Friday, December 13, 2019

గొల్లపూడి లేరిక.



Which hat has he not worn?


All round personality no more.

Andhra Prabha Chittoor days,

AIR, Theatrical Dramas, Cinemas, literary feats,

his transformation into Blog world, social media,

his Daily weekly columns,

his shows on TV...

Interviews ....

remarkable memory of events of the past and people ...


The list goes on
..


Photo courtesy The Hindu

Tribute by కౌముది.



A tribute by


మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


బూరెబుగ్గల వాడు ముద్దుమాటలవాడు
కూరిమిగలవాడు గొల్లపూడి!
తెలుగు చలనచిత్ర తేజోవికాసమౌ
గొప్ప నటుడు మన గొల్లపూడి!
ఆనందమైన శోకాభి నయమ్మైన
నెల్లర మెప్పించు గొల్లపూడి!
మాతృభాషకు తాను మధుర రూపమ్మన
గురుతుగా నిలిచెడి గొల్లపూడి !

పాత్రికేయుడు రచయిత బహుముఖీన
ధీ ప్రపూర్ణుడు నేడు(12-12-2019  11.10 a.m. ) గతించెననగ
ఆంధ్రదేశమ్ము దుఃఖాబ్ధినందు మునిగె!
ఆర్య! మారుతీరాయ ! జోహారులయ్య.!!



మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి


*****

నివాళి
జిలేబి

Thursday, December 12, 2019

గురుమూర్తి గారి ప్రసంగం - పరాశరన్ సత్కార సభ


Revealing facts on Ayodhya 
by Gurumurthy 
of Indian Express, Tuglak fame at the felicitation function of Shri Parasaran 




Cheers
జిలేబి

Wednesday, December 11, 2019

శ్రీమాన్ బ్లాగ్ జ్యోతిష్కుల వారి "రేప్ రెవిలేషన్ " :)




చాన్నాళ్లకి మా బ్లాగ్ జ్యోతిష్కుల వారు సెటైర్ అల్లేరు అదిన్నూ  శ్రీమాన్ నిత్యానందా వారిపై :)

Enjoy Maadi :)

"
మొన్న కొందరు నాయకులు పార్లమెంట్ లో మాట్లాడుతూ, 'ఇండియాకు ప్రపంచ రేపుల రాజధాని అని పేరోస్తోంది' అన్నారు. Make in India బదులు Rape in India అంటే సరిపోతుంది అని కూడా అన్నారు. కొత్త సినిమా టైటిల్ భలే ఉంది కదూ !  సినిమావాళ్ళు ఎవరైనా ఈ టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేశారో లేదో నాకైతే తెలీదు మరి !!"

పూర్తిగా టపాలింకు 

Cheers
జిలేబి

Tuesday, December 10, 2019

జయహో భారత్! జయహో భాజ్పా! జయహో Citizenship Amendment Bill 2019.



జయహో‌ భారత్!

At the stroke of midnight  a few seconds past (more precisely 00:05 hours of 10th December 2019) Indian loksabha passes Citizenship Amendment Bill 2019 with Ayes 311 to Nos 080!

Amith Shaji delivered a marvellous befitting concluding reply.

జయహో భారత్! 
జయహో భాజ్పా!
జయహో అమిత్ షా!

చీర్స్
జిలేబి

Saturday, December 7, 2019

పోలీసు ఎన్ కౌంటర్ - న్యాయం - చట్టం‌- ధర్మం

పోలీసు ఎన్ కౌంటర్ - న్యాయం - చట్టం‌- ధర్మం

చట్టానికి కళ్లు లేవు!
ధర్మ దేవత ఉందో లేదో తెలియదు.
ఏది న్యాయం? ఏది అన్యాయం
కాలాన్ని బట్టి మారుతుందేమో!

ఎన్ కౌంటర్ ఫక్తు సినిమేటిక్ ఎఫెక్ట్.
సినిమా లలో సాధారణ మనిషి ( సో కాల్డ్ ఆమ్ ఆద్మీ) కోరుకునే మదిని మత్తులో తూగించే ఇట్లాగే రా హీరో వుండాలి అనుకునే ఓ సంతోషం.

జనాళి హ్యాపీ.

మేధావుల కనుబొమ ముడి.

జస్టిస్ నాట్ డినైడ్.

చంపిన దానికి కారణం చీఫ్ గారి బస్తీ మే సవాల్.

అందరు ఆఫీసర్లు ఇలా చేయగలరా?

దేశంలో నలుగుతున్న నిర్భయ , దిశ, కేసుల కీ సమాధానం వర్తింప చేయగలరా?

కోర్టు నిర్వీర్యత, రాజకీయ నాయకుల నిర్వీర్యత  ఈ పరిణామానికి దారి తీసిందను కోవచ్చను కుందామా?

ఆ మధ్య ఓ చీఫ్ జస్టిస్ కేసులు మాకెక్కువై పోయాయని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.

కేసుల్ని  తగ్గించు కోడానికి ఇట్లాంటి ఎన్ కౌంటర్ ల ని శరణు కోరొచ్చనుకుంటారా ఆ పెద్దాయన ?


చంపినదానికి కారణం తప్పించు కోడానికి ప్రయత్నించేరు. కాబట్టి.

వాళ్ళు తప్పించుకోడానికిక ప్రయత్నం చేయరు. అప్పుడేమి‌ చేసేది ?


ఓ న్యాయ వ్వవస్థా కళ్ళు తెరు . justice delayed is justice denied.
India cannot solve its issues in this fashion.

ఓ రాజకీయ నాయకుల్లారా!పార్లమెంట్లలో అనవసరమైన కొట్లాటల నాపి  దేశానికి‌ చేయాల్సిన మంచి గురించి ఆలోచించండి.

ఓ పోలీసు వ్వవస్థా! సామాన్యుడు ఓ కంప్లయింట్ తీసుకొస్తే వాళ్ళ పై మీ జులుం ఆపి కొంత సీరియస్ గా కేసు టేకప్ సమయానికి చేయండి. సామాన్యమానవుడు పోలీస్ స్టేటషన్లో  " నిర్భయంగా" కాళ్ళుపెట్టొచ్చ"న్న నమ్మకాన్ని కలిగంచేలా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కలిగేలా అదేదో డీయైజీ ఐజీ లకే పరిమితమనుకోకుండా కానిస్టేబులు లెవలు ముఖ్యంగా వ్రైటరు లెవలు దాకా తీసుకు రండి.

నివాళి
దిశకు.


ఎన్ కౌంటరు కి
జోహర్లు చెప్పడానికి
Can this resolve the
issue అన్న  ప్రశ్న
ప్రశ్నార్థకం.


జిలేబి






Tuesday, December 3, 2019

తాంబూలాలకు పిలుపు రారండి



తాంబూలాలు పుచ్చుకోండి 
రండోయ్ రా రండోయ్



 జిలేబి

Monday, December 2, 2019

డిసెంబరు ఇరవై ఆరు 2019.


డిసెంబరు ఇరవై ఆరు 2019



జిలేబి

Saturday, November 16, 2019

బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా! (పేలాల లవంగక శతకము ) - ఒరిజినల్ జిలేబి శతకము :)



బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!
(పేలాల లవంగక శతకము ) -
ఒరిజినల్ జిలేబి శతకము :)




1

పిస్తాలిస్తానంటే
వస్తా మల్మల్ కబురుల వయసున్నోడా
మస్తుగ చెబ్తా నాపై
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


2

మస్తుగ నేర్చితి టెల్గూ
జాస్తిగ ఛందమ్ము తెల్సు సాఫ్ట్వేరుందోయ్
కుస్తీల్జేస్తా వస్తా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!



3

మస్తైన శాస్త్రి వరుడా
కోస్తా నెల్లూరు మీది! కోసెడు కెళవున్
బస్తీ మాదీ! వస్తా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!



4

రాస్తా లో చదివితినే
బెస్తడి బాలసపు కైపు పీతల కత! నే
రాస్తా శతకముగా యిక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!



5

సుస్తీ పోగొడతా నే
బస్తెడు పేలాల నిస్తె; పద్యం చెప్తా
కాస్తా చెవుల దులుపగా
నేస్తమ్మును దేనికైన నేనే హితుడా!


6

వస్తిరి బ్రెజిలున కెల్లరు!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
మస్తైన హింది నాదోయ్
నేస్తమునకు పేరు గన్న నెమ్మియు మాదోయ్!


7

విస్తారాన్వితగీతిన్
ప్రాస్తుత్యామ్నాయ శంకరాభరణమహో
పాస్తిభరణ్యువుల కొరకు
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


8

కోస్తాను పదమ్ములనే
రాస్తాను విడువక శంకరాభరణములో
విస్తారముగ జిలేబిన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా! :)


9

ప్రస్తుత సమాజమున కవు
లాస్తులయెడు గ్రాంధికమ్ము లావుల్ దప్పన్
బస్తీ చౌకుని నమ్మిరి
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


10

కోస్తా పేగులని జబ
ర్దస్తీగా ఛందమున పదమ్ముల నేస్తా
రాస్తా నేస్తమ్ములకై
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


11

పుస్తెల నమ్ముకు కొండకు
వస్తిని! శేషాద్రివాస! వరదా! కావన్!
నేస్తమ్మీవే స్వామీ!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


12

వస్తాడండీ నారా
జొస్తాడిక వండనింట జొన్నయులేదే!
కాస్తా కరుణించండీ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


13

కస్తూరీతిలకమ్మిడి
స్వస్తిక ముంగట నిలబడి ఛందముతోడై
గేస్తుడొకడు పలికెనిటుల్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


14

మోస్తరుగా ఛందమ్మున
మేస్తిరి యై తిప్పలబడి మేధిర పలికెన్
వస్తువు లేదింట తినన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


15

రాస్తారోకోలంటిమి
వస్తా డిక ముఖ్యమంత్రి వడియనుకొన తోల్
తీస్తానని పలికెనతడె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


16

ముస్తాబాయెను సభయే
ఉస్తాదు బడేమియా కవులకై సరదా
రాస్తా కైపదమిడగా
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


17

జాస్తిగ మాట్లాడకుడీ
సుస్తియు చేయక జిలేబి చురుకుగ వచ్చున్
శాస్తియిదేనని పలుకున్
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


18

వస్తమ్ము నిండుకొనె నా
దస్తువలెన్ కలదు బుద్ధి! దమ్మిడి లేదోయ్
హస్తమ్మున కరుణించుము
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


19

దోస్తీ ప్రభాకరులతో
మస్తీ కవివరులతో సమానముగా నే
చూస్తా వేడుక ! మీరిక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


20

కాస్తోకూస్తో తెలుసోయ్
విస్తారముగా తెలియదు విదురుల వలెనోయ్
తీస్తా తాటనొలుస్తా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


21

జాస్తిగ సంభావన నా
కొస్తి యను కొనవలదోయి కూవారము నా
దోస్తీ! గుప్పిట బట్టెడు
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


22

వస్తవి పోతవి డబ్బుల్
కస్తీరపు మిత్రత కలకాలము మనదోయ్!
రాస్తా శతకము తప్పక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


23

కోస్తా జిల్లా వాడనె
"దోస్తని నొకడు సినిమాని దోసిలి చేర్చెన్
రాస్తా పనగల్ పార్కయె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!"


24

కుస్తీల్బడి ఛందమ్మును
బస్తీ బామ్మ యొకతయె సభాస్థలి లోనన్
రాస్తూ నేర్చి పలికె పో
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


25

చస్తే రానిక! కొలువా?
చూస్తే వీధిబడి యయ్యె! సొబగగు ఛందం
బస్తిత్వము కోల్పోయెన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా?


26

రాస్తా వెంబడి ప్రకటన!
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"
చూస్తూపోయా గతుకులు
కాస్తా బౌరమ్ముపేట గడి కనిపించెన్!


27

రాస్తూ రాస్తూ పోతే
వస్తుందండి పదములు ప్రవాహముగ గుభా
ళిస్తో! ఉదాహరణయిదె
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


28

మస్తాన్వలి శిష్యుడతడు!
ముస్తాఫా మాలు బయట ముదిమియు మీరన్
ప్రస్తుతి చేయుచు నిలిచెన్
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


29

దోస్తానా మాదేనోయ్!
పుస్తకమును వేసెదనిక భుక్తిక తోడై
వస్తుంది! మకుటమిదియే
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


30

కాస్తైనా నేర్చుకొనుము
మేస్తిరిని కుమార!రార! మేధాజీవుల్
చూస్తున్నారు! కొమరుడనె
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


31

మోస్తున్న గ్రాంధికమ్మను
బస్తా దింపగ వెలుపల బడె జనుల పదాల్
మస్తగు తెలుగిదియె సుమా
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


32

రాస్తాను శతకమిక నే
వేస్తా పొత్తముగ రండి! వేదిక వేస్తా!
వాస్తవపు కవివరుల స్థితి!
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"


33

బస్తీ పిల్లయె పలుకగ
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"
చూస్తే నా గుండాగెన్
కాస్తైనా లేదు తెలుగు కన్నుల కప్పెన్!


34

వస్తా వృద్ధాశ్రమమున
కొస్తా! వ్రాస్తా కవితల కూర్పుగ మీపై!
పిస్తా బాదము లేలా!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


35

చూస్తారా శాస్రీజీ!
వాస్తవమగు పాదమును సవాలుగ వేయన్
వస్తుంది జిలేబి వరద!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


36

తోస్తారా వలదనుచున్!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!
కాస్తా కరుణించండీ!
పస్తులు పడుచుండ్రి మా నివాసములోనన్!


37

రాస్తానండీ విడువక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
నా స్తవనీయపు సదనము
కాస్తా హ్యాంగై నిలువగ, కంద జిలేబిన్ :)


38

ప్రస్తుతము పోవలెను నే,
చేస్తా రంటన్ రికార్డు చేరగ నిపుడే
ప్రస్తావింతు సమస్యగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా! :)


39

హస్తాభినయమ్ములతో
వాస్తవమగు తన స్థితి తెలుపన్ యత్నించెన్
విస్తరి విడియాకులతో
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


40

గస్తీల్తిరుగుచు రాత్రుల
మస్తు వెతికివెతికి పద్య మాలలు గా గు
చ్చేస్తున్న శాస్త్రి వరుడనె
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


41

జాస్తి నటేశరమేశుడు!
ప్రస్తుతమున షేరులమ్ము వ్యాపారి పదాల్
వేస్తారా అంటె పలికె
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


42

మస్తిష్కమ్ము‌న సరదా
తోస్తే వేయాలి పద్య తోరణముల్ రా
ణిస్తా కైపద మిస్తా
"బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా"!


43

వస్తా నే సైఫాబా
దొస్తా! ఆకాశవాణి ధోరణిలో ర
ప్పిస్తా చురుకుదనమ్మిక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


44

వస్తూ వుంటే దారిని
మస్తాన్సాయెబు బొరువులు మదిదోచగ నా
మస్తిష్కపు కైపదమయె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


45

వేస్తేనో యుమ్మీ డై
జిస్తివ్! అప్లమ్ముగాను చిప్లమ్మదియే!
చూస్తేను దిల్ బహారే!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


46

చూస్తా నే పూరణలె
న్నొస్తాయో కవులవద్ద నుండి సదనమం
దిస్తా సమస్య యిదియే
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


47

వేస్తా గాలముగా కురి
పిస్తా పద్యముల నేడు విస్తృతముగ నే
నిస్తా గ్రామ్యపు పాదము
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


48

మస్తకమువంచి నిలువ త
థాస్తని దీవించి పదపు తావికి జోడై
వస్తాననె పలుకుపడతి!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


49

తోస్తున్నది నే రాస్తా!
చూస్తా నెన్ని విధముల ప్రచురతముగా నా
కొస్తాయో కందముగా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


50

విస్తారమ్ముగ యాభై!
ప్రస్తుతమునకిదియె నాఖ రై నిలిపెద!నే
వస్తా కూటికి పోవలె
బస్తెడు పేలాల వేల! వలదోయి సుమా !


51

మస్తాన్సాహెబు కొమరుని
కాస్తిగ ఛందమ్ము నేర్పగా ఘనుడాయెన్
వస్తూ దారెంట పలికె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


52

పుస్తెల నమ్మగ తల్లియె
కిస్తుల నాంగ్లమ్ము చదివి కింకట బడుచున్
పస్తుల తాళక పలికెన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


53

చస్తూ బతికెననుదినము
పస్తాయించి వివరముగ పాతకతలనే
ప్రస్తావింపగ పలికెన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


54

లస్తకము బట్టి బాణము
వేస్తో పలికెనతడచట వేగము వలదం
టే స్తవముచేయుడీ సయి
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


55

వస్తానవధానిగ నే
నొస్తా తప్పక పిలిచిరి నోరారంగన్
చేస్తా సాహసమింకన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


56

దస్తావేజుని రాస్కో
కుస్తీల్జేసైన నేర్చి కొండాట్టముగా
వస్తానవధానిగనే!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


57

మస్తైన దాంధ్ర భాష ప్ర
శస్తము! తేటతెనుగాయె చందము! సఖుడా
దస్తగిరికి నేర్చానోయ్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


58

గస్తీలు తిరుగు వేళని
తీస్తా చురకత్తి నింక తేటతెనుగలో
రాస్తా రావిడి చేస్తో!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


59

ఆస్తుల నమ్ముకొనిరి మా
కాస్తిగ ఛందమ్ము వదిలి ! కాసుల్లేవోయ్
ప్రస్తుతి చేస్తోరాస్తా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


60

మోస్తాను నాటి కవివరు
లాస్తిని ఛందమును నా తలపుల జిలేబీ
గా! స్తాంబాళము చాపితి!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


61

ప్రస్తావనగ నరడ మ్రో
గిస్తా! రాసెద జిలేబి గిద్యాల్ వలె పే
రుస్తో పదముల త్వరితము
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


62

రుస్తుంబాగు సమీపము
విస్తారమ్ముగ విదురులు పెనకువ కాగన్
దోస్తులతో పలికితి నే
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


63

బస్తీలోఅమెజాన్ చను
విస్తే నెక్కంగ చంక విడువక పోటీ
చేస్తో పలికెను సుమ్మీ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


64

కాస్తా జాగ్రత్త సుమా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా
వస్తానింటికి యనుచున్
తీస్తారిక ప్రాణముల్ ! మతియెబోవు సఖీ!


65

పస్తుల తాళగ లేనోయ్!
వస్తా నవధానమునకు వలదనకు సుమా!
కాస్తోకూస్తో తెలుసోయ్!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


66

రాస్తో కలగన్నా నే
వస్తున్న ఫ్లయిటుని జగను బాబొచ్చె వెసన్
లేస్తో చెబితి నతనితో
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


67

పాస్తా తిన్నానొకపుడు!
మస్తుగ పిజ్జాల తింటి మరియొకపుడు నా
ఆస్తులు బోయె! తినుటకై
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


68

వస్తోంది జిలేబియదే
వస్తోంది వరద వలె తను పదముల దుమికిం
చేస్తుంది పలుకునింకన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


69

హస్తిగిరి మహాత్మ్యపు ప్రా
శస్తత తెలిపెద కొలువుని ఛందముతోడై
రాస్తో శతకమ్మునికన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


70

హస్తగతంబాయెన్ వ్య
త్యస్తము కాకయె పదముల తళుకుల్ కవిరాట్
రాస్తానిక పూరణగా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


71

ఆస్తాని కందివరులది!
వస్తా వేస్తా పదముల బాలకుమారా!
దోస్తుల కైవారించెద!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


72

కస్తురిపట్టియలు గుభా
ళిస్తో పదముల కలుపుచు లెస్సగ నిదిగో
రాస్తా మాకందముగా!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


73

ఇస్తాద్గీ తోడుగ నే
వ్రాస్తున్నాను నడిరేయి వాలుగ దాటెన్
కాస్తే మిగులు శతమునకు
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


74

ప్రస్తుతము మూడు గంటలు!
వాస్తవ ముగ నిదురబోవు వారికి మేలౌ
జాస్తిగ రాస్తా విడువక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


75

అస్తు! జిలేబీయమిదియె
మస్తిష్క కుహరములెల్ల మాడెను వేడిన్
కాస్త కునుకుపాటుగ నా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


76

వస్తూండగా జిలేబియె
రాస్తా లో కనబడి మరి ప్రముఖులడుగగా
విస్తులు బోవగ పలికెను
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


77

రాస్తూ రాస్తూ నిదురొ
చ్చేస్తే గమనించలేదు ! శీఘ్రమ్ముగ రా
సేస్తాను పూసపాటిగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


78

సుస్తీ చేయంగ జబ
ర్దస్తీ చూపుచు జిలేబి ధాటిగ పలికెన్
కాస్తా కషాయమున్ సయి
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


79

రాస్తా మాలిక నిండుగ
చూస్తా కామింట్లనెల్ల చోద్యము గానన్
వేస్తా కందంబొక్కటి!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


80

సీస్తా సమయములో ఓ
మోస్తరుగ కునుకును తీసి మోడీ బ్రాజిల్
నేస్తపు గాధల చదివా!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


81

ఇస్తావా వస్తూ ము
ద్దిస్తావా నా జిలేబి దిల్ మే కుచ్ కుచ్
కీస్తాహై! చెప్పెను ఊ!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


82

వస్తా! వెళ్లొస్తా ! మ
ళ్లొస్తా! కతలన్ని చెబ్త లొల్లిగ మీకై
దోస్తానా నాదే యిక
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


83

అస్తిత్వమిది జిలేబిది
రాస్తూ పోవడమె తెలుసు రాపిడి తో మా
నేస్తుందనుకొన వలదోయ్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


84

వేస్తామోయ్ కామింటుగ
వేస్తామోయ్ కందముల గుభిల్లనగ ప్రవే
శిస్తాము శతకకర్తగ!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


85

ఆస్తరణని వేయండీ!
వస్తున్నాను దరిదాపు వస్తున్నా కా
వస్తోందిదె త్వరితముగా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


86

ఆస్తరము పైపరుండి స
మస్తము నాకుతెలుసను ప్రమదననుకోనోయ్
విస్తారపు కష్టేఫలి
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


87

పస్తంబైన కొలువిది స
మస్త మెరిగిన కవివరు సమాహారముగా
రాస్తా తప్పక శతముగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


88

పస్తులు కద్దు! జిలేబీ
వాస్తవమిదె కవివరుల సభలెపుడు తవణిం
చేస్తో కన్బడెనోయీ?
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


89

చేస్తా జొప్పించేస్తా
వాస్తవముల నెల్ల వ్రాసి వరవడి నే తె
ప్పిస్తా జర్నలిజమ్మున
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


90

వస్తాయి పరుగిడుచు చా
దస్తాలను వీడగాను దండిగ పదముల్
రాస్తా ధాటిగ ధీటుగ!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


91

రాస్తో కలర్డు న్యూసుల
మేస్తూ సెన్సేషనలిజమే మేటరనన్
కాస్తా గడిస్త దస్కము
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


92

మేస్తిరి మాకందివరులు
దోస్తానాతో గరిపిన ధోరణి గా నే
రాస్తా విస్తారముగా
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


93

పస్తుల పేలా లమ్మే
జాస్తిగ పట్టిందకో గజగజయనుచు వ
చ్చేస్తో వేసేస్తోందోయ్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


94

పస్తుల పేలా లమ్మికి
ప్రస్తుతమువలయును జ్యూసు! వడివడిగా తె
చ్చేస్తో నోర్మూయించుడి!
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


95

బస్తకము గొన్న వారల
మస్తిష్కపు చిన్నతనము మనకేలా! ఓ
టేస్తామిక భాజ్పాకే
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


96

కస్తి పడకు బుచికీ రా
సేస్తున్నారు జనులనుచు! చేరువ కమ్మా
వాస్తవమునకు! జిలేబిన్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


97

గస్తాల్బట్టుచు నేర్చితి
కాస్తై‌నా చేయవలెను గా ధర్మము ! నే
వ్రాస్తా దమ్ముగ రండోయ్
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


98

గుస్తర్దపు సదనమిదియె
ప్రస్తుత యత్నమును చేయ వరవడి నే చే
రుస్తూ వ్రాయను వ్రాయను
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


99

గోస్తనమిది కందివరుల
కై స్తవమిదియే జిలేబి కైవారముగా
చేస్తున్న వందనమిదియె
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


100

వేస్తిని కందము వందని
చేస్తిని యతనమును నేను చేవయు గూడన్
మస్తిష్కపు వేగమితిగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


101

వేస్తా వందకొకటి కలి
పేస్తో కందము జిలేబి పేరిట! సరదా
గా స్తంభాకారాధిగ
బస్తెడు పేలాల నిస్తె పద్యం చెప్తా!


స్వస్తి
పేలా లవంగక శతకము
శివంగి జిలేబి :)

Thursday, November 14, 2019

గాడిద మా లచ్చి - గోవు మా లచ్చి !



గాడిద మా లచ్చి - గోవు మా లచ్చి



14 నవంబర్ 2025 :
--------------------

డిల్లీ లో లోధి రోడ్ మినరల్స్ అండ్ మెటల్స్ కార్పొరేషన్  - ఎం ఎం టీ సీ ఆఫీసు సీ యీ వో  జ్ఞాన్ ప్రకాష్ గారికి  పొద్దుటే అర్జెంటు గా ఓ కాలొచ్చింది.  "సార్, మన వాల్ట్ ఖాళీ ! - పొద్దుట ఒకే ట్రేడ్ లో మొత్తం గోల్డు వాష్ అవుట్ అయిపోయి ఓ వ్యక్తిగత అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపొయింది" .

జ్ఞాన్ ప్రకాష్ ఉలిక్కి పడ్డాడు గాని , బేజారు పడకుండా తాపీ గా అడిగేడు - "ఆర్ యు జొకింగ్ ? వాట్ హ్యపెండ్ టు కట్ ఆఫ్ లిమిట్స్ ?"

"ఏమయ్యిందో తెలీదు సార్ ! బ్రీచ్ సిగ్నల్ రాలేదు " చెప్పాడా పెద్ద మనిషి.

జ్ఞాన్ ప్రకాష్ ఈ సారి ఉలిక్కి పడి , పైజామా నుంచి ప్యాంటు లోకి మారి కారుని లోధి రోడ్డు కి పోనిచ్చేడు. అసలే గోల్డు ధర  విపరీతం గా పడి పోయి కొనే వాళ్ళు లేకుండా పోయేరు. డే యిన్ డే అవుట్ ఇంకా ధర తగ్గొచ్చు వెయిట్, వెయిట్ అంటూ సీ ఎన్ బీ సీ గోల్డ్ అనలిస్ట్ హుషారు గా అంటూ ఉండటం తోడు గోల్డ్ డిపాజిట్ రావటం అదిన్నూ విపరీతం గా, సేల్స్ ఆల్మోస్ట్ నిల్ క్రింద అయిపోతోంది. ఈ నేపధ్యం లో ఇట్లా మొత్తం గోల్డు గోల్ మాల్ అవటం చర్చనీయాంశం కావొచ్చు.  తన ఉద్యోగానికే డోకా కూడా పడొచ్చు. అయినా ఇట్లా ఒకే ట్రేడ్ లో పోవటం ఏమిటి చెప్మా అనుకుంటూ గతాన్ని నెమరు వేసుకున్నాడు.

ఓ ఆరేళ్ళ ముందు దాకా నలభై వేలు పై చిలుకు ఉన్న పది గ్రాముల బంగారం సడెన్ గా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పడి పోవటం ఆరంభించింది. గోల్డు కొనేవారు తగ్గి పోయి , వాల్ట్ లోకి గోల్డు డిపాజిట్ చేసే వారు ఎక్కువై పోయేరు దేశం మొత్తం మీద. దీంతో డిమాండ్ అసలు లేకుండా రోజుకి రోజు మరింత డవును గా ఎల్లో మెటల్ పడి పో నారంభించింది. ప్రస్తుతానికి ౩౦౦ రూపాయల ఖరీదు లో నిలిచింది. ఇంకా తగ్గొచ్చు - మే బీ వందకు తక్కువ పోయినా కూడా ఆశ్చర్యం లేదు. !


దారిలో జ్ఞాన్ ప్రకాష్  టీ ఎన్ కృష్ణన్ - విజిలెన్స్ ఆఫీసర్ కి ఫోను కలిపేడు. దక్షిణ దేశం వాడే తన మాట వింటాడు అనుకుంటూ - " కృష్ణన్ సాబ్ - యు హార్డ్ ది న్యూజ్ " అన్నాడు. ఆ వైపు నుంచి టీ ఎన్ కృష్ణన్ పొలైట్ గా "యెస్ సార్ - వి ఆర్ ఇన్వెస్టి గేటింగ్  విల్ రివర్ట్" అన్నాడు పొడి పొడి గా.

జ్ఞాన్ ప్రకాష్ కారు పోనిచ్చేడు.


14 నవంబర్ 2019
-------------------

ఆవులు మచ్చుకైనా రోడ్డు మీద కనబడని నగరం నించి  ఏడుకొండలు అనే ఆసామి బ్లాగు వ్రాసేడు. సంక్షిప్తం గా గోవు మాలచ్చి కడుపులో బంగారమే బంగారం అని"



అంతకు ముందే గోదావరి నది నీళ్ళ లో తేలి యాడిన మరో ఆసామి గాడిద మాలచ్చి అని బ్లాగు వ్రాసేడు. ఈ మహానుభావుడు డెబ్బై ఏండ్ల దాపుల్లో ఉన్న వాడు. చలామణి లో ఉన్న కొత్త కరెన్సీ లా ఫెళ ఫెళ లాడే మ్యాటర్లు వ్రాస్తుంటాడు.

అతను వ్రాసిన సారాంశం - గాడిద పాలు తో మాంచి బిజినెస్సు లాగించే యొచ్చు అని. దానికి దాయిచే ల్యాండ్లోనో నిప్పాన్ దేశం లో నో ప్రాజెక్ట్ ఫైనాన్షియల్స్ తయారు చేసి ప్రోటో టైప్ క్రింద లాభం ఎట్లా వస్తుందో చూపించేరు.



పనిలేక కునుకులు తీసుకుంటూ పజ్జాలు వ్రాసేసు కుంటూన్న బామ్మ జిలేబి కళ్ళ బడింది మ్యాటరు. మొదట్లో తీసి పడేసింది కాని పద్నాల్గో తారీఖు గోవు మా లచ్చి  ఆర్టికల్ కూడా చదివేక బామ్మకి, తాను మోడీ వెంబడి తిరిగిన వూళ్ళ లో వాళ్ళు  వ్రాసిన సపోర్టింగ్ మేటరు కనుల పండువ గా అనిపించి ఓ పెద్ద ప్లాన్ వేసింది.

పెనిమిటి జంబునాథన్ కృష్ణ స్వామి అయ్యరు గారికి పని పురమాయించింది. పాకిస్తాన్ లోనించి  కర్తార్ పూర్ కారిడార్ ద్వారా గాడిదల్ని (సర్దార్ జీ మోటారు బైకు ఇంపోర్టు కత లెవల్లో ) గాడిద ల పైన చెత్త పడేసుకుని బార్డర్ ఏరియా లో కనులు గప్పి ఇంపోర్ట్ చేయ నారంభించి గుజరాత్ లో కచ్ ఏరియా లో పెద్ద గాడిద మాలచ్చి  ఇంటర్ నేషనల్ ఇన్ కార్పోరేషన్ అనే సంస్థ ని నెలకొల్పింది.

దీనికి తోడు ఏడు కొండలు వ్రాసిన గోవు మాలచ్చి కత చదివేక సీరియస్ గా ఆలోచించి  గోవు మా లచ్చి ఇండియా ఇంకార్పోరేషన్ నెలకొల్పింది.

ఈ రెండూ కాంబినేషన్ లు క్లిక్ అయి ఓ వైపు గాడిద పాలు విపరీతం గా డబ్బులు వెద జల్లటం, ఆ డబ్బులతో గోవు ల్ని విపరీతం గా కొనుక్కొని వాటి కడుపు లో నించి గోల్డు   విపరీతం గా దిగుమతి చేసుకోవటం మొదలెట్టింది జిలేబి.

మధ్య లో గవర్న మెంటు ఆఫ్ ఇండియా వారు గోల్డు లన్నిటికీ లెక్క కట్టా లని పీకల మీదకి రావడం తో, లెక్కల ను పకడ్బందీ గా పెట్టు కొని,  గోల్డు టన్నుల కొద్ది డిపాజిట్ చేయటం మొదలెట్టింది.

ఈ రెండు కలిసి గోల్డు విపరీతం గా ధర పడి పోవటం మొదలెట్టింది మేరా భారత్ మహాన్ మేక్ ఇన్ ఇండియా తో.

ధర రెండు వేల ఇరవై అయిదు నాటికి మూడు వందల రూపాయలకు పడి పోయింది పది గ్రాములు. !

ప్రజలకు ఆశ ఎక్కువ. ఇంకా పడి పోతుంది ధర అనుకుంటూ కూర్చున్నారు.


10 Nov 2025
---------------

ఇండియా నించి ఓ సెక్యూర్డ్ వాట్సాప్ కాల్ అమెరికా కి వెళ్ళింది.

"మనవడా" అంది ఈ వైపు  గొంతు.

ఓయ్ బామ్మా అన్నాడు ఆ వైపు లక్కు పేట రవుడీ, ది గ్రేట్ ఎజైల్ గురు.

అబ్బీ - ఎం ఎం టీ సీ సర్క్యూట్ బ్రేక్ ఓ పది నిమిషాలు ఆపాల్రా ఈ వైపు గొంతు .

ఓస్ అదెంత పని అన్నాడు ఆ వైపు మనవడు.

ముహూర్తం ఫిక్స్ అయింది. - 14 Nov 2025 పొద్దుట ఆరు గంటలకు.



చీర్స్
జిలేబి 

Monday, November 11, 2019

శేషన్ టి.యెన్. - ది అల్శేషన్!


Seshan TN , the Alsatian is no more.
May his soul rest in peace.

May be Indra loka will have tough time if at all it has any elections !



Photo courtesy - News Archives.



జిలేబి