'గరిక' పాటి చేయని సత్యానికి ఎందుకంత విలువ ?
ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను అని సినీ కవి పాట . !
నిజంగానే అట్లా అయ్యింది జిలేబి పరిస్థతి !
మొన్న శర్కరి వారు సత్యనారాయణ వ్రతం గురించి గరికపాటి వారి ప్రసంగం వీడియో పెట్టి మనకు తెలిసిన సత్య నారాయణ వ్రతం కోరికలను ఈడేర్చేది . మరి గరిక పాటి వారేమో సత్యం గురించి మాట్లాడు తున్నారు మరి అంటే , అబ్బే మగరాయుళ్ళ కి ఆండోళ్ళ కి తెలిసినంత గా వీటి గురించి తెలీదండీ అని వ్రాయటం తో మొదలెట్టి ఆ పై గరిపాటి చేయని సత్యాని కి ఇంత విలువా ! ఇంత బిల్డ్ అప్ కూడానా అని వ్రాస్తే విన్న కోట వారు ఆయ్ మీరు గరిక పాటి వారి పాండిత్యాన్ని గరిక పోచ తో పోల్చడం సుతరామూ బావోలేదు సుమీ అని ధక్కా ఇచ్చారు ! శ్యామలీయం వారేమో పొరపాటు మాటన్నారు జిలేబిగారు అన్నారు !
అదిరి పడ్డా ! ఎరక్క పోయి కామేంటాను ఇరుక్కు పోయాను అనుకున్నా ! మరీ శర్కరి వారి కామింటు బాక్సు నింపడం కన్నా మనకు ఒక టపా వ్రాసేందుకు ('టపా' కట్టేందుకు ) అవకాశం దొరికింది సుమీ అని సంతోష పడి పోయా !
సత్యాన్వేషణ అన్నది కాలా కాలం గా ప్రతి జమానా లో నూ జరుగుతున్నదే.
అయితే ఏది సత్యం అన్నది , ఇదే సత్యం అన్నది నిర్ధారణ గా , చెప్పలేనిది. ఇదే సత్యం అంటే అప్పటికి అదే సత్యం కాని దాని ఆవల మరో సత్యం ఉన్నది అన్నదే న ఇతి ! ఈ క్షణం సత్యం అనుకుంటే ఈ క్షణం మాత్రమె సత్యం ఆ పై క్షణం సత్య దూరం. మార్పు చెందనిది సత్యం అనుకుంటే మార్పు లేనిదే ఈ విష్ణు మాయ లేదు.
గరిక సత్యం పాటి అవ్వొచ్చు నెమో గాని సత్యం గరిక పాటి కాలేదు. అది అయితే ఇక సత్యం వేరే ఉన్నట్టే లెక్ఖ .
గరిక పాటి వారు చెప్పినది 'సత్యమైన' మాట - సత్య వ్రతం చెయ్య మనడం . సత్య మేవ జయతే అనటం తో ఋక్కు ఆగలేదు - మరో తోక తగిలించు కున్నది నానృతం అని కూడాను.
ఋతగుం సత్యం పరం బ్రహ్మ అంటుంది ఋక్కు . ఇందులో సత్యానికి మరో తోక కూడా ను "ఋ" త ఎందుకా తోక ? ఇప్పటి దాకా నాకైతే అనుభవైక వేద్యం కాలేదు ( పుస్తక జ్ఞానం కాకుండా) !
నారాయణ సూక్తం 'నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా' అంటుంది ఆ 'పరం బ్రహ్మ' గురించి చెబుతూ ఎండిపోయిన గరిక మొనన ఉన్న పీత వర్ణ రంగులో అణు మాత్రమై అంటూ .
క్వాంటం ఫిసిక్స్ గాడ్ పార్టికల్ వైపు పరుగెడు తోంది .
ఇట్లాంటి నేపధ్యం లో ఒక్క వాక్యం లో వ్రాసినది ఆ వాక్యం . ఆ గరిక పాటి అన్నది బాగా అక్కడ కుదురుకున్న మాట అయి పోయింది !
సత్యం గరిక పాటి చేయదు. చేస్తే అది సత్యం కాదు. మరి ఏ పాటి చేస్తుంది ? తెలీదు ; ఈ పాటి చేస్తుంది అని తెలిస్తే అది సత్యదూరం.
జిలేబి
(హమ్మయ్య ! నేటికి ఒక టపా కట్టేసా:)