Thursday, October 17, 2013

అధ్వానం నించి 'Ad' వాణి దాకా !!


అద్వానీ మోడీ భాయ్ ల మధ్య జరుగుతున్న
'దోబూచు లాట' లు మరీ అధ్వానం గా
తయారు అయి పోతున్నా యనుకు న్నారు
కామోసు అద్వానీ గారు -
మోడీ భాయ్ కి 'Ad' వాణీ అయి పోయేరు
ఈ నిన్నటి రసవత్తర మైన
ఐ ఐ టీ 'రాం'  ఫంక్షన్ లో !



బీ చీర్ఫుల్ !
మోడీ జిలేబియం !

Tuesday, October 15, 2013

ఏదీ నీది కాదు - ఏదీ నీది కాదూ ?

 
ఏదీ నీది కాదు  సర్వ జగత్ విష్ణు మాయ !
నీదన్నది నీదనుకున్నది ఏదీ నీది కాదు  !
 
విష్ణు మాయ !
విష్ణు , మాయ !
 
ఆ పై వాడే నీ వాడై నప్పుడు
ఏది నీది కాదు ? ఏదీ నీది కాదూ ?
 
కిటుకు విష్ణువు లో ఉన్నది !
విష్ణువు నీ వేణువు అయితే
మాయ వేణువు పలికే నాదమై పోదూ ??
 
 
శుభోదయం
జిలేబి

Monday, October 14, 2013

శ్రీ శ్రీ శ్రీ స్వామీ మోడీ అనందా వారి విజయదశమి అనుగ్రహ సంభాషణం

మోడీ వారి
'శాస్త్రోపన్యాసం ' -
శస్త్రోపన్యాసం -
రామాయణ ఉపన్యాసం
 
విజయదశమి సందర్భం గా !
 
 
 
శుభోదయం
మోడీ జిలేబీయం !

Sunday, October 13, 2013

శోభిల్లు సప్త స్వర !

Brahmasri T S Balakrishna Sastrigal, the harikatha legend, is explaining here the similarity between the musical instrument veena and the human body. He also informs that music is present in all human bodies. It is up to us to dig it out. This is part of the CD titled GURU GUHA JAYATHI on Saint Muthuswamy Dhikshathar marketed by Swathi Sanskriti Series.

This is a rough translation listening the audio of Brahmasri T S Balakrishna Sastrigal.  The audio link is given below as well courtesy youtube.

బ్రహ్మశ్రీ టి ఎస్ బాలకృష్ణ శాస్త్రి గారి ఆడియో కి స్వేచ్చాను వాదం ...

... ఆ గంగా నది లో స్నానం చేయడానికి దిగి నప్పడు గమనించాడు .. ఆ నది లో ఏదో తేలియాడుతూ వస్తోంది. గంగా నది లో తేలియాడుతూ వచ్చేవేన్నెన్నో ! స్నానం చేసే వాళ్ళు జాగ్రత్త తో ఉండడం అవసరం .

గంగానది లో తేలియాడుతూ వస్తోన్న దాన్ని గమనించారట ఆయన   .. అది 'అందులో రామా అన్న పదం కనిపిస్తోంది . అది దగ్గిర వస్తోన్న కొద్ది స్ప్రష్టమై కని పిస్తోంది ... మనుష్య ఆకారం పోలి ఉన్నట్టు .

మానవుడు యోగాసనా తిష్టుడై ఉంటే ఎట్లా ఉంటాడో అట్లా కనిపిస్తోంది అది .

ఆ కనిపిస్తోన్నదే అదే వీణ ! 

వీణ ఎట్లా ఉంటుంది ? మానవుడు పద్మాసనం లో యోగాసనం లో కూర్చుని ఉంటే ఎట్లా ఉంటుందో ఆ రూపాన్ని పోలి ఉంటుంది .

పద్మాసనం లో కూర్చున్నవారి రూపం ఎట్లా ఉంటుంది ? క్రింది భాగం వీణ యొక్క క్రింది భాగం పోలి ఉంటుంది ఆ వీణా మధ్య భాగం మానవుడి వెన్నెముక . దాని శిరోభాగం మనుజుడి శిరస్సుని పోలిక !

పూరకం కుంభకం రేచకం ; స్వాదిష్టానం మణి పూరకం బ్రహ్మ రంధ్రం మొదలైనవి దాని భాగాలు .

ఇడా పింగళ నాడులే దాని తంత్రులు . తంబురాలో అగుపించే సారణ అనుసారణ తంత్రుల లా  ఇడా పింగళ నాడులు .

మన శరీరం లో ఇడా పింగళ నాడులు ఉన్నాయి. అట్లా మన శరీరమే ఒక వీణ .

ఈ శరీరమన్న ఒక వీణ సాయం తో మనం పాడ గలుగు తున్నాం.

వాద్యం నించి ఎట్లా శబ్దం జనిస్తుందో మన శరీరమనే ఈ వాద్యం నించి శబ్దం జనిస్తొంది . 

మన శరీరం లో ని నాభి , హృదయం , కంటం, నాశిక ద్వారా ఈ శబ్దం వెలువడు తోంది .

దీనినే త్యాగరాజ స్వామీ వారు చెప్పి ఉన్నారు .

నాభి హృత్ కంట రసన నాసాధ్యుల యందు ... శోభిల్లు సప్త స్వర ...


నాభి స్థానం నించి జనిస్తున్నాయి  - రిషభ గాంధార మధ్యమ దైవత నిషాద ప్రయోగములు .

రిషభం గాంధారం మధ్యమం దైవత నిషాదం ఈ స్వరముల  సంచారం ఈ దేహమే  ఒక ఆలయం

రిషభం లో మూడు , గాంధారం లో మూడు, మధ్యమం లో రెండు  దైవతం లో రెండు నిషాదం లో మూడు

వీటికన్నిటి కి  అతీతం గా నిశ్చలం గా ఉన్నది ష అన్న షడ్యం - షడ్యమం అని చెబుతాము .

ఇది ఆరవ స్థానం లో జనిస్తుంది.  ఆ ఆరవ స్థానమే షణ్ముఖు ని స్థలం. ఆయన పేరే 'షణ్ముఖ'  ఆరవ స్థానం నించి జనించిన వాడు. షడ్యం షణ్ముఖ .. అది ఎక్కడ ఉన్నది? ఈశ్వరుని దగ్గిర ఉన్నది అని అంటారు త్యాగరాజ స్వామి వారు  .  ఈ శరీరమే ఆ పరతత్వ స్వరూపం.

ధర రిగ్ సామాదులలో వర గాయత్రి హృదయమున
సుర భూసుర మానస మున శుభ త్యాగరాజుని ఎద  ...
శోభిల్లు సప్త స్వర ... సుందరుల భజియింప వె మనసా !


వేదముల నించి గ్రహించి బ్రహ్మ ఈ సంగీతాన్ని మన కందించాడు .

ఈ సంగీతం మన దగ్గిర ఎల్లప్పుడూ ఉన్నదే. ఇది మనం సృష్టి , వృద్ధి చేసినది కాదు. 

కొందరు పాడ గలుగు తున్నారు. మరి కొందరు పాడ లేక పోతున్నారు .

పాడ లేక పోతున్న వారికి ఇది లేదని అర్థం కాదు. మన లోన ఉన్నది. దానిని బయటకు తీయాలి.  లోపల ఉన్నదానిని త్రవ్వి తీయాలి. 

భూగర్భం లో ఉన్న నీటి  లా ఉన్నది.  భూమిని తవ్వి నీటి ఊటని బయటకు తీయడం లా ఈ సంగీతాన్ని లో నిండి తీయ గలగాలి ... మన అందరి లో ఉన్నది.  .. అదే ఈశ్వరుడు అని అంటారు స్వామి త్యాగరాజ వారు ...




Photo caricature by Keshav - The famed cartoonist of The Hindu ---> From his blog
 
 
T. S. Balakrishna Sastrigal



శుభోదయం
నవరాత్రి శుభాకాంక్షల తో !
జిలేబి

 

Friday, October 11, 2013

జిలేబి నిరాహార దీక్ష - ఐదు కిలోల బరువు తగ్గుదల స్కీమ్


"ఈ మధ్య మరీ భారీ అయి పోతున్నా ఏదైనా చేసి ఓ ఐదు నించి పది కిలోల బరువు తగ్గాలి అనుకుంటూ ఉన్నా ' చెప్పా " మా అయ్యరు గారి తో .

'ఇదిగో జిలేబి ఏదైనా చేసి ఎందుకు ? ఈ మధ్య దేశం లో ఎన్నో ప్రాబ్లెమ్స్ ఉన్నాయి . ఏదో ఒక డానికి నిరాహార దీక్ష మొదలెట్టు ఓ వారం లో ఐదు కిలో లేమి ఖర్మ, వీలయితే శాల్తీ శాల్తీ యే కరిగి పోవచ్చు కూడాను " అయ్యరు గారు రిటార్టు ఇచ్చారు .

ఆ హా ఇదేదో మంచి సలహా గా ఉన్నదని నిరాహార దీక్ష డిల్లీ లో నే మొదలెట్టే సా . నా తోడు అన్ని పార్టీల నేతలు నేత్రి లు , కూడా నిరాహార దీక్ష మొదలెట్టడం చూసి నాకు కూడా ముచ్చటేసింది !

అబ్బా, ఈ రాజకీయ నాయకులు ఎట్లా ఎట్లా బరువు ఖర్చు చేసు కుంటారు సుమీ అని వార్ని మేచ్చేసు కున్నా మనసులో .

సో , బ్లాగు చదువరులారా, చదువరీ మణు లారా ! ఇదే మీకు జిలేబి అందించు 'నిరాహార దీక్షా ఆహ్వానం ! మీరు బరువు తగ్గాలను కుంటు న్నారా ! వెంటనే నాతొ బాటు డిల్లీ కి వచ్చి నిరాహార దీక్ష మొద లెట్టే య్యండి !

పుణ్యమూ పురుషార్థమూ అంటారు చూడండి , అట్లా మీ బరువు తగ్గ వచ్చు, దాంతో బాటు బోలడంత పేరు కూడాను !
ఇవ్వాళే రండి ! వేగిర పడండి ఆలసించిన ఆశా భంగం ! భలే మంచి చౌక బేరము !


నిరాహార !
నీకు సరిలేదు దేనికైనను !
ఇదే నీకు చీర్సు

జిలేబి (పది కిలోల బరువు తగ్గు ప్లాను లో ఉన్నది!)

Thursday, October 3, 2013

రామాయణం లో పుష్పక విమానం - ఒక విహంగావలోకనం !


విహంగావలోకనం  - A bird's eye view - విహంగ వీక్షణం !

రామాయణం లో పుష్పక విమాన వర్ణన సుందర కాండ లో వస్తుంది. హనుమంతుల వారు పుష్పక విమానాన్ని చూడటం జరుగుతుంది .

వాల్మీకి అత్యద్భుత వర్ణన - ఈ పుష్పక విమానాన్ని గురించి సుందర కాండ లో ఏడవ సర్గ లో  లో చెప్పడం జరుగుతుంది.  ఆ పై ఎనిమిదవ సర్గ ఈ పుష్పక విమాన వర్ణన కి కేటాయించ బడి ఉన్నది .

ఏడవ సర్గ లో ఈ పుష్పక విమానం గురించిన వర్ణన ఒక విహంగావలోకనం లాంటి దైతే ఎనిమిదవ సర్గ లో వర్ణన 'a detailed description' లాంటిది !

పుష్పక విమానాన్ని హనుమంతుడు చూడడాన్ని వాల్మీకి వర్ణన - ఈ పుష్పక విమానం - మహా విమానం - 'best of the best! - वेश्म उत्तमानाम् अपि च उच्च मानम् |! ఉత్తమ మైన వాటిల్లో అత్యుత్తమ మైన విమానం అని !

అంటే ఆ కాలం లో ఇది ఒక్కటే విమానం కాక మరెన్నో విమానం ఉండేవని అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి విమానా ల లో ఈ విమానం అత్యుత్తమ మైన విమానం !

ఇక ఈ విమానని గురించి న మరిన్ని వివరాలు ఎనివిదవ సర్గ లో మొత్తం ఏడు శ్లోకాలలో వాల్మీకి వర్ణన చేయడం జరుగుతుంది . మహద్విమానం మణి వజ్ర చిత్రితం !

महद्विमानम् मणिवज्रचित्रितम् |!

విశ్వకర్మ చేత నిర్మింప బడ్డది. అక్కడ 'వాయుపథం' లో నిలిచి ఉన్నది ! (ఈ వాయుపథం అన్నది మన కాలపు 'Run way' అనుకోవచ్చా ? ) ఆదిత్య పథ వ్యరాజవత్ !

తపోబలము చేత రావణుడు దీన్ని పొందాడు . 'ఇది మనోబలము చేత ప్రయాణిస్తుంది' అంటాడు వాల్మీకి !

అంటే ఈ విమానం ఆ కాలం లో ప్రయాణం చేయడానికి మనోబలం ఇంధనం లాంటిదన్న మాట . - मनःसमाधान विचारचारिणम् | -

तपह्समाधानपराक्रमार्जितम् |
मनःसमाधानविचारचारिणम् |
अनेकसंस्थानविषेषनिर्मितम् |
ततस्ततस्तुल्यविशेषदर्शनम् || ५-८-४


ఈ మధ్య మన కాలం లో నే స్పీచ్ రెకగ్నిషన్ పరికరాలు వస్తున్నాయి . వీటి తరువాయి సాయిన్సు డెవలప్ మెంట్ ఇక మనో బలం (Thought Power) చేత పరికరాలు నడప బడే స్థాయి కి రావచ్చు అనుకుంటా .

అంటే ఆ రామాయణ కాలపు డెవెలప్ మెంట్ ఒక స్థాయి ముందర ఉన్నట్టు అనుకోవచ్చు. మనోబలం చేత నడప బడే విమానం లాంటివి ఉన్నట్టు !

ఇక ఇది కాల్పనిక మైనదేమో అన్న సందేహం చాలా మందికి ఉండనే ఉన్నది. ఆ కాల్పనిక కథ అన్న మాటలని పక్కన బెట్టి - ఈ  రామాయణ కాల ఘట్ట  కాలం నాటికి వాల్మీకి సమకాలీకుడు అన్న మాటలని బట్టి ఆ కాలం లో తాను చూసినదానిని  ఒక కవి వర్ణించాడు అని కూడా అనుకోవచ్చు. అట్లా అయిన పక్షం లో ఇది ఆ కాలపు ఒక విమానానికి సరియైన వర్ణన అయ్యే ఆస్కారం కూడా ఉన్నది.

ఇక దాని రూపం ఎట్లా ఉన్నది ? విచిత్ర కూటం బహుకూట మండితం ! -like a mountain with wonderful peaks adorned by many peaks!

ఇంతే గాక మనోభిరామం శరదిందు నిర్మలం ! - చంద్రుని లా నిర్మలం గా మనోభిరామం గా ఉన్నదట దాన్ని చూడడడం !

సో, ఈ విచిత్ర కూటం బహుకూట మండితం అన్నది చూస్తే దాని రూపు రేఖలు - మన కాలపు 'flyingsaucer' వర్ణన లా ఉన్నది !

ఈ వర్ణన లో అన్నిటికన్నా ముఖ్యమైనది నా కనిపించింది - ఇది మనో బలం చేత నడప బడుతుంది అన్నది . ఈ వాక్యం నిజంగా ఆలోచింప దగ్గ వాక్యం అనుకుంటా . ఎందు కంటే ఇప్పుడు మన మున్న కాలం లో thought power మీద జరుగుతున్న విశేష రీసెర్చ్ రాబోయే కాలం లో ఇట్లాంటి వనరులని మనకి తేవచ్చు కూడాను .

ఆ మధ్య ఎక్కడో చదివా ... హ్యూమన్ క్లోనింగ్ రీసెర్చ్ లో భాగం గా - ఒక బ్రెయిన్ లో జరిగే విశేష మైన లాజికల్ మేపింగ్ ని మరో బ్రెయిన్ లో కి ట్రాన్స్పోర్ట్ చేయ గలిగితే తద్వారా knowledge transfer mechanism చాలా సులభ తరమై పోతుంది అని !

సో ... ఇవ్వాల్టికి ఈ పుష్పక విమాన విహంగావ లోకనం పరి సమాప్తం !

మీకు నచ్చిందని ఆశిస్తూ ...

मनःसमाधान विचार चारिणम् |

ఎప్పట్లా చీర్స్ సహిత -
మీ
జిలేబి
సైనింగ్ ఆఫ్ !

మనోభిరామం శరదిందు నిర్మలం !

Wednesday, October 2, 2013

నేను కుర్చీ ని వదలను గాక వదలను !


మీ వాడే మీ పట్ల అంత విముఖమైన వ్యాఖ్య సంధిస్తే మీరు రాజీనామా చేస్తారా ?" అడిగాడు విలేకరి.


"ఏదో మనవాడు అట్లా మనలని తెగిడా డని నన్ను కుర్చీ వదల మంటే ఎట్లా? అట్లాంటి వన్ని నేను చేయ దలచు కోలేదు " చెప్పాడాయన సంతృప్తి గా కుర్చీ ని తడివి చూసుకుంటూ .

కుర్చీ కిర్రు మంది .

అబ్బా ఎన్నాళ్ల ని ఇట్లా ఒక శాల్తీ నీ భరిస్తూ ఉండడం ? కుర్చీ మరో మారు నిట్టూర్చింది .

అట్లా కాదండీ ఇది మీ ప్రేస్టిజ్ కి సంబంధించింది కదా మరి ? విలేకరి అమ్మాయి ఎగ దోసింది .

ఆ పెద్దాయన నిదానించి చూసాడు ఆ విలేకరి ని - "అమ్మాయ్ నీకు పెళ్లయ్యిందా ? పిల్లా జెల్లా ఉన్నారా ?' అడిగేడు .

ఈ ప్రశ్న కి ఆ విలేకరి కోమలాంగి తత్తర పడి 'ఒక అబ్బాయి మూడేళ్ళ వాడు ' చెప్పింది .

పెద్దాయన నవ్వేడు.

"అమ్మాయి - ఆ నీ బుడతడు నడతలు, నడకలు మాటలు నేర్పేటప్పుడు నిన్నే ఎన్ని సార్లు ఏకవచనం లో సంబోధించి ఉంటా డం టా వ్ ? ఆ బుడతడి మాటలు నువ్వు ఎన్ని మార్లు చిలిపి చిలిపి అని ఆస్వాదించి ఉండవు ? "

విలేకరి కోమలాంగి తలూపింది

ఇదీ అట్లాగే ..  మా బుడతడు ఇప్పుడిప్పుడే నడతలు నడకలు నేరుస్తున్నాడు ... వాడేదో అన్నాడని నా ప్రియతమ మైన కుర్చీ ని వదలదమనడం ఎట్లా మరి ?'

మరో విలేకరి ... మరో ప్రశ్న సంధించ బోయాడు .

పెద్దాయన 'ఓకే గైస్ ... నౌ హేవ్ గుడ్ డిన్నర్' చెప్పాడు .

విలేకరులు అందరు టప్పున 'ప్లేటు ఫిరాయించి ' డిన్నరు మీద పడ్డారు ....

ఆకసాన హంస ఎగిరింది...

విలేకరి అమ్మాయి చెప్పింది మరో విలేకరి తో ... మన పీ ఎం యు నో ... హీ ఈజ్ సో లైవ్లీ "

యా యా ... దిజ్ ఈజ్ మై ఫస్ట్ డిన్నర్ ఇన్ ది స్కై .... "


కథ కంచికి మన మిక ఇంటికి !!


శుభోదయం
జిలేబి

Monday, September 30, 2013

మేరా భుక్తి మీరా భక్తి !



 
మీరాబాయ్ లా
 
భక్తీ శ్రద్దల తో
 
ఉండా లను కుంటా 
 
ప్చ్ మేరా భుక్తి
 
నన్ను భక్తీ కి శ్రద్ద్దకి మధ్య
 
ఊగిస లాడిస్తున్నది 
 
భక్తీ భుక్తి సమ ఉజ్జీలా ?
 
 
 
జిలేబి 
 
 
 

Saturday, September 28, 2013

కురవని మేఘం !

 
ఘనీభవించిన మేఘం
కురవ నని మొరాయించింది
మలయ మారుతం
ప్రచండ మారుత మై మీద పడితే
చిన్నా భిన్నమై
దూది పింజలా
చెల్లా చెదురై పోయింది !
 
 
శుభోదయం
జిలేబి

Friday, September 27, 2013

బ్లాగు సన్యాసం - ఆఖరి భాగం !


బ్లాగు సన్యాసం కథ భాగం రెండు ఇక్కడ

బ్లాగు సన్యాసం - ఆఖరి భాగం !

ఆ కోమలాంగి ట్వీటరీ దేవి స్వామి వారి సన్నిధి కి వెళ్ళే దారిలో మరో ఇద్దరు ముగ్గురు 'స్వామీ' సోదరీ సోదరులను పరిచయం చేసింది జిలేబి కి ...

వీరు పరివ్రాజ జీమైలానందా  వారు- మన ఆశ్రమ ఉత్తర ప్రత్యుత్తరా లన్నీ వీరే చూస్తూ ఉంటారు 

ఈవిడ అక్షరాముద్రితమాయి, మన ఆశ్రమ కంటెంట్ మేనేజ్ మెంట్ స్పెషలిస్ట్

ఈ 'యంగ్' అశ్రమ వాసిని  ఇవ్వాళే స్వామీ వారు ఈవిడకి దీక్ష ఇచ్చేరు  "సమ సంఘ గాలాక్షీ పంచముఖీదేవి మాయి !"

అబ్బా స్వామీ ముఖ పుస్తకానందా వారికి ఎంత 'జ్ఞాన మో '! ఆ ట్వీ ట రీ దేవి నిజ్జంగా బుగ్గన వేలు పెట్టు కోవడం ఒక్కటే తక్కువ మరి !

జిలేబి అదిరి పడింది. తాను పొరబాటున మళ్ళీ అంతర్జాలం లో కి వచ్చేసిందా ? అన్నీ మరీ తెలిసిన పేర్ల లాగే ఉన్నాయే మరి ?

ఆ ఈ హిమాలయాల్లో అస్సలు సెల్ ఫోన్ పని చేయని ప్రాంతాల్లో అంతర్జాలం ఎట్లా ఉంటుంది ? తనది భ్రమ ! అంతా విష్ణు మాయ ఈ పేర్లన్నీ తనకు తెలిసినవి లా ఉండడం కూడా మాయే !

తను ఈ మాయాజాలం నించి బయట పడ డానికే గదా హిమాలయానికి ఈ ఆశ్రమానికి వచ్చింది !?

మాడరన్ డెన్ ధ్యాన గుహ లో స్వామీ ముఖ పుస్తకానందా వారు తన 'wall' మీద కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ చిద్వాలసంగా కూర్చుని ఉన్నారు
 
'ఆహా స్వామి వారి ముఖం ఎంత 'తేట తెల్ల' గా ఉన్నది జిలేబి అబ్బుర పడింది . కొద్దిగా మరింత గమనికగా గమనిస్తే ఫేషియల్ చేసుకుని ఉన్నారేమో అని పించింది

మరీ మేకప్ వేసుకుని ఏమైనా ఉన్నారా ? అబ్బే అంతా విష్ణు మాయ ! అసలు తన బుర్ర సరి లేదు  జిలేబి తన్ను తానె నిందించు కుంది చ చ కైలాసం వచ్చిన తన జిలేబి బుద్ధులు పోలే మరి అనుకుంటూ !

స్వామీ ము.పు ఆనందా వారు చిరు నవ్వు నవ్వేరు ! - జిలేబీ మీరు ఇక్కడి వస్తారని నాకు తెలుసు !  చెప్పెరాయన .

వామ్మో ! ఈ స్వామీ మరీ త్రికాలవేది లా ఉన్నాడే ! తన పేరు కూడా ఈయనికి తెలుసు !

'మీరు ఇక్కడి కి రావడం అంతా 'పరదేవత' ఇచ్చ !' స్వామీ వారు చెప్పేరు ' నిన్నే మా కేంపస్ నించి ఒక ఎనభై ఏళ్ల అమెరికన్ భక్తుడు - బ్లాగా నందా అమెరికా వెళ్లి పోయేడు తనకు 'ఫాదర్ లేండ్' చూడా లని ఉందని '

అప్పుడే అమ్మ చెప్పింది --> నో ప్రాబ్లెం ముఖ్ పుస్తక్ బేటా - ఒక  old lady జిలేబి రేపే నీ చెంతకు వచ్చును ' అని !

జిలేబి ఈ త్రికాల వేదాన్ని విని సంతోష పడ్డది గాని --> తన్ని old lady అనడం నచ్చలే !

ప్చ్ ప్చ్ ఇట్లా ఓల్డ్ అయిపోతూ ఉంటే ఎట్లా !

స్వామీ వారు ట్వీ ట రీ దేవిని దగ్గరకి పిలిచి చెప్పేడు  -  'ఈ జిలేబి వారికి మన ఆశ్రమాన్ని చూపించి ఆ పై ఆ బ్లాగు రూములో సెటిల్ అయి పొమ్మని చెప్పు --> నిన్నటి నించి అస్సలు మన ఆశ్రమ బ్లాగు అప్డేట్ లేకుండా పోయింది --> ఇది మరీ అర్జెంట్ ' అన్నాడు .

ఆ దేవి తిరిగి వస్తూం టే మళ్ళీ పిలిచి ఏదో గుస గుసలాడేడు -- అవి గుస గుసలా లేక ముద్దు ముచ్చట్లా అని జిలేబి కి సందేహం వచ్చినా ఛీ ఛీ ఇవన్నీ విష్ణు మాయ అంశాలే అనుకుంది .

జిలేబి కి వయసు ఎక్కువైనా ఇంకా చెవులు పాము చెవులే --> స్వామీ వారి చుంబన మాటలు విన బడ్దేయి -->

'ట్వీటర్ దేవి--> ఈవిణ్ణి ఆ బ్లాగు రూమ్ నించి బయటకు రానీ కుండా చూసుకో ! మన ఆశ్రమం 'వృద్ధాశ్రమం ' అని పేరు వచ్చే బోతుంది I dont want that to happen --> we are youngish you know!" అన్నాడు !

జిలేబి అదిరి పడింది --> స్వామీ వారితో ఏదో చెప్ప బోయింది --> స్వామీ వారు చేయి గుమ్మం వైపు చూపిస్తూ --> యు ఆర్ డిశ్ మిస్డ్ అన్నాడు --> తన అపెల్ 'లేపతాపమును ' ఓపెన్ చేస్తూ !

హా హత విధీ అని జిలేబి మూర్చ పోయి ' Oh My God' ఇక్కడ కూడా అమ్తర్జాలమే నా !' అని ఎలుగెత్తి పైనున్న భగవంతుణ్ణి పిలిచింది

పై నించి ఆకాశ వాణి సమాధానం వచ్చింది -

" God 'is' no more willing to answer distress calls - you can send your issues by mail only send to God@gmail .com - When He has time he will reply, now shut your mouth and go back to open your mail Aashram updates blog"

*********

జిలేబి మంచం పై నించి దబ్బున నేల మీద పడింది !

జిలేబి జిలేబి ఏమయ్యింది ! అయ్యరు గారు జిలేబి ని తట్టి లేపేరు ! 'ఏమన్నా పీడ కల కన్నావా జిలేబి ?' అయ్యరు పృచ్చ !


చీర్స్
జిలేబి

(సరదా సరదా గా ... ఈ మధ్య కష్టే ఫలే వారు బ్లాగు వదిలి సన్యాసం పుచ్సుకుంటా - సెల్ నెట్ లేని ప్రదేశాలకి వెళ్లి పోతా నన్నారు ! ఆలోచిస్తే ఈ మధ్య ఏ స్వాములోరైనా ఈ ఆశ్రమ మైనా అస్సలు 'నెటిజెన్' కాకుండా ఉన్నదా అన్న సందేహం వచ్చింది -- ఆలోచిస్తా ఉంటే ఈ కల వచ్చింది -

ఈ టపా బ్లాగు సన్యాసం పుచ్చుకోవాలని అనుకున్న మన శర్మగారికి మరి పుచ్చు కోవాలని అనుకుంటున్న మరెవైరనా 'బ్లాగోదరీ' బ్లాగోదరులకు ' అంకితం !!)

 

Thursday, September 26, 2013

బ్లాగు సన్యాసం కథ - భాగం రెండు

బ్లాగు సన్యాసం కథ - భాగం ఒకటి ఇక్కడ -

'నిర్ణ యించేసు కున్నా. ఫైనల్ గా వెళ్లి పోవడాని కే - బ్లాగు సన్యాసం స్వీకరించ డానికే ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచానికి దూరంగా, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని చోటికి వెళ్లి పోతున్నా ' పెట్టా బేడా సర్దేసుకుని అయ్యరు గారితో ఖరా ఖండి గా చెప్పేసింది జిలేబి

'ప్చ్ ప్చ్ అని అయ్యరు గారు 'సరెలేవే జిలేబి వెళ్లి, రా ' అన్నారు

'వెళ్లి మళ్ళీ రావడమే. అబ్బే వెళ్ళడమే ఇక అంతే '

సర్లే . యథో కర్మః అని .. పోయి రా . ఆల్ ది బెష్టు ! దీవించేరు అయ్యరు గారు జిలేబి ని .

జిలేబి అయ్యరు గారికి ప్రణామములు తెలిపి తూరుపు దిక్కు తిరిగి దండం పెట్టి ఉత్తర దిశ గా హిమోత్తుంగ పర్వత దిశ గా బయలు దేరింది .

^^^^

హిమాలయా పర్వత శ్రేణులు .

'జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ముఖపుస్తాకా నందా స్వామి ఆశ్రమం'

బోర్డు చూసి ఆశ్రమం లోకి కాలు పెట్టింది జిలేబి .

ఫ్రెష్ గా నున్న గా షేవింగ్ చేసుకున్న ఒక స్వామీ జీ వారు ఎదురోచ్చేరు .

చూడ్డా నికి మరీ చిన్న పిల్లాడిలా ఉన్నాడే ఈ స్వామీ అనుకుంది జిలేబి  స్వాములోరికి వయసు తక్కువైతే ఏమి మరి ఉండ కూడదా అనుకుని 'దండాలు స్వామీ దండాలు ' చెప్పింది జిలేబి .

స్వామీ వారు ఓ మారు తలపంకించి - 'వెల్కం టు అవర్ కుబేరా పార్క్ - ఇది స్వామీ ముఖ పుస్తకానందా వారి ఆశ్రమం ' అన్నారు .

జిలేబి పులకరించి పోయింది స్వామీ వారి స్వాగతానికి .

'నా పేరు జిలేబి నేను సన్యాసం తీసుకోవాలను కున్నా అందు కని ఈ వైపు వస్తోంటే మీ ఆశ్రమం కనబడింది  ... '

చెప్పింది జిలేబి .

అంతా పర దేవత ఇచ్చ ! మీ రాక మా స్వామీజీ వారికి చెబుతా ' అంటూ ఆ కుర్ర సన్యాసి ఆశ్రమం లో పల వున్న ఓ మాడరన్ బంగ్లా లాంటి చీఫ్ స్వామీ వారి ప్రార్థనా గుహ లో కి వెళ్లి ఓ ఐదు నిముషాల లో తిరిగి వచ్చేడు మరో సుందరి తో .

అబ్బా ఈ అమ్మాయి ఎంత నాజూగ్గా ఉందో అనుకోకుండా ఉండ లేక పోయింది జిలేబి తన భారీ శరీరాన్ని చూసు కుంటూ . చ చ చ ఈ అయ్యరు గారు పెట్టె తిండి తిని ఇట్లా బలుపు ఎక్కువై పోయి ఇట్లా లావై పోయి ఉన్నా. ఇక ఆ పై వార్ధక్యం కూడా వచ్చి పడిందా యే . ఎట్లా అయినా ఈ ఆశ్రమం లో సేద దీరి ప్రతి రోజూ ఉప్మా వాసం చేసైనా సరే సన్న బడి నాజూకు గా తీగలా తయారై పోవాలనుకుంది జిలేబి

ఆ కుర్ర స్వామీ ఈ నాజూకు అమ్మాయి ని పరిచయం చేసేరు - ఈ అమ్మాయి పేరు 'ట్వీటరీ దేవి - ఈవిడ మిమ్మల్ని స్వామీ వారి దగ్గరికి తీసుకు వెళుతుంది . ' చెప్పేడు ఆ కుర్ర స్వామీ.

స్వామీ మీ పేరు చెప్పేరు కారు అడిగింది జిలేబి .

'యు నో హి ఈజ్ యు ట్యూబానందా స్వామీ' కలకంటి ట్వీ టరీ దేవి తేనె లోలి కే కంటం తో  గారాలు పోయింది స్వామీ వారి మీద వాలి పోతూ .

జిలేబి కి ఎందుకో ఇది కొంత ఇబ్బెట్టు గా అనిపించింది . అదేమిటి ఈ అమ్మాయి ఇట్లా వాలి పోతోంది సభ్యత లేకుండా ! ఇది ఆశ్రమం కూడాను మరి  అనుకుంటూ .

ఆ ట్వీట రీ దేవి జిలేబి ఆలోచనలు టప్ మని పట్టేసి --> 'ఆంటీ ' యు నో యూ ట్యూబ్ ఆనందా 'is' మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ' అంది ! ఆ మాటలు జిలేబి కి అప్పటి అర్థం కాలేదు --> 'How can an ex-boyfriend be 'is' ! '


(సశేషం)
జిలేబి






***

 

Wednesday, September 25, 2013

బ్లాగు సన్యాసం కథ !

 బ్లాగు సన్యాసం కథ

నే పోతా చెప్పింది జిలేబి

ఎక్కడికోయ్ ?

ఈ బ్లాగు లోకం విడిచి పోతా

ఎందుకోయ్ ? అడపా దడపా రాస్తూండు ; చదివిన వాళ్ళు చదువుతారు ; నీ లాంటి టైము ఉన్న వాళ్ళు కామెంటు తారు ; నీకూ టీం పాస్ అండ్ టైం పాస్.

అన్నీ వదిలి ఇట్లా పోతా నంటా వె మరి ? నీ వెలా కాలం గడుపుతావ్ ?

లేదు నేను సన్యాసం స్వీకరించి వెళ్లి పోతున్నా . అంతర్జాలం అన్నది లేని ప్రదేశానికి .
నిశ్చయించుకున్నా.

అయ్యరు గారు అడిగేరు - ఎక్కడి కి వెళతా వోయ్ ?

ఏ హిమాలయాలకో తుంగా తీరానికో ఏ కోన లో కో అసలు నన్ను ఈ అంతర్జాలం తాక నంత దూరానికి వెళ్లి పోతా .
ఈ ఎలక్ట్రానిక్ ప్రపంచానికి దూరంగా, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందని చోటికి, తొందరలో వెళిపోవాలని నిశ్చయించుకున్నా.


నువ్వెళ్ళి పొతే నీ రెగ్యులర్ బ్లాగ్ రీడర్ల ఏమయి పోతారు జిలేబి ? పాపం తెల్లారి లేస్తే నీ టపా కసమిసలు చదవందే వాళ్లకి పొద్దు పోదే మరి ? వాళ్ళని 'పని లేని' వాళ్ళు గా చేసేసి వెళ్లి పోతే ఆ కర్మ ఫలం నీకు చుట్టు కుంటుంది సుమా !'

ఆ నోరు తెరిచా . ఈ అయ్యరు గారు ఎట్లా అయినా మాట్లాడ టానికి తగుదురు ! వీరి మాటలని వినకూడదు గాక విన కూడదు . వెళ్ళా ల్సిందే మరి

పెట్టా బేడా సర్దు కున్నా . పోతూ పోతూ ప్చ్ పాపం మన రీడర్లు ఏమి పోతారో అన్న బెంగ పట్టుకుంది . సర్లే ఓ టపా కొట్టి పోతా నను కుని ఓ టపా కొట్టింది జిలేబి - నే వెళ్లి పోతున్నా ఈ పంచ దశ లోకం విడిచి పెట్టి అని.

టపా పెట్టెక చూసింది జిలేబి ; సరే కామెంట్లు ఏమి వచ్చాయో చూసి నాలుగు రోజులు తరువాయి వెళ్దాం లే అనుకుంది .

నాలుగు రోజులు గడిచేయి

యథా ప్రకారం గా కామెంట్లు వచ్చి పడ్డేయి

కామెంట్లు వస్తున్నాయి - ఆయ్ జిలేబి ఇట్లా ఒకే మారు వెళ్ళ మాకు కావాలంటే రెష్టు తీసుకో ఆ పై తిరిగి వచ్చేయి

ఆయ్ జిలేబి నీ టపా చదవందే నాకు పొద్దు గడ వదు వగైరా వగైరా ...

జిలేబి ఆలోచనలో పడింది . ఇప్పుడెం చెయ్యాలి ? అయ్యరు గారితో నొక్కి వక్కాణించే సా నే వెళ్లి పోతా నని ?

ఇప్పుడు ప్చ్ ప్చ్ ఈ బ్లాగర్ల ని కష్ట పెట్టి వెళ్ళా ల్సిందే నా మనం ?

రాత్రి గడిచింది ... తెల్లారి ఓ నిర్ణయానికి వచ్చేసింది జిలేబి .....


(సశేషం)
జిలేబి

Monday, September 23, 2013

నమస్కారం !


 
'మస్కా '
 
రామ్  
 
 
జిలేబి 

Saturday, September 21, 2013

జిలేబి వారి జాంగ్రి !


చాలా కాలం గా అదేమి ఈ పేరు జిలేబి . వీరికి జిలేబి అంటే అంత ఇష్టమా జిలేబి అని పేరెట్టు కున్నారు అని అనుకున్న వారూ ఉన్నారు !

సరే , జిలేబి వారు జాంగ్రీ వేస్తే ఎట్లా ఉంటుందో మరి !?

జాంగ్రీ కి జిలేబీ కి వ్యత్యాసం ఉందంటారా ? రెండూ స్వీటె  . ఎక్కువైతే వెగటే . జిలేబి + జాంగ్రీ ఒక్కరే వేస్తే , అదే బాణలి లో  వేసారను కొండి అప్పుడు ఇది జిలేబి యా జాంగ్రీ యా అన్న సందేహం కూడా రాక పోదు మరి .

జాంగ్రీ కొంత మంద పాటి . జిలేబి సన్నపాటి . ఇదీ ఒక వ్యత్యాసమేనా ? నాలుగైదు జిలేబి లను కలిపేస్తే ఇక జాంగ్రీ అయిపోదూ ? ఆ పాటి దానికి స్పెషల్ గా జాంగ్రీ వేయాలా అన్న మాటా రాక మానదు !

పూర్వ జమానాలో రాయచోటి లో పని జేసే టప్పుడు ఓ సాయిబు వేసే జాంగ్రీ అంటే పడి చచ్చి కొని తినే వాళ్ళం . ఈ జాంగ్రీ ని ఆ సాయెబు కోవా జాంగ్రీ అని అమ్మే వాడు . అప్పటికే అతను అరవై సంవత్సరాల పై బడి ఉన్న వాడు . ఇప్పుడు వారి సంతతి ఏమైనా ఆ కోవా జాంగ్రీ ని వేస్తున్నారేమో మరి .

ఇంతకీ ఇట్లా తాడూ బొంగరం లేకుండా టపా పెడితే అది జాంగ్రీ అవుతుందా ? లేక జిలేబి అవుతుందా ?

ఇక జిలేబి వారి జాంగ్రీ ఏమిటి అంటారా ?

అసలు జాంగ్రీ వేద్దామా జిలేబి వేద్దామా అన్న సందేహం లో కొట్టు మిట్టాడి మా అయ్యరు గారి ని అడిగా ఏమండీ అయ్యరు  గారు ఇట్లా జాంగ్రీ జిలేబి అంటారు గా ? ఇవన్నీ మన భారద్దేశ పిండి వంట లేనా ? లేక 'ఫారెను' వంట లా  అని ?

వారికి తోచింది వారు చెప్పేరు - ముసల్మాను లు భారద్దేశం పై దండ యాత్రల కు వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ వారితో బాటు వచ్చిన వంటకాలు అయి ఉండ వచ్చు - కాల గతి లో భారద్దేశ పిండి వంటల లో కలిసి పోయి ఉండ వచ్చు అని .

ఉదాహరణ కి ఈ ముంత మామిడి పప్పు ఉంది చూసేరు - ఇది  పోర్చుగీసు వారితో వచ్చింది - ఇప్పటి కాలం లో ఈ జీడి పప్పు వేయని పాకం ఏదైనా మన దేశం లో మరి ఉందా ?

ఇది కాదా మరి భారద్దేశ గొప్ప దనం  ? ఆంగ్లం లో అంటారు చూడండి - మెల్టింగ్ పాట్ అని అట్లా దేశం లో కి వచ్చిన ప్రతిది దేశం లో ఇమిడి పోయి మరో సరి కొత్త రూపాన్ని సంతరించు కోవడమే కదా ఈ భరత భూమి గొప్ప దనం !

ఇస్లాము దేశ వాళీ సనాతన ధర్మం తో కలగలిసి సూఫీ - దేశవాళీ సూఫీ అవడం, ఈ రెండిటి మధ్యా ఉన్న మంచి విషయాలను గ్రహించి శిక్కు మతం ఉద్భవించ డం ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు జాంగ్రీ లు ఎన్నైనా వేయ వచ్చు !

మరో ఉదాహరణ - దేశవాళీ తనదై చేసేసు కున్న మొబైలు !

బయలు కెళ్ళినా మొబైలు పట్టు కునే వెళ్ళే వాళ్ళం అయ్యేంత దాకా వచ్చేసా మంటే ఇది మరో మెల్టింగ్ మెగా దేశం కాదూ మరి !



ఈనాటి  e-జాంగ్రీ తో
చీర్స్ సహిత
జిలేబి
 

Thursday, September 19, 2013

భిక్కువు - భిక్షా పాత్ర !

 
భిక్కువు - భిక్షా పాత్ర !
 
భిక్కువు భిక్షా పాత్ర తో 
రోడ్డెక్కాడు 
రోడ్డు నిర్మానుష్యం 
 
నుదిటి చెమటను తుడిచి 
భిక్షా పాత్ర ను పక్కన పెట్టాడు 
రోడ్డు నిండా జనవాహిని !
 
చీర్స్ 
జిలేబి 
 
 

Wednesday, September 18, 2013

విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః !

"వైదేహీ, జనకాత్మజే, స్త్రీలు స్వభావ రీత్యా విముక్త ధర్మ రీత్యా చపలులు, భేదాన్ని కలిగించే వాళ్ళు - ఇట్లాంటి పరుష వాక్యాలు నీ వద్ద నించి నేను వినలేను "

చెప్పింది లక్ష్మణుడు - ఉద్దేశించింది సీతమ్మ తల్లిని .

అరణ్య కాండ లో జింక రూపం లో ఉన్న మారీచుడు 'హా సీతా' అంటే , అది తన భర్త రాములవారిదే ననుకుని, లక్ష్మణుని రాములవారిని కాపాడ డానికి వెళ్ళమంటే, లక్ష్మణుండు ససేమిరా కుదరదం టాడు - ఆ ఆర్త నాదం రామునిది కాదు - ఆ మాయావి రాక్షసులది - నిన్ను కాపాడ మని రాములవారి ఆజ్ఞ - ఇక్కడి నించి కదలను గాక కదలను అంటే-

అమ్మవారు "సంరక్త లోచను" రాలై లక్ష్మణుని పరుష వాక్యాలతో అంటుంది -

'లక్ష్మణా, నువ్వు నన్ను పొంద డానికే రాముని వెంట గోముఖ వ్యాఘ్రం వలె పొంచి పొంచి వచ్చావు ఈ కాననానికి" అని .

అంతటి తో ఊరుకున్నదా  ?

"ఇది నువ్వూ , భరతుడు కలిసి ఆడుతున్న నాటకం కూడా అయివుండ వచ్చు. భరతుడు అర్ధం (రాజ్యం) , నువ్వు మరొక అర్ధమైన నన్ను నా పతి నించి వేరు జేయాలని అనుకున్నారు' అంటుంది పరుషం గా  .

"నా పై కోరికతో నువ్వు  రాముడు ఎట్లా పోయినా ఏమైనా కానీ అని ఆతన్ని కాపాడ డానికి  వెళ్ళ నంటు న్నావు "

लोभात् तु मत् कृतम् नूनम् न अनुगच्छसि राघवम् |
व्यसनम् ते प्रियम् मन्ये स्नेहो भ्रातरि न अस्ति ते || ३-४५-७

ఇట్లా పరుష మాటలు మాట్లాడి (వాల్మీకి అంటాడు 'సంరక్త లోచనా ! అని ) అన్న మరో క్షణం లో నే కళ్ళ నీళ్ళు జల జలా రాలి పోతున్నాయి - భీత హరిణి ! - బాష్ప శోక సమన్విత !

మరో క్షణం లో లక్ష్మణుని - अनार्य करुणारंभ नृशंस कुल पांसन అంటూ మరో మారు జాడించడం మొద లెడు తుంది !

ఈ అరణ్య కాండ లో ఈ ఒక్క సర్గ లో నే వాల్మీకి  స్త్రీ ఒక వివశ స్థితి లో ఎట్లా ఎట్లా మాట్లాడ గలదు - ఏమేమి అనుకో గలదు - ఏవిధ మైనట్టి 'reaction' చూపించ గలదు అన్నదాన్ని  ప్రముఖం గా చూపించడం జరుగుతుంది.

యథొ కర్మః తథొ ఫలః  అన్నదానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అవుతుందేమో మరి.

ఇట్లాంటి పరుష వాక్యాలని సీతమ్మ లక్ష్మణుడి తో అనటం - అదిన్నూ తన భర్త తమ్ముడు, పుత్ర సమానుడు ఐన వాడి తో అనటం - దీని పరిణామం - యుద్ధ కాండ లో - రాముల వారితో అట్లాంటి పరుష వాక్యాలు పలికించ డానికి కారణ భూతమయ్యిందేమో మరి కూడా అనిపిస్తుంది .

మళ్ళీ అంటుంది సీతమ్మ లక్ష్మణుడి తో -- గోదాట్లో దూకైనా , అగ్నిలో దూకైనా చస్తా గాని, రాముల వారు లేని జీవితాన్ని నేను చూడ లేను - మరొక్కరి తో ఉండ లేను అని - गोदावरीम् प्रवेक्ष्यामि हीना रामेण लक्ष्मण ! అంటుంది

(రామాయణం లో ఈ అరణ్య కాండ తనకు అన్నిటి కన్నా నచ్చిన కాండ అని చెప్పు కున్నారు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రు ల వారు - ఎందుకంటే - ఇందులో గోదావరి మాట ఉన్నదంట ! కాండం పర్యంతం ఆంధ్ర దేశం ఉన్నదంట !-  అందుకనేమో 'గోదాట్లో దూకి చస్తా ' అన్న పదం ఆంధ్ర దేశం లో ప్రాశస్త్య మైన పదమయి పోయింది మన  'ఆండోళ్ళ కి ' , సీతమ్మ వారి స్టైల్ లో !- అబ్బా, ఈ గోదావరి తీరం వాళ్ళు రామాయణం లో కూడా గోదారి తెడ్డు వెయ్యకుండా ఉండరు సుమీ !!!))

प्रवेक्ष्यामि हुताशनम् |! - అగ్గి లో బుగ్గై పోతా నంటుంది మళ్ళీ .

దీని పర్యవసానం - యుద్ధ కాండ లో అగ్ని ప్రవేశ ఘట్టం !

మరి ఈ అగ్ని ప్రవేశానికి కారణం సీతమ్మ తన గురించి చెప్పిన శోకా తప్త మాటలే తధాస్తు దేవతలయ్యే యా ?

పరుష వాక్యాలను విన్న లక్ష్మణుడు తన రెండు చెవుల మద్య కాల్చిన బాణం  తో పొడిచినట్టు ఉన్నది అని మళ్ళీ ఇట్లా అంటాడు - "ఇట్లాంటి ధిక్కారా లతో నిన్ను నువ్వే శపించు కుంటున్నావు వైదేహీ అని" - धिक् त्वाम् अद्य प्रणश्यन्तीम् !

(పానకం లో పుడక !
నిన్నటి గజేంద్ర హస్తాభిహతేవ వల్లరి కి లేటెస్ట్ ఉదాహరణం - నీనా దావులూరి - అమ్మాయి మిస్ అమెరికా అయితే - సోషియల్ మీడియా మొత్తం రేసిస్ట్ కామెంట్ల తో - సూటి పోటి మాటల తో - మిస్ ఇండియా కూడా ఈవిడ కి అయ్యే సత్తా లేదు - మరి మిస్ అమెరికానా లాంటి కామెంట్ల తో ! భరితం - ఇది కాదా  మరి గజేంద్ర హస్తాభి హతేవ వల్లరి?)

న తు అహం రాఘవాత్ అన్యం కదాపి (పదాపి!) పురుషం స్ప్రుశే !

न तु अहम् राघवात् अन्यम् कदाअपि (पदापि !) पुरुषम् स्पृशे!?

శుభోదయం
జిలేబి
(ఏమోయ్ జిలేబి, రామాయణం మీద పడ్డావు?- వెనక నించి అయ్యరు గారి పృచ్చ!)

Tuesday, September 17, 2013

గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ!

"రావణుని చేత అపహరింప బడి ఆతని ఇంట ఇన్ని రోజులు ఉన్న సీతా, నువ్వు నాకు తగిన దానవు కావు "

చెప్పినది రామభద్రుడు .

అంతటి తో ఊరుకున్నాడా ?

"నువ్వు నాకు తగిన దానవు కావు . లకష్మణుడి నో, భరత శత్రుఘ్నుల లో ఎవరినో, మరీ కాకుంటే, సుగ్రీవు ణ్నో విభీష ణు డి నో వేరే ఎవరైనా సరే నీ ఇష్టం ఎవరినైనా నీవు కోరి వారితో వెళ్ళు ' అంటాడు .

तदद्य व्याहृतं भद्रे मयैतत् कृतबुद्धिना |
लक्ष्मणे वाथ भरते कुरु बुद्धिं यथासुखम् || ६-११५-२२

शत्रुघ्ने वाथ सुग्रीवे राक्षसे वा विभीषणे |
निवेशय मनः सीते यथा वा सुखमात्मनः || ६-११५-२३


పతియే దైవమ్. అట్లాంటి పతి రామచంద్రుడు "జనవాద భయాందోళన చెందిన వాడై " , రెండు ముక్కలైన హృదయం తో అమ్మవారి తో ఈ మాట అంటే - ఇక సీతమ్మ గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ కాక మరి ఎట్లా ఉంటుంది ?

భీత హరిణేక్షిణి అని చాలా సాధారణం గా విని ఉంటాం .

సీతమ్మ గారి ని వాల్మీకి యుద్ధ కాండ లో - రావణ సంహారం తరువాయి గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ! అని పోలుస్తాడు. గజేంద్రుని హస్తం తో అభిహత మైన వల్లరీ అని .(ఒక ఏనుగు చేత లేత కొమ్మ పెకిలించి వేయ బడితే ఎట్లా ఉంటుందో కాకుంటే ఒక ఏనుగు తొండం తో దెబ్బ తిన్న ఒక తీగ కంపనం ఎట్లా ఉంటుందో మరి చెప్పాలా ?)

సందర్భం ఏమిటి ?

స్వామి వారు రావణ సంహారం తరువాయి అమ్మవారితో మాట్లాడే సమయం . అగ్ని పరీక్ష కి మునుపు సంభాషణ .

సింపుల్ గా 'నువ్వు వేరే ఎవరితో నైనా 'సెటిల్' అయిపో , నాకు తగిన దానివి కావు ' అని ఏ మగడైనా అంటే (ఇది చాలా పచ్చి గా ఉన్నదనుకుంటే ఎవరితో నైనా లేచి పో - అన్నాడను కొండీ ) ఇక ఆ స్త్రీ హృదయం ఎట్లా ఉంటుంది ?

వాల్మీకి ఒక ముక్క , జస్ట్ ఒక ముక్క - రాసి ఉండ వచ్చు - రాముల వారు సీతమ్మ తో - నువ్వు నాకు తగిన దానివి కావు' అని అన్నాడని  .

ఆ పై అట్లా పరుష మైన వాక్యాలు రామ భద్రుడు సీతమ్మ వారి తో అన్నట్టు రాసే డంటే - దీని వెనుక - ఆ కాలం లో జనవాదానికి, ప్రజల ఎద్దేవా కి ఎంత భయం ఉండేదో  అని పించక మానదు .

శ్రీ రాముల వారిని ఎవరైనా ఏదైనా అంటే అది మరీ వివాదాస్పద మయి పోతుంది . కాని రామాయణం - వాల్మీకి రామాయణం లో అయోధ్యా కాండం లో ఈ సర్గ శ్లోకాలు చదివితే మనం నిజంగా ఆలోచనలో పడక మానం మరి !

ततः प्रियार्हश्रवणा तदप्रियं |
प्रियादुपश्रुत्य चिरस्य मैथिली |
मुमोच बाष्पं सुभृशं प्रवेपिता |
                 गजेन्द्रहस्ताभिहतेव वल्लरी || ६-११५-२५


ఇప్పుడు కాలం మారింది . అయినా స్త్రీ ఇంకా గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ యే  ! దేశం లో ఎన్ని చట్టాలు , కోర్టులు తీర్పులు చెప్పినా గజేంద్ర హస్తాభిహతేవ వల్లరీ యే అని పించక మానదు



సీతాం ఉత్పల పత్రాక్షీమ్
నీలకుంచిత మూర్ధజాం !

జిలేబి 

Monday, September 16, 2013

Enjoy the path! Let the Goal wait for Me!

I am so obsessed with this Goal !
 
Every buddy says reach the Goal !
What is so great about Goal?
Whether I reach or not its staying eternally there!
So let it wait eternally for me then!
 
Goal, if thou is got by serendipity
Me too hast that time immortal given by thou!
Either the time takes of me
or
I take in time does not matter !
 
May it be so that in the game of me and Me
Let the Me take over of me rather than me try to get that Me
 
Me, Less of Me if its me, then let Thou be that Me
for to be that Me let me not ponder this me for Me !
 
 
Me that not me
Zilebi

Sunday, September 15, 2013

గుర్తింపు కోరిన మేఘం !

గుర్తింపు కోరిన మేఘం !
 
ఒక మేఘం గుర్తింపు కోరింది 
మేఘ గర్జనై ధారాపాత మయ్యింది 
ఒక చినుకు గుర్తింపు కోరింది 
కుంభవృష్టి యై కురిసింది 
ఒక కోన గుర్తింపు కోరింది 
జలపాతమై తల కోన అయ్యింది 
ఒక పిల్ల కాలువ గుర్తింపు కోరింది 
నదియై పరవళ్ళు తొక్కి మహానది అయ్యింది  
ఒక మహానది గుర్తింపు కోరింది 
వరదై పెనువరదై సుడిగుండమై  సాగరాన్ని చేరింది 
ఒక సాగరం గుర్తింపు కోరింది 
ఉవ్వెత్తున లేచి ఉప్పెనై ఆకసాన్ని ముద్దెట్టేసు కుంది 
 
చర్విత చర్వణం !
హిరణ్యగర్భః  సమవర్తతాగ్రే ....  
 
 
శుభోదయం 
జిలేబి 
 
 
 
 

Friday, September 13, 2013

తెలుగు తండ్రి !

తెలుగు తండ్రి ! ఒక స్నాప్ షాట్ !
 
ఫోటో కర్టెసీ గూగులాయ నమః !


చీర్స్ 
జిలేబి