రంగ నాయకమ్మ మహాభారత పరిచయం - జిలేబి వీర వాయింపు !
ఈ శీర్షిక మీద టపా కట్ట కూడదను కున్నా !
కానీ ఎవరికి వారు మన పురాణాల మీద (సో కాల్డ్ ఈ కాలం లో సులభం గా చెప్పే ఊత పదమైన 'పుక్కిటి' పురాణా ల మీద !) తమ తమ 'వికృతాభిప్రాయములను' తెలియ బరిచే టప్పు డు జిలేబి నువ్వు మాత్రం ఎందుకు తెలియ జేయ కూడదు నీ అభిప్రాయాలని అని మనస్సులో బీ లే జీ ని వదిలి పెట్టు అన్న ఒక 'సత్' సంకల్పం కలిగింది .
(సత్ సంకల్పం అంటే మంచి ఆలోచన అని అర్థం చేసు కోవచ్చు - ఇందులో 'హిందూ త్వం' ఏమీ లేదు - విధవా అంటే తిట్టూ, విడో అంటే పొగడ్త అనుకునే కాలం లో మనం ఉన్నాం కాబట్టి ఈ వివరణ!)
ఒక రామాయణా న్నో, ఒక మహా భార తాన్నో 'భరతం' పట్టిస్తా అని నిర్ణయిం చు కున్నప్పుడు దాని ఒరిజినల్ వెర్షన్ చదివి వీర వాయింపు చేస్తే అది స్వంతం గా ఆలోచించి స్వంతమైన అభిప్రాయాలని చెప్పినట్టు అవుతుంది .
చాలా కాలం మునుపు రామాయణ కల్ప వృక్షం వచ్చినప్పుడు దానికి రిటార్టు గా రామాయణ విష వృక్షం కూడా వచ్చింది .
ఓరీ మనావిడ, విష వృక్షం అంటోంది కదా సరే పోనీ చదివి ఏడుస్తామని నిర్ణయిం చేసు కుని చదివి ఏడిస్తే , యాక్కు అని వాంతి వచ్చే పని అయ్యింది
భూతద్దం పెట్టి మరీ ప్రతి మాట కి వికృతా ర్థం తీయాలంటే తీయ వచ్చు ! అట్లాంటి ఒక రచన గా నాకు ఈ రంగ నాయకమ్మ గారి సో కాల్డ్ వివరణ అనిపించింది .
ఆరుద్ర గారే ననుకుంటా రామాయణం రంకు, భారతం బొంకు అని అన్నట్టు గుర్తు .? ఎవరు అన్నారో కాదు గాని, ఆ స్టేట్ మెంట్ వారి 'way' of understanding that subject' అనుకోవాలి అంతే !
అట్లాగే ఇప్పుడు ఈవిడ , ఒక ఇంగ్లీషు అనువాదాన్ని, తెలుగు అనువాదాన్ని పెట్టేసుకుని తనదైన 'వికృత' స్టైల్ లో (విలక్షణ మైన శైలి అని మీరు భాష్యం చెప్పు కోవచ్చు !) దాన్ని విశ్లేషిస్తే చదవడానికి ఉత్సుకత ఉన్నవాళ్ళు, 'లా' పాయింటు లేవదీయాలని అనుకున్నవాళ్ళు చదవొచ్చు !
అట్లాగే, అందరూ టపాలు ఈ సబ్జెక్ట్ మీద కట్టేస్తున్నారు ,న నేను కూడా ఈ 'వికృత' పుస్తకం చదివి ఓ టపా కట్టేస్తే, కూసిన్ని కామెంటు మెతుకులు నాకూ పడతాయి కదా అని ఆనంద పడి పోయి, ఆశ పడి పోయి ఈవిడ గ్రంధ రాజాన్ని (రాజాన్ని అంటే మళ్ళీ ఎం సి పీ అనొచ్చు కాబట్టి ) గ్రంధ 'రాణి' ని చదివి తుస్సు మన్న , బుస్సుమన్న కస్సుమన్న ఓ ఇట్లాంటి టపా ఒకటి కట్టేయాలునుకున్నా !
"మనుషుల్ని పవిత్రులుగానూ- అపవిత్రులుగానూ విభజించే ఏ రచన అయినా, స్త్రీలని సజీవంగా కాల్చి వెయ్యడాన్ని పవిత్రధర్మంగా చెప్పే ఏ గ్రంథం అయినా " బాడ్ అన్నది ఈవిడ వ్యాఖ్యానం !
అసలు రాజా రామ్ మోహన్ రాయ్ లేకుంటే ఈ ఆచారం దేశం లో కొనసాగి ఉండేదే మరి ? ( బ్రిటీషు వాడు రాకుండా ఉంటె అసలు రాజా రామ్ మోహన్ రాయ్ కి విశాల దృక్పధం వచ్చి ఉండేదా ?)
అంటే, సతీ సహ గమనం ఆ కాలం లో ఉన్నదని ఆ కావ్యం లో ఉంటె, ఆ కాలాన్ని రచయిత నిర్ద్వందం గా ఎట్లాంటి భేష జాలకి పోకుండా చెప్పేడు అని భావం గాని, దాన్ని చెప్పేడు కాబట్టి ఇది సో కాల్డ్ బ్యాడ్ గ్రంధం ఎట్లా అవుతుందో ఆవిడకే మరి తెలియాలి !
ఉదాహరణ కి, ఈ కాలం లో చదువులు ఎక్కువై పెళ్లి పెటాకులు ముదిరే కాలంలో చేసుకుని , టాప్ మని విడిపోయే వారి గురించి రాస్తే, అట్లాంటి ఓ పుస్తకం రాబోయే కాలం లో నిలిచి వుంటే, ఆ కాలానికి 'విడాకులు' సో కాల్డ్ అర్థం కాని విషయమై ఉంటె , అప్పుడు ఆ రాబోయే కాలం లో ఇప్పటి కాలానికి ప్రతీక గా నిలచిన గ్రంధం బ్యాడ్ ఎట్లా అవుతుంది ?
ఏదో రాసేస్తే చదివి సెహ భేష్ అనుకునే వాళ్ళు ఉంటారను కోవడం ఈవిడ గారి కి అబ్బిన విద్య !
ఓ ముప్పై ఏళ్ల మునుపు విష వృక్షం రాసినప్పుడు కాల గతులు వేరు (మన దేశం లో ). అప్పు డున్న యువత కి ఇప్పుడున్న యు వత కి ఎంతో వ్యత్యాసం ఉన్నది . కాల గమనం లో ఇప్పుడున్న యువత ప్రపంచాన్ని చుట్టి వచ్చిన యువత . అంటే , విదేశాల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అందులో క్యాపిటలిస్ట్ కి, కమ్యూనిస్ట్ కి మూల వ్యత్యాసం ఏమిటి, ఏ సమాజం లో అవి 'విరాట్' రూపం లో ఉన్నవో అదే సమాజం లో అవి నేల బారు ఐనవి అని కూడా తెలుసు .
అట్లా గే, మన సమాజ వ్యవస్థ లో ఎట్లాంటి మూర్ఖత్వాలున్నాయి, వాటి వెనుక నిజం గా ఏదైనా సైంటిఫిక్ టెంపర్ మెంట్ ఉందా లేక just pooh pooh' తూ తూ మంత్రా లేనా అని కూడా అర్థం చేసుకో గలిగిన ఈ తరపు యువత .
ఇట్లాంటి ఒక కాల ఘట్టం లో పురాతన స్టైల్ లో నేనూ ఒక lopsided కుహనా విమర్శనా గ్రంధాన్ని రాస్తా , దాన్ని ఆ కాలపు విష వృక్షం లా జన సందోహం ఆదరిస్తుంది అనుకోవడం ఈవిడ గారికి కాలం చెల్లిన అభిప్రాయం మాత్రమె మరి .
ఇక ఆఖరి కామెంటు, ఈ పుస్తకం ధర సబ్సిడీ ని (వంద రూపాయల పుస్తకం ) గమనిస్తే రెండు విషయాలు అర్థం అవుతాయి .
ఒకటి ధర ఎక్కువైతే దీన్ని కొని చదివే వాళ్ళు అసలు ఉండరని(కొని చదివే 'నాధు' లు) వారి కి అనిపించి ఉండవచ్చు ,
కాలం చెల్లిన ఐడియా లకి కాణీ లు రాలవు-
కాకుంటే, ఏదైనా మత సంస్థలు దీని వెనుక ఉన్నాయి అనుకొవచ్చూ (ఈ నా ఊహ నిజం కాకూడ దని అనుకుంటా ! సర్వ విధాలా ఆశిస్తా.
కారాల మిర్యాల
జిలేబి