Tuesday, November 29, 2011

'సురా' పానీయం - జిలేబీయం !

"ఓరోరీ ఇంద్రుడా, సోమ  పాన మత్తులో ఉండినావా, ఏమి నీ ఖండ కావరము ? "

 ఇట్లాంటి సంభాషణలు మన పాత తెలుగు పౌరాణికాల లో గానీండీ, తెలుగు సినిమా ల లో గానీండి మనం చదివి లేక విని ఉండవచ్చు.


మన e లోకం లో మనకు సురాపానం గావించే అవకాశాలలో మొట్ట మొదటిది వ్యాఖ్యలు. అవి ఇచ్చు కిక్కు వేరే ఏదీ e-మాధ్యములో ఇవ్వదని నేను కీబోర్డుపధం గా చెప్పగలను!


ఆ మధ్య హారం , హా, రమ్, హారం ఒక మధు శాల లాంటి దని కూడా ఎవరో జిలేబి అట వారు రాసినది చదివినట్టు నాకు గుర్తు!


ఇక రెండవది - టపా. మనసుకు నచ్చిన టపా, ఆ టపా లో మంచి కంటెంటు ఉన్న టపా మరో సురా పానం లాంటిది.


జిహ్వ కొద్దీ రుచీ, మూడు కొద్దీ టపా లైకింగు !


 శ్రీ రామ రాజ్యం వస్తే, వెంటనే దానిని చాకి రేవు బండ మీద ఎంత ఎక్కువగా బాదితే , మన టపా ఎంత వ్యత్యాసం గా ఉంటె అంత మంచిది.

ఇదే విధం గా  మన డైలీ లైఫు లో జరిగే విషయాల గురించి రాసే టపాల కోవలో , హాట్ హాట్ రాజకీయం, అన్నా హజారే ఉన్నావరిదం కి సంబంధించి మనం చూపించే లెగ్ కికిన్గులు ఇవన్నీ 'when its hot its really cool' లాంటివి అన్నమాట !


మరికొన్ని టపాలు , వంటలకి సంబందించింది. ఇవి చాలా కారణాల వల్ల చాలా పాపులర్ ! ఐటీ రంగం లో ని 'బేచలర్ కిచెన్' టార్గెట్ ఇవి. కాబట్టి మరీ ఘాటుగా , సూపెర్ సేవీ గా రంజు గా కొన సాగుతాయి.


ఇక జ్యోతిష్యం - హాట్ హాట్ టాపిక్! నేను గమనిన్చినదాంట్లో , జ్యోతిష్యం మీద టపా పడితే ( అమెరికా ఎప్పుడు మునుగును- జ్యోతిష్యం ఏమి చెబుతోందీ - ఇట్లాంటి టైటిల్ (తిట్లు) సూపెర్ డూపర్ - అల్ టైం 'ఎక్కువ ' చదివిన' టపాల కోవకి వస్తుంది. !


మరి సాఫ్ట్ వేర్ సాములు రాసే - సెటైర్ అది మరో స్టైల్ . కొంత అర్థం చేసుకోవాలంటే వారి Knowledge is Power and Money' కాన్సెప్ట్ కొంత తెలిసుండాలి.


ఇక హాస్యం గురించి చెప్పనే అక్కర్లేదనుకుంటా. మనిషికి ఆహ్లాదం ముఖ్యం కాబట్టి ఈ టాపిక్కు ఎవెర్ హాట్!


వీటన్నిటికీ , ఆవల, కొన్ని బ్లాగులు , నిశ్శబ్దం గా తమ మానాన తాము రాసుకొంటూ పోతూంటాయి. అంత అలజడి, కామెంటుల పరమాన్నాలు, వీటి లో వుండవు. కాని వాటి కని వేచి వుండే కనులు ఎన్నో ! 
వాటికి వున్న విలువలు - కాల గతిలో నిలిచి పోయేవి.  బ్లాగు లోకాలు గాయబ్ అయినా , అవి తమ కాళ్ళ మీద నిలబడ గలిగినవి !


అట్లాంటి నాకు తెలిసిన ఒక 'సోమ  పానీయం '  శ్రీ సుబ్బా రావు గారి బ్లాగు !

శ్రీ సూక్తం లో- వైనతేయ సోమం పిబ, అని అన్నట్టు,

సోమ పానీయం గా వారి బ్లాగుని పరిచయం చెయ్యడానికి కారణం నాకు తెలిసిన ఈ 'సురా'బ్లాగీయం '  - సుబ్బా రావు గారి బ్లాగు నాకు చాల నచ్చడం !

ఎందుకు నచ్చడం ?

 ఒక ప్రత్యేక శైలి వీరిది  - నాలుగు పదాల నాలుగు పంక్తులతో , జీవితాన్ని ప్రతిష్టాపించడం వీరికే చెల్లు.

చిన్ని చిన్ని పదాలతో , చిన్ని పదబంధాలతో, తేట తెలుగు లో తేనీయలు జాలువారించడం అంత సులభం గాదు !

బ్రహ్మాండమైన సంక్లిష్ట పదాలతో భావాన్ని రాయడం ఒక ఎత్తైతే, అదే భావాన్ని సున్నితం గా, సింపుల్ గా చెప్పడం వెయ్యి ఎత్తులకి సరి సమానం  అని నా విశ్వాసం. అలా సింపుల్ గా చెప్పే కెపాసిటీ ఏ కొద్ది మందికో ఉంటుంది. అలాంటి వారిలో రావు గారు సుప్రసిద్ధులని పిస్తుంది. వీలు చేసుకుని ఓ సారి దర్శించండి !

'బ్లాగ్ మైత్రేయ -  సోమం పిబ'  !


చీర్స్
జిలేబి.

5 comments:

 1. అయ్యయ్యో మీరు ఇంతగా చెప్పాలా? చెప్పండి !!
  Just single line New post లో " పిబరే సోమరసం "
  http://psraopv.blogspot.com/
  అని ఒక్క లింక్ తగిలిస్తే
  ఆఘ మేఘాలపై అద్దానిని తిలకిన్చేదము కదా!

  ఎంతైనా మీ "టపా" ప్రకటనా పటిమ మీసొంతమే తప్ప
  కొల్లగొట్టుట ఎవరికీ చెల్లదు
  మంచి blog ని పరచయం చేసినందులకు Cheers !!
  థాంక్స్
  ?!

  ReplyDelete
 2. అసలు సంగతి చెప్పటం మరిచాను
  మొన్నటి మీ సూచన మేరకు
  నాలో చిన్న పరివర్తన కలిగి నా బ్లాగ్ template మార్చాను
  may be ఇప్పుడు కొంత సౌకర్యంగా ఉంటుంది
  "ఎందుకో?ఏమో!" ని ఒక్కమారు వీక్షించగలరు

  http://endukoemo.blogspot.com

  "ధన్యోస్మి"

  ?!

  ReplyDelete
 3. జిలేబి గారు,

  మీరు ఎంత తెలివిగల వాళ్లండి..ఒక INVITATION లేదు ఒక టపా లేదు , ఒక పిలుపు లేదు ...బిజినెస్ స్టార్ట్ చేసేస్తారా ? అసలు మీకు ఈ అయిడియా ఎలా వచ్చింది అండి? జిలేబీలు తింటే వస్తుందేమో కదా...ఏదేమైనా మీ" బ్లాగ్ ప్రమోటింగ్ కంపనీ "దినదినాభి వృది చెందాలని కోరుకుంటూ....

  మీ రెండవ కస్టమర్ గా నా వాక్యాలు కింద ఉన్నాయ్...

  నా బ్లాగ్ కుడా ప్రమోట్ చెయ్యరూ ....మార్కెటింగ్ ఫి ఇస్తానులెండి......హ హ హ

  నిజంగా బాగుంది...ఆ బ్లాగ్ థాంక్స్ ఫర్ ఇన్త్రోడుసింగ్..

  మీ శ్రేయోభిలాషి,
  RAAFSUN

  ReplyDelete
 4. @ఎందుకో ఏమో గారు,

  సరిగ్గా సెలవిచ్చారు. ఒక్క మాటలో సుబ్బారావు గారి బ్లాగుని చెప్పి ఉండవచ్చు. కొండకచో కీ బోర్డ్ పై చేయి అలా అలా వాటి పదమున అవి పోవుట , కాలు పోయిన రీతిలో నడక రీతి !

  నెనర్లు

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 5. @రాఫ్సన్ మహాశయా,

  నెనర్లు. మీరే ఒక రాఫ్ సన్! సూరీడికి దివిటి పట్ట వలెనా? మీ టపాకు మరో కోటింగు (మార్కెటింగు) ఏల ! మీరే దాని అమ్బాస్సాడరు !

  నెనర్లు
  చీర్స్
  జిలేబి.

  ReplyDelete