Monday, June 3, 2013

Deciphering Cosmic Number - 137


ఈ మధ్య Deciphering the Cosmic Number (by Arthur I Miller ) అన్న పుస్తకం చదవటం జరిగింది . ఈ పుస్తకం కాల్ యుంగ్(సైకో అనలిస్ట్) , వోల్ఫ్ గాంగ్ పౌలి (ఫిజిసిస్ట్ - పీరయాడిక్  టేబల్ - ఎక్స్ క్లూషన్ ప్రిన్సిపల్  కి నోబల్  గ్రహీత)  మధ్య జరిగిన సంభాషణలు , పౌలి కన్న కలల డ్రీమ్ అనాలసిస్ వగైరా విషయాల తో చాలా ఆసక్తి కరం గా పుస్తకం సాగుతుంది .

ఈ పుస్తకం లో ని డ్రీమ్  అనాలసిస్ మన పనిలేక డాక్టరు రమణ బాబు గారి లాంటి వారికి చాలా ప్రయోజనకరమైన విషయం .

ఇక ఈ పుస్తకం శీర్షిక గురించి, : ఈ పుస్తకం ప్రకారం కాస్మిక్ నంబెర్ 137. 

ఈ కాస్మిక్ నెంబర్ ప్రత్యేకత ఏమిటి ? అంటే, "the weird number 137, which on the one hand describes the DNA of light and on the other is the sum of the Hebrew letters of the word “Kabbalah”

వోల్ఫ్ గాంగ్ పౌలి జ్యూయిష్ పరంపర కి చెందిన వాడు కావడం వల్ల  కొద్ది పాటి mysticism కూడా ఈ పుస్తకం లో చూడ వచ్చు.

The fascinating dreams of Pauli and their interpretation by himself as well as Jung are really wonderful subject matter for reading for those who are interested in these subjects.

ఇక ఇట్లాంటి వాటిని చదివితే మన 'ఇండియన్స్ ' వెంటనే ఇవి   మన వాళ్లకి ఎప్పుడో తెలుసోయ్ అనటం సాధారణం  కాబట్టి నేను కూడా నాకు అనిపించిన అగు పించిన  - అంటే ఈ కాస్మిక్ నెంబర్ ఒకటి మూడు ఏడూ కి సంబంధించి రాయ దలచి ఈ టపా అన్న మాట !

137 --->

1 --- ఒకటి ---> దీని గురించి చెప్పాలా ! ఏకం సత్ !

3 --- మూడు ---> త్రిగుణాత్మకం ముక్కంటి త్రిభువనం ముమ్మూర్తులు ... సృష్టి స్థితి లయ కారకమ్  ... ఈ మూడు ప్రతి మతం లోను ప్రతి మిస్టిక్ ప్రిన్సిపల్  లో ను ఉన్నదె.

(యాదృచ్చికం గానో కాకుంటే 'కాకతాళీయం గానో ఇవ్వాళ  కష్టేఫలె శ్రీ శర్మగారు కూడా మూడు 'ముళ్ళ' గురించి టపా పెట్టేసేరు ! దీని భావ మేమి ? క్వాంటం వరల్డ్ లో ఆపరేట్ అయ్యే లాస్ , ఈ 'యాదృచ్చిక లోకం లో ఆపరేట్ అవుతున్నట్టు కదా మరి !)

7 --- ఏడు ---> సప్త సాగరం సప్త నదులు సప్త ... ఈ ఏడు గురించి ఏమి చెప్పాలి ఇంకా ! సప్తపది ! ఏడడుగుల బంధం !

వీటినన్నిటిని అనుసంధానం చేస్తూ ... పురుష సూక్తం లో ...

' సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తః సమిధః కృతాః  '  దేవా యద్యజ్ఞం తన్వానాః  అంటూ మూడు కి ఏడుకి లంకె మన వాళ్ళు ముడి పెట్టేసేరు .

ఇక ఈ 137 బేసి సంఖ్య .

1 = 1
2 = 3-1
3 = 3
4= 3+1
5 = 7-3+1
6 = 7-1
7 = 7
8 = 7+1
9 = 7+3-1
10 = 7+3
11 = 1+3+7 !

అంటే ఒకటి నించి ఈ సంఖ్య  మొత్తం కూడిక 11 వరకు ఈ సంఖ్య నించి తెప్పించ వచ్చు !

ఈ బేసి సంఖ్య  మరో రూపం చూద్దాం .

మన పూర్వ కాలం లో అక్షౌహిణి  అన్న ది   యుద్ధం లో కూర్చే సైనిక అమరికకి పేరు .

ఈ అక్షౌహిణి  అన్నది 21,870  రథాలు , అన్నే ఏనుగులు , దానికిమూడింతలు గుర్రాలు ఐదింతలు నాలిగింతలు సైనికులు    అంటే (1+1+3+5 = 10!) * 21,870 = 218,700 .

ఈ సంఖ్యలో 2+1+8+7 = 18 = 1+8 = 9 ! తొమ్మిది కి ఉన్న ప్రాముఖ్యత చెప్పాలా మరి !

సరే, 2187 అన్న సంఖ్య లో మరో కిటుకుఉన్నది అదేమంటే ...

కనుక్కుని చెప్పండి -- ఆ సంఖ్యకి అంటే 2187 కి న్నూ 1 3 7 కి మధ్య ఒక సంబంధం ఉన్నది .

కనుక్కోగలరనే  ఆశిస్తూ ...

ఇక, ఈ సంఖ్య  మీకు కూడా మరెన్నో ఆలోచనలని రేకెత్తించ వచ్చు . వాటిని మీరు తెలిపితే ఆనంద కంద హృదయారవింద మవుతాను !!


శుభోదయం !
చీర్స్
జిలేబి 

Saturday, June 1, 2013

పోట్లాట ఆపటం ఒక 'కల' !!


 
ఆ మధ్య పోట్లాడు కుందాం రండి అంటూ 'ఉత్థిష్ఠ జాగృత ' అన్నట్టు పిలుపు నిచ్చి టపా కొడితే, కాలక్షేపం కబుర్లు శర్మ గారు, పోట్లాట ఒక కళ , దాన్ని మొదలు పెట్టడం చాలా తేలిక, ఎక్కడ ఆపాలో తెలిసుంటే నే  అన్నారు కామెంటు కాణీ  పెడుతూ .  . 
 
ఈ వాక్యం బాగుందండీ - పోట్లాట ఒక కళ  - అని దాని మీద ఒక టపా కొట్టండి అంటే, సత్తి బాబుని పిలుచు కొచ్చి ఓ బ్రహ్మాండ మైన టపా కొట్టేరు కాలక్షేపం కబుర్లు - అవి ఒట్టి కబుర్లు కావు, ఎక్స్పెరియన్స్ కా బుర్రలు!
 
ఇంతకీ ఈ మధ్య వరస బెట్టి టపాలు గట్రా రాస్తూ, అట్లా మా అయ్యరు గారికి పనులు అప్ప జెబ్తూ , అజామాయిషీ చేస్తూ, ఆఫీసు పనుల్లో 'జిలేబీ మేమ్  సాహేబు మళ్ళీ ఎందుకు ఉద్యోగం లో రీ తయారు  అయ్యింది రా బాబోయ్ అని మా ఆఫీసు వాళ్ళు తల బట్టు కునేటట్టు జుట్టు ఊడ బెరుక్కునేటట్టు టెర్రర్ అయి పోతే, ఓ శుభోదయాన డామ్మని మా అయ్యరు  గారు నా వాలకం జూసి, ఇదిగో జిలేబీ నిన్ను వెంటనే డాక్టరు దగ్గిరకి తోలు కెళ్లా లే అన్నారు నా వాలకం జూసి . 
 
నే అన్నా, ఆయ్ , మన శరీరం గురించి మనకు తెలీదా, ఇందులో ఇంజిను పని జెయ్యక బోతే మనకు తెలీదా, ఆ పాటి దానికి ఆ 'పని లేక' డాటేరు ' బాబులు ఎమ్దుకో అంటే, తట్ తట్  జాన్తా  నాయ్ అంటూ మా అయ్యరు గారు నన్ను డాక్టరు గారి ముందు నిలబెట్టేరు . 
 
చూద్దును గదా, ఈ డా టేరు బాబు అచ్చు మన పని లేక రమణ బాబులా ఉన్నారు. వామ్మో అని కళ్ళు నులుముకుని జూస్తే, మళ్ళీ రూపం చెదిరి వేరే ఎవరి లాగో అనిపించేడు . అంతా నా 'బ్లాగ్' 'భ్రమణం' వల్ల వచ్చిన చిక్కు అనుకుని నమస్తే అన్నా . 
 
య, అయాం  రమణ అన్నారు వారు. 
 
చచ్చాం బో అనుకున్నా. జీవితం లో మనకు ఇట్లా కో ఇన్సిడెన్స్ అయ్యే వి చాలా ఎక్కువగా ఉంటా యేమో  . 
 
మా అయ్యరు గారు నా గురించి చింతాక్రాంతులై వచ్చీ రానీ  తెలుగులో ఆ డాటేరు బాబు కి విశ దీకరించేరు - ఈ జిలేబీ నానాటికి బ్లాగు పక్షి అయి పోతున్నాది అండీ అని 
 
డా టేరు బాబు అచ్చు రమణ బాబు గారి టపా లా నన్ను విశ్లే 'చించి' ఇదిగో అయ్యరు గారు మీకు జిలేబీ దక్కా లంటే జిలేబీ ని ఆ కంప్యూటరు ముట్టుకో వద్దని జెప్పండి అన్నాడు . 
 
నేను ఒప్పుకుంటా నా ! పోట్లాట పెట్టు కున్నా ఆ డాటేరు  బాబు తొ. ఆయ్ , మనకు నచ్చింది మనం జేస్తే, అది మంచి హాబీ కదా ఆ పాటి దానికి నేనెందుకు నా వ్యాపకాన్ని ఆపు జేసు కోవాలి ? శ్రీపాద వారేం జెప్పారు ? అంటూ లెక్చరు పుచ్చు కున్నా ఆ డాటేరు  గారికి. 
 
డా టేరు  బాబుకి హార్ట్ అటేక్  వచ్చే సింది ! 'ఇదిగో అయ్యరు  గారు మీరు ఈవిడ్ని ఇక్కడ నించి తీసు కు వెళ్ళండి లేకుంటే నాకు టెన్షన్ వచ్చేస్తోంది అనడం దాకా వచ్చేసింది ఆయన పరిస్థితి !
 
వచ్చే దార్లో చెప్పా, అయ్యరు వాళ్ ' మన శరీరం గురించి మనకు తెలీదా అని నే  జెప్పా' గా అన్నా 
 
మా అయ్యరు గారు పోట్లాట పెట్టుకుని, ఇదిగో జిలేబీ ఈ బ్లాగు వ్యాసంగం మానేయ్ అంటే, పొతే పోనీ మీ కంటూ టపా ఒక్క నెల రాయ కుండా ఉంటా ! కాని కామెంటు 'మెంతులు ' బ్లాగ్ దియా భేటీ' స్  కి స్వచ్చమైన మందు అది మాత్రం మా నన్నా  !
 
నిజమే ! నువ్వు ఒక్క నెల టపా రాయకుండా మానేస్తా వటే  ? అన్నారు బుగ్గ గిల్లి .
 
ఛీ ఈ వయసులో ఇదేంటి అంటే ! 'హనీ మూన్ డేస్ ' గుర్తు కోచ్చేయి అనేరు !
 
ఔరా, కాళ్ళు కాటి కి లాగుతూంటే, హనీ గుర్తుకు రావటమేమిటి అను కుని  दांतों तले उंगली दबाया मैंने !!
 
అట్లాగే పట్టు బట్టి ఓ నెల రాయకుండా ఉన్నా ! మన సత్తా మనకు తెలీక పొతే గెట్లా  మరి !
 
రెండో రోజు నా చేతులు బ్లాగు రాయక జివ్వు మనటం  జూసి అయ్యరు  గారు పొతే పోనీ జిలేబీ నీకు చదవటానికో  మంచి పుస్తకం తీసుకొచ్చా అన్నారు !
 
తెచ్చిన పుస్తకం Deciphering the Cosmic Number by Arthur I Miller.
 
ఎంతైనా మా అయ్యరు గారు మా అయ్యరు గారే !  సో, ఈ ఒక్క నెలలో చదివిన పుస్తకం ఇదన్న మాట !
 
ఇంతకీ ఈ కాస్మిక్ నెంబర్ ఎమిటం టారా  ఒకటి మూడు ఏడు  ! 137 !  ఈ నెంబరు చూస్తె మీకు ఏమి గుర్తు కొస్తుంది ? సరే ఈ  పుస్తకం మీద తరువాత టపా రాస్తా , నా కనిపించిన విశేషాలు ఈ నెంబరు పై !
 
కాబట్టి, పోట్లాట ఆపటం ఒక కల ! కల కానిది నిజమైనది ! పోట్లాట లో ఉంది మజా అది అనుభవించితే తెలియునులే ! అంటూ .... 
 
 

 
 
 
శుభోదయం !
చీర్స్ 
జిలేబి 

Wednesday, May 29, 2013

ఆవకాయ ఫ్లోర్ టపా కి 'లక్ష్మీ' 'టపా క్యాప్! - హన్నా శరవేగం !


Derivatives world లో ఫ్లోర్ అండ్ క్యాప్ అన్న పదజాలం ఉంది .

అట్లా , నిన్న భమిడి పాటి అయ్య వారు మా ఆవిడ నన్ను ఫ్లోర్ చేసింది అంటే (నిన్నటి లింకు చూడ వలే ) భమిడి పాటి అమ్మగారు 'ఆయ్ ' అని 'ఏదో ఒక మారు పని జెబ్తే, వెంటనే 'టముకు' కొట్టు కోవాలా అంటున్నారు !

భమిడి పాటి అమ్మగారు రిటార్టు ఇస్తారని అనుకున్నా గాని, ఇంత త్వరగా రిటార్టు ఇస్తారని ఊహించలే ! అయ్య వారు చేసిన ఆవకాయ టపా కారం వెంటనే పని జేసి టపా రిటార్టు అమ్మగారు వేసేసేరు !

ఇక ఎందుకు ఆలస్యం !

పిల్లలు టూర్ వెళితే, మనకు ఇక 'హనీ  డేస్ గదా !!

''' ఈ ఏడాది ఆవకాయ కలపడం మా వారికి outsource చేసేశాను. ఏమిటో ఎంతో శ్రమపడిపోయినట్టూ, నేనేదో ఆయన్ని ఆరళ్ళు పెట్టేస్తున్నట్టూ ఓ టపా కూడా పెట్టేసికున్నారు. మరి ఇన్నేళ్ళూ,మింగినట్టు లేదూ? ఒక్క రోజంటే ఒక్కరోజైనా ఆవకాయ లేకుండగా ముద్ద దిగిందా? పైగా బయటినుంచి తేకూడదూ, ఇంట్లోనే, పిల్లల్ని చూసుకుంటూ, ఆయనకి కావాల్సినవన్నీ చేస్తూ, వంటపనీ, ఇంటిపనీ చూసుకుంటూ ప్రతీ ఏడాదీ ఊరగాయలు పెట్టడమంటే మాటలా మరి? అదేం జాతకమో నాది, ఓ పనిమనిషికూడా లేదు'''



చీర్స్
జిలేబి 

अरे भाय आंध्रा पिकिल नही है क्या?!


ఆవకాయ మన అందరిది .... గోంగూర పచ్చడి మనదేలే ...ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్ లెందుకు లే ! అంటూ హ్యాపీ గా పాడే సు కుంటుం న్నారు భమిడి పాటి వారు ...

స్వచ్చమైన ఆవకాయ టపా చదవడానికి ఈ క్లిక్కు నొక్క వలె !


,,,, ఈ రోజుల్లో నగరాల్లో పనిచేసే కుర్రకారుకి, తెలుగువారికంటే పరభాషా స్నేహితులే ఎక్కువాయె, ఎప్పుడో వాళ్ళని ఏ భోజనానికో పిలిచినప్పుడు వాడు अर्‍ऍ भाय आंध्रा पिकिल नही है क्या... అంటాడేమో అని భయం మరి.వాడుకూడా ఎక్కడో నెట్ లో చదివుంటాడు, ఆంధ్రావాళ్ళకి ఆవకాయ చాలా ప్రీతీ అని. అలా క్రమక్రమంగా ఈ “ఆవకాయ” మనకోసం కంటే బయటివాళ్ళకోసం ఓ status symbol గా తయారయింది. ఈనాటి పిల్లలంతా వాళ్ళ అమ్మలో, అమ్మమ్మలో పెట్టిన ఊరగాయలతోనే పెరిగారు. ఇప్పుడే ఈ సుకరాలన్నీనూ..... 



చీర్స్
జిలేబి 

Monday, May 27, 2013

బాబా బ్లాక్ షీప్ ఆనందా వారి ప్రసంగోపన్యాసం


'బాబా బ్లాక్ షీప్ హేవ్ యు ఎనీ వూల్  అంటే, ఎస్ సర్ ఎస్ సర్ త్రీ బాగ్స్ ఫుల్ ' ఇందులో నిగూఢ మైన అర్థం దాగి ఉన్నది ' తన బవిరి గడ్డాన్ని దువ్వుకుంటూ చెప్పారు బాబా బ్లాక్ షీప్ ఆనందా స్వామి వారు.

జనవాహిని 'ఆహా ' అని స్వామి వారి ప్రసంగో పన్యాసాన్ని వినడానికి ఉత్సుకతో 'జై బోలో స్వామీ షీప్ ఆనందా మహారాజ్ కీ' అని దీర్ఘ ఘోష పెట్టేరు .

స్వామీ వారు చేయెత్తి అందర్నీ తడుము తున్నట్టు చెయ్యూపుతూ ఆశీర్వదించేరు  !

భక్తుల కళ్ళలో కన్నీళ్లు తప తప మని రాలేయి . ఆహా స్వామి వారికి ఎంత 'అవ్యాజ మైన' 'ఘాటు' 'గోటు' ప్రేమ మన మీద అని వారు అనందం తో తడిసి ముద్దయ్యేరు .

స్వామీ వారు తమ ప్రసంగాన్ని కొనసాగించేరు .

భక్త 'శిఖా' మణులారా  ! త్రీ బేగ్స్  అనటం ఎందుకు ? చార్ బాగ్ అని ఉండ వచ్చు కదా ? కాదె ! త్రీ బేగ్స్ అనే చెప్పారు ! దీని లో నిగూఢ మైన అర్థం ఏమిటి ! అని మళ్ళీ బవిరి గడ్డం తడి మేరు .

జనవాహిని కి ఈ మారు ఏమి చెయ్యాలో పాలు పోలేదు జై కొట్టాలో లేదో తెలియ లెదు.

స్వామి వారు అన్నారు.... త్రీ బేగ్స్  అనగా, ముక్కంటి ఈశ్వరుడు . త్రీ బేగ్స్  అనగా మూడు గుణములు సత్, రజో తమో గుణములు అన్నమాట త్రీ బేగ్స్  అనగా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు . త్రీ బేగ్స్  అనగా గాయిత్రి .

ఇట్లా సర్వం 'త్రిభువన భూషితం' ! అంతా 'త్రీ' లో నే ఉంది

one for my master అనగా నేమి ! ఆ పరమ ప్రభువు ! one for the dame అనగా నేమి ! ఆ పర దేవత ! one for the little boy down the lane ' అనగా ఎవరు ?

ఎవరూ ఎవరూ 'జై బోలో బ్లాక్ షీపా నందా స్వామీ వారికీ !"

బాబా వారు బవిరి గడ్డం తడిమేరు  ! 'ఎవరు' అంటూ కళ్ళ లో చమక్కు చూపిస్తూ అడిగేరు .

జై జై జై అంటూ జనవాహిని ... ఇంకెవరు మన బాబా గారే ఆ లిటిల్ బాయ్ డౌన్ ది లేన్ !' అంటూ కర ఘోష ఆ హాలు ప్రతిధ్వనించే లా చేసేరు .


స్వామీ వారి శిష్య పరమాణువులు భక్తులందరికీ మూడు మూడు బాగులు ఇచ్చేరు ... ఇందులో మీరు మీ కానుకలు చెల్లించ వచ్చు ! అంతా స్వామీ వారి ముందు పెట్టండి . స్వామీ వారు పరమ ప్రభువు వాటా, పరదేవత వాటా, తమ వాటా అంతా సరి సమానంగా పంచెదరు  '

జనవాహిని ఎగ బడ్డది  ! స్వామీ వారు అక్కడే ఉన్న గొర్రె నెక్కి 'వాహన' స్వామీ వారి గా మారేరు !

కథ కంచి కి మన మింటికి !

వెల్కం బెక బెక !

జిలేబి ఈజ్ బ్యాక్ అగైన్ !

చీర్స్
జిలేబి 

Monday, May 6, 2013

స్వామి బ్లాగానంద వారితో ముఖాముఖీయం


నమస్కారం స్వామీ బ్లాగానంద గారు . తెలుగు బ్లాగు సముదాయము తరపున మీకు ఇవే జిలేబీ శుభాకాంక్షలు .
మీ గురించి 'స్వల్ప' పరిచయం ?

జిలేబీ సిద్ధి రస్తు ! నన్ను పూర్వాశ్రమం లో వీక్లీ ఆనందా అనేవారు . ఈ పంచ దశ లోకం లో స్వామీ బ్లాగానందా అన్న పేరుతో వెలసి ఉన్నాను

మీ పేరు బ్లాగానందా  కావడానికి మీరేమి తపము చేసిరి స్వామీ ?

సంవత్సరాల కొలది ఘోరమైన కామెంటు తపము చేసినాము . వేల కొద్ది కామెంటు సమిధలు సమర్పించి బ్లాగు లోకమున ఆనందము గాంచినాము . దానితో బాటు 'కై' 'వలయ' విద్య గా అందరిని మెచ్చు కున్నాము . తపము ఫలించి 'టా పెశ్వరీ ' మాత అనుగ్రహము మాకు నిండు గా దక్కింది . 'మాతా టా పే శ్వరీ  వర ప్రసాదమున మాకు 'బ్లాగ్బ్లిస్సు' కలిగింది .

స్వామీ బ్లాగానందా  గారు ... బ్లాగు టపాలు మీరేమన్నా వెలు వరిం చారా ?

అంతా విష్ణు మాయ ! మేమే సర్వ బ్లాగు లలోను మీ 'వేలు' నించి వారు తున్నాము ! ఇక మాకంటూ ఒక్క బ్లాగు ఎందుకు ? మీ టపా ఆనందమే మా కర ఘోష !!

స్వామీ అంటే మీరేమీ టపాలు రాయ లేదా !?

చెప్పాను కదా జిలేబీ ? జిలేబీయం ఎచ్చట ఉండునో అచ్చటంతా  అది నా టపా యే  !
ఆహా ఏమి చెప్పినారు స్వామీ !!

స్వామీ !!

ఏమీ !!

నన్ను కరుణిం చండి ! నన్ను దీవించండి !!

హాం ఫట్ !! భామా, బ్లాగు మాని ఇంటి పని చూసుకో ! అంతా సవ్యం గా జరుగు తుంది నీకు !!

ఆ!!! ---!! ఆ ఒక్కటి చెప్పమాకండి  స్వామీ !

అంతా 'టపేశ్వరీ ' ఇచ్చ ! మనం నిమిత్త మాత్రులం మాత్రమె !!


చీర్స్
జిలేబి
(జిలేబీ చాతుర్వార 'నిర్టపా ' వ్రతం ఆరంభం!)

Sunday, April 28, 2013

పోట్లాడు కుందాం రండి !


ఇదిగో నండీ అయ్యరు  గారు ఇవ్వాళ్టి నించి రోజూ మీతో పోట్లాడ బోతా అల్టిమేటం ఇచ్చా మా అయ్యరు  గారి కి

ఏమోయ్ జిలేబి ఏదో కొత్త గా జెబ్తున్నావ్ ? నలభై ఏళ్ల దాంపత్యం లో మీ బామ్మ చలవ నీతో పోట్లాడని రోజు ఉందా అన్నారు మా అయ్యరు గారు .

పోట్లాడ కుండా నాకు మాటల్రావే మరి ఏం  చెయ్య మంటారు ?

కుమారీ సుకుమారీ అని మీ బామ్మ అంటే ఏమిటో అనుకున్నా ! పెళ్ళైన తరువాయే తెలిసింది ' అழగాన రాక్షసి అని !

పోదురు లెండి ! మీరు మాత్రం ఏమిటి మరి ?

సరెలేవే జిలేబి, ఇంతకీ ఇవ్వాళ్టి  నించి కొత్తగా పోట్లాడ బోతా నన్నావ్ ఎందుకోయ్ మరి ? అడిగారు అయ్యరు గారు

'అదండీ, కష్టే ఫలే శర్మ గారు, 'కోలాటం' బొమ్మ పెట్టి , బెల్లం కొట్టిన రాయిలా ఉండ మాకండీ, కూసింత పెనిమిటి తో మాట్లాడండీ అన్నారండీ ! మాట్లాడండీ అంటే, మనం పోట్లాడడమే కదాండి  ? అందుకే అట్లా చెప్పా '

కోలాటం లో కోలాటం 'శబ్దం' చేసినా దాంట్లో రిథమ్ ఉంటుందోయ్ ! అట్లాగే మన పోట్లాటల్లో కూడా రిథమ్  ఉంటే ఫర్లేదు లే !

అయితే పోట్లాడు కుందాం రండి !!!


చీర్స్
జిలేబి 

Friday, April 26, 2013

కనుకొలకుల లో కన్నీళ్లు

 
కాలాలు ఏమైనా కన్నీళ్ళ కి 
కన్య   కనులే స్థావరమా ?
లేక ఇది ఈ మీనాక్షి 
కోరి తెచ్చుకున్న వరమా ?
 
కాలం మారింది అంటారు 
మరి అబల ఏ కాలం లో 
సబల అవుతుంది ?
 
 

Thursday, April 25, 2013

పిల్ల కాలువ - నది - సంద్రం - ఆకాశం

 
పిల్ల కాలువ పరుగులిడు
తోంది నదిని చేరడానికి 
 
నది ఉరుకులిడు
తోంది సంద్రాన్ని చేరడా నికి 
 
సంద్రం  ఆకసం వైపు
ఆకసాన మేఘం భువి వైపు 
చూస్తోన్నాయి 
 
సన్నాయి రాగం తో గాలి తెమ్మర 
అట్లా వెళుతూ మేఘాన్ని ముద్దాడితే 
 
మేఘమాలిక కుంభ వృష్టి అయి
భువి ని తడిపేసింది 
 
పిల్ల కాలువ నది అయ్యింది 
నది మహా నది అయ్యింది 
 
సంద్రం మహాసముద్ర  మయ్యింది 
 
ఆకసం మళ్ళీ సంద్రాన్ని చూస్తోంది 
 
 
జిలేబి 

Tuesday, April 23, 2013

ఇచ్చట బ్లాగు ట్యూషన్ చెప్ప బడును !

ఆ, పిల్లలూ అందరూ వచ్చారా ?

ఎస్ మేడం !

మొదట మనం బ్లాగు మాతరమ్ తో మన తరగతి ని ప్రారంభిద్దాం !

అందరూ చెప్పండి ...

వందే బ్లాగారం వందే బ్లాగారావు ...

ఆ పిల్లలూ ఇప్పుడు మీ పేర్లు చెప్పండి

నా పేరండీ  నా పేరండీ  ....

హాయ్ ఐ యాం ....

ఏమబ్బాయ్ , అట్లా పనీ పాటా లేక కూర్చున్నావే ? ట్యూషన్ లో చెప్పే పాటా లు సరిగ్గా వింటున్నా వా ?

మేడం, కాలక్షేపం కోసం సరదాగా బ్లాగు ఎట్లా రాయడం అని నేను రాసు కొచ్చే నండీ !
ఎరా అబ్బాయ్, ఈ వ్యాసం ఎక్కడో చదివి నట్టుందే  మరి ?

లేదండీ ఇది నా స్వంతం అండీ

ఏమమ్మాయ్ మధురా బ్లాగ్ క్లాసులో జంతికలు తింటూ కూర్చున్నావ్ ? ఏమైనా కాస్తా రాయ కూడదూ ?

రాసేసా మేడం, జంతికలు మీద వ్యాసం !

ఆ, సరే అబ్బిగా, ఏమిట్రా పక్క వాడి తో బాతా ఖానీ కొడుతూ కూర్చున్నావ్ ?

ఏమీ లేదండీ, నేను జెప్పేది ఎవరైనా వింటారా అని చూస్తున్నా

మా నాన్నే మా నాన్నే

ఏమమ్మాయ్ బ్లాగ్జోతి ఈ మధ్య క్లాసులకి నల్ల పూసవై పోయెవ్ ?

మా ఇంట్లో అమ్మ చివాట్లు పెట్టిందం డీ !

ఆ కిట్టిగా, ఏమిరా రాస్తా రాస్తా ఉండావ్ ?

రాము లోరి మీద ముక్క రాస్తున్న నండీ

ఆ అబ్బాయ్, అట్లా నా వైపు చూసి తెగ నవ్వుతున్నావ్ ?

మేడం, మీరూ నవ్వా లనుకుంటే నవ్వండి !


ఏమమ్మా జిలేబీ ఏమిటి తెగ ఆలోచిస్తా ఉండావ్ ?

మేడం, మీరు ఎప్పుడు రిటైర్ అవుతారో?

ఆ ! ఎందుకే !

నేను కలాసులు తీసుకుందా మని !
వామ్మో వామ్మో ఏమి తెలివే నీకు ! నీ బలాగు బంగారం కాకులెత్తుకు పోనూ ....


చీర్స్
జిల్లాలంగడి జిలేబి !

Monday, April 22, 2013

మీ కామెంటులు చిల్లు కాణీ విలువ చెయ్యవు !

శుభోదయం !

కామెంటు విలువ ఎంత అంటే, చ పో చిల్లు కాణీ కి పనికి రావు అన్నాడో 'అన్నా' నీ మనసు' తెలీని వాళ్ళం అనుకున్న ఓ జ్ఞాత ఐన అజ్ఞాత !

ఆహా, జ్ఞాతల కన్నా ఈ అజ్ఞాత జ్ఞానం ఏమి విలువైన జ్ఞానం అనుకున్నా !

ఇంతకీ మనం రాసే టపాలకి వచ్చే కామెంటు లకి కాపీ రైటు  ఎవరికీ చెందు తాయి ?

టపా లకి కాపీ 'రైతు' ల ము మేమోయీ అని జబ్బలు కొట్టుకుని రాస్తాం!

సరే, మన టపాలు చదివి, మన మీద కూసింత కరుణ జూపి మనకు 'తపోత్సాహాన్ని'  కలిగించి, మళ్ళీ మళ్ళీ మనం టపా వ్యామోహం తో మమేకమ వ డా నికి చేయూత నిచ్చే బంగారు కామెంటు దారుల వాక్యాలకి వ్యాఖ్యలకి కాపీ రైటు ఎవరికీ చెందు తుంది ? మన టపా చదివి అది కొట్టేరు కాబట్టి మనకే చెందు తయా ? లేక వారి కామెంటు లకి కాపీ రైటు  వారికే చెందు తాయా ?

ఏమండీ జిలేబీ గారు మీకు పనీ పాటా లేదా ? పొద్దస్త మానూ కాపీ, కాఫీ ల గురించే రాస్తూం టా రు ? అంటా రా ?

అంతా విష్ణు మాయ ! కూపస్థ మండూకః కథ తెలుసు కదా మీకు ! బావి లో ఉన్న కప్పలం బెక బెక మంటూ వాటి గురించే రాస్తూంటాం , రాస్తూ, టాం టాం అంటూ ఉంటాం ! !

ఇంతకీ ఈ విషయం మీద మీ సదభి ప్రాయములను తెలియ జేయ గలరు !


చీర్స్ 
జిలేబి !
(curiosity killed the cat!)
(I'm not dumb. I just have a command over thoroughly useless information~!)

Thursday, April 18, 2013

పాహి రామప్రభో ! కౌసల్యా సుప్రజా రామా !

కౌసల్యా సుప్రజా రామా ....

కర్తవ్యమ్ దైవమాహ్నికం ....

సుప్రభాత వేళ  మధ్యన తటాలున 'పాహి రామప్రభో ' అన్న బ్లాగార్ద్ర నాదం వినబడ్డది

శ్రీ రాముల వారు ఉలిక్కి పడి నిదుర లేచేరు.  రొటీన్ గా వచ్చే సుప్రభాత సేవ శ్లోకాలకు నిదుర లేవడం స్వామి వారు ఎప్పుడో మానుకునెరు.

కొండ పైన నిదుర పుచ్చడమే చాలా లేటు ఆ పై తన కలియుగ ప్రాణాన్ని  గోవిందా గోవిందా అని పెందరాళే లేపెస్తున్నారాయే.

కానీ ఈ మధ్య రెగ్యులర్ గా వచ్చే బ్లాగార్ధ్రనాదం తో స్వామీ వారు 'సుప్రభాతాన్ని' చూడ గలుగు తున్నారు తనివి తీరా.

కొంత కాలం గా సుప్రభాత సేవ తో బాటు మరో కొత్త ఆర్ద్ర నాదం విన వస్తోంది 'పాహి రామప్రభో' అంటూ .

స్వామి వారు అమ్మవారి వైపు చూసేరు - గాఢం గా నిదుర పోతోంది దేవేరి !

ప్చ్ ఈవిడికున్న సౌకర్యం మనకు లేకుండా పోయిందే అనుకుని స్వామి వారు నిదుర లేచి ల్యాపు టాపు  ఓపెన్ చేసి  ఆ బ్లాగార్ధ్ర నాదాన్ని గమనించేరు .

ఎవడో మానవుడు పాపం పంచ దశ లోకం నించి తన్ను రోజూ పిలుస్తున్నాడు 'పాహి రామప్రభో' అంటూ.

స్వామి వారికి ముచ్చట వేసింది . ఈ మానవుడు పాహి పాహి అంటూ తన మీద ఆధార పడి పోవడం గురించి

ఈ మధ్య కాలం లో ఎవ్వడూ స్వంతం గా తన్ను పాహి పాహి అనటం లెదు. గుళ్ళో కూడా అదేదో 'రికార్డు' లట  కాకుంటే 'డిస్కు' లట  వాటిల్లో సుప్రభాతాన్ని పెట్టి తన నిదుర ని చెడ గొట్టి ఈ కలియుగ మానవులు  గుర్రు పెట్టి నిదుర పోతున్నారు

తనేమన్నా రికార్డు డాన్స రా రికార్డు పెడితే ఆడ టానికి ? కాకుంటే 'డిస్కో శాంతి యా  డిస్కు పెడితే డాన్సా డ టా నికి ?

అట్లాంటి ఈ వెర్రి తలల కాలం లో ఈ బ్లాగ్భక్తుడు రోజూ మనః స్ఫూర్తి గా పద్య మాలికలల్లి తనని 'పాహి' పాహి' అంటు న్నాడు !

రాముల వారికి ముచ్చటే సింది . చూద్దాం ఇంకా ఎంత గాఢం గా పాహి పాహి అంటాడో ఆ పై కరుణి ద్దా మనుకుని    బ్లాగు సైన్ అవుట్ అయి లాపు టాపు  కట్టి బెట్టి మళ్ళీ 'ఆనీదవాతగ్ స్వదయా తదేకం' అయ్యేడు.

సీతమ్మ ముసి ముసి నవ్వులు నవ్వింది . తన్ను ఆ మానవుడు పాహి పాహి అని ఉంటే, ఈ పాటి కి స్వామి వారిని ఇట్లా నిదుర పోనిచ్చేదా ? పట్టు బట్టి  స్వామి వారిని బయలుదేర దీసి  పంచ దశ లోకం వెళ్లి ఆ మానవుని దీవించి రమ్మని చెప్పి ఉండదూ ?

అర్థం చేసుకోరూ !!


శుభోదయం
జిలేబి !

Wednesday, April 17, 2013

బాబ్బాబు, నా టపాలు కాపీ కొట్టండి !


'అదేమిటోయ్ జిలేబీ చాలా విచారం గా ముఖం వేలాడెసి కూర్చున్నావు ల్యాపు టాపు ముందు ?' మా అయ్యరు  గారు పరామర్సించేరు ఆప్యాయంగా . 

కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా.

ఏమిటి జిలేబీ నీ మొగానికి ఏడుపు శోభిల్లదే ! కలకంటి కన్నీరు ఒలికిన ప్రాబ్లం అన్న మాటే మరి ! ఏమి నీ బ్లాగు కష్టాలు అన్నారు మా అయ్యరు గారు.

ఏమండీ నా కష్టాలు అన్నీ బ్లాగు కష్టాలేనా ? అడిగా

కాకుంటే ? నీకు పొద్దస్తమానం ఆ కంప్యూటరు జత జేరే ! వేరే ఎ కష్టాలు నీ కుంటాయి ? రిటార్టు ఇచ్చేరు

హు అన్నా హా అన్నా మళ్ళీ కన్నీటి వరదలు చిందించా

ఏమిటోయ్ విషయం ఈ మారు కొంత సేద దీరేక అడిగేరు మా అయ్యరు  గారు మళ్ళీ.

నా టపాలు ఎవ్వరూ కాపీ కొట్టడం లేదండీ ! అని భోరు మన్నా !

ఓసి పిచ్చి దానా ! నీ టపాలు ఎవ్వరూ కాపీ కొట్టక పొతే సంతోష పడాలి గాని ఇలా భోరు మంటే ఎట్లా గే ?

టపాలు  ఎందుకు కాపీ కొట్టి పెట్టు కుంటా రండీ  ?

'ఆ , ఏముందీ, కూసింత నచ్చితే, బాగుంటే ఆయ్  ఈ టపా, కథ కాస్త బాగుందే  , మన బ్లాగులో దాచేసు కుందాం అని పెట్టేసు కుంటారు '

అంటే ఏమని అర్థం ? నా టపాలు ఎవ్వరికీ నచ్చ లేదన్న మాటే గా ? మళ్ళీ బోరు మన్నా !

'ఓసీ నీ బ్లాగు పిచ్చి కాకులెత్తుకు పొనూ !  ఇవన్నీ చేజేతులారా తెచ్చి పెట్టు కున్న కష్టాలు కావే మరి ! అని మా అయ్యరు  గారు ఓ  జాడూ  జమాయించి 'కాఫీ పెడతా ఓ గ్లాసెడు గొంతులో పోసుకుని మళ్ళీ టపా లల్లెసుకో ' అని 'ప్యారీ బీవీ' కోసం కాఫీ పెట్టడం కోసం కిచెను లో  కెళ్ళేరు 

బ్లాగు భామలు, బ్లాగు భయ్యాలు నా టపాలు కాపే కొట్టి మీ బ్లాగుల్లో 'ప్రచారం' చేసి నా కు గంపెడంత పేరు తెచ్చి పెడుదురూ మరి !!- మా తిరుపతి వేంకటేశు గారికి సిఫార్సు చేసి మీకు పుణ్యం వచ్చేటట్టు చూస్తా !!


(తెలుగు తూలిక డాట్ నెట్ మాలతి గారి టపా కామెంట్లు  చదివేక ! సరదాగా )


చీర్స్
జిలేబి 

Tuesday, April 16, 2013

నది లో చేప పిల్ల - నగరం లో వేపుడు

 
నది పరవళ్ళు తొక్కుతోంది 
చేప పిల్ల కేరింతలు కొడుతోంది 
 
చేప పిల్ల నది ముద్దాట ల తో 
నది చేప పిల్ల సయ్యాట ల తో 
మమేకం తదేకం అద్వైతమ్ 
 
చేప పిల్ల పట్నం పోతా నన్నది 
వద్దే అన్నది నది 
లేదు నే పోయి తీరుతా నన్నది పిల్ల 
చస్తే గాని పోలే వె చెప్పింది నది 
 
అయితే నే చస్తా అన్నది చేప పిల్ల 
నది కంట తడి పెట్టింది 
 
జాలరి గాలం విసిరేడు 
చేప పిల్ల గాల్లోకెగిరి వొడ్డున పడ్డది 
 
గిల గిలా టప టపా వేగిర పడి 
ప్రాణం ఉసూరు మన్నది 
 
బుట్టలో పడి నగరం పోయింది 
నగరం లో వేపుడు అయిపోయింది 
 
 
 
అహం వైశ్వానరోహ !
 
జిలేబి 

Monday, April 15, 2013

సొగసరి అబ్బాయికి కి గడసరి అమ్మాయి జవాబు !

మూడు రాత్రుల ముచ్చట అయ్యింది 
 
సొగసరి అబ్బాయి అన్నాడు 
 
నా హం కర్తా హరిహి కర్తా !
 
గడసరి అమ్మాయి అన్నది కదా 
 
క్రియా సిద్ధిహ్ రసత్వే భవతి !
 
 
శుభోదయం 
 
చీర్స్ 
జిలేబి 

Sunday, April 14, 2013

தமிழ் புத்தாண்டு நல் வாழ்த்துக்கள் !

 
తెలుగు బ్లాగ్ లోకం లో 
 
 ' అనైవరుక్కుం' ,
 
வாசகர் கள்  அனைவருக்கும்,
 
 தமிழ்  புத்தாண்டு
 
 நல் வாழ்த்துக்கள் !
 
 
చీర్స్ 
 
జిలేబి !

Thursday, April 11, 2013

ఉగాది 'ఫన్' చాంగ 'జిలేబీయం !

బ్లాగ్ చదువరు లందరికి
జిలేబీ యమైన
శ్రీ విజయ నామ సంవత్సర
ఉగాది శుభాకాంక్షలు !

ఇక ఉగాది అంటే మనం ప్రతి ఒక్కరం ఫన్ చాంగ శ్రవణం కోసం వేచి వుంటాం !

పూర్వ కాలం లో ఇంట్లో పెద్దలు పంచాంగం తెరిచి చదివి చెప్పే వారు, కాకుంటే గుళ్ళో అయ్యవారు చెప్పే వారు.

పచ్చడి లాగించి వారు చెప్పే గళ్ళూ, ఆ గళ్ళలో అట్లా ఇట్లా మారే గ్రహాలూ అవి మన పై జరిపే అగాయిత్యాలు , ప్రేమాయణాలు ఒక్కటని ఏమిటి అవన్నీ కలిపి మనల్ని వచ్చిన ఈ ఉగాది లో ఎట్లా 'దీవించును ' అని తెలుసుకుని అర్థమైతే మనకు నచ్చితే వాటిని గుండెల్లో పెట్టేసుకుని మహాదానంద పడి  పోయే వాళ్ళం .

ఆ  గ్రహాలు మనతో చెడు గుడు లాడతాయంటే కొంత గాభరా పడి ముక్కోటి దేవత ల లో సెలెక్టివ్ representative ని మస్కా కొట్టో , కాకుంటే నవ గ్రహాల లో వారిని సెలెక్టివ్ గా తాజా చేసుకునో వగైరా వగైరా mitigation ప్రాసెస్ మొదలెట్టే వాళ్ళం !

ఈ e-కాలం లో మనం మరీ మా గొప్ప జ్ఞాన వంతు లయిన వాళ్ళం !

కాబట్టి ఈ కాలం లో బ్లాగుల్లోను , ఇంటర్నెట్ లో ను, టీవీ ల లోను 'ఫన్' చాంగ శ్రవణం కంటాం  వింటాం ! ఓ పది పదిహేను దాక   ఈ ఫన్ చాంగ e-పటన , శ్రవణ తరువాయి మన బుర్ర గిర గిరా తిరుగును !

ఒక మహార్జ్యోతిష్ శర్మ గారు ఓయీ జిలేబీ జాగ్రత్త సుమ్మా నీకు రాబోయే కాలం కడు గడ్డు కాలం అంటే, మరో బ్లాగ్ జ్యోతిష్ శాస్త్రి గారు 'ఇదిగో జిలేబమ్మా , నీకు రాబోయే కాలం భేషైన కాలం అంటే , కొంత జుట్టు గీక్కుని, వాటికి బేరీజు వేసు కుని, పోనీలే రాబోయే కాలం ఓ మోస్తరు ఉంటది అని అనుకుంటాం !

ఇవన్నీ కలగలిపి పంచ దశ లోక వాసుల కోసం ఈ జిలేబీ చెప్పు ఈ శ్రీ విజయ నామ సంవత్సర ఫన్ చాంగ బ్లాగ్ టపా పటనం  ఏమనగా ... 

అయ్య లారా అమ్మ లారా ... 

ప్రతి రోజు మీరు జిలేబీ టపా ని వీక్షిం చండి మీకున్న ఏ విధమైనట్టి 'కాల' దోషాలు ఉన్నా అవి re-solve అయి పోవును ! అనగా అవి సాల్వ్  తమకు తామే అయి పోవడమో, లేకుంటే re-solve అయి పోవడమో జరుగును. 

ఆ పై 
మీరు జిలేబీ రోజు వారి టపా వీక్షించి టపా కి తప్పక కామెంటు కొట్టి న మీకు శ్రీ విజయ నామ సంవత్సరం లో అంతా శ్రావ్యం గా, సవ్యం గా కనసోంపు గా దివ్యంగా మంగళం గా అన్నీ మీకు శుభములే జరుగును !

ఇతి శ్రీ విజయనామ సంవత్సర జిలేబీ నామ్యా 'ఫన్' చాంగ బ్లాగ్ టపాః !

అందరికీ ఉగాది శుభ కామనలతో 

శుభోదయం !
జిలేబి
 

Monday, April 8, 2013

వనజవనమాలి: ఓ .. ఆత్మీయ ముఖపరిచయం (కష్టేఫలే )

వనజవనమాలి: ఓ .. ఆత్మీయ ముఖపరిచయం (కష్టేఫలే ): ప్రతి మనిషి  జీవితం లోను  అనేకానేక పరిచయాలు ఉంటాయి    కొంతమంది మన ప్రక్కనే నివశిస్తున్నప్పటికి కూడా పరిచయస్తులగానే  మిగిలి పోతుంటారు  ...

Saturday, April 6, 2013

చిత్తూరు నాగయ్య వెర్సస్ 'డాటేరు ' రమణ గారు !

చిత్తూరు నాగయ్య గారంటే మన బ్లాగ్ లోకపు టపా 'సామ్రాట్' డా టేరు  రమణ బాబు గారి కి మరీ గురి !

ఇక ఈ వి నాగయ్య గారు రమణ గారి గుంటూరు జిల్లా 'వాస్తవ్యులు' కావడం,  మా చిత్తూరు నాగయ్య గారవడం  వల్ల  (వారి సినీ లోకపు చమక్కులకు మునుపు చిత్తూరు రామ విలాస సభ లో నాటకాలలో విశ్వ రూపం గావిం చిన వారున్నూ!)  , రమణ గారి టపాలు తప్పి చదవడం వల్ల  ఈ జిలేబీ టపా అన్న మాట !

చిత్తూరు నాగయ్య గారు మరీ చాలా సినిమా ల లో ఏడ వడానికే  పుట్టిన మానవుళ్ళా  నా కనిపించడం అదేమీ ఖర్మో నాకు తెలీదు మరి. వారు చాలా వెరైటీ రోల్స్ చేసినా ఎక్కువ గా చేసిన రోల్స్ ఏడుపు కి సంబంధించి న వేమొ అని నా  అనుమానం !

(కాకుంటే, నేను చూసిన చిత్రాలలో వారు ఎక్కువగా ఏడుపు గొట్టు రోల్స్ చేసేరేమో!- 'ఆండోళ్లు - అర్ధ సేరు కన్నీళ్లు ఫ్రీ గా ఉన్నవాళ్ళం కదా మరి )


ఎందుకిట్లా అంటారా ? ఈ మధ్య పాత కాలపు చిత్రం నల దమయంతి యు ట్యూబ్ లో కనిపించింది సరే చూద్దారి అని చూస్తున్నా

(ఆ కాలం లో చూడడానికి మా వారు తీసు కెళ్ల లే మరి - కొట్టాయి లో సినిమా చూడ్డం ఏమిటే అని నామోషీ పడి పోయేరు అయ్యరు గారు -విషయం ఏమిటంటే కొట్టాయి చిత్రానికి డబ్బులు ఇవ్వడానికి వచ్చే జమా చాలదు అదీ విషయం!)

చూస్తూంటే అప్పటి దాకా హ్యాండ్ సమ్  గా ఉన్న హీరో నలుడు (నటుడు - కెంపరాజ్ ) అట్లా దమయంతి ని వదిలి బెట్టి చెట్టూ పుట్టా పట్టుకుని అడివి లో కెళ్తే, అక్కడ ఓ సర్పం ఆ నలుణ్ణి కాటేస్తే వికారి రూపి అయిపోతాడు నలుడు !  అంటే మన హీరో ఆరడుగుల అంద గాడు  వికారి అవ్వాలి. ఎట్లా మరి ? హీరో కెం ప రాజ్ మరీ అంద గాడైన నలుడాయే ?

డైరక్టరు బాబు కెంప రాజు బుర్ర పెట్టేడు .

అప్పటి దాకా ఉన్న హీరో కెంప రాజ్ మారి ఏడుపు గొట్టు మొహం తో ధబాల్మని నాగయ్య గారు కనబడ్డేరు !

 నా కళ్ళు చిట్లించు కొని చూసా - నాకు కళ్ళు కనిపించవు సరిగ్గా అది నిజమే కాని ఇట్లా హీరో రూపమే మారి దభీ మని వేరే హీరో నాగయ్య గారు కనిపించట మేమిటీ  అని హాశ్చర్య పోయా !

ఇది మన డా టేరు  రమణ బాబు గారి టపా లు చదవడం వల్ల  వచ్చిన 'సైకో' కళ్ళ జోడు ప్రాబ్లెమ్ ఏమో అని సందేహం వచ్చినాది కూడాను !

ఇంతకీ విషయం ఏమిటంటే ఆ సర్ప కాటు తో హీరో నలుడు రూపు వికారమవ డం తో, ఎట్లా అందరూ యితడు నలుడు కాదు సుమా అని తెలుసు కునేది ? అని ఆ డైరెక్టరు మానవుడు హీరో నే మార్చేసేడు - అది మన నాగయ్య గారయ్యేరు ! అక్కడి నించి ఇక నాగయ్య గారు నలుని రూపం లో మనకు చిత్రం లో కన బడతారు, ఆహా అని మొదటి పాటే వారిది ఏడుపు రాగమై కన్నీళ్ళ కెరటమై మనల్ని స్పృశిస్తుంది !

ఆహా ఇప్పటి కాలం లో మారు వేషం లో హీరో అట్లాగే వచ్చినా ఎవరూ కని బెట్ట లేరే ! -

ఇక్కడేమో పాపం డైరెక్టరు అంత కష్టపడి హీరో నలుడు రూపం 'బదలాయించ ' డానికి ఇట్లా ఏకం గా హీరో నే మార్చేసేడు సుమీ అని ముక్కు మీద వేలేసు కున్నా !

అప్పుడేమో సందేహం వచ్చింది - అరె టైటిల్ లో చిత్తూరు నాగయ్య కనబడ లేదే అని ? ఆ పై మళ్ళీ వెనక్కి తిప్పి చూస్తే , వి నాగయ్య అన్న పేరు కని పించింది . ఓహో అప్పట్లో నాగయ్య గారికి చిత్తూరు నాగయ్య అని పేరు స్థిర పడ లేదు కామోసు అనుకున్నా!

సరే , ఇక మీ కోసం ఆ నాగయ్య గారి కన్నీళ్ళ గంగా ప్రవాహం ! దానికి ముందు కెంప రాజు గారి మజా ఐన సాంగు భానుమతి గారి తో కూడా చూడాలి మరి !

మొదట గా ..  భానుమతి దమయంతి గా అమోఘమైన ప్రేమాయణ గానమాధురీ  ఝురి !- ఓహో మోహన మానసమా !


హీరో కెంప రాజ్ - భానుమతి - నల దమయంతి గా



ఆ పై ఇక మన డా టేరు రమణ గారి నాగయ్య గారి అమోఘమైన నటనా ప్రతిభ !



చీర్స్
జిలేబి 

Wednesday, April 3, 2013

ఏప్రిల్ ఒకటి నాడు మూత బడ్డ బ్లాగు తెరిచిన ఏమగును ?

ప్రశ్నా మీదే !
జవాబూ మీదే!

ప్రశ్న:
ఏప్రిల్ ఒకటి నాడు మూత బడ్డ బ్లాగు తెరిచిన ఏమగును ?

జవాబు

ఒకటి

రెండు

మూడు

నాలుగు

వగైరా ..
వగైరా...

ఖాళీ లను పూరిం చుము !!


చీర్స్
జిలేబి