Wednesday, February 3, 2010

ఆలోచనా స్రవంతి

మనసులోని మర్మమెల్ల తెలిసిన వారెవరైనా ఉంటారంటారా? ఎట్లాంటి టైటిల్ బ్లాగ్ లో రాయాలో ఆలోచన లేకుండా మనసులోనించి వచ్చే ఆలోచనలకి అక్షరం రూపం ఇవ్వగలడం సాధ్యమా? అంటే వచ్చే ఆలోచనలని ఏవిధమైనటువంటి నిబంధనలకి కట్టుబాట్లకి తావివ్వకుండా అక్షర రూపం చెయ్యడం అన్నటువంటి సాధనా ప్రక్రియ ఉందంటారా
ఆలోచించి చూస్తే ప్రతి మనిషి అక్షర రూపమివ్వడానికి మునుపు తన ఆలోచనలకి ఓ సామాజిక పరమైన లేకుంటే సిద్దాంతిక పరమైన కట్టుబాట్లని పెట్టుకుంటా డేమో? ఎందుకంటే ఆలోచనలని యదా తధంగా ప్రచురిస్తే అది ఒక ద్రౌపది లాంటి రచన ఐతే దాన్ని విశ్లేషించడానికి లేక విమర్శించ డానికి ఎల్లప్పుడూ జనం ముందు ఉండ వచ్చు. కాకుంటే అది ఒక రామాయణ విష వృక్షం అవ్వచ్చు.

ఏమంటారు?

చీర్స్
జిలేబి.

Tuesday, February 2, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

బ్లాగ్ భాన్ధవులకి
నూతన సంవత్సర శుభాకాంక్షలతో

మీ
జిలేబి.

Monday, December 28, 2009

Sunday, December 27, 2009

లంగా రవిక కోక

తే నా లంగా అని తెలంగాణా లాగేసు కుంటే
కోక నాది అని కోన సీమ కోరితే
రవిక నాదని రాయలసీమ రాద్ధాంతం చేస్తే-
తెలుగు తల్లి నగ్న నాదం బిక్కు మొహం పెట్టి చూస్తోంటే-
సందులో సడేమియా అని మా తాత గారి సూదిలో దారం
"జ్యోతి" లా ప్రజ్వరిల్లుతూంటే-
ఆంద్ర దేశమా - ఇది కలికాలం సుమా!
నీ కేట్లాంటి కష్టాలు వచ్చేయి తెలుగు తల్లీ
ఓపిక పట్టు- కష్టాలు తొలగి పోయే రోజులు వస్తాయని

జిలేబి.

Saturday, December 19, 2009

మా పూరిల్లు మార్పులు చేర్పులు

అభివృద్ధి అన్నది ఎట్లా వస్తుంది? ఉన్నదానిని పడగొడితే దాని స్థానం లో పెద్ద భవంతి ని కట్టొచ్చు. ఉదాహరణకి మా ఇల్లు చాల పాత ఇల్లు. దీన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న సర్దుబాట్లతో ఇంకా ఓ నలభై లేక యాభై సంవత్సరాలు లాగించ వచ్చు. కాకపొతే ఖర్చులు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి - సంవత్సరానికో మారు జై తెలంగాణా అన్నట్టు. కాకుంటే ప్రతి ఐదు సంవత్సరాలకో మారు ఎన్నికలన్నట్టు. దానికి విరుద్ధం గా మన్నికగా మా ఇల్లు గట్టి గా ఇంకో వంద సంవత్సరాలు నిలబడాలంటే ఇంటిని నేల మట్టం చేసి కొత్త గా కడితే (మేస్త్రి లు కరెక్ట్ గా కడితే- సున్నం సిమెంటు మన్నికవైతే లాంటి నిబంధనలకి లోబడి) సాధించవచ్చు.

కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రం లో ఉన్న ప్రస్తుత పరిస్థితి మా పూర్ ఇల్లు లానే ఉంది. దీనికి సమాధానం కొత్త ఇల్లా లేక సర్దుబాట్లతో ఇంటిని రిపైర్ చెయ్యడమా లాంటిది.

జిలేబి ఇంత సింపుల్ కాదు ఈ విషయం అంటారా- మా ఇంట్లో అమ్మదే పై చేయి. ఆమె ఎట్లా చెబితే అలానే నడుచు కోవాలి. మా అయ్య కి బొక్కసం నింపడం ఎట్లా గో తెలుసు కాని ఇంటిని నిలబెట్టడం విషయం లో పరిజ్ఞానం తక్కువ. కాకుంటే మా అయ్య వీధి లోని రామయ్యలన్దరితోనూ కూర్చొని గంటల తరబడి హరిత సమస్యల గురించి, ప్రపంచదేశాల సమస్యల గురించి అనర్గళం గా సంభాషించ గలడు- అంత మాత్రమే మా అయ్య సత్తా.

చీర్స్
జిలేబి.

నగరం లో సర్కస్!

ఫ్లైట్ నుంచి దిగబడి హమ్మయ్య మా భారత భూమి పై కాలు మోపాను అని సంతోషం పడి పోవడం ప్రతి భారత ప్రవాసి కి ఓ పిచ్చి ఆనందం ! ఆ ఆనందం ఓ రెండు మూడు రోజులలో హుష్ కాకి ఐపోయి "మా దేశం లో ఇట్లా - ఇక్కడ ఇట్లాంటి కంపరిసన్ కి దిగి పోవడం సర్వ సాధారణం!

అట్లాంటి బడుగు మధ్యతరగతి భారత ప్రవాసి మహానగర సందర్శనార్థం బయలు దేరడమునను ఆ హా మా దేశం ఏమి ఉన్నతి చెందింది- "ఇండియా షైనింగ్ " అంటే ఇదే కామోసు అన్న అధ్బుతమైన ఆలోచనతో సరే ఈ ఊరి బస్సు కూడా ఎక్కి చూసేద్దాం అన్న ఆలోచనకి వచ్చి బస్సు ఎక్కడమున్ను ఆ పై బస్సులో ఒఊపిరి ఆడక ( ఆ పాటి ఓ రోజుకే అల ముహం వేలాడ దీసుకుంటే ఎలా మరి- ఇదే దేశం లో ఈ కార్యక్రమం రోజువారి జరుగుతోందే మరి?) ఎందుకొచ్చిన నగర సందర్శనం రా బాబు అనుకోవడమూ కద్దు!

కాని ఈ మారు గమనించిన దానిలో విశేషం బెట్టి దంటే- నగరం లో దుకానులు కలర్ ఫుల్ గా ఐయిపోయీయి! బస్సులు ట్రాఫ్ఫిక్ అట్లాగే మరీ ఎక్కువై పోయేయి. అంటే దరిమిలా దేశానికి ఎ ఇన్ఫ్రా స్త్రక్తుర్ అన్నది ఎట్లా వస్తుందో తెలియకుండా పోయింది.

బస్సులలో చెవులకి ఎఅర్ ఫోన్ లు ఉన్నాయి. చేతుల్లో ఐపాడ్ ఉన్నాయి. జనాల చేతుల్లో తినడానికి జుంక్ ఫుడ్ బోల్డంత ఉంది. కాని రోజువారి ప్రయాణం లో పదనిసలు ఎప్పుడు సరిగమలు పాదతాయో ?


ఇది ఎ ఒక్క మహానగర దుర్భాగ్యం మాత్రం కాదనుకుంటా? అన్ని మహా నగరాల పరిస్థితి ఇంచు మించు ఇట్లా గే ఉన్నది. జనత సౌకర్యం గా పయనం చెయ్యలేక ప్రైవేటు వాహనాలు రోడ్ల పై ఎక్కువై అవి ఇంటి వటుడింతై అన్నట్టు గా ఇటు రోడ్ ని అటు ఫుట్ పాత్ లని అధిగమిస్తూ సర్కస్ చేస్తూ పోతూంటే- ఓ భారత దేశమా - ప్రగతి కి నిర్వచనం ఎక్కడ ఉన్నది?

జన ప్రభంజనం లో మహా ప్రవాహ వాహినిలో కొట్టుకు పోతున్న దేశమా - కాస్త నిలిచి జనాలకి ఎట్లాంటి సౌకర్యం ఇవ్వాలని అనుకుంటున్నావో ఓ మారు ఆలోచించు అని అనుకోకుండా మానుకోడు సామాన్య మానవుడు!

అయినా దేశం ఇట్లాంటి సమస్యల ప్రవాహాన్ని పట్టించుకోదు! పట్టించు కావలసినవి చాల ఉన్నాయి- ఉదాహరణకి రాష్ట్ర విభజన లాంటి నిఖార్సైన విషయాలు!

మీరేమంటారు? తెలుసు లెండి సామాన్య మానవులం మరి- ఇట్లాంటి విషయాలు పట్టించుకుంటే- మన ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి చూసీ చూడకుండా వెళ్లి పోవడం మన ఆరోగ్యానికి క్షేమ కరం!

జిలేబి.

Friday, December 18, 2009

"వరదరాజ గుడి- భూమాత బడి "

చిత్తూరు నీవా నది తీర ప్రాంతంలో విరాజిల్లిన గుడి శ్రీ వరదరాజస్వామి గుడి. ఈ గుడి కి వెళ్ళడానికి నీవా నదిని దాటి వెళ్ళాలి. పూర్వ కాలం లో నది నీళ్ళతో నిండి ఉంటె నదిని దాటి ఈ గుడికి వెళ్ళడం ఒక పెద్ద విషయం. ఆ తరువాయి దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశానికి స్వాతంత్రం వస్తే చిత్తూరు నీవా నదికి నీళ్ళు పోయేయి. నీవా నది లో చిత్తూరు లో కాలుష్యం అన్ని నదుల్లా దీనికి పట్టింది. కాలుష్యం తో బాటు చిత్తూరు నాయుడు గారి "సురాపానం" (అదేనండి మదిరం- లికర్ అంటారు అట ఆంగ్లం లో ఐతే) కార్ఖానా "పుణ్యమా" అని నదిలో "సురాపానం" కాలువై ప్రవహించింది. ఆ కాలంలో దగ్గిరి వీధిలోని నీళ్ళు "మత్తు" గా గమ్మత్తు గా పసుపు కలర్ తో జనాలకి ఓ కిక్ ఇచ్చింది! నది బెడ్ చేరబడింది - ఆ మధ్యలో ఈ నాయుడు గారు సాయిబాబా గారి నీటి పధకానికి కొట్లిచ్చారని వినికిడి. పర్సనల్ కాలుష్య నివారణార్థం కామోసు అనుకున్నాను ! ఈ నది కాలువని - సురా కాలువ సువాసలని భరించలేక చాలామంది ఈ గుడి కి వెళ్ళడం మానుకున్నారు కూడా. ఆ పై ఆ గుడి దొంగల బడి అయ్యింది. అప్పుడప్పుడు మంచి ఎండలో ధైర్యం చేసి ఆ కాలపు కుర్రాళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు ! ఆ తరువాయి ఎవరో పుణ్యమా అని మళ్ళీ గుడి లో దీపం కొన్ని రోజులు వెలిగింది.

ఇవన్ని ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే- ఈ పై కహానికి కోపెన్ హగెన్ సభలకి సామరస్యం ఉంది కాబట్టి. భూప్రపంచాల కాలుష్యం నివారించడానికి ౧౯౨ దేశాలు సమావేశమై తమకు తామే పాడుచేసుకున్న గుడిని మళ్ళీ నిలబెట్ట తామోచ్ అని వాక్రుచ్చి హాట్ తోపిక్ తో కిందా మీదా పడుతున్నాయి- మా నాయుడు గారు సాయిబాబా గారి నీటి పథకానికి డబ్బిచ్చినట్టు గా ( ఆ మాత్రమైన ఇచ్చాడు గా అన్నది మరో వాదన - అదీ ఇవ్వకుంటే ఏమయి ఉండేది చిత్తూరోల్ల నీటి కష్టాలు ?)

నదులకి నీళ్ళు లేవు. జనాలకి నదులే ఇల్లులు కట్టుకోదాని స్థలాలు అయి పోయేయి.
నదులలో నీళ్ళు లేవు. నది మట్టి ఇల్లులు కట్టుకోడానికి రాష్ట్రేతర రావాన అయి పోతోంది
నదీనాం సాగారో గచ్చతి అన్నది ఆ నాటి వాక్కు!
నదీనాం రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాకెట్ మనీ గాచ్చాసి అన్నది నేటి వాక్కు
నదీనాం న ప్రవహంతి - నదీనాం న జీవసి అన్నది రేపటి వాక్కు !

అంతా విష్ణు మాయ కలికాలం ప్రభావం ! మాయ తేరా దిగితే - మనిషి ఆకస హర్మ్యాల నుండి భూమ్మి మీద కి రావటం - ఓ త్సునామి క్షణం అంత సేపు !

జిలేబి.

Saturday, December 12, 2009

మొర మొరాలు బొరుగులు కూనలమ్మ పదాలు

చిత్తూరులో ఓ ముసల్మాను - పతాను బొరుగులు అమ్మే వాడు. "మొర మోరా" అన్నది అతని కేక !

మొదట్లో సైకిల్ లో వచ్చేవాడాయన - ఆ పై ఓ ఓల్డ్ టీవీఎస్ ఫిఫ్టీ లో వచ్చి బొరుగులు అమ్మేవాడు.
అతని కంఠం వీధి చివర్లో అరిస్తే ఆ వీధి మొనలో వినబడేది ! ఈ మానవుడి గురించి చిత్తూరబ్బాయీ ఒకతను సుమన్ కుమార్ అనే అతను, తన కథలో ఓ క్యారెక్టర్ గా కూడా చిత్రించిడం జరిగింది.

ఇప్పుడు ఈ మొర మొర ప్రసక్తి ఎందుకు అంటే -

ఈ రెండు రోజులలో ఆంద్ర రాజ్యం లో "మొర మొర" లు ఎక్కువై పోయేయి. అంటే బొరుగులన్న మాట . గాలి ఎటు వీస్తే బొరుగులు ఆ వైపు ఎగిరి పోతాయి. ఇప్పడు ఆంధ్ర దేశం లో ఏ బొరుగులు ఎక్కడ తేలతాయో కూడా తెలియడం లేదు.

ఈ "తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది" అన్న పాట ఎంతదాకా సరి అన్నది తెలియడం లేదు!

దేశ విభజన , రాజ్యాల విభజన రాష్ట్రాల విభజన - "విభజించు పాలించు" అన్న సూత్ర మునకు కట్టు బడి ఉన్నామా లేక ఇంకా భారతీయులు గా ఉన్నామా ?

అంతా చిదంబర చిద్వాలాసం అనుకోవాలా లేక ఇది మూక సైకాలజీ మీద "మాతా హరి" రాజకీయ నాటక రచనా పరిహాసమా?

అవురా నలుగురు నవ్వి పో దురు గాని నాకేటి సిగ్గు? కూనలమ్మ పదాలే రాజ్య భవితవ్యం!

రాష్ట్రమంతివర్గం చేవ లేకుండా సత్తా లేకుండా ఉంటే - రాజన్నవాడు నిఖార్సుగా ఉండక పొతే - ఆ దేశ రాజ్య పరిస్థితి నడి సముద్రం లో నావ!

దాని దిక్కు కి సూచికా లేదు- దాని మనుగడకి భరోసా నూ లేదు. !

అంతా విష్ణు మాయ కాకుంటే మరే మంటారు?

చీర్స్
జిలేబి.

Wednesday, November 25, 2009

ఇండియన్ స్టాక్ మార్కెట్

ఈ మధ్య ఇండియన్ స్టాక్ మార్కెట్ చాలా గొప్పగా నింగి వైపు దూసుకెడుతోంది! ఆ మధ్య క్రితం సంవత్సరం ప్రపంచ మార్కెట్లంతా ఇక ఉంటామా లేక ఊగిపోతామా అన్న స్థితి లో డిసెంబర్ నెలలో ఉండింది. ఒక్క సంవత్సరం తరువాయీ ఇప్పుడు నింగి వైపు జూమ్!! ఈ జూమ్ ఎంతదాకా కొనసాగొచ్చు? ఈ మధ్య జూలై 2010 లో మళ్ళీ సెన్సెక్స్ 21000 మార్క్ దాటుతుందని ఓ ప్రవచనం!

ఈ లాంటి స్థితిలో ఈ బ్లాగు రాయడం ఎందుకంటే , ఇది నిజంగా ఈలా నింగి వైపు రియల్ గా వెళ్తుందా అన్న ప్రశ్న ఉదయిచడం ! మీరేమంటారు?

చీర్స్
జిలేబి.

Saturday, November 21, 2009

ఇచ్ఛా మరణం vs ఆత్మహత్య

ఈ మధ్య ఈ ప్రశ్న ఉదయించింది. మహానుభావులు ఇచ్ఛా మరణం పొందుతారంటారు - ఉదాహరణకి కపాల మోక్షం ద్వారా ప్రాణాన్ని త్యజించడం లేక సజీవ సమాధి కావడం లాంటివి. జ్ఞాని ఐన మహానుభావులు ఈ లాంటి మరణం తో ఈ లోకాన్ని విడిచి పెట్టడానికి ఆత్మ హత్య కి సాదృశ్యం ఉన్నదా అన్నదే నా సందేహం. సామాన్య మానవుడు తాళలేని కష్టాలతో ఇక ఈ జీవితం తాను భరించడం లేడనుకుని ఆత్మ హత్య కి పాల్పడడం లేకుంటే ఆత్మ హత్యే సమస్యకి పరిష్కారం అన్న ఆలోచనతో జీవితాన్ని ముగించడం జరుగుతుంది. ఇదే మహానుభావులు శాస్త్రాలు "ఆత్మ హత్య మహా పాతకం" అంటారు! మరి నా కర్థం కాని విషయం ప్రాణాన్ని కపాలం ద్వారానో లేక సజీవ సమాధి ద్వారానో త్యజించడం ఆత్మ హత్య కాదా? తార్కికానికి అందని ఈ విషయం ! బ్లాగు రీడర్లు దీన్ని గురించి అభిప్రాయం తెలుప గలరు. ఇది పెద్ద మనుషుల ఫార్సు ఆలోచనలా ఉన్నది నాకైతే- అంటే పెద్దవాళ్ళు చేస్తే ఓ న్యాయం చిన్నవాళ్ళు చేస్తే మరో న్యాయం లాంటిది?

జిలేబి.

Wednesday, November 18, 2009

పంచేంద్రియాలకి ఆవల!

ప్రణవ్ మిస్త్రీ అన్న అబ్బాయి పంచేంద్రియాలకి ఆవల ఆరో ఇంద్రియాన్ని గురించిన ఈ పదిహేను నిముషాల టాక్ వీలు చేసుకుని చూడండి! అవకాశం కలిసివస్తే భారతీయులు ఎట్లాంటి ఇన్నో వేషన్ చేయగలరో అన్నదానికి ఇది నిదర్శనం

http://www.ted.com/talks/pranav_mistry_the_thrilling_potential_of_sixthsense_technology.html

చీర్స్
జిలేబి.

Wednesday, November 4, 2009

మదర్ మీరా - శ్రీమతి కమలా రెడ్డి ఒక పరిచయం


పుట్టినది చండేపల్లె నల్గొండ జిల్లా ఆంధ్ర దేశం
ప్రస్తుత నివాసం జర్మనీ దేశం
గృహస్తాశ్రమం !
పూర్వశ్రామం లో కమలా రెడ్డి గారు
ఇదీ చిన్ని పరిచయం వీరి గురించి.
ఛీర్స్
జిలేబి.

Sunday, November 1, 2009

శ్రీ ఏక్ హార్ట్ టొల్లె ఒక పరిచయం


శ్రీ ఏక్ హార్ట్ టొల్లె ఒక పరిచయం
పుట్టినది జర్మనీ దేశం
చదివినది లండన్ మహానగరం కేంబ్రిడ్జీ
నివాసం కెనడ దేశం లో!
ఒకానొక దినాన "అంతర్ముఖ పరివర్తన" ఆయన జీవితంలో మలుపు
అది ధ్రుఢమై అంతర్ముఖ ప్రయాణం
ఆపై పుస్తకాలతో "ప్రస్తుతాన్ని" గురించి వివరణలు!
ఇవీ ఆయన గమమించిన సత్యాలు ఆయన ఉపన్యాస దీటి కి సోపానాలు

ఛీర్స్
జిలేబి.

శ్రీ "మూజి" ఒక పరిచయం

శ్రీ మూజి
సత్సంగ్ విత్ మూజి !
అన్తోనీ పాల్ యంగ్
జమైకా దేశం పుట్టిన గడ్డ
ప్రస్తుతం నివాసం లండన్ మహా నగరం
పూర్వశ్రామం లో స్ట్రీట్ పైంటర్ , ఆర్టిస్ట్ , వృత్తి రీత్యా "అధ్యాపకుడు
తన నిరంతరాన్వేషణలో "పాపాజి" శిష్యరికం
రమణ మహర్షి వారసత్వ తాత్విక ఆలోచన దృక్పధం!
ప్రపంచ విస్తృత పర్యటనలలో "సత్సంగ్ విత్ మూజి" అన్న
టాపిక్ ఆయన "తాత్విక ఆలోచనలకి " వేదిక!

ఛీర్స్
జిలేబి.

Saturday, October 31, 2009

శ్రీ చారిజి ఒక పరిచయం



నా గురు దేవులు పుస్తక విరచిత
శ్రీ చారిజి గారు
పూర్వాశ్రమం లో కార్పోరేట్ ఎగ్జిక్యూటివ్
తన గురుదేవుల సహజ మార్గ రాజయోగ పధ్ధతి ని
ప్రపంచానికి తెలిపిన వారు
కర్మ యోగి
రాజ యోగ పధ్ధతి గురించి ధ్యాన పధ్ధతి గురించి అనర్గళంగా
జన బాహుళ్యానికి అర్థమయ్యేలా విసదీకరించినవారు !
నివాసం మద్రాసు (చెన్నై) మహానగరం
తనదైన 'ఆంగ్ల భాషా' పాటవం ఆయన అనర్గళ ఉపన్యాస ఝరి!

ఛీర్స్
జిలేబి.

Friday, October 30, 2009

శ్రీ "M" ఒక పరిచయం

శ్రీ "M" ఒక పరిచయం!
పేరు ముంతాజ్ ఆలి !
మలయాళీ జన్మ ప్రదేశ రీత్యా
ముసల్మాను జన్మ రీత్యా
ప్రస్తుత వాసం ఆంధ్ర దేశం!
పూర్వాశ్రమం లో జర్నలిస్ట్ వృత్తి రీత్యా
ముంబై రామకృష్ణ సంస్థలో ఒకప్పుడు దీక్ష పొందిన వారు
వేదాంత సారాన్ని సులభంగా అనర్గళంగా విసదీకరించ గలిగిన వారు
"నీ లోని అంతర్యామిని దర్శించు" అన్న మతాతీత "నిర్మత" సంస్కృతి వారిది
మనీషి
మదనపల్లె ప్రస్తుత వాసం
ఆయన పేరులోనే "M" కాదు ఆయన ప్రవృత్తి లో కూడాను!
సూర్యునికి పరిచయం అవసరం లేదు.
అయినా సూర్యుని గురించి చెప్పకుండా ఉండలేము!
ఈ పరిచయమూ ఆ కోవకే చెందినది -

ఛీర్స్
జిలేబి.

Wednesday, October 28, 2009

జాలం - కూడలి- హారం

జారువాలు బ్లాగు రుచులతో
లంబోదర విరచిత వ్యాస భారతం దీటుగా
బ్లాగ్ రచయితల కూడలి హారం జాలం
దిన దిన ప్రవర్ధమానం గా వర్ధిల్లాలి అన్న
ఆశయాలతో ఈ బ్లాగు ల పేర్లతో
అల్లిన పద ప్రబన్దం
ఈ టపా తో పరిసమాప్తి!
మళ్ళీ సమయం వచినప్పుడు
మరో మారు ఈ ప్రహేళిక పునః ఆరంభం !!

ఛీర్స్
జిలేబి.

Monday, October 26, 2009

నెమలి కన్ను

నెమలి కన్నులు చూడ చక్కన
' నెమలి కన్ను ' చదువ చంపకమాల
నెమలి కి అందం కన్నులు చందం నడకలు
' నెమలి కన్ను ' కి అందం విలక్షణం
చందం పుస్తక పరిచయం!
ఛీర్స్
జిలేబి.

మనస్వి

ఆమె మనస్వి
తను తాపసి
నాతి చరామి అన్నాడు అతడు
అర్ధాంగిని అన్నదావిడ
ఈ సమీకరణంలో
కలసి ఉంటే కలదు సుఖము
లేకుంటే కలదు కష్టాలు కన్నీళ్ళు
మనస్వి తాపసి ని తపస్వి చెయ్యగలిగితే
తాపసి మనస్వి ని మమేకం చేసుకోగలిగితే
ఆ జీవనం సహజీవనం !

ఛీర్స్
జిలేబి.

Sunday, October 25, 2009

కూడలి !

కూ
ప్పు
లింకులు
వెరసి
కూడలి
మా కూడలి

ఛీర్స్
జిలేబి.