ఈ మధ్య Deciphering the Cosmic Number (by Arthur I Miller ) అన్న పుస్తకం చదవటం జరిగింది . ఈ పుస్తకం కాల్ యుంగ్(సైకో అనలిస్ట్) , వోల్ఫ్ గాంగ్ పౌలి (ఫిజిసిస్ట్ - పీరయాడిక్ టేబల్ - ఎక్స్ క్లూషన్ ప్రిన్సిపల్ కి నోబల్ గ్రహీత) మధ్య జరిగిన సంభాషణలు , పౌలి కన్న కలల డ్రీమ్ అనాలసిస్ వగైరా విషయాల తో చాలా ఆసక్తి కరం గా పుస్తకం సాగుతుంది .
ఈ పుస్తకం లో ని డ్రీమ్ అనాలసిస్ మన పనిలేక డాక్టరు రమణ బాబు గారి లాంటి వారికి చాలా ప్రయోజనకరమైన విషయం .
ఇక ఈ పుస్తకం శీర్షిక గురించి, : ఈ పుస్తకం ప్రకారం కాస్మిక్ నంబెర్ 137.
ఈ కాస్మిక్ నెంబర్ ప్రత్యేకత ఏమిటి ? అంటే, "the weird number 137, which on the one hand describes the DNA of light and on the other is the sum of the Hebrew letters of the word “Kabbalah”
వోల్ఫ్ గాంగ్ పౌలి జ్యూయిష్ పరంపర కి చెందిన వాడు కావడం వల్ల కొద్ది పాటి mysticism కూడా ఈ పుస్తకం లో చూడ వచ్చు.
The fascinating dreams of Pauli and their interpretation by himself as well as Jung are really wonderful subject matter for reading for those who are interested in these subjects.
ఇక ఇట్లాంటి వాటిని చదివితే మన 'ఇండియన్స్ ' వెంటనే ఇవి మన వాళ్లకి ఎప్పుడో తెలుసోయ్ అనటం సాధారణం కాబట్టి నేను కూడా నాకు అనిపించిన అగు పించిన - అంటే ఈ కాస్మిక్ నెంబర్ ఒకటి మూడు ఏడూ కి సంబంధించి రాయ దలచి ఈ టపా అన్న మాట !
137 --->
1 --- ఒకటి ---> దీని గురించి చెప్పాలా ! ఏకం సత్ !
3 --- మూడు ---> త్రిగుణాత్మకం ముక్కంటి త్రిభువనం ముమ్మూర్తులు ... సృష్టి స్థితి లయ కారకమ్ ... ఈ మూడు ప్రతి మతం లోను ప్రతి మిస్టిక్ ప్రిన్సిపల్ లో ను ఉన్నదె.
(యాదృచ్చికం గానో కాకుంటే 'కాకతాళీయం గానో ఇవ్వాళ కష్టేఫలె శ్రీ శర్మగారు కూడా మూడు 'ముళ్ళ' గురించి టపా పెట్టేసేరు ! దీని భావ మేమి ? క్వాంటం వరల్డ్ లో ఆపరేట్ అయ్యే లాస్ , ఈ 'యాదృచ్చిక లోకం లో ఆపరేట్ అవుతున్నట్టు కదా మరి !)
7 --- ఏడు ---> సప్త సాగరం సప్త నదులు సప్త ... ఈ ఏడు గురించి ఏమి చెప్పాలి ఇంకా ! సప్తపది ! ఏడడుగుల బంధం !
వీటినన్నిటిని అనుసంధానం చేస్తూ ... పురుష సూక్తం లో ...
' సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తః సమిధః కృతాః ' దేవా యద్యజ్ఞం తన్వానాః అంటూ మూడు కి ఏడుకి లంకె మన వాళ్ళు ముడి పెట్టేసేరు .
ఇక ఈ 137 బేసి సంఖ్య .
1 = 1
2 = 3-1
3 = 3
4= 3+1
5 = 7-3+1
6 = 7-1
7 = 7
8 = 7+1
9 = 7+3-1
10 = 7+3
11 = 1+3+7 !
అంటే ఒకటి నించి ఈ సంఖ్య మొత్తం కూడిక 11 వరకు ఈ సంఖ్య నించి తెప్పించ వచ్చు !
ఈ బేసి సంఖ్య మరో రూపం చూద్దాం .
మన పూర్వ కాలం లో అక్షౌహిణి అన్న ది యుద్ధం లో కూర్చే సైనిక అమరికకి పేరు .
ఈ అక్షౌహిణి అన్నది 21,870 రథాలు , అన్నే ఏనుగులు , దానికిమూడింతలు గుర్రాలు ఐదింతలు నాలిగింతలు సైనికులు అంటే (1+1+3+5 = 10!) * 21,870 = 218,700 .
ఈ సంఖ్యలో 2+1+8+7 = 18 = 1+8 = 9 ! తొమ్మిది కి ఉన్న ప్రాముఖ్యత చెప్పాలా మరి !
సరే, 2187 అన్న సంఖ్య లో మరో కిటుకుఉన్నది అదేమంటే ...
కనుక్కుని చెప్పండి -- ఆ సంఖ్యకి అంటే 2187 కి న్నూ 1 3 7 కి మధ్య ఒక సంబంధం ఉన్నది .
కనుక్కోగలరనే ఆశిస్తూ ...
ఇక, ఈ సంఖ్య మీకు కూడా మరెన్నో ఆలోచనలని రేకెత్తించ వచ్చు . వాటిని మీరు తెలిపితే ఆనంద కంద హృదయారవింద మవుతాను !!
శుభోదయం !
చీర్స్
జిలేబి