పూర్వం సిరా బుడ్డి ఉండేది(ఉండేదట!)
సిరా అద్దితే కలం కావ్యాన్ని పలికించేది
ఆ తరువాత సిరా కలం లో కలయికై
దారావాహిని అయ్యింది !
మరి ఈ ఇరవై ఒక్క శతాబ్దంలో?
కంప్యూటర్ రాత రసవత్తర బ్లాగోదయం గా
భాసిస్తోంది!
సో నేటి కదంబం సి రా (కంప్యూటర్ రాత!)
ఛీర్స్
జిలేబి.
సమస్య - 5006
-
18-1-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుమతులు మాత్రమె వసింత్రు గుంటూరు పురిన్”
(లేదా...)
“కుమతుల్ మాత్రమె వాసముందురు గదా గుంటూ...
13 hours ago
అంతకు మునుపు తాటాకుల మీద గంటం పోట్లు, ఇంకా అంతకు మునుపు రాతిమీద ఉలి పోట్లూ కూడా ఉండేవి .. అప్పటికైనా ఇప్పటికైనా క్షరం కానిది అక్షరం ఒక్కటే. ఆ అక్షరమేమో పొట్టలో ఉంటుందిట.
ReplyDeleteబాగుంది మీ సి రా కదంబం!
జిలేబీ గారూ !
ReplyDeleteచవులూరించే పేరు పెట్టుకున్నారు. చెవులూరించే రచనలు చేస్తున్నారు. బ్లాగుల పేర్ల ఆధారంగా టపాలు వ్రాయటం గురించి వ్యాఖ్య రాద్దామని అనుకుంటూండగా నా బ్లాగు మీద కూడా రాసేసారు. ఇప్పుడైనా వ్యాఖ్యానించక పోతే బాగోదని రాస్తున్నాను. ఈ సరికొ్త్త విన్యాసం బాగుంది. నిఝంగానే ! నా బ్లాగు మీద రాసారని కాదు. నమ్మండి. ఏమైనా బ్లాగు లోకంలోకి ఈ మధ్యనే అడుగు పెట్టినా సీనియర్ బ్లాగర్ల పేర్ల సరసన నాది కూడా నిలబెట్టినందుకు కృతజ్ఞ్తతలు. కొత్తపాళీ గారి మాట 'అ'క్షర సత్యం.
బాగుంది.కానీ రావు గారి బ్లాగు శిరా కదంబం కదా! సిరాకు శిరాకు అర్థంలో చాలా భేదముంది.సిరా అంటే అందరికీ తెలుసు.శిరా అంటే దేవునికి సమర్పించే ఒక నైవేద్యమనుకుంటా.రావుగారు మా అనుమానాన్ని నివృత్తి చేయాలి.
ReplyDeleteరెండూ కాదండీ, అది రావు గారి పూర్తి పేరుకు షార్ట్ కట్ అనుకుంటాను.బహుశా శివరామ ...Ist guess :)
ReplyDeleteవిజయ మోహన్ గారూ ! భా,రా.రె. గారూ !
ReplyDeleteభా.రా.రె. గారు చెప్పింది నిజమే ! అయితే 1st guess కదా ! చూద్దాం ! ఇంకెన్ని వస్తాయో !
శిర అంటే కేసరిబాత్. సత్యనారాయణ స్వామి ప్రసాదం లాంటి ఓ స్వీటు.
ReplyDeleteఅయ్యా చి వి గారు
ReplyDeleteరావు గారి బ్లాగు శిరా కదంబం! ఈ తపా 'సిరా కదంబం'!
శిరా రావు గారు
ధన్యవాదాలు ప్రొత్సాహనికి
భా రా రె గారు రవి గారు, కొత్తపాళీ గారు
మీ ప్రోత్సాహం ఎల్లప్పుడూ స్పూర్థి నిస్తూంది.
చీర్స్
జిలేబి.
రావుగారూ, తిరుమలలో శ్రీవారికి నివేదించేవి శిరా తీపి నైవేద్యం,కదంబం కూరగాయలతో చేసిన నైవేద్యం అని తెలుసు.తీపి,కారం కలయికగా మీ బ్లాగని నేను ఆ కోణంలో ఆలోచించాను.కానీ మీ పేరుతో అని ఆలోచించలేకపోయాను.నేను మీ బ్లాగును మొదట చూసినప్పటినుండి మిమ్మల్ని అడిగి నా సందేహ నివృత్తి చేసుకుందామని అనుకున్నాను.చివరకు ఆ కోరిక జిలేబీ గారి టపా ద్వారా తీరినందుకు సంతోషంగా ఉంది. వాస్తవాన్ని ఊహించినందుకు భా రా రె గారూ మీకు నా అభినందనలు.
ReplyDeleteజిలేబీ గారూ మిమ్మల్ని తప్పు పట్టాలని నా ఉద్దేశ్యము కాదు.కోపమొచ్చిందేమో అయ్యా అని సంభోదించారు.మిమ్మల్ని ఏమైనా నేను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి.
జిలేబీ గారికి
ReplyDeleteముందుగా మీకు ధన్యవాదాలు. మీ టపా వల్లనే నా బ్లాగు పేరు మీద ఇంత చర్చ జరిగింది. అది పెద్ద విశేషం కాకపోవచ్చు కానీ కొన్ని తెలియని విషయాలు తెలుసుకున్నాను. అందుకు సంతోషంగా ఉంది. చర్చల విశిష్టత ఇదే ! మీ ద్వారా ఇది నెరవేరినందుకు మరోసారి అభినందనలు. ముఖ్యంగా కొత్త విషయాలు తెలియజేసిన విజయ మోహన్ గారికి, రవి గారికి కృతఙ్ఞతలు