Monday, October 26, 2009

నెమలి కన్ను

నెమలి కన్నులు చూడ చక్కన
' నెమలి కన్ను ' చదువ చంపకమాల
నెమలి కి అందం కన్నులు చందం నడకలు
' నెమలి కన్ను ' కి అందం విలక్షణం
చందం పుస్తక పరిచయం!
ఛీర్స్
జిలేబి.

మనస్వి

ఆమె మనస్వి
తను తాపసి
నాతి చరామి అన్నాడు అతడు
అర్ధాంగిని అన్నదావిడ
ఈ సమీకరణంలో
కలసి ఉంటే కలదు సుఖము
లేకుంటే కలదు కష్టాలు కన్నీళ్ళు
మనస్వి తాపసి ని తపస్వి చెయ్యగలిగితే
తాపసి మనస్వి ని మమేకం చేసుకోగలిగితే
ఆ జీవనం సహజీవనం !

ఛీర్స్
జిలేబి.

Sunday, October 25, 2009

కూడలి !

కూ
ప్పు
లింకులు
వెరసి
కూడలి
మా కూడలి

ఛీర్స్
జిలేబి.

Saturday, October 24, 2009

పరిమళం

గుభాళింపు
తాజాదనం
కనులకి ఆహ్లాదం
'పరిమళం'
శత 'పుష్ప' హృదయం !

ప్రఫుల్ల
మధుర
భావ వీచికల పరిమళం
పరిపూర్ణం , బ్లాగోన్నతం!

శుభాకాంక్షలతో
జిలేబి

Friday, October 23, 2009

రవిగారూ!

రవి
విహారి అవిశ్రాంత చరి
గాడాన్ధకార ప్రపంచానికి దివిటి !
రూఢిగా రవి లేనిదే భువి లేదు!
రవి ప్రజ్వలనం భువి నిర్మూలనం!

UNO దిన సందర్భం గా అన్ని దేశాల Environmental Improvement Plans సఫలీకృతం కావాలని ఆసిస్తూ
ఛీర్స్
జిలేబి.


హారం హా, రమ్ !

మ్మ్
రమ్
హారమ్
ఆంద్ర పాఠక ప్రజానీకానికి
హా, రమ్ మా హారమ్!
ఆహార్యం ఆంద్ర బ్లాగ్ లోకానికి
మహా ఆరామం బ్లాగ్ రీడర్లకి

ఛీర్స్
జిలేబి.

Thursday, October 22, 2009

జ్యోతి

యత్ర సూర్యో న ప్రకాశయంతి
అని వేద వాక్కు!
జ్యోతి ప్రజ్వలనం ఆ వేద వాక్కు ప్రతిధ్వని!
ఆ దివ్య జ్యోతి అఖండం అపూర్వం!
యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయాం పశ్యతి
అన్న గీతాచార్యుని ఉపదేశం
ఈ హృదయ జ్యోతి ని సాక్షాత్కారం చేసుకోవడానికి
సర్వదా సమాలోచనల రాచ మార్గం!
నా హం కర్తా కర్తా హరిః!

ఛీర్స్
జిలేబి

కొత్త పాళీ

కొత్త ఒక వింత పాత ఒక రోత
పాళీ ఏదైనా దాని సత్తా వ్రాసే 'కొత్త' దనాన్ని బట్టి
పాళీ వెనుక ఉన్నమెదడు బట్టి!
ఈ కొత్త పాళీ బ్లాగుల సముదాయం
దిన దిన అభివ్రిద్ది
తెలుగు రచయితా రచయిత్రులకు చేయూత!
కవులకి కవయిత్రులకి కాదేది 'కావ్యార్హం!'
'బ్లాగ్వేదిక' అందరికి 'భారతి' ఆశీర్వచనం!

ఛీర్స్
జిలేబి.

Wednesday, October 21, 2009

సిరా కదంబం

పూర్వం సిరా బుడ్డి ఉండేది(ఉండేదట!)
సిరా అద్దితే కలం కావ్యాన్ని పలికించేది
ఆ తరువాత సిరా కలం లో కలయికై
దారావాహిని అయ్యింది !
మరి ఈ ఇరవై ఒక్క శతాబ్దంలో?
కంప్యూటర్ రాత రసవత్తర బ్లాగోదయం గా
భాసిస్తోంది!
సో నేటి కదంబం సి రా (కంప్యూటర్ రాత!)

ఛీర్స్
జిలేబి.

Tuesday, October 20, 2009

మోహన మీ ప్రకృతి

తిమిర సంద్రాల
కృతి కర్తా స్వప్నమీ
ప్రకృతి
మీ (నా) ప్రకృతి
వ్య అందాల
రిత వయ్యారాల
మోహన మహోత్తున్గాల
ప్రకృతి-
మోహన మీ ప్రకృతి !

ఛీర్స్
జిలేబి

Monday, October 19, 2009

అమ్మ ఒడి

అమ్మ ఒడి ఒక బడి
అమ్మ చెంత నిశ్చింత
అమ్మ మా అమ్మ ముగ్గురమ్మల అమ్మ
సరస్వతి లక్ష్మి పార్వతి ల సంగమం మా అమ్మ
అనురాగ రాగాల పల్లకి లో జీవితం లో మరపురాని
దినాలని మదిలో నిలపి
'అమ్మాయీ' నాదైన ఈ వారసత్వం
నీ ద్వారా ఇంకా నీ వారసత్వానికి ప్రాసాదించు!
అన్న ఆశీస్సులతో ఆశీర్వదించే అమ్మ ఒడి ఒక గుడి
సదా సిద్చిర్భవతు సర్వానాం !
జిలేబి.

Sunday, October 18, 2009

హరి సేవ

సేవ అన్నా సర్వీసు అన్నా మనకి చాల ఇష్టం
వాలంటరీ సర్వీసు స్వచ్ఛంద సేవ సంస్థల హృదయం
అది హరి సేవ అన్నా జన సేవ అన్నా
ముఖ్యమైనది హృదయం ద్వారా పని చెయ్యడం
హరి సేవలో, జన సేవలో తరించే ప్రజా లోకానికి
ఇవ్వాళ ప్రపంచ పేదరికాన్ని పోగొట్టాలన్న
అంతర్జాతీయ దినోత్సవనాన్ని గుర్తు చేస్తూ

మీ
జిలేబి.

Saturday, October 17, 2009

లీలా + మోహనం!

భామ సత్య సారథి కే రథ సారథి గా నిలచిన వేళ
'సారథి' శౌర్యం నరకాసురనుని వధించిన వేళ
చూపులలో వయ్యారాలు మాత్రమే గాదు స్త్రీ శక్తీ అనిపించిన వేళ
భామా సమేత కృష్ణుడే శక్తీ స్వరూపుడు అని నిరూపించిన వేళ
ఆ వేళ ఈ వేళ - దీపాల మేళ !
ఆ 'లీలా మొహనుల' కు నమస్సులతో !

అందరికి శుభాకాంక్షలతో!
'సత్పుర' వాసిని
జిలేబి.

హృదయ స్పందనల చిరు సవ్వడి

ఎవ్వరూ లేనప్పుడు కిటికీ దేన్ని చూస్తుంది?
ఎవ్వరూ భాజాయించనప్పుడు ధమరుకం ఏ నాదాన్ని వినిపిస్తుంది?
ఎవ్వరూ విననప్పుడు మురళీ ఏ గానాన్ని ఆలపిస్తుంది?
ఎవ్వరూ చూడనప్పుడు కళ్లు వేటిని చూస్తాయి?
హృదయ కవాటాలని తెరచి వినగలిగితే ....
స్పందనల చిరు సవ్వడి వీటన్నిటికి అతీతంగా
ఉన్న ఆ ఆంతర్యామిని సాక్షాత్కరిస్తుందా?
ఆనందో బ్రహ్మ!

దీపావళి శుభాకాంక్షలతో
జిలేబి.

Friday, October 16, 2009

నవ్వులాట

ఆహా నా నవ్వులాట
ఆహా నా నవ్వులాట
నీకు నాకు నవ్వు అంట తాం తాం తాం
నవ్వు నాలుగివిధాల ఆరోగ్యమంటా
నవ్వితే రత్నాలు రాలుతాయంట
నవ్వే నాకు శోభ యంటా
అందుకే .....
నవ్వో నమః!

ఛీర్స్
జిలేబి.

Thursday, October 15, 2009

ఆంధ్రా 'మృతం'?

ఆంధ్రుల చరితం అతిరస భరితం
ఆంధ్రుల సంస్కృతి అమోఘ కావ్యం
ఆంధ్రుల మేధస్సు వర్ణనాతీతం
ఆంధ్రుల వంటకం షడ్రసో పేతం
ఆంధ్రుల కీర్తి అతిరధ మహారధుల సమ్మేళనం
ఆంధ్రుల కావ్యం కమనీయం
ఆంధ్రుల సౌర్యం అసామాన్యం
మరి ఆంధ్రుల రాజకీయం......??????

ఛీర్స్
జిలేబి

Tuesday, October 13, 2009

ఆలోచనా తరంగాలు

తిరంగం తరంగం లా వయ్యారాలు పోతూంటే
మది మనోల్లాసంగా మురిసిపోతూంటే
పై ఎద పై పై ఎగసి పడుతూంటే
ఆలోచనా తరంగాలు చక్కిలి గింతలు పెడుతూంటే
మనసా ఎందుకే మౌనం

ఛీర్స్
జిలేబి.

Monday, October 12, 2009

భావ నిక్షిప్తం

గుండలోని మాట గొంతుకలో కొట్లాడుతుంటే
మదిలోని సవ్వడి మరువనీయ కుండా ఆరాట పెడ్తూంటే
హృదయం తనని మరవ లేక తానే తనలో మమేకం కాలేక పోతూంటే
భావం ఆర్ణవమై సంధ్యలో కరిగిపోతూ
నాతో చెలిమి చెయ్యమని
నా మనసే భావమై నాలో నిక్షిప్తం!
అంతా గుప్చుప్!

జిలేబి.

Sunday, October 11, 2009

మురళీ గానం

మురళీ గానం
మధురం
తియ్యదనం కలబోసిన దంటా
ఆ కాలం లో నే నుండి ఆ గానాన్ని
ఆలకించి ఉంటే అవునో కాదో చెప్పే దాన్ని
కాని ఆ మురళీ గానం తానెప్పుడు మధురమే
అని నిరుపించుకోవడానికి
ప్రతి కాలం లో ను ఒక్కో మానీషి లో ప్రతిధ్వనిస్తూనే ఉంది
వినడానికి మన చెవులు హృదయ ద్వారాలని తెరిచి వుంచితే!

ఛీర్స్
జిలేబి.

Saturday, October 10, 2009

కలల ప్రపంచం

కలల ప్రపంచం
నీది నాది అన్నా ఈ ప్రపంచం
అందరిది ఈ ప్రపంచం అయినప్పుడు
కలలు కనే నా నేస్తం కలల ప్రపంచం
ఎప్పుడు సాకారం ?

పిన్న పెద్ద అన్నా తమ్ముడు అక్క చెల్లి
బంధుత్వం బాదరాయణం
ఓ అరవై లేక డెబ్భై ఏళ్ళు
జీవితం
పరమం పురుషార్థం
ఆనందో బ్రహ్మ!

ఛీర్స్
జిలేబి.