Friday, March 12, 2010

వేకువ వెలుగులు

వేళా వేళా భాస్కరుని రాకతో
కువ కువ మనె కామెంట్లతో
న్నె విషయాలతో
వెరైటీ రచనలతో జా
లు వారు కవితలతో
గుర్తింపు గలిగిన
లుక్ గుడ్ బ్లాగులతో
కూడలీ హారమై న తెలుగు బ్లాగు లోకానికి శుభోదయం!

చీర్స్
జిలేబి.
(టైటిల్ కర్టసీ- భారారే గారి వేకువ వెలుగులు సీరీస్ )

Thursday, March 11, 2010

బిల్లీ శూన్యం - సిల్లీ స్మశానం

ఈ మధ్య భారారే గారి - బ్లాగుల్లో సిల్లి బిల్లి గొడవలు టపాలు చదివాక భలే నవ్వొచ్చింది.

బ్లాగులు ఓ మోస్తరు టైం పాస్ కాలక్షేపం. వీటిల్లో కూడా ఇట్లాంటి హాం ఫట్ ఫైటింగ్ లు - దాడులు - ఐ పి అడ్రస్ ల షెర్లాక్ హోమ్స్ బిజినెస్ లాంటివి జరుగుతుంటాయని - చాల తీక్షణం గా విమర్శలు - గిల్లి కజ్జాలు జరుగు తూన్టాయని చదివాక ఈ టైటిల్ పెట్టి రాయాలని అనిపించింది. స్మశానం లో శవాలు కాల్చబడతాయి కాకుంటే పాతి పెట్ట బడతాయి. బ్లాగుల్లో రాసినవి ఇంట్రెస్ట్ ఉంటె ఎవరైనా చదువుతారు - కాకుంటే మౌస్ స్కిడ్ చేసి క్లోజ్ చేసి మరో బ్లాగు కి వెళ్తారు - సో బ్లాగు లోకం కూడా ఓ లాంటి శ్మశాన వాటికే- ఆ పాటీ దానికి - బిల్లీ శూన్య మంత్రాలలాంటి- ఐ పి అడ్రస్ ల షెర్లాక్ హోమ్స్ అవసరమేనా అన్న సందేహం రాక మానదు! అయినా కాలక్షేపానికి కొందరు శ్మసానాలని కూడా తవ్వే వాళ్ళు ఉండ వచ్చు - ఏమైనా నిధులు గట్రా దొరుకుతా ఏమో అన్న ఆశతో - టుటాం క మెన్ పిరమిడ్ ల తవ్వకాలలా- హరప్పా మొహన్జదారాలల - ఏదైనా విశేషమైన వస్తువు లు బయట పడతాఎమోనని చూద్దాం !

బిల్లీ శూన్యం - బ్లాగ్ మాత్రికుల్లార - మీ సిల్లీ స్మశాన తవ్వకాలని వెంటనే ప్రారంభించండి ! - అల్ ది బెస్ట్ !

చీర్స్
జిలేబి.

Tuesday, March 9, 2010

మా బామ్మకి వందేళ్ళు





ల్లి, కొప్పులో,
హిరణ్మయి నడకలో, కా
ళం పగ పడితే,
వణం కించిత్,
దిక్సూచి కుటుంబానికి,మ
నోహరి మనోహరునికి , వా
త్సల్యమయీ మరు
వం - ఇవ్వాళ
మా బామ్మకి వందేళ్ళు !
మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో -
చీర్స్
జిలేబి.

Monday, March 8, 2010

అనంతుని ఆహ్వానం

మతం మాయమై పోయింది
ఆధ్యాత్మికం ఆకాసానికి ఆవల పోయింది
సత్యం సమీర మై సాగి పోయింది
ఇంక మిగిలింది-
అనంతుని ఆహ్వానం
వేచి ఉండడం మన కర్తవ్యం -
రావడం రాకపోవడం
ఆ అనంతుని ఆంతర్యం

చీర్స్
జిలేబి

Saturday, March 6, 2010

శ్రీ కృష్ణ విలాపం - మూడో భాగం

మొదటి భాగం ఇక్కడ

రెండో భాగం ఇక్కడ
.....
శ్రీ కృష్ణుల వారు - కాస్త సమయం తీసుకొని నిద్ర లేచారు. చుట్టూ చూసారు. నిర్మానుష్యం. స్వాములు లేరు. తన పరివారమూ లేరు. ఓ మారు కళ్ళు మూసుకుని ప్రశాంతం గా అవలోకించి - సరే ఫైనల్ గా మళ్ళీ మారు కర్మ భూమి లో - మారు సామాన్య ప్రజానీకాన్ని కదలించి - మీ కష్టాలేమిటి- ఇలా స్వాములోల్లతో ప్రాబ్లెమ్స్ లో ఇరుక్కున్తారేమిటి? అని ప్రక్కన నారదుల వారు ఉంటె మంచిదని వారిని పిలుచుకొని కర్మ భూమి కి వచ్చేరు. కర్మ భూమి లో-

ఓ అమ్మాయీ, వాళ్ళ పేరెంట్స్ ఓ స్వామిజి ని కలవడానికి వెళ్తున్నారు- ఆ అమ్మాయిని నారదులవారు కదలించారు - అమ్మాయీ అమ్మాయీ ఈ స్వామిజి ని ఎందుకు కలవాలని వెళ్తున్నావు?

ఆ అమ్మాయి " ఏమో తెలీదు- మా అమ్మ వెళ్తోంది నేను వెళ్తున్న అన్నది . అమ్మా అమ్మ మీరెందుకు వెళ్తున్నారు? అంటే- అదేమో తెలీదు - మావారు వెళ్తున్నారు - నేను వెళ్తున్నాను అన్నది-

అయ్యా మీరెందుకు వెళ్తున్నారు స్వామీ? అంటే- ఆ భర్త గారు- మా ఆఫీసు లో నాకు ప్రొమోషన్ రాలే- స్వామీ వారి బ్లెస్సింగ్ ఉంటె వస్తుందేమో అన్నఆశ తో వెళ్తున్నా అన్నాడు.

మరో అయ్యని కదలిస్తే - మా ఆవిడ వెళ్తోంది కాబట్టి నేను వెళ్తున్నాను అన్నాడు.

భార్య గారు భార్య గారు - మీరెందు కు వెళ్తున్నారు అంటే- చాల కాలం నించి మాకు పిల్లలు లేరు. స్వామీ "ముద్దు బ్లెస్సింగ్" తో పిల్లల్ని పుట్టిస్తారని విన్నాము - ఆయన బ్లెస్సింగ్ తో పిల్లలు పుట్టాలని - పరవశం తో కనులు మూసుకుంది.

మరో మానవుణ్ణి కదలిస్తే- స్వామీ మా కులం వారు- ఆ పాటి మేము సపోర్ట్ ఇవ్వక పొతే ఎలా? అన్నాడు.

ఓ రాజకీయ నాయకుణ్ణి కదలిస్తే- "స్వామీ మీకు తెలియనిది ఏమి ఉన్నది? ఎక్కడ జన సందోహం ఎక్కువో అక్కడ మేముంటేనే మాకు పరపతి- మా ఇమేజ్ పెరగాలంటే - మేము ఈలాంటి 'సంఘాలని' సమాజలని తప్పక చూసి మా వచ్చే ఎన్నికలకి తయారు గా ఉండాలి అన్నాడు.

ఓ సిని తారని కదలిస్తే- అందం ఒక్కటే కాదు స్వామీ మా ఫీల్డ్ కి కావాల్సింది- కాస్త పరిచయాలు - కూడా- ఇట్లాంటి పరిచయాలు - ఈ లాంటి క్లబ్బుల్లో మాకు చిక్కుతాయి అంది గుంభనగా.

ఓ విదేశీయుణ్ణి అడిగితె- యోగం భోగం ఈ కర్మ భూమిలో దొరుకుతాయి అన్నాడు.

ఓ కాటి కి కాలు చాపుకున్న ముసలి వాణ్ని అడిగితె- "వచ్చే జన్మలో నేను ఎవెర్ యంగ్ గా" ఉండాలని స్వామీ వారి బ్లెస్సింగ్ కోసం వెళ్తున్న అన్నాడు.

ఓ కుర్రకారు- అక్కడ నా వయసు అమ్మాయిలూ ఎక్కువ వస్తారు- కాలేజి తరువాయి ఇక్కడే మా కాజోల్ ని మేము వెతకాలి అన్నాడు.

ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ - ఆన్ సైట్ రావాలని - బ్లెస్సింగ్ కావాలన్నాడు.

ఓ మీడియా వాణ్ని అడిగితె- స్వామీ మా ప్రజలకి ఇరవై నాలుగు గంట లు మసాల న్యూస్ కావాలి - మేము మసాల న్యూస్ ఇరవై నాలుగు గంట లు ఇవ్వాలంటే - జన సందోహ ప్రదేశాలలో - వెతికి వెతికి మసాల న్యూస్ లు పట్టాలి - దానికి కొంత మార్ఫిసం చెయ్యాలి - అప్పుడే మా ప్రేక్షకులకి నప్పుతాయి - లేకుంటే మా ఛానల్ రేటింగ్ గోవిందా- అంతెందుకు - గోవిందా గోవిందా ఛానల్ చూడండి - స్వామీ వారికే పబ్లిసిటీ కావాల్సి వొచ్చే- ఇరవై నాలుగు గంట లు - అంటూ వాపోయాడు-

ఇవన్నీ వింటూ పోతూంటే - సైలెంట్ గా ఉన్న కృష్ణ స్వామీ వారి కి మళ్ళీ తల తిరిగింది.

ఇందులో ఒక్కరి కి కూడా భక్తీ అన్నది ఉన్నట్టులేదు. యద్భావం తద్భవతి. కోరికలే గుర్రాలు గా నా కర్మ భూమి వాళ్ళు స్వారి చేస్తూన్నారు. చేయి చేయి కలవనిదే తప్పట్టు రాదు. ఈ చేయి కి ఆ చేయి ఆసరా. భగవంతుడు సృష్టి కార్యం కోసం స్త్రీ పురుషున్ని సృష్టించాడు. ఈ మానవులు - తమ కోరికల కోసం - వాటిని ఈదేరడం కోసం - ఈ స్వామిజి ల మీద పడుతున్నారు.

ఇందులో సో కాల్డ్ భగవంతుని గా నా స్థానం ఏమి లేదు - కాకుంటే - శంఖం పూరించి- యదా యదాహి గ్లానిర్భవతి భారతా- అని మరో మారు అవతారం ధరించవచ్చు. అయినా అందు వలన ప్రయోజనం ఉంటుందా? - దీనికి పరిష్కారం ఏమిటి? అన్న ఆలోచనలో పడి -

కృష్ణాజి " హా సత్యా" అన్నారు- ఈ మారు సత్య పక్కనే నిలబడి "స్వామీ " అన్నది.

ఏమి పరిష్కారం? అన్నారు కృష్ణాజి.

"నరకాసుర వధ" స్వామీ అన్నది సత్య- తనకు తెలిసిన సత్యం అదే- మనిషిలోని అసురుడు వెళితేనే - కోరికలు తగ్గిస్తేనే - వీళ్ళ జీవితాలలో - జీవనం. లేకుంటే - యధో కర్మహ తతో ఫలః అన్న అర్థం వచ్చేలా -

చీర్స్
జిలేబి.

శ్రీ కృష్ణ విలాపం - భాగం రెండు

మొదటి భాగం ఇక్కడ-
....
అలా మూర్చ పోయిన కృష్ణ స్వాములు కొంత సేపటి కి తేరుకుని - కనులు తెరిచి చూసారు.

వారి కి కొంత దూరం లో - ఎవెర్ హ్యాప్యానంద, "విష్" ఆనంద , సీనియర్ ఐన భగవానంద అందరు కలిసి చిద్విలాసంగా స్వామీ వారి ని చూపిస్తూ - గోపిలకి - "డిష్" ఆనందా లాగ -
"అమ్మాయిలూ- భగవంతుడనే సా టి లైట్ కి మేము డిష్ లం. మీ టీవీ లో ఆయన పిక్చర్ కనిపించాలంటే - మా లాంటి డిష్ ల అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం మా డిష్ లకి ప్రనమిల్లుకోండి అని ఉపన్యాసం దంచేస్తుండగా

కృష్ణ స్వాముల వారి కి ఏమి చెయ్యాలో పాలు పోక సరే పొతే పోనీ వీరి భాదలేమి టో కనుక్కుంటే తాను ఏమైనా హెల్ప్ చెయ్య గలడేమో అని ఆలోచించి -

"ఓ స్వాములార - నేను ద్వాపర యుగం నాటి వాణ్ని. మీ కష్టాలేమి? మీ కేమైనా కష్టాల ? నష్టాల? అని అడిగి తే - స్వాములు నవ్వి - ఒకరి తరువాత ఒకరు గా ఇలా వాక్రుచ్చేరు.

"కృష్ణ- నీవు పురాణ కాలం లో ఉన్నావు- పిల్లన గ్రోవి ఉంటె చాలను కుంటున్నావు - తప్పు నాయన తప్పు - ఈ కాలం భక్తులకి ఇవన్ని పనికి రాని వస్తువులు. ఈ కాలం లో భక్తులకి - బ్లాగులు - అంతర్జాల చమక్కులు -యు ట్యూబ్ బ్రాడ్ కాస్ట్ యువర్ సెల్ఫ్ లు లాంటి వి ఉంటె నే - స్వాముల వారి ని గమనిస్తారు- ఎవరి కి ఎంత మంది ఫాన్స్ అన్నది వీటి మీద ఆధార పడి ఉంటై. నీ టైం లో నువ్వు ఓ పద హారు వేల మంది నే పిల్లన గ్రోవితో ఆకర్షిస్తివి. - నీ పిల్లన గ్రోవితో ఈ కాలం లో ఓ పోరిని కూడా పట్టలేవు నాయన అని భగవానంద చెప్పగా కృష్ణుల వారు ముక్కు మీద వేలు వ్రేసుకుని తన పిల్లన గ్రోవిని ఓ మారు తడిమి చూసుకున్నారు-

"కృష్ణ- నీ కు పిల్లనగ్రోవిని ట్యూన్ చెయ్యడం మాత్రమె తెలుసు - మా ఎవెర్ హ్యాపి ఆనందా స్వామీ వారి కి పిల్లని ఎక్కడ మీటితే మిర్చి ఎఫ్ ఎం లా బాలీవుడ్ స్టైల్ కాకుంటే పాప్ స్టైల్ పలుకుతుందో - ఎక్కడ వేలిని తాకితే - ఎక్కడ తీగలు కదులు తాయో తెలుసు" అని విష్ ఆనందా వారు- గడ్డం తడివారు

"కృష్ణ- విష్ ఆనందా తక్కువేమీ కాదు సుమా - ఆయన ఉత్తరాది వాడు - రెండు వేదాలు ఎక్కువే చదివేడు - అని ఎవెర్ హ్యాప్పీ ఆనందా స్వామీ వారు తనకు తెలియక పోయినా విష్ ఆనందా గారి గురించి పొగి డేడు.

కృష్ణ స్వాముల వారు ఓ మారు బుర్ర గోక్కుని - సరే స్వాములు - ఈ అమ్మాయిల విషయం లో ఏమి ఈ చపలత్వం - ఓ పక్క నా భగవద్గీత ని కాపీ రైట్స్ లేకుండా కాపీ కొడుతూ? అని అడిగిందే తడవు గా

ఎవెర్ హ్యాపి ఆనందా వారు- అమెరికన్ స్టైల్ లో - హేక్ క్రిస్- పురాణ కాలం లో ఎవడో పిచ్చి సన్నాసి ఈ కాషాయ వస్త్రాలని మా యుని ఫోరం గా పెట్టి పోయేడు. అప్పట్నుంచి మాకి ఇదో ట్రేడ్ మార్క్ ఐపాయింది.

ఓ రాజకీయ నాయకుడు పంచ కడతాడు. ఓ మిలిటరీ ఆఫీసర్ యుని ఫోరం వేస్తాడు. ఓ కలక్టరు సూట్ వేస్తాడు. వీళ్ళంతా ఉంటె తమ పెళ్ళాల తో శృంగారం సాగించడానికి - సాంఘిక వ్యస్త ఆస్కారం కలిపించింది - పెళ్లి అన్న పేరుతొ. దాన్ని మీరి ఎంత మంది పొరిగింటి పోరి ల మీద పడటం లేదు? కాదన గలవా? -

సన్నాసి కాషాయ వస్త్రాలు తీస్తే - శరీరం - సంసారి బట్టలూడ దీస్తే - శరీరం - దాని అవసరం దానికి - అంతా - నీ యోగ మాయ విలాసం - కాదంటావా?

పొయ్యే కాలం ఏమిటంటే - మాకి వ్యవస్థ లేదు - శరీరాన్ని సుఖ పరచడానికి - ఈ పిచ్చి మా లోకం మమ్మల్ని వీటి కి అంటరాని వాళ్ళ లా చూస్తోంది. కాదంటావా ? -

అదీ గా క మా వద్ద వచ్చే పోరులంతా - యమ రంజుగా ఉండటం మేము చేసుకున్న పుణ్య ఫలం - ఈ కుళ్ళు బోతూ మా లోకం వాళ్లకి - ఈ పాటి తీరికా లేదు -పెళ్ళాల్ని సుఖ పెట్టడానికి - వీళ్ళంతా మేమేదో ఉద్దరిస్తామని మా దరి కోస్తారు- దరి కొచ్చే సుందరి ని కాదనడానికి మేము ఏమైనా వెర్రి సన్నా సులమా? " అని హింట్ ఇచ్చేడు.

కృష్ణా జీ "హా సత్యా" అని మరో మారు మూర్చ పోయేరు - ఇంకెక్కడి సత్యం- సత్యమేప్పుడో లేచి పోయింది!

చీర్స్
జిలేబి.

Friday, March 5, 2010

శ్రీ కృష్ణ విలాపం

స్వామీ శ్రీ కృష్ణుల వారు చిద్విలాసం గా యమునా తీరే - తన పద హారు వేల మంది గోపికలతో కొలువై ఉండగా ఎవెర్ హ్యాపీ బ్లిస్స్ ఆనందా స్వామిజి గారు - ఉండేలు దెబ్బకి పరారి ఐ వచ్చిన కుందేలు వలె కృష్ణా జీ ముందు ధబీల్మని ప్రత్యక్షమై -

హేక్ కృష్ణ- ఇదేమి నన్నిలా జనాలు వెంట పడి తరిమేలా చేస్తివి? నేనేమి పాపం చేసినాను- నువ్వేమో ముగ్గురు భామల తో చాలక పదహారు వేల మంది గోపికలతో ఉంటె - ఆ హా కృష్ణ విలాసం - అంతా విష్ణు మాయ అని జనాలు పోగిడేరు?
మరి నేను ఒక్కగానొక్క రాగ రంజిత హృదయేశ్వరి తో నా లోకం లో ఉంటె వాడెవడో నీవు శకుని కుటిలత్వాన్ని మాయ బజార్ లో అదేదో దర్పి ణి లో చూపెట్టినట్టు - నన్ను నీ కర్మభూమి లో నీ కర్మ నీదే అన్న రీతిలో నడి రోడ్డులో నిలిపేడు? ఇది ఏమైనా న్యాయమా స్వామీ ? అంటే

క్రిష్ణులవారు తన యోగ నిద్రని కాసేపు పక్కకి పెట్టీ - కళ్ళు మూసుకుని అవలోకించి - భక్తా - ఈ మధ్య నన్ను నీవు మరీ మరీ తలచుకుంటూ ఉంటివి - దేశం లో ఎడా పెడా భగవద్గీతల సభలలో నా గురించి మరీ పొగిడి తివి - ఆ హా నా భక్తుడు ఇంతగా నన్ను పొగిడే గదా అని నేను నిన్ను ఓ క్షణం తలిస్తిని. మరో మారు తలిచేలోపు మా సత్య - స్వామీ భక్తులని మరీ ఎక్కువైగా తలవకండి ప్రాబ్లెం - అని చెప్పడం తో భక్తులని తలిస్తే ఏమి ప్రాబ్లెం అని ఓ క్షణం ఆలోచనలో పడితిని.

ఇంతకీ ఇదన్న మాట సంగతి - మరీ రసగ్నుడవే అని సరే అయినదేమో అయినది ఇక కావాల్సిన కార్య మేదో చూడు అని సలహా ఇచ్చేరు పరమాత్ముల వారు- అంతా విష్ణు మాయే - నా చేతి లో ఏముంది అని కృష్ణు ల వారు ఆ యోగ మాయని ఓ క్షణం తలిచేరు.

ఈ కృష్ణుడు కూడా నన్ను కాల రాసాడే అని ఎవెర్ హ్యాపీ స్వామిజి గారు ఇంకా ఏమి చెయ్యడం - అని స్వామీ వారి మీంచి తన దృష్టిని యమునా పైకి - ఆ పై పదహారు వేల గోపికల పై కి చూపులని సారించేడు. గోపికలలో రాగ రంజితాలు ఆతనికి గోచరించినై.
ఆ హా అర్థమైంది - యోగ మాయ ఉద్దేశం ఇదన్న మాట అని భాష్యం చెప్పుకుని - గోపికలు - మీకు వ్రిందావనం గురించి చెబ్తాను ఇలా రండి అన్నాడు.

అదిగో అప్పుడే మొదలైంది - శ్రీ కృష్ణులవారి "విలాపం" ! ఆ కాలం లో శంకరుడే భోలా శంకరుడని అనుకుంటిని - ఈ కలి యుగం లో నన్నే ఈ మానవుడు - భోల్తా కొట్టిన్చాడే - అని -

వారి విలాపాన్ని విని - కల్కి భాగావాను ల వారు- "వరదా" - నేను నీకు కలి గీత నేర్పిస్తాను ఇలా రా నాయనా అని ' వరదా- భగవంతునికి భక్తునికి అనుసంధాన మైనది అంబికా అగరొత్తులు మాత్రమె కాదు - అంబిక "గరం" ఒత్తులు కూడా అనడంతో-

- కృష్ణుల వారు మూర్చ పోయి "హా సత్యా" - అంటే - హుష్ కాకి- సత్యమే లేచి పోయింది. !

చీర్స్
జిలేబి.

డాకినీ శాకిని బ్లాగిని - హాం ఫట్

ఈ మధ్య నేను మరీ బ్లాగులు ఎక్కువ రాసేస్తున్నని - ఇంటి పని వంట పని గమనించడం లేదని అసలు వీటికన్నిటికి కారణం ఎ భూతమో పిశాచామో జిలేబి ని పట్టి పీడించడమే కారణమని మా ఇంట్లో వారు తీర్మానించేసుకుని ఓ బ్లాగ్వాదిని పిలిపించి మంత్రం వేయించేరు - ఆ బ్లాగ్మంత్రవాది ఇలా మంత్రోచ్చార ణతో మొదలెట్టగానే -
హాం ఫట్
హ్రీం ఫట్
హాం హ్రీం క్రీం
డాకిని
శాకిని
బ్లాగిని
పో పో వదిలిపెట్టు పారిపో -
జిలేబి ని వదిలి పెట్టి పో -
హాం హ్రీం క్రీం - డాకిని బ్లాగిని శాకిని హాం ఫట్ - హ్రీం ఫట్- క్రీం ఫట్
అనటం తరువాయి నేను మూర్చ పోయాను.
మా వాళ్లకి భయమేసి - ఆ బ్లాగ్మంత్ర వాడిని పంపించేసి ఆ పై నన్ను మూర్చ నించి లేపడం తరువాయి వెంటనే నేను ఈ టపాలు వ్రాసే తీరుతానని శపథం పట్టటం తో - ఇదేమి పొయ్యే గాలం రా భగవంతుడా- డోలు పోయి ధమరుకం వచ్చే అని మా వారు తలపట్టుకుని కూర్చూంటే - ఈ టపాలు ముగించెయ్యడం జరిగింది. అయిన కుక్క తోలు వంచడం ఎవరి తరం? - నలుగురు నవ్వి తే నేమి - మా బ్లాగ్ పిచ్చి మాదే - ఎవరి పిచ్చి వారికి ఆనందం కాదా మరి? మా వారు మాత్రం ఆ ఈనాడో లేకుంటే హిందూ నో తలక్రిందుల చదవగా లేనిది మేము బ్లాగ్ వ్రాస్తే వచ్చిందా తంటా- జిందాబాద్ బ్లాగినీ సమాజం -

చీర్స్
జిలేబి.

Thursday, March 4, 2010

శరత్ 'కాలమ్'

రవేగం స్వప్న రాగలీన స ' దృశ్యం '
సజ్ఞ రాగిణి - తస్మా
త్ ప్రియా సమాగమం - బ్లాగ్ 'విహారే'
కానవచ్చు ఆ నె
వంక అంద
మ్
శరత్ 'గాలం'
శరత్ 'కాలమ్'

చీర్స్
జిలేబి.

Wednesday, March 3, 2010

ఉడిపి హోటలు - ఉడాలు టపాలు

ఈ టపాలు రాయడానికి చాలా ఆలోచించి రాద్దామా వద్దా అన్న సందేహం లో పడి సరే రాద్దాం అన్న ఆలోచనతో రాస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రస్తుత చిత్తూరు పరిస్తితి ని చిత్రీ కరించదు. ఈ ఉడిపి హోటలు ఓ ముప్పై ఏళ్ళ క్రితం బ్రాహ్మణ వీధిలో ఓ ఇరవై ఏళ్ళ క్రితం జండా మాను వీధిలో ఆ పై బజారు వీధిలో ఉండేది. ఆ పై ఈ హోటలు మూత పడిందో లేదో నాకు తెలీదు. కాని ఈ ఉడిపి హోటల్లు సాంబారు - అదీ తెల్లవారి ఆ హోటల్ కెళ్ళి రెండు ఇడ్లీ ఒక బకెట్ సాంబార్ తో లాగిస్తే దాని మజా వేరు ! ఆ కాలం లో ఆంద్ర పత్రిక ఎర్రయ్య గారి అంగిట్లో - వారి అంగడి దినపత్రికలు- వార పత్రికలూ అలకరించిన ఓ "పత్రికా వనం" అన్నాతక్కువే- అరువుకి చదివి - ఈ హోటల్లో రెండు ఇడ్లీ ఓ బకెట్ సాంబార్ లాగించిన రోజులు - "సాంబార్" జ్ఞాపికలు! అప్పట్లో ముదిగొండ శివ ప్రసాద్ గారి చారిత్రాత్మక సీరియల్లు ఓ త్రిల్ చదవడం. పేపర్ లో సీరియల్ - డైలీ సీరియల్ ఓ రోజు చదవక పొతే అదోలా అయిపోయేది. ఇప్పుడూ తెలుగు పత్రికలూ ఆన్ లైన్ లో చదువు తాము అనుకోండి - అయినా తెల తెల వారి - ఆ పేపర్ వాసనతో - ఆంద్ర పత్రికా కాకుంటే ఆంద్ర ప్రభ చదవడం లాంటి జ్ఞాపకాలు- వాటి తో పాటు - పిచ్చా పాటి- ఇట్లాంటివి - ఈ కాలం లో కొద్ది తక్కు వే అనిపిస్తాయి. తెల తెలవారి హారం - కూడలి లో ముఖం పెట్టేసి బర్రుమని మౌస్ ని సాగాదీయ్యడం వేరే టెక్నిక్ !

ఆంద్ర పత్రికా ఇప్పట్లో లేదు. వాళ్ళ వారపత్రిక కూడా లేదు. కాని జ్ఞాపకాలు మాత్రం ఇంకా ప్రస్ఫుటం గా ఉన్నాయ్. ఈ విషయం గురించి ఆలోచిస్తే - జ్ఞాపకాలు అన్నవి మన మెదడులో ఓ లాంటి "చిప్" లా నిబడీ కృతమై కావాల్సినప్పుడు ఫ్లాష్ లా వచ్చేలా రావడం అన్నది మనిషి జీవితం లో ముఖ్య విషయం లా అనిపిస్తుంది. ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Tuesday, March 2, 2010

అదిగో పులి- అల్లదిగో పులి వేచి చూస్తోంది

హైతి చిలి నడిరాత్రి ఉలికి పాటు
గోళం చలి మయం
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది

యూరోపు దేశాల ఊగిసలాట
అమెరికా ఆర్ధిక మాంద్యం
ఆసియా అటో ఇటో తేలని పరిస్తితి
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది

ప్రపంచ దేశాల సంక్షోభం
భూమాత గగ్గోలం
త్సునామీల గందర గోళం
అదిగో పులి
అల్లదిగో పులి వేచి చూస్తోంది

జిలేబి

Saturday, February 27, 2010

అయస్కాంతం -

ఐశ్వర్యం తో వయసు
కనకం తో కాంతం
వెరసి అయస్కాంతం

మమత జుక్ జుక్ రైలు బండి
ప్రణబ్ ఫైనాన్స్
వెరసి 'బంగ్లా' ఖాతం!

సర్దార్జీ - ముఖర్జీ-బెనర్జీ
వెరసి "సోనార్" భారత్
మేరా భారత్ నేటి భాగోతం !

చీర్స్
జిలేబి.

Tuesday, February 16, 2010

జల పుష్పం

నిప్పు వేడి
గాలి వేగం

సూరీడి తాపం
చంద్రిమ చల్లదనం
తారల చమక్కు

మేఘ గర్జన
ఋతువుల రాగం

అన్నీ నేనే అన్నది జల పుష్పం

ప్రాణస్యప్రాణం అంతర్పుష్పం
అదే మంత్ర పుష్పం !

(మంత్ర పుష్పం ఆధారం )

జిలేబి

Thursday, February 11, 2010

సౌగంధికా పరిణయం

ఈ మధ్య భీమాంజనేయ యుద్ధం చిత్రం చూడటం జరిగింది. ఈ చిత్రం లో కథ స్థూలం గా నలకూబరుని సౌదామిని పరిణయం - దాని పర్యవసానం గా భీమాన్జేయుల మద్ద్య యుద్ధం జరగటం లాంటి సంఘటనలతో కథ నడుస్తుంది. సౌగంధిక పుష్పం - కుబేరుని శివార్చన మొదలైన సన్నివేశాలతో సౌగంధిక పుష్పం తీసుకు రావలసిన సౌదామిని నల కుబేరుని ప్రేమలో పడి శివార్చానకి ఆలస్యం గా రావడం అందులోను పూజ అప్పుడు కుబేరుడు ఒక సౌగంధిక పుష్పం తగ్గడం గమనించడం, ఆ పుష్పం సౌదామిని శిరుస్సులో ఉండడం, సౌదామిని ని శపించడం, సౌదామిని భూలోకం లో రావడం లాంటి విచిత్ర సన్నివేశాలతో కథ రమ్యం గా జరుగుతుంది.
ఈ చిత్రం చూస్తున్నప్పుడు వచ్చిన సందేహం ఏమిటంటే - సౌగంధికా పరిణయం అన్న మరో కథ ఉందా? లేక ఈ సౌదామిని నలకుబెరుల కథనే సౌగంధికా పరిణయం అంటారా?
మీ కెవరికైనా తెలిసిన చెప్పగలరు

జిలేబి.

Wednesday, February 3, 2010

ఆలోచనా స్రవంతి

మనసులోని మర్మమెల్ల తెలిసిన వారెవరైనా ఉంటారంటారా? ఎట్లాంటి టైటిల్ బ్లాగ్ లో రాయాలో ఆలోచన లేకుండా మనసులోనించి వచ్చే ఆలోచనలకి అక్షరం రూపం ఇవ్వగలడం సాధ్యమా? అంటే వచ్చే ఆలోచనలని ఏవిధమైనటువంటి నిబంధనలకి కట్టుబాట్లకి తావివ్వకుండా అక్షర రూపం చెయ్యడం అన్నటువంటి సాధనా ప్రక్రియ ఉందంటారా
ఆలోచించి చూస్తే ప్రతి మనిషి అక్షర రూపమివ్వడానికి మునుపు తన ఆలోచనలకి ఓ సామాజిక పరమైన లేకుంటే సిద్దాంతిక పరమైన కట్టుబాట్లని పెట్టుకుంటా డేమో? ఎందుకంటే ఆలోచనలని యదా తధంగా ప్రచురిస్తే అది ఒక ద్రౌపది లాంటి రచన ఐతే దాన్ని విశ్లేషించడానికి లేక విమర్శించ డానికి ఎల్లప్పుడూ జనం ముందు ఉండ వచ్చు. కాకుంటే అది ఒక రామాయణ విష వృక్షం అవ్వచ్చు.

ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Tuesday, February 2, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

బ్లాగ్ భాన్ధవులకి
నూతన సంవత్సర శుభాకాంక్షలతో

మీ
జిలేబి.

Monday, December 28, 2009

Sunday, December 27, 2009

లంగా రవిక కోక

తే నా లంగా అని తెలంగాణా లాగేసు కుంటే
కోక నాది అని కోన సీమ కోరితే
రవిక నాదని రాయలసీమ రాద్ధాంతం చేస్తే-
తెలుగు తల్లి నగ్న నాదం బిక్కు మొహం పెట్టి చూస్తోంటే-
సందులో సడేమియా అని మా తాత గారి సూదిలో దారం
"జ్యోతి" లా ప్రజ్వరిల్లుతూంటే-
ఆంద్ర దేశమా - ఇది కలికాలం సుమా!
నీ కేట్లాంటి కష్టాలు వచ్చేయి తెలుగు తల్లీ
ఓపిక పట్టు- కష్టాలు తొలగి పోయే రోజులు వస్తాయని

జిలేబి.

Saturday, December 19, 2009

మా పూరిల్లు మార్పులు చేర్పులు

అభివృద్ధి అన్నది ఎట్లా వస్తుంది? ఉన్నదానిని పడగొడితే దాని స్థానం లో పెద్ద భవంతి ని కట్టొచ్చు. ఉదాహరణకి మా ఇల్లు చాల పాత ఇల్లు. దీన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న సర్దుబాట్లతో ఇంకా ఓ నలభై లేక యాభై సంవత్సరాలు లాగించ వచ్చు. కాకపొతే ఖర్చులు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి - సంవత్సరానికో మారు జై తెలంగాణా అన్నట్టు. కాకుంటే ప్రతి ఐదు సంవత్సరాలకో మారు ఎన్నికలన్నట్టు. దానికి విరుద్ధం గా మన్నికగా మా ఇల్లు గట్టి గా ఇంకో వంద సంవత్సరాలు నిలబడాలంటే ఇంటిని నేల మట్టం చేసి కొత్త గా కడితే (మేస్త్రి లు కరెక్ట్ గా కడితే- సున్నం సిమెంటు మన్నికవైతే లాంటి నిబంధనలకి లోబడి) సాధించవచ్చు.

కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న ప్రస్తుత పరిస్థితి మా పూర్ ఇల్లు లానే ఉంది. దీనికి సమాధానం కొత్త ఇల్లా లేక సర్దుబాట్లతో ఇంటిని రిపైర్ చెయ్యడమా లాంటిది.

జిలేబి ఇంత సింపుల్ కాదు ఈ విషయం అంటారా- మా ఇంట్లో అమ్మదే పై చేయి. ఆమె ఎట్లా చెబితే అలానే నడుచు కోవాలి. మా అయ్య కి బొక్కసం నింపడం ఎట్లా గో తెలుసు కాని ఇంటిని నిలబెట్టడం విషయం లో పరిజ్ఞానం తక్కువ. కాకుంటే మా అయ్య వీధి లోని రామయ్యలన్దరితోనూ కూర్చొని గంటల తరబడి హరిత సమస్యల గురించి, ప్రపంచదేశాల సమస్యల గురించి అనర్గళం గా సంభాషించ గలడు- అంత మాత్రమే మా అయ్య సత్తా.

చీర్స్
జిలేబి.

నగరం లో సర్కస్!

ఫ్లైట్ నుంచి దిగబడి హమ్మయ్య మా భారత భూమి పై కాలు మోపాను అని సంతోషం పడి పోవడం ప్రతి భారత ప్రవాసి కి ఓ పిచ్చి ఆనందం ! ఆ ఆనందం ఓ రెండు మూడు రోజులలో హుష్ కాకి ఐపోయి "మా దేశం లో ఇట్లా - ఇక్కడ ఇట్లాంటి కంపరిసన్ కి దిగి పోవడం సర్వ సాధారణం!

అట్లాంటి బడుగు మధ్యతరగతి భారత ప్రవాసి మహానగర సందర్శనార్థం బయలు దేరడమునను ఆ హా మా దేశం ఏమి ఉన్నతి చెందింది- "ఇండియా షైనింగ్ " అంటే ఇదే కామోసు అన్న అధ్బుతమైన ఆలోచనతో సరే ఈ ఊరి బస్సు కూడా ఎక్కి చూసేద్దాం అన్న ఆలోచనకి వచ్చి బస్సు ఎక్కడమున్ను ఆ పై బస్సులో ఒఊపిరి ఆడక ( ఆ పాటి ఓ రోజుకే అల ముహం వేలాడ దీసుకుంటే ఎలా మరి- ఇదే దేశం లో ఈ కార్యక్రమం రోజువారి జరుగుతోందే మరి?) ఎందుకొచ్చిన నగర సందర్శనం రా బాబు అనుకోవడమూ కద్దు!

కాని ఈ మారు గమనించిన దానిలో విశేషం బెట్టి దంటే- నగరం లో దుకానులు కలర్ ఫుల్ గా ఐయిపోయీయి! బస్సులు ట్రాఫ్ఫిక్ అట్లాగే మరీ ఎక్కువై పోయేయి. అంటే దరిమిలా దేశానికి ఎ ఇన్ఫ్రా స్త్రక్తుర్ అన్నది ఎట్లా వస్తుందో తెలియకుండా పోయింది.

బస్సులలో చెవులకి ఎఅర్ ఫోన్ లు ఉన్నాయి. చేతుల్లో ఐపాడ్ ఉన్నాయి. జనాల చేతుల్లో తినడానికి జుంక్ ఫుడ్ బోల్డంత ఉంది. కాని రోజువారి ప్రయాణం లో పదనిసలు ఎప్పుడు సరిగమలు పాదతాయో ?


ఇది ఎ ఒక్క మహానగర దుర్భాగ్యం మాత్రం కాదనుకుంటా? అన్ని మహా నగరాల పరిస్థితి ఇంచు మించు ఇట్లా గే ఉన్నది. జనత సౌకర్యం గా పయనం చెయ్యలేక ప్రైవేటు వాహనాలు రోడ్ల పై ఎక్కువై అవి ఇంటి వటుడింతై అన్నట్టు గా ఇటు రోడ్ ని అటు ఫుట్ పాత్ లని అధిగమిస్తూ సర్కస్ చేస్తూ పోతూంటే- ఓ భారత దేశమా - ప్రగతి కి నిర్వచనం ఎక్కడ ఉన్నది?

జన ప్రభంజనం లో మహా ప్రవాహ వాహినిలో కొట్టుకు పోతున్న దేశమా - కాస్త నిలిచి జనాలకి ఎట్లాంటి సౌకర్యం ఇవ్వాలని అనుకుంటున్నావో ఓ మారు ఆలోచించు అని అనుకోకుండా మానుకోడు సామాన్య మానవుడు!

అయినా దేశం ఇట్లాంటి సమస్యల ప్రవాహాన్ని పట్టించుకోదు! పట్టించు కావలసినవి చాల ఉన్నాయి- ఉదాహరణకి రాష్ట్ర విభజన లాంటి నిఖార్సైన విషయాలు!

మీరేమంటారు? తెలుసు లెండి సామాన్య మానవులం మరి- ఇట్లాంటి విషయాలు పట్టించుకుంటే- మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి చూసీ చూడకుండా వెళ్లి పోవడం మన ఆరోగ్యానికి క్షేమ కరం!

జిలేబి.