు గంట లు మసాల న్యూస్ కావాలి - మేము మసాల న్యూస్ ఇరవై నాలుగు గంట లు ఇవ్వాలంటే - జన సందోహ ప్రదేశాలలో - వెతికి వెతికి మసాల న్యూస్ లు పట్టాలి - దానికి కొంత మార్ఫిసం చెయ్యాలి - అప్పుడే మా ప్రేక్షకులకి నప్పుతాయి - లేకుంటే మా ఛానల్ రేటింగ్ గోవిందా- అంతెందుకు - గోవిందా గోవిందా ఛానల్ చూడండి - స్వామీ వారికే పబ్లిసిటీ కావాల్సి వొచ్చే- ఇరవై నాలుగు గంట లు - అంటూ వాపోయాడు-
ఇవన్నీ వింటూ పోతూంటే - సైలెంట్ గా ఉన్న కృష్ణ స్వామీ వారి కి మళ్ళీ తల తిరిగింది.
ఇందులో ఒక్కరి కి కూడా భక్తీ అన్నది ఉన్నట్టులేదు. యద్భావం తద్భవతి. కోరికలే గుర్రాలు గా నా కర్మ భూమి వాళ్ళు స్వారి చేస్తూన్నారు. చేయి చేయి కలవనిదే తప్పట్టు రాదు. ఈ చేయి కి ఆ చేయి ఆసరా. భగవంతుడు సృష్టి కార్యం కోసం స్త్రీ పురుషున్ని సృష్టించాడు. ఈ మానవులు - తమ కోరికల కోసం - వాటిని ఈదేరడం కోసం - ఈ స్వామిజి ల మీద పడుతున్నారు.
ఇందులో సో కాల్డ్ భగవంతుని గా నా స్థానం ఏమి లేదు - కాకుంటే - శంఖం పూరించి- యదా యదాహి గ్లానిర్భవతి భారతా- అని మరో మారు అవతారం ధరించవచ్చు. అయినా అందు వలన ప్రయోజనం ఉంటుందా? - దీనికి పరిష్కారం ఏమిటి? అన్న ఆలోచనలో పడి -
కృష్ణాజి " హా సత్యా" అన్నారు- ఈ మారు సత్య పక్కనే నిలబడి "స్వామీ " అన్నది.
ఏమి పరిష్కారం? అన్నారు కృష్ణాజి.
"నరకాసుర వధ" స్వామీ అన్నది సత్య- తనకు తెలిసిన సత్యం అదే- మనిషిలోని అసురుడు వెళితేనే - కోరికలు తగ్గిస్తేనే - వీళ్ళ జీవితాలలో - జీవనం. లేకుంటే - యధో కర్మహ తతో ఫలః అన్న అర్థం వచ్చేలా -
చీర్స్
జిలేబి.