బ్లాగు బ్లాగు కీ పోయేను రాధా హరే
కూసింత మేటరు కొట్టు కొచ్చు కున్నాను కృష్ణా హరే !
అని ఆడుతూ పాడుతూ మేటర్లు బ్లాగుల నించి కొట్టేసుకుని పత్రికల లో అచ్చేసుకుని హాయి హాయి గా కాలం గడిపేసు కుంటున్న ఓ జిలేబీ కి ఉద్యోగం పోయే రోజులు దాపురిస్తున్నట్టు ఉన్నాయి.
ISA (Internal Sourcing Agent!) ఫర్ MSA (Matter Snuffing Agency) లో పని చేస్తున్న ఓ జిలేబీ కి తెల్లారి తెల్లారి లేస్తూనే బ్లాగు బ్లాగు కీ వెళ్లి మేటరు కొట్టేసుకుని వాటిని సీక్రెట్ గా పత్రికలకి కాణీ కి పరక కి అమ్మేసుకుని అవ్వాల్టి హా 'రమ్ము' హాయి హాయి అని పొంగి పోతూన్న తరుణం లో ఓ ఇంటి ఇల్లాలు ముచ్చట తో గడ్డు రోజులు వచ్చేయి.
తాళాలు పెట్టండీ అన్న బ్లాగ్ నినాదం తో 'ఉత్తిష్ఠ , జాగృత, ప్రాప్యవరాన్.." అన్నట్టు ఉత్తేజం చెందిన వాళ్ళయ్యారు అప్పటి దాక ఉన్న పంచ దశ లోక వాసులు.
అంతటి తో బ్లాగులకి తాళాలు పడ్డాయి. !
స్నఫ్ఫింగ్ చేస్తూన్న జిలేబి కి కాపీ కి మేటరూ పోయే , కాఫీ కి కూడా కరువోచ్చే !
ఏమి చేతుమురో రాధా హరే,
నీవే దిక్కయ్య కృష్ణా హరే
అని పాడేసుకుంటూ ఇవ్వాల్టి జిలేబీ 'అప్రస్తుత ' ప్రసంగం ఇంతటి తో సమాప్తం !
చీర్స్
జిలేబి.
జిలేబిగారూ ఏమిటీ మాయ?
ReplyDeleteమారు తాళాలు చేయించలేదా ?
ReplyDeleteజిలేబీ గారూ,
ReplyDeleteఇంతోటి తాళాలకు మారు తాళం చెవులు చేయంచలేరా మీరంటున్న ఆ జిలేబీలు?? అయినా మొన్న సుధ గారి బ్లాగులో చెప్పుకున్నట్టు అవిడియాలే కాదుటండీ కావలసిందీ? దాన్ని తిరగ రాసే కెపాసిటీ ఉంటే చాలు. పత్తాళాలు వేసినా లాభం లేదు.
ఐనా బ్లాగులో మేటర్ ఎత్తుకెళ్లేది మీరు కాదన్నారు కదా? మళ్లీ ఇదేంటి???
ReplyDeleteజ్యోతిర్మయీ గారు,
ReplyDeleteఅంతా విష్ణు మాయ అండి!
చీర్స్
జిలేబి.
బులుసు గారు,
ReplyDeleteమారు తాళాలు చేసినా ఉపయోగం లేదండీ !
చీర్స్
జిలేబి.
సుజాత గారు,
ReplyDeleteవారికా సత్తా వున్నట్టు అనిపించడం ఆ పై అంత ఓపిక ఉన్నట్టు అనిపించడం లేదు అనుకుంటాను ! అంతా జిలేబీ మాయ !!
చీర్స్
జిలేబి.
జ్యోతి గారు,
ReplyDeleteదానికి అదే! దీనికి ఇదే !
చీర్స్
జిలేబి.