సుభద్ర ఎట్లా శ్రీ కృష్ణుల వారికి చెల్లెలు అని అడిగారు జై గొట్టి ముక్కలు వారు.
దానికి సమాధానం టపీమని ప్రవీణ్ శర్మ చెప్పెసేరు (అబ్బాయి ప్రవీణుడు స్ట్రైట్ సమాధానం ఇవ్వడం ఇదే మొదటి సారి నేను చదవడం!) - వసుదేవ రోహిణి ల కుమార్తె సుభద్ర అని , సో, సుభద్ర శ్రీ కృష్ణుల వారి చెల్లెలు అని.
శ్రీ కృష్ణార్జునుల మైత్రి జగద్విదిత విషయం. ఈ విషయమై ఆలోచిస్తా ఉంటే ఫక్కున నవ్వు వచ్చింది.
చెల్లెలు సుభద్ర వివాహం అర్జునిని తో గావించడానికి శ్రీ కృష్ణుల వారి నాటకం (శ్రీ కృష్ణార్జున యుద్ధం లో రసవత్తరమైన ఘట్టాలు ఉన్న సన్నివేశాలు ఉన్నాయి మరి !- తపము ఫలించిన శుభ వేళ .. )
కథా పరం గా రక్తి కట్టించే అంశం ఏమిటంటే, 'సుభద్రా సహిత అర్జునుల' 'ఎలోప్మేంట్' సందర్భం లో సుభద్ర ని శ్రీ కృష్ణుల వారు రథాన్ని సారధ్యం వహించ మనడం, దానిని కారణం గా చూపి, అర్జునుడు సుభద్ర ని లేవ దీసుకు పోలేదు, సుభద్రే మనసు పడి అర్జునిని లేవ దీసుకు పోయింది కాబట్టి ఇందులో అర్జునిని తప్పేమి లేదు సుమీ అని అర్జునినికి శ్రీ కృష్ణుల వారు వకాల్తా పుచ్చు కోవడం !
ఎంతైనా అర్జునుని మీది అవ్యాజమైన ప్రేమ శ్రీ కృష్ణుల వారి ది మరి.
మైత్రీం భజరే !
ఇక ఈ టపా శీర్షిక మూడో మొగుడి నాలుగో పెళ్ళాం ఎవరు అంటే సుభద్రా దేవే కదా మరి? అర్థం అయ్యిందా ? అర్జునిని ద్రౌపది, చిత్రాంగద, ఉలూపి తరువాయి సుభద్ర నాలుగో భార్య కదా మరి అర్జునుల వారికి ?
ద్రౌపది వరమాల తో అర్జునిని వరిస్తే, తల్లీ భిక్ష తెచ్చామని కుంతి తో ఐదుగురు కొమరులు అంటే, ఆ తల్లి భిక్షని సమంగా పంచుకొండీ అంటే, పాంచాలి పంచ భర్తృక అయ్యింది. అర్జునుడు ద్రౌపది కి మూడో మొగుడన్న మాట .
ద్రౌపది, చిత్రాంగద, ఉలూపి ల తో చేర్చి మువ్వురు భార్యలని అక్కున చేర్చుకున్న అర్జునినికి (మూడు మళ్ళీ!) సుభద్ర తన మనసుని దార పోసుకుని నాలుగో పెళ్ళాం అయ్యింది.
వీరి జీవితం లో ని మరో అపూర్వ సంఘటన అభిమన్యుని జననం. తండ్రి కై అభిమన్యుని మరణం, ఆ పై అభిమన్యు ఉత్తర ల పుత్రుడు పరీక్షిత్తు మొత్తం కౌరవ వంశానికి ఏకైక వారసుడు గా మిగలడం ఆ పై ఆతని మరణం తక్షకుని ద్వారా ... ఆ పై జనమేజయ వృత్తాంతం, ....
సో, జై గొట్టి ముక్కలు గారు, మొత్తం మీద, మీ ప్రశ్న కి సమాధానమూ, ఈ చిన్ని టపా అంతా మీ అమ్మాయి చిన్ని ప్రశ్న తో మొదలు !
చిన్ని బుర్రల ప్రశ్నల తోనే కదా పెద్దవాళ్ళు కూడా చదవడం నేర్చుకునేది మరి !
మీ ప్రశ్న కి సమాధానం ఏమిటబ్బా అని ఆలోచిస్తూ ఉంటే, గూగల్ ఘటోత్కచుడు (!) అట్లా ఇట్లా లాగించి మొత్తం మీద ఇండోనేషియా లో ని ఒక అపూర్వ మైన అర్జునిని విగ్రహాన్ని చూపెట్టేడు !
Raja Ravi varma - Arjuna Subadhra
ఎక్కడి నించో కథ ఎక్కడికో వెళ్లి పోయింది మరి !
చీర్స్
జిలేబి.