Wednesday, February 27, 2013

విప్రలంభ శృంగార యోగి !


విప్రలంభ శృంగార యోగి !
***photo courtesy googlaaya namah***
 

"మన దగ్గిర చుట్టమైన రాముడు
మహావీరుడూ ,
ప్రకృతి సౌందర్య పిపాసీ ,
దుష్టశిక్షకుడూ ,
శిష్టరక్షకుడూ,
ముఖ్యం గా విప్రలంభ శృంగార యోగిన్నీ !"
 
(వాల్మీకి మహర్షి విరచితం రామాయణం మూడో సంపుటం అరణ్య కాండ వాడుక భాషలో శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
వచనానువాదం - పబ్లిషర్స్  అద్దేపల్లి అండ్ కో - సరస్వతి పవర్ ప్రెస్ -రాజమహేంద్ర వరము - మొదటి కూర్పు 1956- 'సూచన' -ముందు మాట నించి )  
 


జిలేబి
 

6 comments:

  1. ఇందుకు మీకున్న అభ్యంతరమేమిటి... ధర్మార్ధ కామ మోక్షము : అర్ధాన్ని, కామాన్ని ధర్మబద్ధంగా ఆచరిస్తే మోక్షము లభిస్తుంది.. ఋషులు, మునులు శుభ్రంగా భార్యలతో కాపురాలు చేసుకుంటూనే..యజ్ఞ యాగాది క్రతువులు చేసేవారు...

    ReplyDelete
    Replies
    1. వోలేటి వారు,

      అభ్యంతరం ఏమీ లేదు! మీరు నిన్నటి టపా చూడవలె ! అంతే!

      ఆ పదం అద్భుతం గా అనిపించి ఈ టపా పెట్టా అంతే !

      చీర్స్
      జిలేబి.

      Delete
  2. మీరు కూడా శ్రీపాద మీద పడ్డారే

    ReplyDelete
    Replies
    1. కష్టే ఫలే వారు,

      ఏమని చెప్పుదు , అంతా శర్మ గారి 'సహ'బ్లాగ్ వాస దోషం !

      మీ క్రిందటి శ్రీ పాద వారి టపా చదివాకా అట్లా గూగ్లిస్తా ఉంటే, ఈ archive.org లో శ్రీ శ్రీ పాద వారి ఈ పై పేర్కొనబడ్డ పుస్తకం కనబడ్డది. ఆ హా అని చదవ నారంభిస్తే ఓహో అనిపించే లా ఆ పదం కనబడ్డది. దాని మొదటి పర్యవసానం నిన్నటి స్వామీ వెంకన్న వారి దోబూచులాటల టపా ! ఇవ్వాళ ఇదన్న మాట !

      అవీ ఖబుర్లు కాకర కాయలున్ను !

      చీర్స్
      జిలేబి.

      Delete
  3. ఓహో జిలేబీ గారూ, విప్రలంభం అంటే విరహం అండీ. మీరు యెందుకో గాని పరాకుపడ్డారు.
    నాయికానాయకులు కలసి ఉండగా కాదు. వారు ఒకరి కొకరు యేదో‌ ఒక కారణంగా దూరమై విరహం అనుభవిస్తూ ఉంటే దానిని విప్రలంభశృంగారం అంటారు. కవుల దృష్టిలో ఇది మహారసస్ఫోరకమైన కవితావస్తువు. ఈ సందర్భంలో విప్రలంభశృంగారం పైన కాళిదాసుగారి మేఘసందేశం తప్పక మొదట చెప్పవలసిన కావ్యం. అలాగే జయదేవులవారి గీతగోవిందమూ విప్రలంభశృంగారం ప్రధాన రసంగా కలదే.

    ReplyDelete
  4. శ్యామలీయం వారు,

    అవునండీ 'సావిరహే' తవ దేవ... ! విరహం లో రహం! శ్రీ పాద వారు విప్రలంభ శృంగార 'యోగి' అన్నారు చూడండీ అదన్న మాట విషయం అక్కడ.

    ఇక ఆ చిత్రం చిత్రకారుని చమత్కృతి ! అందులో నిజం గా చెప్పాలంటే సీతమ్మ లేదు. రాములవారు సీతమ్మ ని 'సజాయిస్తునారట'! అదీ 'విప్రలంభమే' కదా అని విరహం లో రహం అని ఆ చిత్రం పెట్టా !

    జిలేబి.

    ReplyDelete