కాలా కాలం గా సన్నాసులు బుట్టలో పడటాన్ని కొనియాడే శుభ దినం సందర్భాన ఇవ్వాళ సన్నాసుల వారి కథా, బుట్ట బొమ్మ కథా తెలుసు కుందాం !
జిలేబీ పెళ్లి రోజు .
బుట్ట లో జిలేబీ ని పెట్టుకుని వస్తూంటే , బుట్ట బొమ్మ లాంటి అమ్మాయి నాకు కాబోయే అర్ధాంగీ అని మురిసి పోయిన జంబు నాధన్ కృష్ణ స్వామీ అయ్యరు గారికి అవ్వాళ తెలిసి రాలే, బుట్టలో బొమ్మ పుత్తడి బొమ్మ కాదని, పేరు మాత్రమె జిలేబీ అని, తానె బుట్టలో బోల్తా పడ్డాడనీ నూ.
ఆ పై మూడు రాత్రుళ్ళు (ఈ మూడు రాత్రుళ్ళ ముచ్చట గురించి నేను చెప్పను బాబు మరీ సిగ్గు !) కానించిన తరువాయి శ్రీ అయ్యరు వారు 'జిలేబీ, మాంచి ఫిల్టరు కాఫీ ఒక్కటి పట్టుకు రావోయ్ " అంటే జిలేబీ బిక్క మొగం బెట్టి,
"అయ్యరు గారు, మీకు వంట బాగా వచ్చనే బామ్మ నాకు చెప్పి నన్ను మిమ్మల్ని కట్టు కొమన్నారు " అని బిక్క మొగం పెడితే, వంశ పారంపర్యం గా వచ్చే అయ్యరు హోటలు వృత్తి ఇంట్లో కూడా వంట గాడేనా, గాదేనా నా గతీ , రాధా, నా జిలేబీ ఇది నీకు తగునా సుమీ అని మా అయ్యరు వారు ఉసూరు మన్నారు !
ఈ మా పెళ్ళి ఈ సో కాల్డ్ యాదృచ్చికమో, కాక 'తాళీ' బలీయమో జంబూ వారికే తెలియాలి !
ఈ సన్యాసి బుట్టలో పడే కార్యక్రమము నే పెళ్లి దినాన అబ్బాయి వారి 'కాశీ యాత్ర ' గా పరిగణించడం బట్టి తెలియ వస్తున్నది ఏమనగా, ఈ వాలం టీను దినం మన పూర్వ ప్రాచీన సాంప్రదాయ పద్ధతే అని, దీనిని కాపీ క్యాటూ చేసి కాపీ లెఫ్టు చేసి సంతు వాలం టీను దినము గా మార్చి వేసి నారని మనము విశ్వసించ వలె.
ఈ సన్యాసి బుట్టలో పడే కార్యక్రమము నే పెళ్లి దినాన అబ్బాయి వారి 'కాశీ యాత్ర ' గా పరిగణించడం బట్టి తెలియ వస్తున్నది ఏమనగా, ఈ వాలం టీను దినం మన పూర్వ ప్రాచీన సాంప్రదాయ పద్ధతే అని, దీనిని కాపీ క్యాటూ చేసి కాపీ లెఫ్టు చేసి సంతు వాలం టీను దినము గా మార్చి వేసి నారని మనము విశ్వసించ వలె.
అయ్యలారా, అమ్మలారా , ఇవ్వాళ సంక్తు వాలం 'టీన్' జరుపు కొనుడు అబ్బాయి లారా, అమ్మాయి లారా మీకందరికీ ఇదే శుభ కామనలు !
మీరు జంబూ అయితే, మీకు జిలేబీ ఖచ్చితం గా లభ్యమవు గాక!
తప్పి మీరు జిలేబీ అయితే, తప్పక ఎవడో ఓ సన్యాసి మీ బుట్టలో పడడం ఖాయం!
ఇంతటి తో ఈ సన్యాసి బుట్టలో పడ్డాడు అనబడు బుట్టో పాఖ్యానం పరి సమాప్తము !
ఇది చదివిన వారికి, వినిన వారికి చదివి వినిపించిన వారికందరికీ ఆ పద్మావతీ అలమేలు మంగా సమేత మా ఏడు కొండల పెరుమాళ్ళు(ఈయన రెండు మారులు బుట్టలో పడినట్టు ఉన్నాడు సుమీ !) సకల మంగళములు కలుగ జేయు గాక!
చీర్స్
ఫక్తు, జిలేబీ డే!
ఈ మధ్యనే ఎక్కడో చదివాను ఈ సారి ఆ వాలంటీనము లేదంట....
ReplyDelete14-02-12 = 0 అంట కదా అందుకూని....... :-)
మాధవి గారు,
ReplyDelete'పూజ్య' మయితే మరీ పూజ నీయమైన దినమే మరి !
చీర్స్
జిలేబి.
@Madhavi : :D
ReplyDeleteవాలం టీన్స్ దినం అంటారని మా మితృడొకడు సెలవిచ్చాడు. అంటే తోక గలిగిన టీన్స్ దినమని వారి భావం. తోక అంటే వేరే చెప్పాల్సిన పని లేదు కదా.... దహా.
ReplyDeleteమాధవి గారూ... దహా.
baga cheppitiri..cheers jilebi...
ReplyDeleteనచ్చిన సుందరి యెందుకు
ReplyDeleteవచ్చెడు నొక బుట్టలోన వయ్యారముగా
తెచ్చిన యా బుట్టనె విభు
ముచ్చట చెఱ గొనగ గాక పోదు జిలేబీ
అందాల బుట్ట లోపలి
సుందరవదనారవింద సుదతీమణి చే
యందుకొనిన సన్యాసియె
వందేళ్ళకు బంది యనగ వచ్చు జిలేబీ
సన్నాసిని చేసెడునో
సన్నాసిని చూసి కన్య సరదా పడునో
సన్నాసియగుట తథ్యం
బన్నన్నా పురుషు డాలి బంటు జిలేబీ
జిలేబీగారికి పెళ్ళిరోజు శుభాకాంక్షలతో.
అమ్మాయిలు బుట్టలోంచి పడకుండా ఉంటే చాలు.
ReplyDeleteఅమ్మాయిలు బుట్టలోనూ పడరు, బుట్టనుండీ పడరు. అంతా వఠ్ఠి భ్రమ. వాళ్ళను పడకుండా రక్షించబోయి హీరోచితంగా, సన్నాసులే బుట్టలో పడిపోతూ ఉంటారు.
ReplyDeleteభార్యాభర్తల్లో ఎవరు బుట్టలో పడితేనేంలెండి ఇద్దరూ ఒకబుట్టలో పడితే చాలు కదా..జిలేబిగారూ ప్రేమికుల రోజు సుభాకా౦లండీ..
ReplyDeleteమీరు జంబూ అయితే, మీకు జిలేబీ ఖచ్చితం గా లభ్యమవు గాక!
ReplyDeleteతప్పి మీరు జిలేబీ అయితే, తప్పక ఎవడో ఓ సన్యాసి మీ బుట్టలో పడడం ఖాయం!
రెండునూ..ఒకటియే కదా! విచారం అసలు వలదు. బుట్ట కింద కోడి పుంజు లాగా ఉంటిరా ..అదియే పదివేలు కదా ! ప్రేమికుల రోజు శుభ కామనలు.. జిలేబీ!
@ఇండియన్ మినర్వా గారు
ReplyDeleteనెనర్లు !
బులుసు గారు,
ReplyDeleteతోక కలిగిన దినం వాలు అంటిన దినం - హనుమంతుల వారు వాలు ని అంటించిన దినం! లంకా దహన్ ! కోతి చేతికి చిక్కిన పూమాల అని ఒక వాక్యం ఉంది ! అది గుర్తుకు వస్తున్నది !!
చీర్స్
జిలేబి.
@సాయి గారు,
ReplyDeleteనెనర్లు ! అంతా వాలంటీను మహాత్మ్యం !
చీర్స్
జిలేబి.
@శ్యామలీయం మాష్టారు,
ReplyDeleteనెనరస్య నెనరః! జిలేబీ నామ్యా కందః కడు రమ్యః!
జిలేబి.
కష్టే ఫలే గారు,
ReplyDeleteఅమ్మాయిలు బుట్ట నించి పడేలా చేసి, బుట్టలో పడేలా చేస్తారండోయ్!!
చీర్స్
జిలేబి.
శ్యామలీయం మాష్టారు,
ReplyDeleteబుట్టలోపలి మహాభుజగేంద్రుఁడు బుట్ట బొమ్మ ఒకరి కొకరు సరి జోడు!!
చీర్స్
జిలేబి.
జ్యోతిర్మయీ గారు,
ReplyDeleteనెనర్లు. చాలా బాగా చెప్పేరు ! పడ్డా ఒకే బుట్టలో పడటం లో నె వుంది ఫ్యామిలీ అందం చందం !!
చీర్స్
జిలేబి
వనజ వనమాలీ గారు,
ReplyDeleteబుట్ట కింద కోడి పుంజులా వున్నారా అదే పది వేలు ! బాగా చెప్పారండీ !
మీకున్నూ శుభాకామనలు!
చీర్స్
జిలేబి.
మీ బుట్టోపాఖ్యానం బాగుందండి.
ReplyDelete@లాస్య రామకృష్ణ గారు,
ReplyDeleteబుట్టో పాఖ్యానం మీకు నచ్చినందులకు నెనర్లు !!
చీర్స్
జిలేబి.