Sunday, February 12, 2012

మానస కావేరి

మనస్సు విప్పాలని
ఒకటే పోరు
నా అంతరంగం తో
కుదరటం లేదు


మనసు విప్పాలని
ఒకటే ఆలోచన
ఆలోచన తోడు  రా నంటోంది
ఎద తోడైనా రా అంటే నిశ్శబ్ధం

ఏ ఆలోచనా పూర్తి గా
ఓ కొలిక్కి రాదు తెగిన గాలి పటం లా
మధ్య మధ్య లో  మౌనం
ఈ ఆలోచన లేలా అని

చేతులు ఖాళీ అయినా పర్లేదు
మనసులు ఖాళీ అవకూడదని
అనుకున్నా, మనసులో మనసు
ఎట్లాంటి ఆసరా ఇవ్వడం లేదు

ఆలోచిస్తున్న ఆలోచనలు
లోచనా కమల లోచన లై
మానస కావేరి లా
మౌన సంద్రాన్ని స్పృశిస్తున్నాయి

జిలేబి.

9 comments:

  1. chaalaa baagundi.
    mukhyamgaa..

    ఆలోచిస్తున్న ఆలోచనలు
    లోచనా కమల లోచన లై
    మానస కావేరి లా
    మౌన సంద్రాన్ని స్పృశిస్తున్నాయి

    ReplyDelete
  2. వనజ వనమాలీ గారు,

    నెనర్లు మీకు నచ్చినందులకు !~~~

    క్షీరసాగర
    జిలేబి!

    ReplyDelete
  3. జ్యోతిర్మయీ గారు,

    చీర్స్ కేమండోయ్ బ్రహ్మాండం గానే ఉంది! కాక పోతే,

    స్విజ్జ్ యంగ్ ఫ్రౌ పర్వత శ్రేణుల లో బుజ్జి పండు చదువుకి జిలేబీలు చుడుతూంటే చేతులు చలికి వణుకు తున్నాయి!! ఆలోచనలు ఓ కొలిక్కి రావడం లేదు! అదన్న మాట విషయం!


    క్షీరస
    జిలేబి !

    ReplyDelete
  4. అమ్మో! అమ్మో....ఏంటండోయ్ అదరగొట్టేస్తున్నారు:-)

    ReplyDelete
  5. వామ్మో, వామ్మో, పద్మార్పిత గారు,

    కాస్త పద్మార్పిత గారిలా రాద్దామని ప్రయత్నించా లని కాస్త బోర్ల పడ్డ అంతే సుమండీ !!

    నెనర్లు మీ హాశ్చర్యములకు(అభినందన లె నంటారా ?|)

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  6. మనసు విప్పండి....ప్లీజ్...

    ReplyDelete
  7. భావాలు అందంగా ఉన్నాయి .
    మనసులో ఎల్లవేళలా మధుమాసాలు నిలుపుకోండి
    ఎన్నైనా రాయొచ్చు .. మీ అందమైన భావ
    సుమగందాలకు అభినందనలు

    ReplyDelete
  8. సముద్రపు అలలు పౌర్ణమినాటి చంద్రుడిని చూసి ముచ్చటతో, తాకాలనే ఆశతో ఉవ్వెత్తున పైకెగసి, చివరకు అందుకోవటం కష్టమని క్రిందకు దిగినట్లుగ, నేను కూడా మీ రచనలను చదివి ఆ స్థాయిని అందుకోలేక ఈ విధముగ వ్యక్తపరుస్తున్నానండి.

    ReplyDelete