పరికిణీ పరిచితే
పిట పిట లాడుతోన్దంటారు
సల్వారు సాయిస్తే
సరసాంగి అంటారు
శుభ్రం గా చీర కడితే
సింగారి అంటారు
ప్యాంటూ షర్టూ వేస్తే
పైలా పచ్చీసు అంటారు
జీన్సు జమాయిస్తే
జిల్ జిల్ జిలేబి అంటారు
మిడీ వేస్తే
మిటారి అంటారు
షార్టు వేస్తే
షకీలా అంటారు
కోటూ సూటూ వేస్తే
కోణంగీ అంటారు
వెస్టర్న్ వేస్తే
వగలమారి అంటారు
స్విమ్ సూటు వేస్తే
సిగ్గే లేదంటారు
బురఖా వేస్తే
భావ ప్రాప్తి లేదంటారు
అబ్బ పోనీ
బట్టబయలు అవుతానంటే
బరి తెగిన్చిన్దంటారు
నేనేమి చేతురో నా ముద్దుల దినేశా
రాదే చెలీ నమ్మ రాదే చెలీ
ఈ మగువలెపుడు మగవారిని
నమ్మ రాదే చెలీ!
ఛీ
రాస,
జిలేబి.
పిట పిట లాడుతోన్దంటారు
సల్వారు సాయిస్తే
సరసాంగి అంటారు
శుభ్రం గా చీర కడితే
సింగారి అంటారు
ప్యాంటూ షర్టూ వేస్తే
పైలా పచ్చీసు అంటారు
జీన్సు జమాయిస్తే
జిల్ జిల్ జిలేబి అంటారు
మిడీ వేస్తే
మిటారి అంటారు
షార్టు వేస్తే
షకీలా అంటారు
కోటూ సూటూ వేస్తే
కోణంగీ అంటారు
వెస్టర్న్ వేస్తే
వగలమారి అంటారు
స్విమ్ సూటు వేస్తే
సిగ్గే లేదంటారు
బురఖా వేస్తే
భావ ప్రాప్తి లేదంటారు
అబ్బ పోనీ
బట్టబయలు అవుతానంటే
బరి తెగిన్చిన్దంటారు
నేనేమి చేతురో నా ముద్దుల దినేశా
రాదే చెలీ నమ్మ రాదే చెలీ
ఈ మగువలెపుడు మగవారిని
నమ్మ రాదే చెలీ!
ఛీ
రాస,
జిలేబి.
మొహం మీద ఈడ్చి కొట్టినట్లు ఉంది. బాగా చెప్పారు.
ReplyDeleteబురఖా వేసుకున్న స్త్రీ పై రేప్ జరిగినా బురఖా వేసుకోవడం నీదే తప్పు, కాస్త ఒళ్ళు చూపిస్తే రేప్ జరిగేది కాదు కదా అని అంటారు ఈ అభినవ అగ్నిహోత్రావధానులు.
ReplyDeleteఉన్న మాటంటే ఉలుకెక్కువంటారు...
ReplyDeleteఅయ్య బాబోయ్.
ReplyDeleteచాలా బాగా వ్రాసారు.
కాని చిన్న పాటి సందేహం అండీ. మగువలెపుడు మగవారిన నమ్మ రాదే అనేశారు -కానీ- పాపం యీ మగువలు సాటి మగువలను నమ్మగలిగే పరిస్థితి ఉందా అని.
"తెలుసుకొనవే యువతీ అలా నడచుకునవే యువతీ"
ReplyDeleteబాగుందండీ..
.very good it is a fact
ReplyDeleteబురఖా కీ భావప్రాప్తికి సంబందం ఏమిటో ?
ReplyDeleteమగువలు మగవారిని, మగవారు మగువలను నమ్మక పోతే సృష్టి ఆగిపోతుందండీ! మరో మాట చెప్పండి.
ReplyDeleteభాసి, వరూధిని గారు కూడా మార్తాండవాది అని కన్ఫర్మ్ అయిపోయావా?
ReplyDeleteపరస్త్రీ లో తల్లిని సోదరిని చూడాలనే వారు పురుషుడి లో రావణాసురుడినే ఎందుకు చూస్తారో?
ReplyDeleteఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, అర్ధాలె వేరులే ...... దహా.
(నేను జంప్)
అసభ్యముగా లేనంతవరకు ఏమి ధరించిన ఎవరు ఏమి అనరు అండి.. అంట మాత్రాన మమ్ములను నమ్మవదు అంటే ఎలా అండి.. దీనికి ఏమి అంటారు --->
ReplyDeleteవాళ్ళ అందాన్ని పొగిడితే అబద్దం ఆడుతున్నావని అంటారు
పొగడక పోతే సౌందర్య ద్రుష్టి లేదంటారు
- చెప్పిన దానికల్లా ఒప్పుకుంటే డుడూ బసవన్నవని వెక్కిరిస్తారు
ఒప్పుకోక పోతే అర్థం చేసుకునే మనసు లేదని నిందిస్తారు
- చక్కగా తయారైతే పూల రంగడని చురకలేస్తారు .
సింపుల్ గా వుంటే తాతయ్యలా వేస్ట్ అంటారు
- ఎక్కువగా మాట్లాడితే బోర్ అంటారు మాట్లాడకపోతే ప్రేమ లేదంటారు
- ముద్దు పెట్టుకుంటే జెంటిల్మెన్ వి కాదంటారు .
పెట్టుకోక పోతే మగాడివే కాదు పొమ్మంటారు
- చెయ్యి పట్టుకోబోతే అందు కోసమే కాచుకూర్చున్నవంటారు బుద్దిగా కూర్చుంటే ముద్ద పప్పు అంటారు
- వేరే ఆడ వాళ్ళ వైపు చూస్తే మగ బుద్ది అంటారు.
వాళ్ళు వేరే అబ్బాయి ల వైపు చూస్తే క్యాజువల్ లుక్ అంటారు
దినేష్ రెడ్డి అంటే అంత ఇష్టమా జిలేబీ గారూ? ఆయన కూడా నచ్చేశాడా? ముద్దులిచ్చేస్తున్నారు?
ReplyDeleteఇంతకీ పైన తప్పుల మీద తప్పులు చేస్తూ నిచ్చెన ఎక్కిన "పిట్ట" జిలేబీ యేనా?
అవున్లెండి.
ReplyDeleteఎవరికి తోచింది వారు అంటారు.
ఎవరి డిఫెన్స్ వారిది.
@వనజ వనమాలీ, శ్రీ లలిత గారు,
ReplyDeleteసరిగ్గా చెప్పారు. ఏమిటో చోద్యం వీరిది, దొంగ గారు దోపిడీ చేస్తున్నారంటే మీరు తాళాలు సరిగా వెయ్యలేదండీ అంటారు.
పోనీ తాళం వేసామంటే గట్టి తాళం వెయ్య లేదండీ అంటారు!. గట్టి తాళం వేసీ దొంగ పడ్డాదంటే దొంగలు దొర లై పోయారండీ అంటారు.
ఇంత చెబ్తారే కాని దొంగలు సమాజం లో ఎందుకు వుంటారు అని ఆలోచించరే సుమీ అనుకున్నామంటే , దొంగా పోలీసు ఆట పురాతన మైన ది, ఏమీ చెయ్యలేం అంటారు !
చీర్స్
జిలేబి.
@శ్యామలీయం మాష్టారు,
ReplyDeleteఈ మారు పద్యం నించి గద్యం లో పడ్డారు! మా చిన్నప్పటి హిందీ మాష్టారిణి చెప్పేది గుర్తు కోస్తుందండి- సహేలీ 'షార్ప్' నఖః" అని !
చీర్స్
జిలేబి.
@రాజి గారు,
ReplyDelete@రావు గారు,
ఖచ్చితం గా ఇది 'తెలుసు కొనవే యువతీ అండ్ బె కేర్ ఫుల్ అనటం లాంటిది అన్నమాట !
చీర్స్
జిలేబి.
బులుసు మాష్టారు,
ReplyDeleteమీరు చెప్పిన ఉదాహరణ కి ఎంత ప్రాచీన మైన వారిని తీసు కొచ్చి నారో (రావణా 'సూరుడు' ) దాని ని బట్టి చూస్తేనే ఈ ప్రాబ్లం ఎంత పాత దో తెలుస్తోందండీ! నార చీర కడితే నూ తప్పలేదు కష్టాలు - నారీ నీ వె నా ప్యారీ అని హేరాఫేరీ చేసాడు 'రాబాన్'
చీర్స్
జిలేబి.
@తెలుగు పాటలు గారు,
ReplyDeleteహమ్మయ్య మొత్తం మీద మొదటి మారు మీకు టపా అర్థమయ్యినందులకి నా కు ఒకే హ్యాపీ గా ఉండండి!
ఆ పై మీ 'మగ వారి పాట పాత కాలం నించి ఇలా అంటున్నారు గైని, మళ్ళీ సాధించే ఘన కార్యములు వేరు వేరు ! జేకే !
చీర్స్
జిలేబి.
ఈ తెలుగు వెబ్ మీడియా పేరు ఏమిటో తెలీదు !
ReplyDeleteసో తేవెమీ గారు,
అయిందండీ మీ కామెంటు వేము స్పాము,
విడిపించితి దాని బురఖా
అది అయ్యిన్దండోయ్ కామెంటు తునక !
ఈ మార్తాండ 'వేదం' ఏమిటో అర్థం కాలేదు కాబట్టి కామెంటు నాస్తి !
చీర్స్
జిలేబి.
@భాస్కర్ గారు,
ReplyDeleteసూరీడికి, చామంతి కి ఉన్న అనుబంధం అది!
@కష్టే ఫలే మాష్టారు,
నమ్మకం వరకు సృష్టి కార్యం నిలప కుండా వుంచటం వరకు నో ప్రాబ్లం అనుకుంటాను మాష్టారు. తంటా ఎక్కడ అంటే , సెంటిమెంటు దెబ్బలతో ! అదన్న మాట నమ్మకానికి , సెంటిమెంటు లకి వ్యత్యాసం!
చీర్స్
జిలేబి.
@కిరణ్ కుమార్ గారు,
ReplyDeleteపిట్ట ఎగరాలని చూస్తోంది. విలుకాడు వీలు కాదు అంటాడు. ఎం చేద్దామండీ , దినేశుడూ ఒక తల్లి బిడ్డే కదండీ, బామ్మలకి ఎప్పుడు 'మనవాడి' పై ప్రేమలే, నచ్చినా మెచ్చాలని ఉందా ?మెత్త గా మొట్టాలని కూడా వుంటుంది !
చీర్స్
జిలేబి.
@మళ్ళీ శ్యామలీయం మాష్టారు,
ReplyDeleteడిఫెన్సు, ఫెన్సు ఎన్ని ఉన్నా అఫెన్సు ఎక్కువై పోతే న్యూసెన్సు !
చీర్స్
జిలేబి.
హహహ భలే చెప్పారు!
ReplyDeleteయింతకీ మీ వేష ధారణ చూశాక ఏమంటారో సెలవిచ్చారు కాదు ?
ReplyDeleteరవి గారు,
ReplyDeleteఅందులోనే చెప్పా గదండీ ! జిల్ జిల్ జిలేబీ అని !
చీర్స్
జిలేబి.