Tuesday, October 18, 2016

మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 2

 
మకుటా రామ - వయాంగ్ కులిత్ - Legacy of Rama's Crown-భాగం - 2


మొదటి అంకం

క ఏక అధి దశ పూర్వ ? అంటూ ఈ అంకం మొదలవు తుంది. శూన్యం నించి ఆవిర్భవించింది అంతా అంటూ మొదలయి హస్తిన వర్ణన  ఉంటుంది. విశేషం ఏమిటంటే హస్తిన కి నౌకా తీరం ఉండటం !  (జావా ద్వీపం కాబట్టి హస్తిన క్కూడా తీరం వచ్చి ఉండ వచ్చు).

దుర్యోధన, ద్రోణ, సంగ్కుని, కార్తమరామ ల మధ్య సంభాషణ - టూకీ గా - దుర్యోధనునికి వచ్చిన కలలో దేవతలు శ్రీ రాముల వారి మకుటాన్ని - వారి పరిపాలనా దక్షత సిద్దాంతాన్ని ఈ భారత కాలం లో ప్రసాదించ డానికి ఒక తపస్వి వేచి ఉన్నాడు. ఎవరికైతే అర్హత ఉన్నదో వారికది లభ్యం అవుతుందని కల. ఈ విషయమై, మిగిలిన వాళ్ళ అభిప్రాయాలని కోరడానికి దుర్యోధనుడు ద్రోణుని మొదట తన అభిప్రాయం అడుగుతాడు.

ద్రోణుడు కూడా తానూ అట్లాంటి విషయం గురించి విని ఉన్నాడని ఆనతి కాలం లో నే ఇట్లాంటి వరమివ్వడం జరుగుతుందని దానికై ఎవరికైతే అర్హత ఉన్నదో వారి కి అది లభ్యమవు తుందని అంటాడు.

అట్లాంటి వరాన్ని ఎట్లా పొందడం ఎట్లా దాన్ని కాపాడు కోవడం అని సంగ్కుని అడగటం దానికి జవాబు గా ద్రోణుడు వరమంటే ఏమిటి అని చెప్పడం తో సంగ్కుని అడుగుతాడు కౌరవుల కి దాన్ని పొందే అర్హత ఉందా అని.

దానికి సమాధానం గా ద్రోణుడు తాను విన్నది 'సంబివర' వ్యాపారులు (దేశాటనం చేస్త్తూ వ్యాపారం చేసు కునే వాళ్ళు ?) అనుకుంటున్నది చెబ్తాడు - పాండవ మధ్యముడు 'జనకుడు', తన దేశమైన (ఇలాకా ? ) మధుకర ని వీడి  ఏదో యాత్ర కి బయలు దేరాడని, జనకుడు యాత్రకి బయలు దేరితే ఖచ్చితం గా అది ఇట్లాంటి ఏదో వరం కోసమే అయ్యుంటుందని అంటాడు .

ఆ పై మరో సంభాషణ సంగ్కుని కి ద్రోణుని కి మధ్య - జనకుడు ప్రయత్నిస్తున్నాడు అంటే అది మనకు దక్కడం కష్ట మేమో అన్న సందేహానికి , ప్రయత్నం ఉంటే మానవుడు దేన్నైనా సాధించ గలుగు తాడు అంటూ ద్రోణుడు సుదీర్ఘ వివరణ ఇస్తాడు - > సూక్ష్మం గా -> కర్మ సిద్దాంతం; శరణాగతి; 

ఈ ఉద్బోధ విన్నాక దుర్యోధనుడు తను ఆ ప్రయత్నం చేస్తా నంటే, సంగ్కుని రాజకీయ చతురుడు దుర్యోధనుడు కాకుండా వేరే ఎవరైనా అర్జునుని కి సమ ఉజ్జీ వెళ్ళా లని అంటాడు ( దుర్యోధనుడు వెళ్లి పరాభవం చెందితే అది బాగోదు - రాజకీయ చతురత ).

అర్జునిని సమ ఉజ్జీ ఐన బసుకర్ణ ని పంపించాలని నిర్ణయం జరుగుతుంది.

రెండవ అంకం -

ఈ రెండవ అంకం లో కర్ణుడు దుర్యోధన సంభాషణ - దుర్యాపుర అరణ్య ప్రాంతం లో కుంతరుంగు పర్వత శ్రేణి లో శ్వేల గిరి (శ్వేత గిరి? ) ముని వాటిక లో కేశవ సిద్ధి మౌని రాముని మకుటాన్ని ఈ తరానికి చేర్చటానికి వేచి ఉన్నాడు.

కర్ణుడు వెళ్లి ఆ వరాన్ని పొంది రావాలి. కర్ణుడు తాను దుర్యోధనుడి సేవకుడనై ఆ కార్యాన్ని సాధించు కొని వస్తా నంటాడు.

ఈ మొదటి అంకం లో వచ్చిన ఒక సులుకోన్ (శ్లోకం ) -  బానువతి - దుర్యోధనులు వనం లో సేద దీరుతున్నా రన్న అర్థం లో ఉన్నది . (కథకి సులుకోన్ కి సంబంధం ఉండదు).

ఛందం - శార్దూల విక్రీడితం - సంస్కృత + పురాతన జావా కలయిక; కొన్ని పదాలు అర్థ మవుతాయి ; కొన్ని కాలేదు; చదివింది ఆంగ్లం లో ; కాబట్టి ఛందస్సు సాఫ్ట్వేర్ ని బట్టి  పరిష్కరించింది (తప్పొప్పులు ఉండ వచ్చు );

ఇది భారత యుద్ధ అన్న జావా భారత కథ - Canto V, Verse 1- (1157- CE of King Jayabaya Kediri కాలం నాటిదట ఈ భారత యుద్ధ అన్న గ్రంథం ) నించి సంగ్రహింప బడినది.


శార్దూల విక్రీడితం (లంపా 19 )

లెంగ్ లెంగ్ రమ్యనికం శశాంక కుమెనీర్మంగ్రెంఘరూమింగ్పురీ !
మంగ్కిన్ తన్ పసిరింఘ్ హలేప్ని కయుమా మస్ లిర్ మురుబ్ యింగ్లఘిత్
తేక్వన్ సర్వ మణీక్ తవింజ్ఞ సినవుంగ్సాక్షాత్సెకార్సీనుజీ
ఉంగ్యాన్ బానువతీ వనాంరె మలెగెన్ లన్ నాథ దుర్యోధనా !
 


ఆంగ్లం లో చదివినది - మీకు వేరే ఏదయినా స్ఫురిస్తే తెలియ జేయ గలరు !


Leng-leng ramya ningkang sasangka kumenyar mangrengga ruming puri
Mangkin tanpa siring halep nikang umah mas lir murub ing langit
Tekwan sarvwa manik tawingenya sinawung saksat sekar sinuji ;
Unggyan Banuwati, ywan amrem alengen, lan Nata Duryudana

Lagu Sardoola Wikridhita (lampha 19) form
From Baratayuda (canto V, verse1), a kekawin poem in Old Jawanese by mpu Sedhah and mpu Panuluh
circa 1157, era of King Jayabaya Kediri.

Meaning- The moon's enchanting radiance so enhanced the splendor of the palace, that the golden pavilion which seemed to flare into the sky was now quite beyond compare. Its walls, moreover, were formed of various jewels strung together like embroidered flowers.  It was here that Banuwati and King Duryudana lay sleeping, enraptured by love.


(సశేషం) 

Monday, October 17, 2016

మకుటా రామ ! - వయాంగ్ కులిత్ - The Legacy of Rama's Crown - భాగం - 1

 
 
మకుటా రామ ! -
 
The Legacy of Rama's Crown
 
వయాంగ్ కులిత్

ఉపోద్ఘాతం -

మన దేశం లోని తోలు బొమ్మలాట లాంటిది ఇండోనేషియా లోని వయాంగ్ కులిత్ (Wayang Kulit).

ఈ వయాంగ్ కులిత్ జావా సంస్కృతి కి సంబంధించినది. జావా, బాలీ ద్వీప సమూహం లో ఇప్పటికి బతికి న సంస్కృతికి ప్రతీక. United Nations declared this as an World Heritage to be preserved.

జావా ద్వీప జనబాహుళ్యం లో ఉన్న నమ్మిక  ప్రకారం జావా లో సంతతి పరీక్షిత్ వారసులు గా చెప్పుకోవడం కద్దు.

వీరి పురాతన భారత యుద్ధ - భారత కథ సుమారు పది/పదకొండో శతాబ్దం లో వ్రాయ బడింది. ఇది పురాతన జావా భాష లో వ్రాయ బడింది. ఈ శైలి ని కాకవిన్ అంటారు (ట!). (Ka Kawin or Ke Kawin).

ఈ వయాంగ్ కులిత్ లో ముఖ్యం గా భారత దేశపు భారత రామాయణం లో నించి వచ్చే పాత్రల తో తోలు బొమ్మలాట ఉంటుంది.

మధ్య మధ్య లో సులుకున్ (శ్లోకం ? ) అంటూ సంస్కృత, పురాతన జావా పద జాలం కలిసిన వి కనబడతాయి. (ఇవి ఛందో బద్దం గా ఉండటం విశేషం ) 

ఒక రాత్రి మొత్తం (సుమారు ఆరు గంటల పాటు ) సాగుతుందట ఈ తోలు బొమ్మ లాట.

అట్లాంటి ప్రదర్శన లో ఒకటి మకుటా రామ !.

రాముని కిరీటం  అన్న కథా వస్తువు ఆధారం గా మహా భారత కాలపు నాయకుల ను పెట్టుకుని నీతి , సంస్కృతి , మంచీ చెడ్డా చెప్పు కునే టట్లు ఉంటుంది.

ఈ ఆట లో ముఖ్య పాత్రలు

అర్జునుడు - ఇతనికున్న యితర పేరు మన భారత దేశం లో లేనిది(నాకు తెలిసినంత వరకు)   -  జనకుడు . . జ్లామ్ప్రోంగ్ ; మార్గన; పెర్మది (పెర్మది, జ్లామ్ప్రోంగ్ జావా పేర్ల లా ఉన్నాయి).

సాదేవ (సహదేవుడు); నకుల;

శకుని - సంగ్కుని అన్న పేరు తో ఉన్నాడు !

ధర్మ రాజు - పుంత దేవ అన్న పేరుతో కనబడ తాడు.

దుర్యోధనుడు - మరో పేరు - జగపితాన ; (జగత్పిత ?)

దుర్సాసన (దుశ్శాసనుడు) ; కార్తమరామ ; చిత్రాక్ష ; చిత్రాక్షి; దుర్మగతి   (కౌరవ సంతానం ) - చిత్రాక్ష, చిత్రాక్షి కవలలు (మగ వారు).

బాణోవతి -   దుర్యోధనుని భార్య భానుమతి  వీరి ప్రకారం బాణోవతి !

లెక్ష్మణవతి - లక్ష్మణ - దుర్యోధనుని కూతురు;

దుర్ణ (ద్రోణ)- ఇతర పేరులు - ద్విజ వర ; కుంభాయన ;

భీష్మ- గంగా దత్త  ;

అశ్వత్థామ ;

కర్ణుడు - యితని యితర పేర్లు - సూర్యపుత్ర; సూర్యాత్మజ ; బసు కర్ణ;

అర్జుని భార్య సుభద్ర కు వీరి ప్రకారం పేరు సెంబద్ర ; మరో పేరు లారా ఇరెంగ్ ! ; సింతవక - సెంబద్ర మగ వేషం లో మారినప్పుడు పేరు; (ఎందుకు మారింది ? కథా విషయం లో కి వెళితే తెలుస్తుంది :))

నారద  - (నారదుల వారు లేకుంటే కథ ఎట్లా మరి !)

భీమసేనుడు; ఇతని యితర పేరులు - భ్రాతసేన ; ఆర్యసేన;

మహంబీర ! - గరుడుడు ( గరుడ లేకుంటే మరి ఇండోనేషియా ఎట్లా ! ) ;


క్రేస్న - కృష్ణ - హరిమూర్తి ;

ఈ తోలు బొమ్మ లాట లో రామాయణ కాలానికి చెందిన వాళ్ళూ కనడతారు -

విభీషణుడు- మరో పేరు గుణవాన్ ;

విభీషణుడి కొడుకు - భీషవర్ణ ;

కుంభకర్ణుడు ; అతని భార్య కిశ్వణి ! (కుంభకర్ణుడి భార్య పేరు మొదటి సారి వినడం!) ;

అనోమోన్ - హనుమాన్ - మన హనుమంతుల వారు .

వాయు సంతానం గా, హనుమాన్ వారితో బాటు జాజల్వ్రేక (అసురుడు) ; కువర - పాము; సితుబంద - ఏనుగు;


కేశవసిద్ధి - తపస్వి - రామ మకుటాన్ని భారత కాలం లో వారికి అంద జేయ డానికి వేచి ఉన్న  తపస్వి.

లింబుక , చంగిక - వీళ్ళు కామెడి ట్రాక్ - లంబూ జంబూ లాగా అన్న మాట ! (మాయా బజార్ గుర్తొస్తుందా? )

సరే కథాక్రమం బెట్టిదన !

(సశేషం!)

Thursday, October 13, 2016

కనులెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)


 
 
 
కనులెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)
 
అరచూపు! వాలుచూపు బె
దురు చూపు కొరకొర చూపెదురుచూపు జిలే
బి రుసరుస చూపు తా కను
లెరుపు వెనకచూపు మనసు లేమార్చును బో :)
 
చీర్స్
జిలేబి
 






Saturday, October 8, 2016

సరస్వతీ నమస్తుభ్యం !

 
సరస్వతీ నమస్తుభ్యం !
 
 

చిత్రం - శ్రీ కేశవ్ - ది హిందూ దినపత్రిక కార్టూనిస్ట్
 
 
పలుకుల తల్లి ! మినుకుగొ
మ్మ!లచ్చి కోడలు ! జిలేబి మాటలబోటీ !
నిలచితి వమ్మ ! జనులమన
ముల మేలగు రీతిగాను ముంగటి రమణీ !
 
జిలేబి


Friday, October 7, 2016

అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు !


విజయ దశమి శుభాకాంక్షలతో


చిత్రం - శ్రీ కేశవ్ - హిందూ దినపత్రిక కార్టూనిస్ట్

జిలేబి

Wednesday, October 5, 2016

వై నాటీజ్ మై క్వొశ్చెన్ !

 
 
వైనాటీజ్ మై క్వొశ్చెన్ !


పుల్లెల శ్యామ్ గారి మణిప్రవాళ కందం
ఆంధ్రామృతం బ్లాగు లో చదివాక !


శ్యామ్ గారి కందం :-

ఐ నో సమాఫ్ద పీపుల్
మే నాటెంజాయ్ ద తెలుగు మీటరినింగ్లీష్
వై నాటీజ్ మై క్వొశ్చెన్
హౌ నై సీజ్ దట్ రిథం యిననదర్ లాంగ్వేజ్ !


జిలేబి సరదా జవాబు :)


వైనా టీజ్ దై క్వొశ్చెన్ !
ఐనో బట్యిఫయిటెల్యు ఐవిల్ బీస్మాష్డ్ :) 
ఫైనర్ దస్కిల్ గోస్ సర్ 
ఫైనర్ వి బికం ద తెలుగు ఫైర్బ్రాండ్ దట్జ్ వై :)

చీర్స్
జిలేబి
(వెరీ నాటీ :)

Saturday, October 1, 2016

ఫర్జు నిభాయించెను భళి భళిరా మోడీ !


ఫర్జు నిభాయించెను భళి భళిరా మోడీ !
 

ఫోటో : కర్టసీ : ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్
 
సర్జిక లాప్రేషన్లన్
గర్జించెను, భరతదేశ ఘనతయు గూడన్
తర్జని జూపగ నార్మీ,
ఫర్జు నిభాయించెను భళి భళిరా మోడీ !
 
 
 
చీర్స్
జిలేబి  

Wednesday, September 28, 2016

పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !


పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
 
 
 
తరచూ హరి తానొక్కటి
ని రమించుచు కోరుచు కమనీయంబుగన
న్నరసియు సొలసియు వేరొక
పరమును గాంచెను జిలేబి పరమావధిగన్ !
 
 
చీర్స్
జిలేబి

Tuesday, September 27, 2016

శరముల సారింతునోయి సమరసము గనన్ !


గీతోపదేశం !

 
Painting - Courtesy- Shri Keshav of The Hindu Fame
 
ముందు:
 
హరివిల్లువలె మనమ్ము స
మరసము గానవలెనుగద !  మైత్రీం భజరే !
గరళంబు కత్తికట్టుట!
శరముల సారింపగ హృది సరియన లేదే !
 
తరువాయి :
 
హరి! విల్లువలె మనమ్ము ను
సరి జేసెదనోయి మేలు  సఖుడా ! కృష్ణా !
గరళం బైనన్ త్రాగెద ! 
శరముల సారింతునోయి సమరసము గనన్
 
 
 
శుభోదయం
జిలేబి

Sunday, September 11, 2016

సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !


సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !
 
 
రుజుమాటల నాడుచు చ
ట్టు జబ్బలను బట్టి వెనుక టుప్పని బేల్చున్
:)
నిజమును పలుకగ తగదూ !
సుజనులకు వలదు జిలేబి చురకల పలుకుల్ !
 
 
శుభోదయం
జిలేబి

Monday, September 5, 2016

వినాయక చవితి జిలేబి శుభాకాంక్షలు !

వినాయక చవితి జిలేబి శుభాకాంక్షలు !





న్యూస్ కర్టసీ  :_ ఈనాడు న్యూస్  "మింటిన" వారు  - సిరిలేనివాసు :)

ముంబయి: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు రకరకాల పదార్థాలు ఉపయోగించి వినూత్నంగా బొజ్జ గణపయ్యలను తయారు చేస్తారు. మట్టి, బియ్యం, చాక్‌పీస్‌, ఛాక్లెట్‌లు ఇలా రకరకాల వాటితో చేసినవి చూస్తూనే ఉంటాం. కాని ముంబయికి చెందిన కొందరు కళాకారులు జిలేబీల గణపయ్యను తయారు చేశారు. పసుపు రంగులో ఉన్న ఈ జిలేబీల గణనాథుడు సందర్శకులను తెగ ఆకట్టుకుంటుంది. సోమవారం వినాయకచవితి సందర్భంగా ముంబయిలోని ఓ వీధిలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.


బ్లాగ్ వీక్షకులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు !

వార్తా ప్రదాత శ్రీ సిరిలేని వాసుల వారికి నెనర్లు !


గణపతి జిలేబి బప్పా !
ననుదినము కొలుతుము మంచి నడతయు గనగన్
వినుమా విన్నప మిదియే !
జనులందరిని గనవయ్య చక్కగ నీవే !



శుభోదయం
జిలేబి 

Wednesday, August 31, 2016

అత్యధిక ఆశావహ రాష్ట్రం గా తెలంగాణ - చీర్స్ !

అత్యధిక ఆశావహ రాష్ట్రం గా తెలంగాణ - చీర్స్ !

 
అత్యధికాశావహ రా
ష్ట్రాద్యాత్ప్రథమ తెలగాణ షాన్దారు బడసెన్ !
విద్యా వైద్యంబైటీ
సద్యో జాతపు జిలేబి సాధన గనుమా !
 
త్రీ చీర్స్ టు తెలంగాణా !
 
జిలేబి  
 

Monday, August 29, 2016

The Mathematics of కందం !

The Mathematics of కందం !

ఈ మధ్య  "A Beautiful Question" (Finding Nature's Deep Design- by Frank Wilczek-winner of the nobel prize in Physics) పుస్తకం చదువుతూంటే ఔరా ప్రకృతి గణిత మయం మాయం అనిపించే సింది !




ఈ మధ్య ముప్పావు సంవత్సరం పాటు ఊపులో శంకరాభారణ బ్లాగు లో చేస్తున్న సవారి , నేర్చుకుంటున్న (అనుకుంటున్నా :) వి, ఆ పై గురుళ్ళ సైడు కిక్కులు, (అకటా వికటాలు :) , అనానిమస్సు ల చీవాట్లు, చింపిరి హవా జుట్లు  , దాంతో బ్లాగు లోకం లో 'గండర' గోళం మీద పడి రచ్చ చేయటం అన్నింటి మధ్యా నెవర్ గివ్ అప్ జిలేబి అనుకుంటూ ఈ కంద పద్యం తెలుగు లో ఎందు కంత పాప్యులర్ అయిపోయిందబ్బా అని ఒకింత దాంతో తలే ఉంగలీ దబాయించ కుండా ఉండక పోయా !


పై పుస్తకం చదువుతూంటే కందం లో ని మేథమేటిక్స్ దీనికి కారణ మయి ఉంటుందే మో అనిపించింది.

ఛందస్సు లో గణితం తప్పక ఉంది. (మూలం లోకి వెళితే ) కందం కూడా అందులో భాగమే  ; కాని దీనికి గలిగినంత ప్రాముఖ్యత మిగిలిన వాటికి లేక పోవడం అనడం కన్నా ఇందులో ఉన్న సౌలభ్యం మిగిలిన వాటి లో లేక పోవడం ( ఆటవెలది, తేట గీతి కి ఉన్న సౌలభ్యం వదిలేస్తే ) మూల కారణం అరవై నాలుగు అన్న మేజిక్ నంబర్ అనుకున్నా !

గురు లఘు మాత్రలు మొత్తం వెరసి కందం లో అరవై నాలుగు . ఈ అరవై నాలుగు మధురగతి రగడ లో కూడా కనిపిస్తుంది. అయినా కందం టాప్స్ అండ్ రాక్స్ :)

మొదటి, మూడవ పాదం లో పన్నెండు మాత్రలు , రెండు నాల్గవ పాదం లో ఇరవై మాత్రలు మొత్తం కలిపి 12+20+12+20 = 64.

ఈ పన్నెండు ఇరవై కి 3:5 నిష్పత్తి మరో విశేషం ( సమత లేక పోవడం );

మధుర గతి రగడ లో అయితే సమతుల్యత దీనికన్నా ఎక్కువ ప్రతి పాదం లోనూ 16 ! అయినా దానికి ఇంత ప్రాచుర్యం లేదు !

ఈ అరవై నాలుగు ఒక మేజిక్ సంఖ్యే ! అరవై నాలుగు కళలు అంటాం ;

కందం లో ఉన్న not so even distribution (12,20) కూడా ఈ ప్రాముఖ్యత కి కారణం అయ్యుంటుందేమో మరి !

ఆ పై ఈ అరవై నాలుగు మాత్రలకి కొంత యతి ప్రాస కలిపి, ఆ పై జగణం పొజిషన్ ఖచ్చితం గా ఎక్కడ ఉండాలో చెప్పటం లాంటి నిర్దుష్టత తో  పటిష్టం చేయటం  (మధుర గతి రగడ లో దీనికన్నా ఇంకొంచెం పటిష్టత ఎక్కవే - అంత్యానుప్రాస కూడా ఉంది ) దీనికి సొబగు దక్కినట్టుంది !

మొత్తం మీద నాటి చందోకారుల మేథస్సు తీక్షణత కి యిది ప్రతీక అనుకోవచ్చు. కందం పొందిక దీనికి ఉదాహరణ !

సో నేటి కందం కందం :)

అరుబది నాల్గు కళలవలె
అరుబది నాల్గనగ మాత్ర లా కందంబూ !
పరిపరి విధముగ పదముల
సరితూకంబు గణితంబు చక్కగ కలిసెన్!



ముప్పది రెండుకు రెండుగ
నొప్పిన కందము జిలేబి నొకపరి గనుమా
అబ్బురమగు పదబంధము
అప్పటి కవుల గణితంబు అద్భుతము గదా !

చీర్స్
జిలేబి

Saturday, August 27, 2016

భాగ్య దా లక్ష్మీ బారమ్మా !

భాగ్య దా లక్ష్మీ బారమ్మా !

క్రితం రోజు వేణువు గారు సరి కొత్త గాయని (Young Budding Upcoming Artist) సూర్య గాయత్రి ని పరిచయం చేసారు.

అద్భుతః అనుకోకుండా ఉండ లేక పోయా !

అంత చిన్ని వయసులో ఆ స్వర మాధుర్యం అమోఘం ! (పదకొండు పన్నెండు సంవత్సారాల ప్రాయం ? ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ! కేరళ అమ్మాయి . తండ్రి మృదంగ విద్వాంసుడు ; తల్లి గృహిణి. వడకర ఉత్తర కేరళ రాష్ట్రం నివాసం !

ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అన్న సోషియల్ మీడియా థీం తో వెలుగు లోకి వచ్చిన మరో ఆణి ముత్యం .

మరో ఎం ఎస్ దేశానికి వస్తున్నారా ? ప్రకృతి ప్రసాదించిన వరమా మన దేశానికి అన్నట్టున్న స్వరం.

ఈ అమ్మాయి పాట భాగ్యదా లక్ష్మీ బారమ్మా !



త్రీ చీర్స్ టు సూర్య గాయత్రి అండ్ వారి గురువు గారు కులదీప్ పాయ్ గారికి
 
చీర్స్
జిలేబి

 

Thursday, August 25, 2016

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు !

 
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు !  





చిత్రం : కర్టసీ - కేశవ్ ఆఫ్ అవర్ హిందూ ఫేమ్ !
 
 
కృష్ణం వందే జగద్గురుమ్ !

అమవసి శశివదన ! మురా
రి మహిని భవహరముగ నొనరించిన వనమా
లి! మరిమరి కొలుతు మయ్యా
సుమగురు ద్రఢిమను గనంగ శుభముల బడయన్

జిలేబి
 

Friday, August 19, 2016

కారాగారపు టపాలు కనకన మనవోయ్ !



కారాగారపు టపాలు కనకన మనవోయ్ !


పారా హుషారు సారూ
కారాగారపు టపాలు కనకన మనవోయ్ !
వీరావేశము వలదోయ్
బారా తలుపులు తెరువుము  బాగుగ మనవోయ్ !



చీర్స్
జిలేబి
 

Wednesday, August 17, 2016

శ్మశాన వాటిక లో జిలేబి


శ్మశాన వాటిక లో జిలేబి



ఫోటో కర్టసీ : ది హిందూ దినపత్రిక - 16 ఆగస్ట్ 2016

నిన్న మా హిందూ వారు తమిళ నాడు ఎడిషన్ లో ఒక ముఖ్యమైన సమాజం లో మార్పు గాన వచ్చు రీతి లో ని ఒక వార్త ను ప్రచురించారు .

తమిళ నాడు ప్రభుత్వం ఒక జిలేబి కి కల్పనా చావ్లా అవార్డు బహుకరించింది . కారణం ?

శ్మశాన వాటిక శివుని కే సొత్తు. మహిళలు అక్కడికి వెళ్ళడం లో నూ (ఆఖరికి అందరూ అక్కడి కే వెళ్ళినా ) సమాజ పరమైన నిషేధాలు ఉన్నాయి .

అయినా వాటి నన్నిటిని అధిగమించి ఒక జయంతి (ఈవిడా జగణమే - జిలేబి లా :)
శ్మశాన వాటిక కేర్ టేకర్ రూపం లో ఉద్యోగ బాధ్యత లను తీసు కోవడానికి పూనుకొంది.

జేజేలు .

గగనానికి ఎగిరినా ఆఖరుకి శ్మశానానికి గూడా వెరవమంటూ శ్మశాన వాటిక లో ఇంచార్జ్ గా ఈ జయంతి ఉద్యోగం లో చేరడానికి కారణ మైన విషయం ఏమిటి ?

ఆవిడ, ఆవిడ సోదరి యిద్దరూ ఆడువారు. తండ్రి చని పోయినప్పుడు దహన కార్య క్రమాలకి ఆవిడ తన కజిన్స్ మీద ఆధార పడ వలసి వచ్చింది, ఇబ్బందుల నెదురు కోవాల్సి వచ్చింది. 

అందులో నించి పుట్టినదీ జాగృతి ఆలోచనా స్రవంతి .

ఆ జిలేబి కి శుభాకాంక్షల తో !

ఫోటో కర్టసీ మా హిందూ వారు.

పూర్తి నిడివి వ్యాసం  లింకు


చీర్స్ టు జయంతి
జిలేబి

Friday, August 12, 2016

ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక ! జిలేబీయం

ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో కష్టే ఫలే కబుర్లు ధారావాహిక !

గురుడు కన్యారాశి లో ప్రవేశిస్తున్న ఈ శుభ దినాన బ్లాగు లోకపు వారి సౌలభ్యం కోసం ప్రైవేట్ అయిన బ్లాగు నించి కష్టే ఫలే వారి టపాలు జిలేబి బ్లాగు ఓ ఫ్యాన్ ఆర్ట్ విత్ జేకే జిలేబీయం లో ధారా వాహిక గా రాబోతోందని తెలియ జేయడానికి సంతోషిస్తున్నా !

తెలుగు వారి పంచ దశ లోకమనబడు ఈ బ్లాగు లోకం లో కష్టే ఫలే వారి ని వారి టపా మాధుర్యాన్ని తెలియని వాళ్ళు ఉండరని అంటే అతి శయోక్తి కాదు; కాని ఈ మధ్య వారి బ్లాగు సెలెక్టివ్ ఇంటలిజెంషియా వారికి మాత్రమె పరిమిత మై పోవడం తో వారి టపాలని తెలుగు వాళ్ళందరూ చదవడానికి సౌకర్యం లేకుండా పోయింది (ముఖ్యం గా జిలేబి చదవడానికి :))

కాబట్టి వారి టపా మాధుర్యాన్ని గూగల్ సెర్చ్ లో మళ్ళీ కనబడేలా చేయడానికి ఈ పునర్బ్లాగీకరణం చేయడం జరుగుతోంది; వారి పేరు మీదనే ఈ టపాలన్నీ ప్రచురించ బడతాయి  ;

అందరికి ఉపయోగ పడుతందని ఆశిస్తో !

మొదటి టపా కై ఓ ఫ్యాన్ ఆర్ట్ విత్ జేకే జిలేబీయం లో వచ్చిన టపా !


— శర్మ కాలక్షేపం కబుర్లు—
Posted on సెప్టెంబర్ 23, 2011 

గురు, దైవ వందనం

 కన్న తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు. పెంచిన తల్లి తండ్రులకు సాష్టాంగ దండ ప్రణామాలు.
అడుక్కునైనా చదువుకోమన్న శ్రీ దేవరభట్ల రామా రావు గారికి నమస్కారాలు. శ్రీ. చెఱుకుపల్లి హనుమత్ కవిరాట్ లక్ష్మణశాస్త్రిగారికి, జోస్యుల వేకట నరసింహంగారికి, సమయపాలన నేర్పిన వర్రె అప్పలరాజు మాస్టరికి, తెలుగు మాస్టారు సుబ్రహ్మణ్యంగారికి, జాన్ మాస్టారికి వందనములు.

నేటి కాలంలో బోధగురువులు శ్రీచాగంటి కోటేశ్వర రావుగారికి నమస్కారం. తెలుగు వ్రాయడానికి తన బ్లాగు ద్వారా సహకారం అందించిన శ్రీభైరవభట్ల కామేశ్వర రావు గారికి నమస్కారం. నాలుగు తెలుగు అక్షరాలు తప్పులేకుండా వ్రాయడం వచ్చినంతనే బ్లాగు వ్రాయమని ప్రొత్సహించిన భమిడిపాటి ఫణిబాబుగారికి వందనం. ఏందరో మహానుభావులు అందరికీ వందనం.

పూర్తి గా చదవడానికి రాబోవు టపాలు చదవడానికి ఈ లింకు నొక్కవలె


శుభోదయం
జిలేబి
 

Saturday, July 30, 2016

సదనపు విషయముల పైన చతురత జేర్చన్ !



 
 
 
సుధయొప్పె సుధా కుండలి
క!ధన్యమయ్యెను జిలేబి! కదనము జేయన్
పదముల బేర్చెను; జగణము
సదనపు విషయముల పైన చతురత జేర్చెన్


చీర్స్
జిలేబి

Wednesday, July 27, 2016

ప్రైవేట్ బ్లాగ్గిరి -గిరిగిరి జిలేబీయం :)

ప్రైవేట్ బ్లాగ్గిరి -గిరిగిరి జిలేబీయం :)


అయ్యరు వాళ్ ! అంటూ పిలిచా;

ఎందుకోయ్ అట్లా అరుస్తున్నావ్ ? పక్కనే గా ఉన్నా ? అయ్యరు గారు అదిరిపడి హిందూ పేపరు నించి తల బయట పెట్టి చూసారు.

అబ్బబ్బ ! మీ కెప్పుడూ ఆ పనిలేని నసలేని హిందూ పేపరే నా ? నా మాట వినరుస్మీ అన్నా విసుక్కుంటూ .

అబ్బే ! జిలేబి నీ మాట వినక బోవట మేమిటి ? బ్లాగ్ లోకం కోడై కూస్తోంది కదా నీ గురించి ;

హిందూ పేపర్ లో అదీ వచ్చే సిందీ ? హాశ్చర్య పోయా !

లేదులే ! నిన్న రాత్రి నిద్రలో నువ్వే ఏదో మాట్లడేసు కుంటూ ఉంటేనూ ?

ఏమని మాట్లా డా నండీ ?

గాంధీ గిరి - దాదాగిరి ప్రైవేట్ బ్లాగ్గిరి  అంటూ గిర గిర తిరిగి పోతూంటే నూ ?

ప్రైవేట్ బ్లాగ్గిరి అన్నానా :! దాంతో తలే ఉంగళీ దబాయా మైనే !

అవునోయ్ ! కాఫీ ఏమన్నా కావాలా నిద్ర మత్తు వదల టానికి !

అయ్యరు వాళ్ మీ చేత్తో కాఫీ ఇస్తే నేనెప్పుడైనా వద్దంటానా ? మారాము బోయా !


***

అయ్యరు వాళ్ అట్లా కాఫీ పెట్టటానికి కిచెను గదిలోకి వెళుతూ నే జిలేబి బ్లాగు మూట విప్పి

గిరిగిరి బ్లాగ్గిరి ప్రైవేట్ బ్లాగ్గిరి చుట్టూ తా చుట్ట సాగింది !


ఏదో చెప్పండి చూద్దాం వేగం గా ఈ వాక్యాన్ని

గిరిగిరి గిరి ప్రైవేట్ బ్లాగ్గిరి గిరి గిరిగిరి గిరీ :)



ఈ రోజు జిలేబి కి ఏమి వాయింపులు ఉంటా యో యేమో ! :)

చీర్స్
జిలేబి
అతి త్వరలో జిలేబి కూడా  ప్రైవేట్ అయిపోతూంది :)