స్విట్జర్ లాండు.
అతి పాపులర్ ఐన స్విస్సు బాంకు ముందు నిలబడ్డాడు కొండ దేవర.
అక్కడ అటూ ఇటూ పోయే జనావళీ టై సరి జేసు కోవటం జూసి తానూ తన మెడలోని పూమాలని సరి జేసు కుని బాంకు లోకి అడుగు పెట్టాడు సామి.
'ఎస్ హౌ కేన్ ఐ హెల్ప్ యు సర్' అన్నది కౌంటరు దగ్గిర ఉన్న స్విస్సు భామామణి .
ఆవిడకి తెలుసు ఈ లాగా గెట్ అప్ లో వచ్చిన వాళ్ళు ఖచ్చితం గా 'భారద్దేశం' అనబడే దేశం నించి వచ్చే ఉంటారని, వీళ్ళకి అంగ్రేజీ తప్పించి లోకల్ భాష ఐన స్విస్ జర్మన్ తెలీదనీను. అందుకే ఆంగ్లం లో సంభోదించింది.
స్వామి కొద్దిగా జంకి 'దీర్ఘాయుష్మాన్ భవ ' అన్నాడు.
కౌంటర్ అమ్మాయి అర్థం కాకుండా నవ్వుతూ 'ఎస్ సర్' అంది.
కొద్దిగా ముందుకి వంగుతూ స్వామి చెప్పాడు, 'నాకో స్విస్సు అకౌంటు ఓపెన్ చెయ్యాలి - సీక్రెట్'!
ఎస్ సర్, మెజారిటీ ఆఫ్ అవర్ అకౌంట్ హోల్డర్స్ ఆర్ ఫ్రం యువర్ కంట్రీ సర్ - ఉయ్ గివ్ బెస్ట్ సర్వీస్'
'మా 'దివాణం' వాళ్ళు మీ ఊరి గడియారం లో నా ఫోటో పెట్టడానికి కమీషన్ నాకిస్తా మన్నారు.' చెప్పాడు స్వామి. కానీ ఆ కమీషన్ మా దేశం లో ఇవ్వడం కుదరదట నాకు, ఇక్కడే ఇస్తారట, అందుకే ... నాకిక్కడే అకౌంట్ కావాలి'
ఎస్ సర్ నో ప్రాబ్లెమ్ !
స్వామి ఈ మారు మళ్ళీ మెడలోని పూమాలని సర్దుకుని, 'ధన్యవాద్' చెప్పాడు .
ఆ అమ్మాయి కూడా ధన్యవాద్' అంది .
ఆ బ్యాంకు వాళ్ళు ఇట్లాంటి చిన్ని చిన్ని హిందీ పదాల్నీ , మరిన్ని చైనీసు పదాల్నీ పదాల్ని కౌంటర్ అమ్మాయిలికి చెప్పి పెట్టేరు వచ్చిన కష్ట మరలని సంతోష పెట్ట డానికి ~
స్వామీ సంతృప్తి గా తలూపి అక్కణ్ణించి ఓ SMS - కొట్టాడు - డీల్ డన్ -స్టార్ట్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ - అని !
(మా స్వామి ఇంకా ఏ ఏ ఊళ్ళో అకౌంట్లు తెరవబోతాడో మరి !-
కొన్ని రోజులు పోతే నాయుడు హాల్ వాళ్ళు వచ్చి మా ప్రాడెక్ట్ మీద స్వామీ వారి బొమ్మేట్టేసు కుంటాం కూసింత కమీషను మీకూ ఇస్తాం అంటారేమో మరి !)
జిలేబి.