అల - కల - తల - వల
పై పదాలను అన్యార్థంలో పాదాదిని ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.
*****
అలరింపగ రామకథ స
కల జనుల వినుడు వినుడనగ లవకుశులటన్
తలచిరి వసుగర్భసుతను
వలవల కన్నీరుగ ప్రజ వసుధాధిపుకై!
అల ముక్కుపచ్చలారని
తలకయు లేని నగుమోము దహరుడయా ! నా
వల గాములు! గాధేయుడ!
కలవరమాయె మది నేను కానకు వత్తున్!
అలవోకగ తాకగ గుణి
కలజముడి విడువడినట్టు గప్పున కూలన్
తలరారు నితండెయనుచు
వలతియు జూచి రఘుపతిని వరునిగ వలచెన్!
అలరారు నీకు సతిగా
వలపుల రాణిగ ధరణిజ పరిపూర్ణముగా
తలచె మదిని నిను పతిగా
కలహంసా!యేలుకొనుమ కళ్యాణమునన్!
అలకలకొలికి యిదియె! సీ
త! లక్ష్మి!కళ్యాణరామ! ధరిణిజ యిదిగో
వలపుల పంటగ నిల్చు స
కల గుణముల మేల్మిగా సుఖములను జేర్చున్!
అలఘుడు రఘుపతి, సిత యల
కలల్ల లాడెడు మహీజ, కల్యాణమటన్
తలతల లాడెడు చీరల
వలతులు నటునిటు తిరిగిరి వరుడిని గానన్ !
అక్కల- అయ్యో !
అలనాడిచ్చిన వరముల
తలంపునకు తెచ్చి కైక తన రాముని న
క్కల! కాననమున కంపగ
వలవల నేడ్చె దశరథుడు పరిపరి విధముల్!
అలనాటిదె నాతి వెతలు !
కలకంఠి శుభాంగి లక్ష్మి కనవచ్చెను కుం
తలమును దున్నగ! తానా
వల రాముని సతిగ వెడలె వనమున కకటా!
వలపుల జమచేసుకొనుచు
కలవర పడక పతిరాక కై నిదురను తా
నలవోకగ కౌగిలిగా
తలచెను లక్ష్మణుని సతియె తరుణి జిలేబీ!
కలడా రఘురామునివలె గాళకుడిలలో?
వలపుల కురుపించెద సయి
యలసిసొలసియైన పరిణయం బాడెద నే!
అల వైకుంఠములో సే
వల చేసెను కర్మ ఫలపు పరిపక్వతకై
తలచుచు నెదిరిగ విభుడిని
కలహమునకు కాలుదువ్వె కద రావణుడే!
అలరింపంగను కాలపృష్ఠమట నా యార్యున్ ప్రియత్వమ్ముతో కలపన్ దున్నగ బుట్టి నట్టి సిత, జింకన్ కోరగా వేటకై
తలసాలన్ దహరుండు లక్ష్మణుడి చేతన్బెట్టి శ్రీరాముడావల బోవంగ మహీజ గీత భళిరా పాయెన్గదాలంకలో !
అలకాపురిపతి మ్రొక్కుచు
తలసాలన్ గాపుగాచు ధరణిజ వినుమా
వలచితి రమ్మా లంకకు
కలడే దశకంఠుని వలె గండడిల రమా ?
కలయగ సుగ్రీవుడు నా
వల వాలిని కంధరమున ఫల్యపు మాలన్
తలచియు ధర్మము బాణం
బలవేయగ చచ్చినాడు బలవంతుడటన్ !
అలవోకగ లంఘించుచు
కలతల చేర్చి యసురులకు కార్మొగిలువలెన్,
తలచిన రీతిని తానా
వల నీవల దూకెనుగ పవన తనయుడటన్!
అల గంధమాదనమ్మున
కలహమ్ముల కల్లు త్రాగి కలకలములతో
వలకాకపు కోరికలకు
తలమీరి పనుల మరిచిరి తఱులమెకమ్ముల్!
కలవరమును జేర్చెడు కల!
అలఘుడు రఘురాముడు తను నగచరములతో
వలతి ధరణిజను కావగ
తలకన్నది లేక దునిమె దశకంఠునిటన్ !
అలసట యన్నది లేక స
కలము రఘుపతి దని తలచి కరసేవగ పో
తల యిసుకను నుడతయు తా
వలచక తెచ్చెను ప్రపత్తి పరిపక్వముగాన్ !
అలసె సొలసెనాత్మయు నా
వల తల్లియు వేచెనయ్య పట్టిని కడుపున్
కలవరపడక కలుపుకొన
తలచెద నీ మేలు రామ తరలెద పుడమిన్!
జిలేబి