Thursday, November 17, 2011

తిరపతయ్య - ఢిల్లీ చలో ! చలో ఢిల్లీ !

ఇవ్వాళ ఏమి సుదినము !

ఏమి సుదినము !

మా తిరపతయ్య ఢిల్లీ చలో

 ప్రయాణం మొదలెట్టిన సుదినం !

చాలా కాలమునకు మా తిరపతయ్య కి

దేవీ దర్శనం దక్కిన సుదినము !

దేవేరి ఏమి చెప్పెనో ?

తిరపతయ్య ఏమి చేయునో ?

పంచు లచ్చీ చిలక జోస్యం చెప్పుమా ?

మా వెంకన్న బోడి గుండు సంఘం వాళ్ళు

తిరపతయ్య కి ఏమి సత్కారం చేతురో ?

అయ్యా త్వరగా సమాచారములు చెప్పుడీ ,

మా తిరపతయ్య కి జేజేలు చెప్పుడీ !

చీర్స్
జిలేబి.

తిరపతయ్య ఎవరు ? ఆతని కథా కమామీషు ఏమిటి ? సస్పెన్స్ సుమా !

5 comments:

 1. హహహ్హ..గమనించితిని జిలేబీ.
  0=BR*2 రాకపోవడానికి కారణం రమ్ము ఎఫక్టే తప్ప నాది కాదని మనవి :))

  ReplyDelete
 2. దేవేరి ఏమి చెప్పేనో అని ఇక అలోచించాల్సిన పని లేదండి. మాటలు మొత్తం బయటకు వచ్చేసాయి.


  ఫైర్‌స్టార్: (సేతులు కట్టుకుని)అమ్మగోరు రమ్మన్నారంట...రెక్కలు కట్టుకుని వాలిపోయానమ్మా..సెప్పండమ్మా..

  సోనియమ్మ: వాట్ నాన్సెన్స్ ! నీ యెదవ డ్రామా డవిలాగులు నువ్వూ...రెగ్యులర్ లైఫ్‌లో కూడా నీ నటన ఆపవా ? సరే సరే ఎందుకొచ్చావో ఏడువ్ !

  ఫైర్‌స్టార్: అంటే..అదీ..నాకు ఎమోషన్ పండించకపోతే మాట బయటికి రాదమ్మా...ఇకపోతే..మా పిల్లోడి పెళ్ళి కుదిరిందమ్మా...మీ సెవిన ఆ ముక్క ఏద్దామని వచ్చానమ్మగోరూ. మా బామ్మర్ది కూడా ఓ పాలి మిమ్మల్ని కలిసి రమ్మన్నాడు..

  సోనియమ్మ: మరి నేనే స్వయంగా ఢిల్లీకి పిలిపించానని యెదవ టీటీలు ఆడుతున్నావంట మీడియాలో ?

  ఫైర్‌స్టార్: అంటే..అదీ..మీరు పిలిపించారని సెప్పుకుంటే రేంజ్ పెరుగుద్దని అలా సెప్పుకున్నానమ్మా...అహ్మద్ పటేల్‌గారి పర్మిషన్ కూడా తీస్కున్ననమ్మగోరూ....
  (కళ్ళ నిండా నీళ్ళెట్టేసుకుని..గొంతు పూడుకుపోయి)....జనం, మీడియా, మన పార్టీవోళ్ళూ బొత్తిగా గౌరవించడంలేదమ్మా...ఊకలో ఈకలా తీసిపారేస్తన్నారు..తిరపతి ఎమ్మెల్యే అని పిలుస్తున్నారమ్మా..

  నా స్థాయికి, నా స్ఠేఠస్‌కి, నా హోదాకి తగ్గట్టు ఏదన్న ఇప్పించండమ్మా..మీ పేరు సెప్పుకుని ఇంకో నాలుగయిదు బొమ్మలు సేసుకుంటాం..

  సోనియమ్మ: బొక్కలోది రాజకీయాల్లో నీకు స్థాయేటి ? అయినా నీ స్థాయికి, హోదాకి తగ్గట్టుగా అంటే పంచాయితీ బూత్ ఇన్‌చార్జ్ కింద పెట్టాల్సి ఉంటది. అది కూడా పాలకొల్లులో అయితే నీకు పోటీ ఉంటది..ఏదన్నా నువ్వునాకినపాలెం లాంటి ఊర్లో ఒక బూత్ సూద్దాంలే.....
  (విసుగ్గా)ఇంకేంటి చెప్పు త్వరగా..

  ఫైర్‌స్టార్: (చేతులు పిసికేసుకుంటూ)..నాతోబాటూ..నా వర్గం లీడర్లకి కూడా వాళ్ళ స్ఠేఠస్‌కి తగినట్లుగా ఏదన్న పడేయండమ్మా..మీరేమీ దయతల్చకపోతే ఆఖరికి నాకు ఏర్‌పోర్ట్‌కి సెండాఫ్ కి కూడా ఎవురూ రారమ్మగోరూ..... (మళ్ళీ కళ్ళొత్తుకుంటూ)..ఇప్పటికే పరిస్థితి రకరకాలుగా ఉందమ్మా

  సోనియమ్మ: గంజి తాగేవాడికి మీసాలెత్తేవాదొకడు అనే సామెత విన్నావా ఎప్పుడన్నా ? నీ తెలివి ఈ రేంజ్ కాబట్టే మీ బామ్మర్ది నిన్నట్లా ఆడించాడు. యెదవ కోడి బ్రెయిన్ కొద్దిగా వాడు.
  నీ యెనకున్న ఆ ఇద్దరికీ పదవులిస్తే ఆళ్ళు నీ యెనకెందుకుంటారు ఇంక ? నీకేదో ఒకటి పడేస్తాలే...ఇంకెళ్ళు..

  ఫైర్‌స్టార్: సంతోషం అమ్మగోరూ..ఈ జన్మకిది సాలమ్మగోరూ..సాలు....Thank You, thank you !

  సోనియమ్మ: సరే సరే..(విసుగ్గా) ఇక తగలడు...

  ఫైర్‌స్టార్: అమ్మగోరూ..బెబ్బెబ్బె..అదీ..మ్మ్..మ్మ్మ్...సివరాకరి కోరికమ్మా....ఇప్పటికే నాతో ఆరు నిమిషాలు మాట్లాడారమ్మా....ఇంకో అరగంట ఆ మూలన కూకుంటనమ్మా..బయటికెళ్ళి 40 నిమిషాలు మాట్లాడుకున్నామని, జగన్, చంద్రబాబు, CBI , మన్నూ మశానం గురించి నా సలహాలు అడిగారని సెప్పుకుంటానమ్మా..నీ కాళ్ళట్టుకుంటా....వద్దని మాత్రం అనకమ్మా..ప్లీజ్..

  సోనియమ్మ: సరే సరే..(విసుగ్గా) ఏదో ఒహటి ఏడువ్ పో..... By : KC Chekuri

  ReplyDelete
 3. తిరపతయ్యకి రాజశేఖరరెడ్డే గుండుకొట్టించాడూ!!!!

  ReplyDelete
 4. పంచులచ్చిమీ, తిరపతయ్యెవరూ, దేవేరి ఎవ్వరు, బోడిగుండు సంఘమేది ?
  అంతా అల్లుకుపోయిన మల్లెతీగల్లా వున్నయేంటో. కొద్దిగా వివరమిస్తే మేమూ హాట్ హాట్ జిలేబీల్ని సర్వచేసే భాగ్యానిస్తారేమో నని వేడుకోలు.

  ReplyDelete
 5. భారారె
  తిరపతయ్య ఎవరు ? ఆతని కథా కమామీషు ఏమిటి ? సస్పెన్స్ సుమా !

  @జాన్,

  టపా కన్నా పెద్దగా కామెంటినందులకు నెనర్లు

  శర్మ గారూ,

  బోడిగుండుకి మరో బోడిగుండు !

  ReplyDelete