Wednesday, November 16, 2011

జిలేబి ఫేమస్ ఈక్వేషన్ - O = BR² - నోబెల్ బహుమతి గ్రహీత

జిలేబి ఫేమస్ ఈక్వేషన్ - O = BR² - నోబెల్ బహుమతి గ్రహీత

కి ప దొ న అని మన అప్పారావు శాస్త్రీ గారు ఒక సమీకరణాన్ని నా బ్లాగులో కామెంటు కింద పెట్టి మెజీషియన్ మన పట్టాభిరాం గారి లాగ హుష్ కాకీ ఐ పోయారు.

ఏమండీ అప్పా రావు శాస్త్రీ గారు, శాస్త్రీ గారు, కి ప దొ న అనగా ఏమి అంటే ఆయన జవాబిస్తే ఒట్టు.

ఈ మధ్యలో John గారు వచ్చి , కి ప దొ న = ROFL అని మరో సమీకరణం కామేంటి ఆయన కూడా గాయబ్ అయి పోయారు.

ఇలా ప్రతి ఒక్కరు వచ్చి వారికి తోచిన సమీకరణాన్ని రాసి వెళ్లి పొతే, నేనేమి చేతును నారాయణా అని కుయ్యో మొర్రో అంటే, అసలు కామేన్టిన వాళ్ళు తిరిగి వచ్చి మనం కామెంటినామే , జిలేబి గారి కి ఏమైనా సందేహములు ఉన్నాయా, వాటిని తీర్చవలసిన భాద్యత మన మీద ఉంది కదా ? అని ఆలోచిన్చనే లేదు సుమీ !

ధడాలుమని, మరో బ్లాగరు శ్రీ మాన్, పురాణ పండ ఫణి గారు, (మంచి కాలం వీరు పేరు పీ క్యూబ్ అని పెట్టుకోక నాకు ఒక సమీకరణం తగ్గించారు !) , నా మీద దయతలచి, జిలేబి గారు ,

ROFL = Rolling on Floor Laughing అని మరో సమీకరణం వదిలి గయ్యబ్ హోగయేరు !

ఇక ఇన్ని సమీకరణం లు మనలని కొంగ ఫ్యుజి చెయ్య కూడదు సుమా అని నేను చాలా సీరియస్ గా ఆలోచించి,
కి ప దొ న అనగా, కింద పడి దొర్లి నవ్వడం అన్న అర్థం వచ్చేలా అర్థం చేసేసుకున్నాను.

హమ్మయ్య ఇప్పడు నేను కూడా మరో సమీకరణం రాసేసాను.

కింద = Below
పడి =  Fall
దొర్లి = round round round
నవ్వు = Laugh

so, BF R*R*R L = ROFL

Cancelling both sides R,F,L we derive,

BR*R = O

So, O = BR Square!

వావ్ నేను Einstein అయి పోయానోఅచ్ !

ఇప్పడు నేను కూడా ఎవరైనా కామేంటి వెళ్లి పొతే , వాళ్ళ టపా లో వెళ్లి ఓ = బీ ఆర్ పవర్ రెండు అని ఒక సమీకరణం రాసేయ వచ్చు!

ఎయిన్ స్టెయిన్ అయిన
జిలేబి
O = BR² ! (ఓ ఈజీ క్వల్టు బీ ఆర్ స్కోయారు)
(కి ప దొ న = ROFL అనబడు ఒక జిలేబి O = BR² నోబెల్ సమీకరణం కథ సమాప్తము)

16 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Einstein గారూ.. Einstein అవింనందుకు congrats..!

    మీ విజయం వెనుక నేనూ ఉన్నానన్నమాట. అదేనండీ నేను కామేంటి గాయబ్ అయి పోవడం వల్లనే కదా..మీరు సమీకరణం కనుగొన్నారు. మీకు నోబెల్ ప్రైజు వస్తే నా వాటా నాకు పంపడం మరచిపోకండి.

    ReplyDelete
  3. Congrats...varudhini garu..మీ BR² మెచ్చి మే౦ కూడా వాడుకోవచ్చా..

    ReplyDelete
  4. మీకు నోబుల్ ఇవ్వకపోతే బ్లాగ్ రోకో లు జరిపిస్తామని తెలియ చేసుకొంటున్నాం :)

    ReplyDelete
  5. అయ్యా జాన్ గారు,

    నోబెల్ బహుమతి లో మీకు కూడా పార్ట్ ఉంది కాబట్టి, మీకు కేజీ ల కొలది జిలేబి లు అన్డుకొండీ. ఇది నో బెల్ - అంటే నో గంట బహుమతి. కాబట్టి నో పైసలు రాలును. ఏమి చేద్దాం బ్లాగ్ లోకం వాళ్ళం - అడ్జస్ట్ చేసేసుకోవాలి మరి. నెనర్లు. కామేన్తినందులకు !

    @జ్యోతిర్మయి గారు,

    నిరభ్యంతరం గా O = BR² వాడుకో వచ్చు. క్రింద కర్టసీ జిలేబి అని రాస్తే ముదావహం (ఆనందో బ్రహ్మ ) ధన్యవాదములు.

    ReplyDelete
  6. హరే కృష్ణ గారు,

    హరే రాం ! ధన్యవాదములు - రాం రోకో - రాస్తా రోకో , ఢిల్లీ చలో ఉద్యమం కి సప్పోర్ట్ ఇస్తున్నందులకి. బ్లాగ్ రోకో మాత్రం వద్దు సుమా !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. ఆ మధ్యన బజ్జుల్లో చర్చలు జరిగాయి. తెలుగు వాళ్ళు తెలుగులోనే నవ్వుకోవాలి. బ్రాకెట్ల లో నవ్వకూడదు అని తీర్మానించుకొని అన్నీ రకాల నవ్వులకి సంక్షిప్త నామాలు పెట్టేం.
    దహా = దరహాసం. చి.న = చిరునవ్వు, అహా = అట్టహాసం, కి.ప.దొ.న, న.న.న., ఇత్యాదులు. వీటి గురించి ఆ.సౌమ్య గారు ఒక టపా వ్రాసే ఉద్దేశ్యం తో ఉన్నారు.
    కాబట్టి సాహిత్యం లో నోబెల్ ప్రైజు కి మేమే అర్హులము అనిన్నూ మీరు కాదనిన్నూ మనవి చేసుక్కుంటున్నాము. కాదు కూడదు అంటే మీరు రసాయన శాస్త్రం లోనే, గణిత శాస్త్రం లోనో, మరేదైనా శాస్త్రం లోనో తీసుకోవలసిందిగా విజ్నప్తి చేస్తున్నాం.

    ReplyDelete
  8. అయ్యా బులుసు గారు,

    మీరు ఆ అప్పీల్ ఇచ్చేక మేము గీత దాటదామా ? నెవెర్. మీరు దేనిలో నోబెల్ తీసుకోమంటారో దానిలోనే నోబెల్ ఇవ్వవచ్చు.

    ఆ సౌ గారు 'సౌ' నోబెల్ కి అర్హులు. ఇంతకీ బజ్జులే బోజ్జో అని గూగుల్ అన్నాయి అనగా విన్నాను. మరి మీరు ఇలా సీక్రెట్ గా బజ్జులలో ఇల్లాంటి నిర్ణయములు తీసుకొంటే మాకు ఎలా తెలియును. ?

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  9. క్షమించండి జిలేబి గారు
    నాలుగు రోజులుగా నెట్ ఓపెన్ చేయడం లేదు (గత అయిదేళ్ళలో ఇదే మొదటి సారి అనుకుంటా )
    కిం. ప. దొ. న ,
    మ.హా
    ద.హా
    ఇలాంటివి గురువు గారు కనిపెడుతుంటారు
    మీరు బజ్ లలో లేకపోవడం వల్ల మిస్ అవుతున్నారు అనుకుంటా
    సంకలిని లో బజ్ లో ఒక సారి లుక్ వేయండి ( బజ్ సరదాగా ఉంటుంది. మీ బజ్ తో లాగ్ ఇన్ అవనవసరం లేదు)
    ఇహ నోబుల్ విషయానికి వస్తే
    E= MC² లానే O = BR² ఉండటం తో మీరు Einstein అయిపోయారు
    నేను కూడా తత్వ శాస్త్రం మీద అధ్యయనం చేస్తున్నాను
    అతి త్వరలో ( ఒకటి రెండు నెలల్లో ) బ్లాగర్ ల మెదళ్ళు తింటాను
    అప్పుడు నాకు కూడా తత్వ శాస్త్రం మీద "నో బిల్" ఇప్పించాలి

    ReplyDelete
  10. భారారె
    మీ కోరిక పై next post వచ్చేసింది. గమనించవలె.

    అప్పా రావు శాస్త్రీ గారు,

    మీరు శాస్3 ! మీ పేరులో నే ఉంది తత్వము అన్న మూడు అక్షరములు. మరి మీరు వేరొక తత్వము చదవ వలయునా? పేరుకే నో బిల్లు ఇవ్వ వచ్చును. మీ తత్వ 'శాస్త్రీ' యములు ఈ భువి కి భాస్కరుని వలె హారము నివ్వు గాక అని మా వెంకన్న శాస్త్రీ గారి ని వేడుకొందు !

    జిలేబీయం!

    ReplyDelete
  11. హహహ బావుంది...పైన గురువుగారు చెప్పినట్టు మేము అల్రెడీ ఈ ప్రక్రియ మొదలెట్టాము. త్వరలో ఒక పోస్ట్ రాస్తాను దీని మీద :)

    ReplyDelete
  12. LOL. (think need not explain). Kani Naako chinna dharma sandeham. Mee sameekaranam adedo cinemalo chiranjivi cheppinattu "in front crocodile tears" laa leduu? anduvalla mimmalni einstein ane kante blog chiranjivi(ni) ante baguntundemo? einstein aite anta glamour kudaa undadu kadaa. emantaru?

    phani

    ReplyDelete
  13. పీ క్యూబ్ గారు,

    ఈ మారు మీరు రాసినది నాకేమీ అర్థం కాలేదు. !

    'in front crocodile tears' ? అనగా నేమి ?
    ముందు
    ముసలి
    కన్నీళ్ళు ?

    దేని ముందు ?

    ReplyDelete
  14. ఆ సౌమ్య గారు,

    మీ ఆ టపా ఎప్పుడు వచ్చును ?

    ఆల్ ధి బెస్టున్నర !

    ReplyDelete