Tuesday, February 4, 2014

కష్టే ఫలే - శర్మ కాలక్షేపం కబుర్లు !


ర్రున దూసుకొచ్చే వే
ర్వేరు టపా గమకం తో
నాలని ఆకట్టు కొని ఏ
నా టికైనా నిలిచి పోయే
సుమేరు కంటెంట్ అ
ఖిల విజ్ఞానం, మ
నో విహంగ మధురాను 

వ పరిమళానికి
వంకసరకు ఇది అది అన్నీ-
తురంగ వేగ 'టపా'శ్రమం వారిది !


ల 'కాలమ్' మృ
ష్టేరుక మేఘం
లదాయక జ్ఞాన 
లేపనం ! లే లెమ్మని
రవేగం తో భాస్కర శ  
ర్మ  టపా గీతమ్


కాలానికి నిలిచే 
కార ని 
క్షే ప భాండాగారం 
పంచు కునే ఫల వృక్షం !
లం  కితా
బు  ఆరు నూ 

ర్లు పై  కబుర్లు !


కష్టే ఫలే - శర్మ కాలక్షేపం కబుర్లు !


శుభాకాంక్షల తో 
జిలేబి 

Monday, February 3, 2014

గాజుల శ్రీదేవి-అల్లరి పిల్ల !

గాజుల శ్రీదేవి-అల్లరి పిల్ల !

గానంతో గమకం తో 
జుంజుర్ల సోయగాల తో 
క్షణ మైన విలక్షణం తో 
శ్రీలు పొంగిన రాగాల తో  
దేదీప్య మానమైన 
విరజాజి శోభల తో  

దిగో అ
ల్లది గో జల్లన
రివ్వున బ్లాగ్ దీ
పిక తో ఆ నాజూకు టపా  పి 
ల్ల  గాలి లా వచ్చేస్తోంది !!


శుభోదయం 
జిలేబి 

Saturday, February 1, 2014

మోహన మీ ప్రకృతి !

 
మోహన మీ ప్రకృతి !
 
తిమిర సంద్రాల
కృతి కర్తా స్వప్నమీ
ప్రకృతి
మీ (నా) ప్రకృతి
వ్య అందాల
రిత వయ్యారాల
మోహన మయూరం !
 
మోహన మీ ప్రకృతి !
 
 
శుభోదయం 
జిలేబి 

Tuesday, January 28, 2014

స్టాకు మార్కెట్టు 'గోవిందా' గోవిందా హే రాజన్ !!

స్టాకు మార్కెట్టు 'గోవిందా' గోవిందా హే రాజన్ !!

ఇవ్వాళ పేపరు తిరగేస్తే ఉన్న మతి పోయేటట్టు మా అన్ని 'పేపరోళ్ళు రిజర్వ్ బ్యాంకు గవర్నరు  రాజన్ మీద పడ్డారు !

పాపం ఆయన కూడా మానవ మాత్రుడే కదా ! జనాలు చేసే 'మార్కు' ఎత్తులకి ' దిగువ లకి ఆయనే పరిష్కారం చూపించా లంటే ఆయన మాత్రం ఏమి చేయగలడు !

స్టాకు మార్కెట్టు కి స్వామీ మోక్ష ప్రదాతవు అన్నట్టు అయి పోయింది 'హే రాజన్ ! పాహిమాం పాహిమాం ' అన్నట్టు !

అయినా గత శుక్ర వారం దాకా బుల్లిష్ అంటూ వాయ గొట్టిన అనలిస్ట్ లు శుక్రవారం మధ్యాహ్నం పై బడి 'we should walk cautiously' అనడం మొదలెట్టేరు !

అంతా విష్ణు మాయ కాకుంటే ఈ ప్రాబబలిస్టిక్ లోకం లో ప్రాబబిలిటీ వల్ల మార్కెట్టు కి పై కాలం దిగువ కాలం వస్తోం దా లేక   మనుషులే ప్రాబబిలిటీ ని సృష్టి స్తారా అన్నది  ఎల్ల కాలపు ప్రశ్నాయె మరి !

"The world has the beauty of making possibilities to happen as well it has the capacity to make the impossibilities as possible" అంటారు !

మరి ప్రోబబిలిటీ ఈ వారాంతం లోపు స్టాకు మార్కెట్టు ని ఏ వైపు తీసు కెడు తుందో మరి !

ఈ జనవరీ నెలని గమనిస్తే 2009 January నెల గుర్తు కోస్తోంది ! అప్పుడూ బెన్ బెర్నాంకె రోజుకో స్టేట్ మెంట్ ఇచ్చే వాడాయన !

సరిగ్గా శుక్రవారం వస్తే చాలు సరి కొత్త స్టేట్ మెంట్ ఇచ్చే వాడు ! సోమ వారానికి ఏషియా మార్కెట్లు ధమ ధమ అని ధమాల్ అనేవి !

సరే ఈ సంవత్సరమూ చూద్దాము !

చీనా దేశపు ఆచారం ప్రకారం జనవరి నెలాఖర్నించి ' గుర్రపు' సంవత్సరం మొదలవు తుందట !

గుర్రపు సంవత్సరం ముందే చైనా ఎకానమీ గురించి 'వాతలు' రావడం మొదలెట్టేయి !

ఇక మన ఇండియన్ రుపీ గురించి చూస్తే ఇవ్వాల్టికి అది డాలరు కి అరవై నాలుగు రూపాయలు అయ్యేటట్టు ఉన్నది
(ఇండియా రిపబ్లిక్ 63 సంవత్సరాలాయే మరి !)

సో ఇవ్వాల్టికి జిలేబీ 'వాతలు' పరి సమాప్తం !


చీర్స్ సహిత
జిలేబి !

Wednesday, January 22, 2014

మనవరాలి తాతయ్య కి నివాళి

 
తడు తొంభై ఏళ్ల పై బడ్డ వాడు అ 
క్కినేని పేరు సార్థకం చేసిన వాడు 
నేటి తరం నటులకి దిక్సూచి 
నిన్నటి నేటి మరి ఎన్నటి మేటి 
 
నాటి తరపు క్రమశిక్షణ ఆలా 
గే  అవలోకితెశ్వర  'అనీ 
శ్వ ర  'ఆత్మబలం'
మణీయ 'నట' రాజా !
రాబోవు కాలం లో నీ 
వు ఈ తెలుగు తెరకి
'మేఘ సందేశం' 
 
 
అక్కినేని కి నివాళి 
 
సంతాప 
జిలేబి 
 
 

Tuesday, January 21, 2014

'సడక్' ఆగ్రహం - అరవిందోద్యమం !

'సడక్' ఆగ్రహం - అరవిందోద్యమం !


కేజ్రీవాల్ క్రేజీ వాలా యా అని కష్టే ఫలే వారు ప్రశ్నించారు . కాదనుకున్నా ఎందు కంటే , గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో పని జేసి బయటకి వచ్చిన మానవుడు కాబట్టి !

భారద్దేశ చరిత్ర లో ప్రప్రధమ 'ప్రజా' స్వామ్య 'గణతంత్ర' 'సడక్' ఆగ్రహం' అంటే కేజ్రీ వాల్ తప్పకుండా చరిత్ర లో చరితార్థులవుతారు !

సడక్ ఆగ్రహానికి అప్పోజిషన్ లో గాని పదవి లో గాని లేకుంటే ఒకటి నాలుగు నాలుగు క్రింద బుక్ చేసి బొక్కలో పెట్టొచ్చు !

ఒక రాష్ట్ర అధిపతి యే ఆ సడక్ ఆగ్రహాన్ని సరి కొత్త రీతి లో వెలిబరిస్తే !

కేజ్రీ వాల్ గారు నిజం గా మెచ్చు కోవాల్సిన వ్యక్తి ! అంత అసందిగ్ధ మైన పరిస్థితి లో కూడా ను సడక్ నించే తన ఆఫీసు వ్యవహారాలకు ఆటంకం రాకుండా చూసు కుంటూ పని జేసుకుంటూ టీవీ లో కనబడ్డారు !

'దుపట్టా'హాఫ్' !

సడక్ ఆగ్రహానికి అధికారం తోడైతే ఏమవుతుందో ఇప్పటి దాకా మనకు తెలీదు !
ఇప్పుడు తెలుసు కుంటున్నాం ! సడక్ ఆగ్రహం  ఈ కాలపు సత్యాగ్రహమా  మరి !

రాబోవు కాలమే తేల్చాలి నిర్ధారణ గా !


చీర్స్
జిలేబి

Saturday, January 18, 2014

Aurobindo Pharma- Ratio covered call strategy analysis

Strategy:

Buy one lot of futures  and sell two lots of call  just above call strike 

Considered: Aurobindo Pharma for analysis Futures February 2014 390 and January 2014 Call 400/-

An analysis of Covered call strategy on Aurobindo Pharma: as of 17th January 2014 closure
Options expiry date: 30th Jan 2014

No of trading sessions left 9 days for expiry.

The catch here is to have approximately Rs.4,00,000 as Margin/Limit. Assuming one can afford such limits the following analysis is made:

BUY FEBRUARY 2014 FUTURES AT 390/-

SELL JANUARY 2014 400 CALL AT 7 RS. * 2 LOTS: january 2014: premium collected is 14 Rs.

(When we sell two lots , one of them is covered up to the other premium. That is one call sold is covered upto 14 Rs, the other call is covered by the underlying future bought position)

Down side we are covered upto 390-14 Rs = 376/-

If January close at: 407 17 Rs profit (407-390)

Lot size = 2,000 So profit = 34,000/-

Exposure 20th jan to 30th jan 2014 = 9 trading sessions

Delta is 35% and Theta is 50 paise per day approx.

Limit required = Total 4,00,000 Rs.

Approximately return 8% pm return = 96% return p. a (approx.) If you go by calendar days its much higher).

Is this achievable?

If market closes at 414 : You make 20,000/- (400-390= 10Rs *2000)

Upto 424/- You are covered. Beyond 424/- for every one point one point loss.

In net below 376 and above 424 Losses Let us see what are the probabilities for this?

Below 375 probability is 35% and above 425 is 15% .
So total probability is 50% We can assume on either side probabilit is 25% .

 This means we have 75% probability of being in minimum profit of RS.20K Max profit of Rs.34k.

To be re-analysed on 30th Jan2014 for the factuals

cheers
zilebi

Friday, January 17, 2014

'నమో' లో ఏముంది ? రాహులయినా రెహ్మాను అయినా ఏముంది !


మాది ఏక చత్రాధి 'పైత్యం' కాదు అన్నారు మేడం గారు

సెహబాష్ అని అనాలని పించింది !

భారద్దేశం లో దేశం లెవెల్ నేతలు తగ్గి పోతున్నారా అనిపించింది .

ఒక దేశాన్ని కట్టి పడేసే నేతలు మనకు అవసరమా అని కూడా అనిపించింది

ఒక్కడు ' ఒక్కరే' దేశాన్ని ముందంజ వేయ గలుగు తారా అని కూడా ప్రశ్నించ వచ్చు!

భారద్దేశం ప్రజాస్వామ్య దేశం అనడం కన్నాఎక్కువగా  ప్రజా 'సౌమ్య' దేశం అనవచ్చు !

ఎందు కంటే దేశం లో ఏమి జరిగినా మనం 'సౌమ్యం' గా సౌకర్యం గా మరిచి పోయే వాళ్ళం కాబట్టి .

దీనికి మరో కారణం నా కనిపిస్తున్నది ఏమిటంటే , దేశం లో ప్రజలకి రోజువారి దినసరి సరకులకే, దినసరి జీవితానికే తమ సమయం వెచ్చించా ల్సి వస్తోంది .

ఇక మిగిలిన సమయం లో మన మీడియా (మీడియా గురించి ఎంత తక్కువగా చెబితే అంత మంచి దేమో మరి !) ఇరవై నాలుగు గంటలు బ్రేకింగ్ న్యూస్ ఇస్తూ, 'పండంటి' కాపురాల సీ 'రీళ్ళు' కుమ్మరిస్తూ , సినెమా పాటల హోరుల తో, నాయకుల భీకర హ్రీంకార ఘీం కారాల తో  ప్రజల్ని కట్టి పడేస్తో ఉంటుంది

ఇక ప్రజలకి తీరు బాటు ఎక్కడ ? తింకింగ్ పవర్ ఎక్కడ మరి ?

సరే, మరి ప్రజా స్వామ్యం గుత్తాధి 'పైత్యం' కాదు అనుకుంటే , మరి దేశం ఎప్పుడో ఈ 'గుట్టా' ధి పైత్యం నించి విడివడి
ముందంజ వేసి ఉండాలి కదా !

అబ్బా అన్నీ ప్రశ్నలే ! జవాబు లెక్కడ మరి ?

ఏమిటో పొద్దస్తే ఈ   భేషజం !

"జిలేబి టపా కట్టి కిచను కెళ్ళి కూసింత కాఫీ నీళ్ళు నా ముఖాన పడెయ్య కూడదు ?" అయ్యరు వెనుక నించి  'హోమ్' కారం !
కూసింత నిదానించి టపా రాద్దా మన్నా సమయం లేకుండా పోయిందేమి మరి బీలేజీ జిలేబి ???

చీర్స్ సహిత
జిలేబి (బీలేజీ)

Friday, January 10, 2014

మై 'ఆమ్' జిలేబి హూ !!


ఈ మధ్య మన కేజ్రివాల్ గారు ఏ ఏ పీ పార్టీ తరపున డిల్లీ అసెంబ్లీ లో ఓ అర్ధ గంట పాటు మాట్లాడేరు

ఆ సందర్భం లో మనమంతా ఏక్ దమ్ ఆమ్ ఆద్మీ అని వారు చెప్పేరు

ఆమ్ ఆద్మీ అనబడు బేచారా మానవునికి మరో మారు వీరిచ్చిన సరికొత్త నిర్వచనం - 'ఈమాన్దారీ' - అంటే నిజాయితీ గలిగిన  మానవుడు . వాడు ధనవంతుడు అవ్వచ్చు బికారీ అవ్వచ్చు - మతలబ్ నహీ - ఈమాన్దారీ తో జీవిస్తే ఆమ్ ఆద్మీ
అదే ఇక బె- ఈమాన్దారీ మానవుడు ఫక్తు ఆమ్ ఆద్మీ కాదు .

కాబట్టి మమంతా ఆమ్ జిలేబి లం  అని నా ఉవాచ !

జిలేబీ ఫ్రెష్ గా ఉంటే నోటికి రుచి .

ఓల్డ్ జిలేబి ఈజ్ నో గుడ్ టు ఈట్ !

అట్లా మనమంతా ఫ్రెష్ గా ప్రతి రోజూ టపాలు గట్రా రాస్తూ కూసింత కామెంట్ల తో ఎవర్ ఫ్రెష్ గా ఎవర్ గ్రీన్ గా ఉంటున్నాం కాబట్టి మనం అసలైన సిసలైన ఆమ్ జిలేబీ లము !!


సో, నేటి ఈ టపా 'ఆమ్' జిలేబీ లందరికీ అని తెలియ జేసుకుంటూ ...


చీర్స్ సహిత

జిలేబి





 

Wednesday, January 8, 2014

బ్లాగని బ్లాగిణి బ్లాగరుని గ్రక్కున విడువ వలె గదవే జిలేబి !


రాసిన చదువని టపా

 కామెంటిన నప్పని కంటెంటు

'బ్లోగిల్లు ' చేరని

బ్లాగరు - బ్లాగిణి

బ్లాగని బ్లాగిణి బ్లాగరుని

గ్రక్కున విడువ వలె 

గదవే జిలేబి.

చీర్స్

జిలేబి.
 
నూతన సంవత్సర 
లేట్ శుభాకాంక్షలతో 
ఒన్స్ అగైన్ యువర్ 
ట్రూ లీ 
జిలేబి