Derivatives world లో ఫ్లోర్ అండ్ క్యాప్ అన్న పదజాలం ఉంది .
అట్లా , నిన్న భమిడి పాటి అయ్య వారు మా ఆవిడ నన్ను ఫ్లోర్ చేసింది అంటే (నిన్నటి లింకు చూడ వలే ) భమిడి పాటి అమ్మగారు 'ఆయ్ ' అని 'ఏదో ఒక మారు పని జెబ్తే, వెంటనే 'టముకు' కొట్టు కోవాలా అంటున్నారు !
భమిడి పాటి అమ్మగారు రిటార్టు ఇస్తారని అనుకున్నా గాని, ఇంత త్వరగా రిటార్టు ఇస్తారని ఊహించలే ! అయ్య వారు చేసిన ఆవకాయ టపా కారం వెంటనే పని జేసి టపా రిటార్టు అమ్మగారు వేసేసేరు !
ఇక ఎందుకు ఆలస్యం !
పిల్లలు టూర్ వెళితే, మనకు ఇక 'హనీ డేస్ గదా !!
''' ఈ ఏడాది ఆవకాయ కలపడం మా వారికి outsource చేసేశాను. ఏమిటో ఎంతో శ్రమపడిపోయినట్టూ, నేనేదో ఆయన్ని ఆరళ్ళు పెట్టేస్తున్నట్టూ ఓ టపా కూడా పెట్టేసికున్నారు. మరి ఇన్నేళ్ళూ,మింగినట్టు లేదూ? ఒక్క రోజంటే ఒక్కరోజైనా ఆవకాయ లేకుండగా ముద్ద దిగిందా? పైగా బయటినుంచి తేకూడదూ, ఇంట్లోనే, పిల్లల్ని చూసుకుంటూ, ఆయనకి కావాల్సినవన్నీ చేస్తూ, వంటపనీ, ఇంటిపనీ చూసుకుంటూ ప్రతీ ఏడాదీ ఊరగాయలు పెట్టడమంటే మాటలా మరి? అదేం జాతకమో నాది, ఓ పనిమనిషికూడా లేదు'''
చీర్స్
జిలేబి