Friday, November 13, 2015

ఫ్లాష్ ! ఫ్లాష్ ! ఫ్లాష్ ! అతి త్వరలో వ్యాసుల వారి తో జిలేబి బ్లాగ్ ముఖీయం !

 
 
 
 
 
ఫ్లాష్ ! ఫ్లాష్ ! ఫ్లాష్ !
 
అతి త్వరలో వ్యాసుల వారి తో జిలేబి బ్లాగ్ ముఖీయం !
 
చాలాకాలం తరువాయి జిలేబి బ్లాగ్ముఖీయం తో వస్తోంది 
 
ఇది ఒక  A B N - ఆంధ్రా జిలేబి  సహ సమర్పణ !
 
వెండి తెర పై వేచి చూడుడు !


చీర్స్
జిలేబి
 

Tuesday, November 10, 2015

దీపావళీ జిలేబీయం ! - హే కృష్ణా - కాపీ రైటా ఇల్లవా ?

దీపావళీ జిలేబీయం ! - హే కృష్ణా - కాపీ రైటా ఇల్లవా ?

కృష్ణా జీ హౌ ఆర్ యు ? అడిగింది సత్య !

భామ వైపు చూసేరు శ్రీ కృష్ణుల వారు .

ఈ సత్య అప్పుడెప్పుడో కాలం లో నరకాసురుడి ని సంహారం గావించి సత్యాన్ని నిలబెడితే జన వాహిని దీపావళీ తో ఆనంద పడి పోయేరు !

అప్పటి నించి జనవాహిని ప్రతి ఏటా ఈ దినాన్ని కాపీ కొట్టేసు కుంటూ దీపావళీ జరిపేసు కుంటోంది .

ఈ కలియుగం లో అగర్వాల్ భాయీ లు , శ్రేష్ఠులు కలిసి దీపావళీ సమయాన్ని బిలియన్ డాలర్ మార్కెట్ గావించే సేరు కూడాను !

కాపీ కి ఇంత మహాత్మ్యం ఉంది !

అందరూ శ్రీ కృష్ణా రామా నీ లా నన్ను చేయ వయ్యా అని దండాల మీద దండాలు పెట్టేసు కుంటున్నారాయే !

ఈ జమానా లో అంతా కాపీ మాయం మయం !

కాపీ లేని జీవితం ఎట్లా ఉంటుంది స్మీ :)

దీపావళీ భళీ 'జిలేబీయం !

అందరికీ దీపావళీ 'కాఫీ' కాంక్షల తో !

చీర్స్
జిలేబి

Thursday, November 5, 2015

బ్లాగ్ గాంధీ శ్రీ కాలక్షేపం కబుర్ల శర్మ గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు !

బ్లాగ్ గాంధీ శ్రీ కాలక్షేపం కబుర్ల శర్మ గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు !

 
శుభాకాంక్షల తో 
జిలేబి 
 

Monday, November 2, 2015

ఈ జమానాలో జనాలకి కాలక్షేపం కబుర్లు, బాతాఖానీ బటానీ కబుర్లే ఎందుకు కావాలి ?

ఈ జమానాలో జనాలకి కాలక్షేపం కబుర్లు, బాతాఖానీ బటానీలు ఎందుకు కావాలి ?

మా మీ మన అందరి 'రోలు కర్ర' శ్యామలీయం బ్లాగ్ మాష్టారు ( వీరిది వృత్తి పరంగా మాష్టారు ఉద్యోగం కాదు - మేధా జీవి ) ఓ కామెంటులో - ... ఈ రోజుల్లో జనానికి వినోదం కావాలి ... కాలక్షేపం సరుకు తప్ప మరేమీ పట్టని వారి సంఖ్యాబలం కారణం గా అలా కాలక్షేపం సరుకుల్ని పంచేందుకు తాపత్రయ పడే వారే ఎక్కువ (ఎడిట్)"

ఈ వ్యాఖ్య చదివాక  - ఎందుకు ఈ కాలం లో ఎక్కువ మంది కాలక్షేపం కబుర్లు, సరదా గా సాగి పోయే విషయాలు తప్పించి కొద్ది పాటి సీరియస్ మేటర్ ని చదవటానికి ఉత్సుక చూపించడం లేదు ? అని పించింది .

మా అయ్యరు గారి తో ఈ మాటే అంటే ... జిలేబి నీ వయసు రోజుల్లో (అబ్బ వయసు రోజుల్లో అంటే నే జిలేబి కి చెక్కిళ్ళ గుబాళింపు ఎక్కువై పోతుంది మరి :)) రేడియో లో కూసింత ఏడుపు కథ లు వస్తే నే నీ కళ్ళ లో కన్నీరు జర జరా రాలి పోయేది గుర్తుందా ? అడిగేరు .

ఆలోచించా . అవును ఆ కాలం లో అన్నీ ఉమ్మడి కుటుంబాలు . కష్టాలు నష్టాలు ఎట్లా ఉన్నా గృహ వాతావరణం లో ఉత్సుకత , హిందీ లో చెప్పాలంటే ఉమంగ్ భరీ లైఫ్ ! ఉమ్మడి కుటుంబాలలో ఉన్న మజా ఆ కాలం వారికే తెలుసు నెమో !

అంతే గాక ఇప్పటి బిజీ లైఫ్ బ్యాక్ ప్యాక్ బకరా బేబీ లైఫ్ అప్పట్లో ఎక్కడ ? ఉద్యోగమో సద్యోగామో గానిస్తే ఆ తరువాయి బాతాకానీ కి ఇంటి నిండా జనాలు ఇంటి చుట్టూతా వున్నవారంతా బంధువులే బాంధవ్యాలే. జీవన గతి , సరళి   సుళువు గా సాగి పోయే రోజులు . రేడియో లలో నో మీడియా (అప్పటి కి లేదు కాబట్టి , పేపర్ల లో నో ) వినోదం  కన్నా కన్నీ టి కధ లే ఎక్కువ .  కాంట్రాస్ట్ బాగా కుదిరి పోయేది !

జీవన గతి లో కన్నా మిన్నగా కన్నీటి కథలు ఉంటె మన జీవితమే బెటరోయి అని పించే లా ఆలోచింప జేసేవి .

మరి ఇప్పటి మాట ఏమిటి ?

జీవనం హై ఫై లైఫ్ ! సిటీ వారి కథలు ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పరు గె పరుగు . నిలబడి తీరిగ్గా ఆలోచించ టైం ఎక్కడ ?

ఇట్లాంటి జీవన గతి లో  సో కాల్డ్ 'రిలేక్సేషన్ ' కోసం తపించి పోయే , విష్ణు మాయ లో పడి పోయిన మానవుడు !

ఆ ఉన్నంత కూసింత టైం వినోదానికి కాలక్షేపానికి ఏదన్నా  ఉందా అని చూస్తున్నాడు .

మా ఏడు కొండల వెంకన్న లైఫ్ ని బిజి బిజీ చేసి, గజి బిజి చేసి పారే సాడు :) (విష్ణు మాయ మా వెంకన్న దే కదా మరి :)

సో , ఇట్లా ఆలోచిస్తే ఈ కాలపు మానవుడికి, బ్లాగ్ దర్శకులకు కావల్సినిది కాలక్షేపం ఖబుర్లు, బాతా ఖానీ బటానీ లు . ( ఈ టైటిల్లో మీకు ఎవరి బ్లాగు టపా అయినా గుర్తు కొస్తే అది జిలేబి  ఊహాత్మకం గా పెట్టిన పేర్లే గాని వ్యూహాత్మకం గా పెట్టినవి కావు అని గుర్తు పెట్టు కోవాలి ! జేకే !)

సో ప్రియ బ్లాగ్ బాంధవుల్లారా ! మీ అభిప్రాయమేమిటి ఈ విషయం మీద ?

ఫుట్ నోట్ :  జిలేబి కి అర్థం కాని విషయం  ఒకటుంది ఈ కాలం లో కూడా కన్నీటి కుండల, వైషమ్యాల టీ వీ సీరియళ్ళు ఈ జిలేబి లని ఎందుకంత మరీ టీ వీ పెట్టె ముందు బందీ చేసి పారేస్తున్నాయి  ? బ్లాగ్ లోకం లో ఉదాహరణ - వనజ వనమాలీ గారి కథలు )

చీర్స్
జిలేబి
(శ్యామలీయం వారి కామింట్ చదివాక )

Thursday, October 29, 2015

అమ్మకానికో బ్లాగిల్లు - కొనడానికో ....

అమ్మకానికో బ్లాగిల్లు - కొనడానికో ....

మొత్తం మీద మరో అగ్రిగేటర్ డమాల్ ! బ్లాగిల్లు మూట కట్టే సారు మా 'స్టారు' శ్రీనివాసు గారు.

అదేమిటో ఈ తెలుగు బ్లాగు లోకాని కొచ్చిన ఖర్మ !

ఒక్కటొక్కటే బ్లాగులు మూత పడి పోతా ఉంటె , దానితో బాటు అగ్రిగేటర్ లు కూడా మూట కట్టేయ్యటం !

బ్లాగిల్లు శ్రీనివాసు గారు ఇచ్చిన కారణం - బ్లాగిల్లు కి అంత 'రెస్పాన్స్' రావటం లేదు అని .

బ్లాగులు వ్రాసే వాళ్ళు ఎందుకు వ్రాయటం లేదు అంటే ... అబ్బే అంత 'రెస్పాన్స్' రావటం లేదండీ అని.

ఇట్లా ప్రతి ఒక్కరు చూస్తా ఉంటె మిగిలిన వాళ్ళ కోసమే వ్రాస్తా ఉన్నట్టు ఉన్నారుస్మీ ! జేకే !

(ఈ మధ్య శ్యామలీయం వారి బ్లాగులో కామెంటి జేకే అంటే - జేకే అంటే ఏమిటి అని అడిగారు శ్యామలీయం వారు - అబ్బే జేకే తెలీక పోవటమేమిటి వీరి కి అనుకున్నా ! జేకే !)

ఏమండీ బ్లాగిల్లు శ్రీనివాసు గారు, కూడలి, మాలిక గట్రా వాళ్ళు ఏమి ఆశించి ఇంకా తమ అగ్రిగేటర్ లని నిలబెట్టి ఉన్నారు ?

మరో ఆలోచన వస్తుంది - అగ్రిగేటర్ ల ని పెట్టిన వారు - అగ్రిగేటర్ ని మరీ 'పెర్సనల్' గా చూస్తూ న్నారేమో అని ! బ్లాగులోళ్ళం మేమైతే బ్లాగులకి కామింటులు వచ్చాయా లేదా అని ఆతుర పడుతుంటాం గాని అగ్రిగేటర్ లు 'క్లిక్కులు' వచ్చేయా లేవా అని రోలు కర్ర రూలు కర్ర పట్టుకుని లెక్కెయ్యడం జేసి అగ్రిగేటర్ ని మత పెట్టేస్తే  ఇక మా లాంటి బ్లాగులొళ్ళ కి వ్రాసే టపాల కి ఎక్కడ ప్రచారం ఉంటుంది ?

సో  బ్లాగిల్లు శ్రీనివాసు గారు మీరు మళ్ళీ మీ అగ్రిగేటర్ ని త్వరతిం గా నే తెరవండి .

ఆ కామింటు ల సెక్షన్ ని హారం లా తయారు చెయ్యండి (exactly like 'haram' comment section) అప్పుడు చూడండి మీ అగ్రిగేటర్ కి వచ్చే హిట్లని :)


చీర్స్
జిలేబి
 

Monday, October 19, 2015

ప్రతి తెలుగు వాడు తప్పక చదవాల్సిన పుస్తకం - ఇదండీ మహాభారతం !

ప్రతి తెలుగు వాడు తప్పక చదవాల్సిన పుస్తకం - ఇదండీ మహాభారతం !

తెలుగు వారి కి సులభ శైలి లో మహా భారతాన్ని రంగనాయకమ్మ గారు అందించారు.

ఇందులో కథా పరం గా , అక్కడక్కడా వారి వ్యాఖ్యానాన్ని అందిస్తూ మూల మహాభారతానికి అతి దగ్గిరగా అచ్చ తెనుగులో మహా భారతాన్ని వీరు అందించారు .

దరిదాపుల్లో నాలుగు వందల పేజీ ల లో మహా భారతాన్ని ఎట్లాంటి 'భేషజాలు' , ఉత్కృష్ట ఉపమానాలు  లేకుండా కథ ని కథావస్తువు ని యథార్థం గా అందించారు.

వారు అక్కడక్కడ కొట్టిన సెటైర్ నవ్వు తెప్పించ వచ్చు.

కొండొకచో వెటకారం గా అని పించ వచ్చు.

కూసింత వెగటు కలిగించ వచ్చు.

వీటన్నిటి ని పక్క న బెట్టి, ఒక మామూలు సాధారణ జన సమాజానికి ఈ మహా భారత కథ ఏమన్నా విలువల్ని అందిస్తాయా అని వారు ఎక్కు బెట్టిన బాణం మనల్ని ఆలోచింప జేస్తుంది.

వారి సైడు కామింటు లని పక్క న బెట్టి మహా భారతాన్ని ఆస్వాదించ వచ్చు.

సైడు కామింటుల తో సహా చదివితే తల తిరిగ వచ్చు. దానికి వారిని బాధ్యులని చేయ రాదు. 

మహా భారతాన్ని ఇట్లాంటి కోణం లో నించి కూడా చూడ వచ్చు అనడానికి రంగనాయకమ్మ గారి పుస్తకం ఒక సర్వోత్క్రుష్ట మైన ఉదాహరణ.

చదవండి . ఆలోచించండి. అన్నింటినీ యధాతధం గా (వారి 'కిక్కుల'ని కూడా) తీసు కోవాల్సిన అవసరం లేదు.


 
 
చీర్స్
జిలేబి

 

Thursday, October 15, 2015

జబ్బు పడి లేస్తే దాని హాయి యే వేరు :)

జబ్బు పడి లేస్తే దాని హాయి యే వేరు :)

ఈ మధ్య అదేమి విష్ణు మాయయో , గ్రహాల 'పాట్లో' ప్లాట్లో తెలీదు గాని సీనియర్ సిటిజెన్ అయిపోయారు గా ఇక ఇట్లాంటి జబ్బులన్నీ మామూలే అని జిలేబి కే రిటార్టు ఇచ్చె లా ప్రియ బాంధవులు తయారయ్యేరు !
 
అబ్బా ! జబ్బు పడి లేస్తే దాని మోజే వేరు !
 
ప్రశాంతత అనగా నేమి ! అని తెలియ వలె నన్న, అయ్యరు గారి తో సేవలు చేయించు కోవాలె అన్నా జబ్బు పడితే నే తెలుస్తుంది !
 
దేశం లో మళ్ళీ మొన్న వచ్చిన అమావాస్య పాట్లు గ్రహపాట్లు గురించి మళ్ళీ టపా వచ్చేసింది కూడాను మా బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి నించి . కాబట్టి నేను సరి కొత్త గా కొట్టాల్సిన టపా కూడా ఏమీ లేదు :)
 
ఇక భారద్దేశం లో చాలా మంది తమ తమ అవార్డులను (కాగితా ల ముక్కలను, పథకాలను ) తిరిగి ఇచ్చ్చేస్తున్నారు . కాబట్టి నేను కూడా నాకు బ్లాగు లో ళ్లు ఇచ్చిన పథ కాలను అన్నిటినీ తిరిగి ఇచ్చేయా లను కుంటున్నా :)
 
ఇప్పటి కి టపా కబుర్లు ఇంతేస్మీ :)
 
చీర్స్
జిలేబి

Wednesday, September 16, 2015

నేనిప్పుడు భవిష్యత్తుని చదవగలను - చూడ గలను - జిలేబి భవిష్యపురాణం :)

నేనిప్పుడు భవిష్యత్తుని చదవగలను - చూడ గలను - జిలేబి భవిష్యపురాణం :)

శిష్యా !

గురూ

ఇవ్వాళ్టి న్యూస్ పేపర్లన్నీ వచ్చేయా ? న్యూస్ ఛానల్ అన్నీ సమీక్షించావా ?

చేసేసాను గురూ !

లేక్ఖెంత ?

జపానులో పెను తుఫాను - మూడు శాల్తీలు లేచి పోయేయి

హు; శని మూడో గళ్ళ లో ఉన్నాడు .

సౌదీ లో వందమంది క్రేను క్రింద నుజ్జ్జు

సహస్రాణాం మయా సృష్ట్యాం రాసుకో . రాహువు కేతుని చూస్తున్నాడు .

ఇంకా ?

అమెరికా లో స్కూలు బస్సు ఆక్సిడెంటు - ఇద్దరు పిల్లలు

బాలార్కుని మార్కు ఇది రాసేసుకో .

ఇండో నేషియా లో ఖాండవ దహనం గురువర్యా

రాసుకో - అగ్ని దేవుడు నెయ్యి కోసం చూస్తున్నాడు .

లెక్ఖ లయ్యేయా ?

ఓ లెక్ఖ బకాయి గురూ !

ఏమిటోయ్ ?

అమెరికా వాడు వడ్డీ రేటు పెంచు దామా వద్దా అని ఆలోచిస్తున్నాడట ....

హు హు హు ! వాడి శ్రాద్ధం దరి దాపుల్లో కి వచ్చేస్తోంది - అమెరికా ఎంబసీ వాడు తనకు వీసా ఇవ్వక పోవడం గుర్తు కొచ్చే స్వామీ వారికి - రాసుకో - మిధునం లో మిడి మిడి పాటు తప్పదు . ధనుస్సు లో శని ప్రవేశిస్తున్నాడు . అయ్యిందా లెక్ఖ ?

ఓ మోస్తరు అయినట్టే గురువు గారు !

ఓకే ! వీటన్నిటిని మన రీసెర్చ్ విభాగానికి పంపి తీక్షణం గా గ్రహ గతుల్ని వీటి కనుగుణం గా సంశోధించు !

అట్లాగే గురువరా !

రాబోయే కాలం లో ఏమి జరుగును గురువరా ? ఎనీ క్లూ ?

బిడ్డా ! రాబోయే కాల రహస్యం శ్రీవిద్యా రహస్యం ! అది అందరికి చెప్ప బడదు ! కాలం దాట గానే పేపర్లో వచ్చె అన్ని బ్యాడ్ న్యూస్ లు సంకలనం చేసుకుని రా నా దగ్గిరికి వాటన్ని టికీ మూలాలను గ్రహ గతులనించి నీకు లాగి చూపిస్తా :)

గ్రహ గతులు అన్నింటి నీ నిర్దారిస్తాయ్ అవన్నీ నీకు అర్థం కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది - మొన్న అమావాస్య వచ్చింది చంద్రుణ్ణి చూసేవా ?

చంద్రుడు ఒట్టేసి కనబళ్ళేదు గురూ :)

శిష్యా ! నాకు నువ్వు తగిన పరమానందయ్య శిష్యుడవే !

జై బోలో గురు మహారాజ్ కీ ! జై జై జై! విజయీ భవ ! రాబోయే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఏమి జరుగును గురు మహారాజ్ !

గుండు గురువు బవిరి గడ్డం తడివేరు ! - ఇరవై తొమ్మిదో తేది చెబ్తా నీకు ఆ రహస్యం :)


చీర్స్
జిలేబి 

Monday, September 14, 2015

చెట్టు కొమ్మన కోతి - చెరువులో చందమామ !

చెట్టు కొమ్మన కోతి - చెరువులో చందమామ !
 
చెరువులో చందమామ కనిపిస్తే 
చెట్టు కొమ్మన కోతి 
లబక్కున చెరువులోకి దూకింది 
చందమామని చుట్టే ద్దా మని !
 
చెరువు కల్లోలమై చందురూడు  
ప్రతి నీటి బొట్టు లోనూ కరిగి పోతే 
చెట్టు మీది కోతి 
ప్రతి బిందువు నీ ముద్దాడు దామని 
మునకలు వేసింది . 
 
 
ఆకాశం లో ఓ కారు మేఘం 
చందురుణ్ణి కప్పేసింది -
మళ్ళీ కోతి చెట్టే క్కే సింది !
 
 
శుభోదయం 
జిలేబి 

Friday, September 11, 2015

ప్రత్యభిజ్ఞాత్ హృదయం - ప్రత్యభిజ్ఞాత్ హృద్యం !

ప్రత్యభిజ్ఞాత్ హృదయం - ప్రత్యభిజ్ఞాత్ హృద్యం !

కశ్మీరీ శైవ సంప్రదాయం లో - సంక్షిప్త మైన సూత్రీకరణ కాబడ్డ  ప్రత్యభిజ్ఞా హృదయం  -అభినవ గుప్తుని శిష్యుడైన క్షేమ రాజ క్రోడీ కరించిన కృతి .  అభినవ గుప్తుడి కాలం పదవ శతాబ్దం అని ఒక నిర్ధారణ . ఆ ప్రకారం చూస్తే ఈ క్షేమ రాజ ఆ కాలపు వాడై ఉంటాడు .

చిన్ని చిన్ని పదాలతో మేరు సమాన మైన భావాన్ని ఈ పుస్తకం లో చూడ వచ్చు .

కామెంటరీ లేకుండా చదవటం నా వరకైతే బెటర్ .

కాని అందులోని 'nuances' ని తెలుసుకోవా లంటే వ్యాఖ్యానం/భాష్యం  చదవకుండా అర్థం కాదేమో . బ్రహ్మసూత్రముల లా ఇదీ సూత్రీ కరించ బడిన పుస్తకమ్.

ఆ కాలం లో అన్నీ సూత్ర రూపం లో చెప్పడం ఆనవాయితీ !

(దానికి భాష్యం/వ్యాఖ్యానం/వ్యాఖ్యానం పై మరో వ్యాఖ్యానం  చెప్పు కోడా నికి వేరు వేరు కాలం లో వారి శిష్యులు మళ్ళీ మళ్ళీ పుడతా రనుకుంటా వాటికి అర్థం తెలుసు కోవడానికి, అర్థం చేసుకోవడానికి,, పరమార్థం  చెప్పు కోడానికి . జేకే ! (అంతా కాలమహిమ ! విష్ణు మాయ యాయే మరి !)  -

మొదటి సూత్రం తో నే మతి పోతుంది ; certainly you will be taken to a different dimension later on !
Enjoy!

చితిహి స్వతంత్రా విశ్వసిద్ధి హేతుహు !

ప్రతి - ప్రత్యక్ష
అభి - ఇప్పుడే (హిందీ లో अभी ఇందులో నించే వచ్చిందే మో )
జ్ఞాన - జ్ఞానం
హృదయం - The heart of 

ప్రత్యభిజ్ఞ - Recognition
(The heart of (secret of)  'Recognition')

ప్రత్యక్షం గా ఇప్పటి కిప్పుడే జ్ఞానమైన హృదయం .  An Heart that has realized in the 'Now'.

 ప్రత్యభిజ్ఞహృదయం లింకు ఇక్కడ

శుభోదయం 
చీర్స్ 
జిలేబి
 

Thursday, September 10, 2015

అద్దం లో ముఖం !

అద్దం లో ముఖం !
 
 
ముఖమల్ మీద
పడు తూం టే 
అద్దం లో ముఖం
పలచ నై పోయింది !
 
పోనీ అద్దాన్ని తుడిస్తే 
తా తళుక్కు మని 
మెరిసింది కాని 
ముఖం కనిపించ లేదు !
 
అబ్బా ముఖమల్ 
తీసేద్దా మంటే 
ఎందుకో బెరుకు 
బెరుకుతో సరకు 
దొరుకు తుందా ?
 
 
 
 
శుభోదయం 
జిలేబి 

Monday, September 7, 2015

ఆత్మ ఉందా లేదా ? సరి ఐన సమాధానం చెప్పండి చాలెంజ్ పే చాలెంజ్ !

ఆత్మ ఉందా లేదా ? సరి ఐన సమాధానం చెప్పండి చాలెంజ్ పే చాలెంజ్

చా, మరీ ఇట్లా అడ్డ దిడ్డ మైన ప్రశ్న వేస్తే ఎట్లా జిలేబి అంటారా ?

లేకుంటే ఏమిటండీ ?

పురాతన కాలం నించి ఈ ప్రశ్న వేధిస్తో నే ఉంది . వేధిస్తో నే ఉంది ; ఇంకా ఒక ఒకే నిర్ధారణ కి రాలే !

ఆత్మ ఉందంటూ కొందరు , లేదంటూ ఇంకొందరు వాదిస్తూ నే ఉంటున్నారు .

దీనికి తోడు జోదు ఆ సో కాల్డ్ 'పరమాత్మ :) కలడు కలండనే వాడు కలడో లేదో అంటూ సందేహం వెలిబరుస్తూనే మహా భాగవతం రాసి మన మొఖాన పడేసి కుదేసి టా టా చెప్పి తా చక్కా పోయాడు పరంధాముని సన్నిధికి అంటూ ఒక పుణ్యాత్ముడు :) మళ్ళీ ఇక్కడా ఆత్మే పుణ్యాత్ముడు , పాపాత్ముడు గట్రా :)

ఆత్మ కి అసలు రూపం లేదు ; ఎక్కడ ఉంది అని మన కష్టే ఫలే వారి లా వివేక చూడామణి ని పట్టు కు ఈది, (ఇదేమన్నా గోదావరి యా ఈ తటం కని పిస్తే , ఖచ్చితం గా ఆ వైపు మరో తటం ఉందని అనుకోవడానికి :)) ఈది కోశాల కోణాల ని కొన లని పట్టు కోవడానికి 'బాహుబలి' ప్రయత్నం చేస్తున్నారు !

మరి కొందరేమో యోగః అంటూ జోగాడుతూ ఆ సో కాల్డ్ ఆత్మా వారిని సందర్శించ డానికి శీర్షాశనాలు వేస్తున్నారు .

మరి కొందరేమో , స్వామీ వివేకా నందా వారికీ జెయ్ అంటూ మన నరేంద్ర మోడీ వారి లా (ఈ నరేంద్ర మోడీ పేరు ఎందుకు జిలేబి అంటే , బ్లాగార్పీ రేటింగు కోసం అని బ్లాగ్ రీడర్లు చెబుతారు కాని జిలేబి అది ఒప్పుకోదు  !) దరిద్ర నారాయణ్ సేవ లో కర్మ యోగం లో మునిగి తేలి ఆత్మ దర్శనాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు .

మరి కొందరేమో , హూ యాం ఐ అంటూ తల గోక్కుంటూ బుర్రె తడుముకుంటూ దీర్ఘాలోచనలో పడి ఆత్మా ఎక్కడ ఉన్నావా అసలున్నావా అంటూ బవిరి గడ్డం తడివేసు కుంటున్నారు.

వీటి మధ్య లో నగర జీవనం లో క్రిందా పైనా పడి నోటి బువ్వ కి చేతి పని కి ఏమైనా పొత్తు కుదురుతుందా అంటూ సగటు మానవుడు ,తనకున్న కొద్ది పాటి సమయం లో గణపతి బప్పా మోరియా అంటూ రెండు చెంపలు వేసేసుకుని , గుంజిళ్ళూ తీసేసు కుని వచ్చేస్తోంటే , సో కాల్డ్  'శాస్త్ర పారంగతులు ' అసలు శాస్త్రం లో విగ్రహారాధన ఉందా అంటూ తర్కించి తర్కించి శుష్కించి శుష్కించి అలసి సొలసి నిదుర పోయి లేసి ఆహా కల గంటిని అంటూ ఇదియేరా పరమాత్మ తత్త్వం అంటూ సెటిల్ అయి పోతున్నారు .

ఏమిటో , జిలేబి నాకు ఒక్క ముక్కా అర్థం కావడం లేదంటారా !

అంతా మాయ ! విష్ణు మాయ ! అంటూ జిలేబి చక్కా వెళ్లి పోతుంది !

అబ్బబ్బా , ఈ ఆత్మా వారికి అంత టెక్కు ఎందుకో ? ఉంటె , ముందుకొచ్చి నేనే అని జేప్పోచ్చు గా ?

ఊ హూ ! చస్తే  రాడు, రాదు  - చస్తే గాని రాడు, రాదు, ముందుకి అదే ఏమి చావడం  అంటే వెతుక్కో జిలేబి  ఏది చావాలో అంటూ ఉపనిషత్తుల వారు (వీరు డైరెక్ట్ గా చెప్పరు గాక చెప్పరు - ఉపనిషత్తుల వారిది ఎప్పుడూ ఇండైరేక్ట్ మార్కెటింగ్ టెక్నీక్ :) ముక్తాయించి ఆయ్ ఇక మరో ఉపనిషత్తు కి వెళదామని చక్కా వెళ్లి పోతారు !

ఇక మిగిలింది ఈ కాలపు స్వామీ వారలు, మహారాజ్ లు , వీళ్ళు కాలాని కి తగ్గట్టు ఏది కావాలో అది చెప్పుకుంటూ టైం పాస్ టీం పాస్ చేసి వారికి తగిన జ్ఞాన బోధ ఇంకొంచం గట్టి వారైతే తరుణో పాయ మంత్రం జెప్పి నీ తంటాలు నువ్వు పడవోయ్ జిలేబి అని చక్కా ఆ హిమాలయాల కేసి తిరిగి దండం పెట్టేసు కుంటారు !

ఇక హిమాలయాల మాట అంటారా ? 'కాలా కాలం' గా వీటన్నికి సాక్షీ భూతం గా (ఈ సాక్షీ భూతం ఏమిటి మధ్య లో !) నిలబడి గంగై , సుగంగై , ఆకాశ గంగై , సాగరమై , మేఘమై, నీలి మేఘమై , ఘనీ భూతమై ( మళ్ళీ భూతం ) , హోరై, జోరై , వానై వరదై , మళ్ళీ హిమమై , మళ్ళీ ......


శుభోదయం
జిలేబి
(కష్టే ఫలే వారి వివేక చూడామణి టపా శర పరంపరలు చదివేక )

Wednesday, September 2, 2015

హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులోళ్ళు అంటే నే నాకు భయ్యం :)


హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులోళ్ళు అంటే నే నాకు భయ్యం :)
 
 

అక్కడక్కడా చెదురు ముదురు గా తెలుగు బ్లాగు లోకం లో టపాలు రాద్దామని, వీలైతే తమకు తెలిసిన దానిని నలుగురుకి షేర్ చేసుకుందామని గట్రా 'సద్భావన' తో ఉన్న బ్లాగు మణులు, మాన్యులు బితుకు బితుకు మని నేటి టపా రాద్దామా వద్దా అని డైలమా లో పడి సరే పోనీ ఈ దురద వదిలితే పోయేదా ఏదో ఒకటి రాద్దా మని నిర్ణయించు కని కీ బోర్డ్ పట్టేరు , టపా రాసి హమ్మయ్యా ఇవ్వాల్టికి మనం రాసే సాం - ఏడుకొండల వాడా వెంకట రమణా నా టపాలు 'హ్యాక్' కాకుండా చూడు సామీ అంటూ పెరుమాళ్ళ కి నమస్కారం పెట్టి పబ్లిష్ బటన్ నొక్కేరు .

అంతలో బ్లాగు భూతాలూ , పెను భూతాలూ, లిటిల్ రాస్కేల్స్, బిగ్ 'భ్రాతర్స్' , టైనీ 'త్విట్టర్స్' ఆవులింతలు బెట్టి ముసుగు తన్ని నిదుర పోదామా లేక బ్లాగు లోకం మీద పడి కస మిస కామింట్ల తో కుదేద్దామా అని మళ్ళీ ముసుగులు పెట్టు కునేయి .

అంతలో వాళ్ళ బాస్ అందర్నీ 'జర నిద్ర లేవండహే' అని  అదమాయించి తానూ టపాలకి కామెంట్లు బరకడానికి సంసిద్ధురా లయ్యింది.

అగ్రిగేటర్ ల లో కామింట్ల వరదలు తయారయ్యేయి .

కుక్కా !

నక్కా !

నంగ నాచి

ఓసీ శూర్పణఖ !

బద్మాష్ !

ఆంద్రోళ్ళ ఆగడాలు

తెలంగాణా తిట్లు

నువ్వా  నేనా

సై అంటే సై



బ్లాగు భూతాలూ, రాస్కేల్స్ గుంభన గా నవ్వు కునేయి . టపాలు రాస్తారర్రా :) చూడండి మీ టపాల కన్నా పెద్ద పెద్ద కామింట్లు పెడతాం అంటూ 'బద్మాష్' అంటూ అరిచేయి .

వాళ్ళ బాస్ అందరికి ఆర్డర్ పడే సింది - ఒరేయ్ బడుద్దాయిలు, అందరూ ఓ పదో పరకో పేర్లు పెట్టు కొండర్రా మీలో కొందరు పొగుడుతూ రాయాలి . మరి కొందరు తెగుడుతూ రాయాలి . మరి కొందరు బండ 'బూట్ల' తో తల తన్నేలా కామింటా లి .

సై అంటే సై అనేయి కామింటు కామినులు, భూత ప్రేత పిశాచాలు :)

హమ్మో నాకు భయ్యం ! ఈ బ్లాగులో కామేంటోళ్ళం టే నే నాకు భయ్యం :)

శుభోదయం
చీర్స్
జిలేబి

Friday, August 28, 2015

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ! -పద్య రచన- శ్రీ గుండు మధుసూదన్!

శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ! 

పద్య రచన- శ్రీ గుండు మధుసూదన్!

నేడు శ్రావణ మాసమునందు  పౌర్ణమికి ముందు వచ్చే వరలక్ష్మీ శుక్రవారము. పరమ పవిత్రమైన పండుగ రోజు.

ఈ సందర్భముగా శ్రీ గుండు మధుసూదనరావుగారు రచించిన వరలక్ష్మీ  వ్రత మాహాత్మ్యము కథను పద్యములలో చదివి ఆనందించండి.

శ్రీ గుండు మధుసూదన్ గారికి
అభినందనల తో జిలేబి 
 

పద్య రచన. శ్రీ గుండు మధుసూదన్! 
ఆ.వె.
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)
ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)
కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)
తే.గీ.
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)
కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)
తే.గీ.
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)
ఆ.వె.
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;
చారుమతియు లేచి, సంతసించి,
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి,
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)
కం.
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)
తే.గీ.
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి,
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)
కం.
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)
తే.గీ.
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి!
దేవి! నారాయణప్రి యాబ్ధితనయ! నమ”
మనుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)
తే.గీ.
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)
తే.గీ.
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)
కం.
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్న మఱియుఁ జదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత మనవరతమ్మున్! (14)
(ఇది వరలక్ష్మీ వ్రతమాహాత్మ్య కథ)

Thursday, August 27, 2015

కాళిదాసు చెల్లెలి మావ భలే మంచోడు :)

 
కాళిదాసు చెల్లెలి మావ భలే మంచోడు :)
 
కాళిదాసు చెల్లెలు
కవిత చెబ్తే 
మావ మెలితిరిగి
వంకర్లు పోయేడు 
 
 
 
జేకే !
 
జిలేబి 

Tuesday, August 25, 2015

నా జేబులో డబ్బులు పోయెను - రామా హరే ! కృష్ణా హరే !


చైనా డమాల్ - గ్లోబల్ జాటర్ డమాల్ :)

చీని చీనాంబరాలు ధరించి అని ఆ కాలం లో గొప్ప గా చెప్పే వాళ్ళం. ఈ మధ్య గ్లోబలైజేషన్ గోల లో చీని చీనాంబరాలు ఎక్కడ చూసినా అక్కడ .

పాపం చీనా వాడు కొంత ఇల్లు సర్దు కుంటామని ఇల్లు కొంత సర్ది తే , ఆ సేతు హిమాచల పర్యంతం అన్నట్టు అటు జప్పాను వాడి నించి ఇటు అమెరికా వాడి దాకా అందరి జాటర్ డమాల్

కొందరు మానిక్ మండే అంటే , మరి కొందరు బ్లాక్ మండే అని గీతాలాపన చేసేరు .

బ్లడ్ బాత్ ఆన్ దలాల్ స్ట్రీట్ అంటూ మా హిందూ 'వార్' చెప్పేరు .

ఒక్క రోజులో వెయ్యిన్ని ఆరు వందల పాయింట్లు జాటర్ డమాల్ అవడం ప్రపధమం . ( అంటే, ఇకమీదట ఎప్పుడైనా జాటర్ డమాల్ అయితే దీనికి పై బడే అన్నీ పడతాయని అనుకోవాలేమో మరి :) బెంచ్ మార్క్ ?)

ఏడు లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజులో హుళు హుళు క్కి అయి పోయిందట :) ఇంతకీ ఈ దస్కం ఎవరి జేబులో కెళ్ళి ఉంటాయి ? అమెరికా వాడి ఇంటికి మళ్ళీ చేరి పోయి ఉంటాయా ? సమాధానం లేని ప్రశ్న :)

సరే మన జైట్లీ వారేమో అబ్బే , మన దేశం సర్దేసు కుంటుంది అని వాక్రుచ్చేరు .

మా ఆర్ బీ ఐ రాజన్ గారేమో జిలేబి చీర్సు చెబితే చెప్పును గాని నేను మాత్రం చీర్స్ చెప్పనే చెప్పను అనేసేరు - రీజేర్వ్ బ్యాంక్ చీర్ లీడర్ కాదోయ్ అంటూ .




సందులో సడే మియా అంటూ వడ్డీ రేటు మార్పు కి కొంత కామా పెట్టేరు .

ఈ స్టాకు మార్కెట్టు గోలలో మామూలు విషయమై పోయిన ది - కమాడిటీ మార్కెట్ - పదహారు సంవత్సరాల ప్రాయం కోల్పోయింది :) (పదినారు వయదినిలే అంటూ ఇక మనం పాట పాడేసు కోవచ్చు )




మధ్య లో రూపాయి భేతాళుడు నాదారి ఎడారి నా పేరు బికారి అంటూ మళ్ళీ మొదలెట్టేడు !



వీటన్నిటికి కారణం గ్రహ పరిస్థితులే అని నొక్కి వక్కాణిస్తూ న్నారు బ్లాగ్ జ్యోతిష్యులు :)




రాబోయే సెప్టెంబర్ 'మహీ'నా లో 'మహీ' మీద గామా రేస్ విపరీతం గా వస్తున్నాయంటా ; దానికి ముందస్తు గా ఇవన్నీ 'శుభ' సూచకాలు కని పిస్తున్నాయ్ (అట :)

జిలేబి మొన్న స్వామీ వారితో సెల్ఫీ మేళ మాడేవు కదా దాని పర్వ్యసానమే ఇది అని మరి కొందరు 'మెట్టియల్' విరిచేరు కూడన్నూ :)

జిలేబి ఇప్పుడు కూడా చీర్సేనా అంటే ఏమి చెప్పడం

జాటర్ డమాల్ అయినా చీర్సు చీర్సే :) జిలేబి జిలేబి యే !

చీర్స్
జిలేబి
 

Friday, August 21, 2015

శ్రీ వారి "సెల్ఫీ" సేవ !

శ్రీ వారి "సెల్ఫీ" సేవ !
 
శ్రీ మన్మధ నామ సవంత్సరే
దక్షిణాయనే వర్ష ఋతౌ
శ్రావణ మాసే శుక్ల పక్షే

....


విచ్చేసిన వారందరికీ శుభోదయం. ఈ కళ్యాణ సేవ తదుపరి స్వామీ వారితో సెల్ఫీ సేవ ప్రారంభ మగుతుంది .

మీ మీ మోబైళ్ళ తో  పద్మావతీ మంగ తాయారు సమేత  స్వామీ వారితో సెల్ఫీ దిగాలనుకున్న వాళ్ళందరూ తలో వెయ్యిన్నూట పదహార్లు కౌంటర్లో చెల్లించి రశీదు పుచ్చుకోవాల్సిందని మనవి .

ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవిందా అంటూ భక్త జనవాహిని కౌంటరు మీద పడింది .

కౌంటరు కలెక్షను మొదలయ్యింది :)


ఆ హా ఒకా నొక కాలం లో మీ మోబైళ్ళు కి నో ఎంట్రీ . ఆ పై స్విచ్ ఆఫ్ మోడ్ ; ఆ పై సైలెంట్ మోడ్ ;

The current trend is "selfie" mode :) Mod "I" ndia :)


స్వామీ వారు , అమ్మ వారలు కూడా మరింత సింగారించు కునేరు. సెల్ఫీ లో మనం బాగా కనబడాలి కదా మరి :

స్వామీ వారి తో సెల్ఫీ దిగండి . మీ జీవితాన్ని  శుభకరం గా మలచు కోండి .

మీకు మొబైలు లేదా ? no problem.

పక్కనే సామ్సంగ్ వారు 'స్వామి సంఘ్' అనే సరికొత్త మేడ్ ఇన్ ఇండియా 'ఇండీ' మొబైల్ షాప్ కూడా తరిచేరు . అందులో కొనుక్కోవచ్చు . స్టేటు బ్యాంకు వారి  పన్నెండు నెలల ఇంట్రెస్ట్ ఫ్రీ ఇంస్టాల్ మెంట్ ఆఫర్ కూడా ఉంది .

అట్లాగే ఐఫోన్ వారి 'ఐపద్మిని' అనే సరి కొత్త ఇండీ మొబైల్ కూడా ఉందండోయ్ .

ఆఫర్ ఆఫర్ ఆఫర్ !

బై ఒన్ గెట్ ఒన్ ఫ్రీ మేడ్ ఇన్ ఇండియా మోబైళ్ళు కూడా ఉంది

ఆలశించిన ఆశా భంగం. భలే మంచి చౌక బేరం

రారండోయ్ రారండోయ్
పిల్లా జెల్లా రారండోయ్ !


శుభోదయం
చీర్స్
జిలేబి
(Mod "I" ndia )

Monday, August 17, 2015

జ్యోతి లక్ష్మి చీర కట్టింది జిలేబి సినిమా ప్రవచనం

జ్యోతి, లక్ష్మి, 'చీర కట్టింది' జిలేబి- సినిమా ప్రవచనం
 
అకాల చరాచర అండ పిండ బ్రహ్మాండములో ఉండు అమ్మ ఎవరు ?
ఆవిడ ఏ రూపం లో ఉంది ?
అదియే పరతత్వ మైన జ్యోతి రూపం లో మనకు కానవచ్చును .
 
శివ పురాణం లో లక్ష్మీం 'చీర' రాజ  తన్హాయీ ' అని చెప్ప బడి ఉంది .
 
అట్లా  జ్యోతి, లక్ష్మి ,చీర కట్టింది ఎవరిని ?
 
అండ పిండ బ్రహ్మాండ లోకంలో ఉన్న
ద్విపద చతుష్పద జీవరాసులన్నీ 
ఆ  చీర ఒడుపులో నించి ఊడి పడి,
ఆ మాత 'క్షీర' ఉడుపుల్లో పెరిగిన 
ఆ మాత ఇచ్చిన  వరాల బిడ్డలే  కదా !
 
జిలేబి అనగా ఎవరు ?
 
బ్లాగ్మాత
 
పంచ దశ లోక పరమాణువు .
 
సినిమా అనగా నేమి ?
 
ఆది శంకరుల వారి - దృక్ దృశ్య వివేకావివేక  'చూడ ' , (ర) మణీ, మనీ !
 
ప్రవచనం అనగా నేమి ?
 
ప్రస్తుత వచనం . ప్రసంగ వచనం 
అది అప్రస్తుత మైతే, అప్రసంగం అయితే 
 తపాళ్ టైటిళ్ళు తిట్లు గా పరిడ విల్లును .
 
ఇంతటి తో జ్యోతి, లక్ష్మి, 'చీర కట్టింది జిలేబి' సినిమా ప్రవచనం పరి సమాప్తం .
 
ఈ ప్రవచనాన్ని చదివిన వారికి , చదివి వినిపించిన వారికీ
ఆ కొండ పైనున్న మా పెరుమాళ్ళు
రెండు రెట్లు 'వడ్డెనలు'
వాయించునని తెలియ జేసుకుంటో
 
"ఐ యామ్ వేద" !
 
జిలేబి
 
 

Friday, August 14, 2015

కన్నీటి కలువ

కన్నీటి కలువ 
 
ఒక కలువ
విరుచు కోవాలని 
ఆకాశం వైపు చూసింది 
 
చినుకుల కన్నీళ్లు 
కలువ ని తాకితే 
 
కన్నీటి కలువ 
కాలువ లా పెల్లుబుకింది 
 
 
జిలేబి 


 

Monday, August 10, 2015

బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి - దక్షిణామూర్తి స్తోత్ర ప్రసంగం

బ్లాగ్ జ్యోతిష్ శర్మ గారి - దక్షిణామూర్తి స్తోత్ర ప్రసంగం
 
వారి ప్రసంగ వేగం రైలు స్పీడు ...
సో కొంత స్పీడు తగ్గించి వినాలను కుంటే
Audacity సాఫ్ట్వేర్ ద్వారా తగ్గించి వినవచ్చు .
(Its clarity is better at 90% Change Speed)
 
 
 
 
 
cheers
zilebi

Thursday, August 6, 2015

స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో !

 
స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి  స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో!!!

స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి  స్వామీజీ మహారాజ్ కీ జయ్ హో బ్లాగు వేణీ వేణులు గొంతెత్తి ఓహో ఆహా అని స్వామీ వారిని కొనియాడు తూంటే స్వామీజీ వారు తమ బవిరి గడ్డం తడుము కుంటూ తమ భక్త బ్లాగు జనవాహిని ఆసాంతం గమనించి , తలయాడించి తమ సంతోషాన్ని వెలుబరచి చిరు నగవు చిందించేరు .

బ్లాగు భక్త జనవాహిని 'ఆనంద' డోలికలో తూగు లాడేరు .

భక్తులారా ! స్వామీ వారు గొంతు సవరించు కునేరు .

వెంటనే జనవాహిని స్వయం ప్రకటిత బ్రహ్మజ్ఞాన మేధోమూర్తి  స్వామీజీ వారికి జయ్ అంటూ మరో మారు గళం ఎత్తింది .

స్వామీ వారు చేయి ఊపేరు - జనవాహిని నిశ్శబ్దం గా స్వామీ వారి వైపు ఆతురత తో చూసింది .

బ్లాగ్ భక్తులారా ! మీకు ఇవ్వాళ నేను జ్ఞాన బోధ చేయడానికి ఉపక్రమిస్తున్నా . చెప్పేరు స్వామీ వారు .

"భగవంతుడు భక్త జన మందారుడు అంటారు కదా ! అసలు ఆ భగమంతుడు కి భక్తుడి కి అసలు సంబంధం కలిగించే వారు ఎవరు " స్వామీ వారు ప్రశ్నించి నిదానించేరు .

వెంట నే బ్లాగు భక్తుల గుసగుసలు, రుస రుసలు మొదలయ్యేయి . టప టపా  చేతులు తట్టేయి . స్వామీ వారు ముదావహం గా తలూపేరు .

బ్లాగ్ 'భక్తులూ' కానివ్వండి ఇక మీ కామింటులు ! స్వామీ వారు చేయి పై కెత్తి గాలి లో ఊపేరు .

భక్తులు తమ తమ లేపుటాపు లను తెరచి తాపము తో కామింట డటం మొదలెట్టేరు .....

అవి ఎట్లన .....


చీర్స్
జిలేబి

 

Friday, July 31, 2015

కాలమ్ కలాం కాలం - జిలేబీయం

కాలమ్ కలాం కాలం - జిలేబీయం
 
నివాళి
 
ఒక అబ్దుల్ అజరామరుడయ్యేడు
ఒక యాకుబ్ తన కర్మఫలం పొందేడు
 
భరత భూమి
పుణ్య భూమి
కర్మ భూమి
 
నమామి సతతం కాలం !
 
సరి జోదు లేరెవ్వరు నీకు !
దేవాంశ నైనా, ఆసురాంశ  నైనా
క్షణం లో క్షరం చేసి
జిలేబి మాయ జేస్తావు !
 
నివాళి .
 
జిలేబి

Tuesday, July 28, 2015

ఆకసాన చందురూడు !

 
ఆకసాన చందురూడు 
 
తలెత్తి చూస్తే 


ఆకాశాన చందురూడు !


అబ్బ ! ఏమి చమ్కీలు !
తారలు గుస గుస లతో 
మొహనమీ ప్రకృతి !
 
పూర్ణ చందురూడు 
ముస్తాబవు తున్నాడు !
 
తారల తట పటాయింపు !
మరీ ఈ చందురుడు !
అబ్బ సిగ్గేస్తోంది సుమీ !
 
 
చీర్స్ 
జిలేబి 

Wednesday, July 15, 2015

చెట్టు క్రింద రాయడు !

చెట్టు క్రింద రాయడు !
 
 
రాయడు చుట్ట వెలిగించేడు
చప్పున చెట్టు ముడుచు కుంది
 
రాయడు తలెత్తి చూసేడు
టప్పున టెంకాయ తల మీద పడింది
 
రాయడు హమ్మా అన్నాడు నొప్పితో
గప్పున చల్ల గాలికి చెట్టు గాలి నిచ్చింది
 
రాయడు హమ్మయ్య అంటూ సేద దీరాడు
మెప్పున చెట్టు గుస గుస లాడింది
 
 
శుభోదయం
చీర్స్
జిలేబి
 

Saturday, July 11, 2015

ఇచ్చట కామింటుటకు టపాలు అద్దె కివ్వ బడును !

ప్రజా మధ్య పాలక కళా కారులు !

కళాకారులు - రాసేవాళ్ళు, గీసేవాళ్ళు, పాడేవాళ్ళు అంటూ అనేక రకాలుగా వుంటారు ... 

కొందరి ప్రస్తానం ప్రజాకళాకారులుగా మొదలై కాసులకి, కీర్తికి లొంగిపొయ్యి పాలక పక్షులై పోతారు , మారిపోతారు

... పూర్తి గా చదవండి 


అహం పిపీలికః !

చీర్స్ 
జిలేబి
కామింట దలిచిన చొ 
ఇచ్చట కామింటుటకు టపాలు అద్దె  కివ్వ బడును !  
 

Friday, July 10, 2015

మేం ఆస్తికులమోయ్ ! శానా శానా గొప్పో ళ్ళం !

మేము ఆస్తికుల మోయ్, శానా గొప్పోళ్ళం !
 
అగ్ని మీళే పురోహీతం !

ఆ ఇంతకీ దేముడు రాయిలో ఉండాడా ? రప్పలొ ఉండాడా ?
కనిపిస్తాడా ? కనిపిం చడా ?
నమ్మకుమున్న వాళ్ళ కె కనిపిస్తాడా ?

ఓయ్ ! మీరు నాస్తికులు . ఛీ ఛీ పో పో ! మీకు వాడు కనిపించడు !
'ఓయ్ ! నిజంగా వాడే ఉంటె , నమ్మకమున్నా లేకున్నా కనిపించాలి కదా  ఉంది, ఉన్నాడు, ఉన్నది అంటే నమ్మకానికి అతీవల కనిపిం చాలీ గదా ?

ఆయ్ ! నో నో నో ! నువ్వు నాస్తికురాలివోయ్ ! నీకు కనిపించడు ;

సరే ఆస్తికా ! అస్తు ! ఇంతకీ నీ దేముడు విగ్రహంలో , రాయి లో ఉండాడా ? దానికేమైనా శాస్త్రం గట్రా ఉందా  అని నిరూపణ ఉందా ?

శాస్త్రం మనిషి వ్రాసిందోయ్ ! ఆ పై వాడు ఉన్నాడు అన్నది నిజమైతే, మనిషి వ్రాసిన శాస్త్ర నిరూపణ ఉంటె ఏమిటి ? లేకుంటే ఏమిటి ?

ఆయ్ ! అట్లా కాదు నిరూపణ కానిదే ఉన్నాడా లేదా అన్నది సత్య దూరం కాదు ! కాబట్టి శాస్త్ర నిరూపణ కావాల్సిందే

నాస్తికుడు బుర్ర గోక్కున్నాడు !

వీళ్ళ పిండా కూడు ! ఉన్నాడు అంటారు ! ఉన్నాడు అన్న వాణ్ని గొప్పగా సర్వాంతర్యామి అంటారు ! రాయి లో ఉండాడు ,రప్పలొ ఉండాడు , నీలో ఉండాడు, నాలో ఉండాడు మనం దరిలో ఉన్నాడు అంటారు ! మళ్ళీ క్రేజే ఆస్తికాస్ , యు సి, మళ్ళీ నిరూపణ కావాలి అంటారు !

అబ్బ ! నాస్తికత్వమే బెష్టు ! లేదు ! తంటా వదిలే! వెతికితే ఉంటాడు; నీ నమ్మకాన్ని బట్టి కనిపిస్తాడు గట్రా ఇఫ్ బట్ నో స్టేట్మెంట్ లు లేవు !


మేం ఆస్తికులమోయ్ ! శానా శానా గొప్పో ళ్ళం !


శుభోదయం
జిలేబి 

Tuesday, July 7, 2015

పట్టు మామి, ఉణక్కు వేలై ఒన్ణుం ఇల్లయా :)


పట్టు మామి, ఉణక్కు వేలై ఒన్ణుం ఇల్లయా :)

అబ్బబ్బా, అయ్యరు వాళ్ ఈ మధ్య మరీ పిచ్చ పిచ్చ గా ఉందండీ ! చెప్పా మా అయ్యరు గారి తో !
ఏమోయ్ నీకొచ్చిన 'కష్టం' ? అయ్యరు గారు హిందూ పేపర్ లో మోడీ వర్సెస్ ఆల్ (ఇందులో తర తమ బేధం లేకుండా అన్ని పార్టీలు ఉన్నట్టున్నాయిస్మీ:)) న్యూస్ ఐటెం చదువుతూ తలెత్తి కనబడని కళ్ళద్దా లని సరి జేసుకుని చూసేరు .

అసలు ఏమీ పనిపాటా లేకుండా పోయిన్దండీ చెప్పా అయ్యరు గారి తో ;

ఎందుకోయ్ ?

"ఈ మధ్య బ్లాగు లోకం లో సరి ఐన టపాలు ఏమీ రావడం లేదండీ ! టపా కంటెంటు మారినా కామింట్లలో శ్రీ మాన్ రామ ప్పెరుమాళ్ వారు నలిగి పోతున్నారు ; సీతమ్మ బెబ్బెలు పడి పోతున్నట్టు ఉన్నది నా కైతే " చెప్పా వారితో

దానికీ నీ పిచ్చ పిచ్చ కి సంబంధం ఏమిటోయ్ ? బుర్ర అర్థమయ్యీ అర్థమవనట్టు ఊపి ప్రశ్నిం చేరు అయ్యరు గారు .

ఆ ఏముందండీ, అందరూ గోదారి పుష్కరాలంటూ వెళ్ళా మంటూ టపాలు రాస్తున్నారు ; మనమూ వెళ్దా మా " అడిగా అయ్యరు గారి తో .

ఇదిగో జిలేబి నాకు 'ఇరుక్కుం' ఇడమే వైకుంటం' ! ఆ గోదారి దాకా పోవాలంటే ఈ శాల్తీ ఎంత కష్ట పడాలి నీకు తెలిసిందే కదా అన్నారు అయ్యరు గారు ;

అబ్బబ్బా ! ఈ పడక్కుర్చీ వేదాంతా నికి ఏమి గాని .. ఈ మధ్య బ్లాగు లోళ్ళు పట్టు మామీ నీకు వేరే వేలై ఏమీ లేదా అని అడిగే రండీ  మళ్ళీ చెప్పా .

వాళ్ళు అడిగిన దాంట్లో తప్పే ముంది జిలేబి ? నువ్వు ఉబుసుపోక తెల్లారి గట్రా నేను వేడి వేడి గా వేసిన కాఫీ లాగించేసి బ్లాగుల మీద పడతావు ! అట్లా జూస్తే, పెందరా ళే పని పాటా లేకుండా ఉన్న వాళ్ళే కదా ఇట్లా టపాలు , కామింట్లు గిలుకుతారు అని జనం అనుకుంటారు - చెప్పేరు అయ్యరు గారు .

అబ్బ ! ఈ అయ్యరు గారు ఎప్పుడైనా నాకు వత్తాసు పలుకుతారా ; ఊహూ నెవెర్ ఇన్ యువర్ లైఫ్ జిలేబి  అని అనుకో కుండా ఉండలేక పోయా .

ఇంతకీ ఏమన్నారోయ్ బ్లాగు లోళ్ళు ? ఉత్సుకత తో అడిగేరు లెగ్ పుల్లింగ్ జేస్తూ

ఇట్లా అన్నారండీ జెప్పా :

"ఓ సౌభాగ్యవతి
నీవు పతియే ప్రత్యక్ష దైవమని ,
 పతి పాదపద్మములే కైవల్య పదమని,
పతి సేవే మోక్ష మార్గమని ఎరిగిన ఇంతివని,
అయ్యర్ సేవ చేసుకొనే వృద్ద నారిశిరోమణివని "

అయ్యరు గారు పడక్కుర్చీ నించి క్రింద పడి పోతారేమో అన్నంత గా బిగ్గరగా నవ్వేరు .

"జిలేబి నీకు జనాలు ఇంత మంచి తాకీదు ఇచ్చెరా ! ఔరా ! కాల మహిమ కాకుంటే, అయ్యరు తెల్లారి గట్రా నిద్ర లేచి కాఫీ పెట్టి జిలేబి ని నిద్ర లేపి , బీ లేజీ నించి వాయగొడితే, ఆ జిలేబి పంచ దశ లోకం లో కామింటులు కొడుతూ టీం అండ్ తిండి పాస్ చేస్తూ బతి కేస్తోంటే , పతి సేవే మోక్ష మార్గమని ఎరిగిన ఇంతి వని, వాణీ , నా జిలేబి నిన్ను పొగిడేరా " అంటూ ఆ పై మూర్చ పోయేరు !

అయ్యరు వాళ్ అయ్యరు వాళ్ అంటూ వారి మొగమ్మీధ వారిచ్చిన కాఫీ ఏ కొంత చల్లా! ఆ వేడి కి ఉలిక్కి పడి

"జిలేబి! ఇది నిజంగా కాల మహిమయే ! -" అంటూ మరో మారు నొక్కి వక్కాణిం చేరు !

పోనీ లెండి అయ్యరు గారు ! ఆ క్రెడిట్ లో మీకో సగం ఇచ్చేస్తా ! చెప్పా - ఈ మధ్యే అర్ధనారీ తత్వమే అద్వైత మని ఒక మహానుభావులు వారు సెలవిచ్చిన వైనం గుర్తుకొచ్చి !


చీర్స్
జిలేబి
(வேலை இல்லாத கண்மணி :)

 

Friday, July 3, 2015

జిలేబి బూరెలు - ఎవరిని దండిం చాలి ?

జిలేబి బూరెలు - ఎవరిని దండిం చాలి ?

బ్లాగు రీడర్లు , మొదట ఈ కథ చదవ వలె - ఆ పై ఈ టపా గిలిగిం తలు :)

అందరి నీ ఝాడిం చాలి అంటే దండించాలి అని జిలేబి రాణీ వారి ఆజ్ఞ మేరకు రాజు అందరిని దండిం చేడు .

దండిం చిన తరువాయి జిలేబి రాణీ వారి ని రాజా వారు అడిగేరు - మహారాణీ ! అందరిని దండిం చాలి అన్నావ్ ! నీ మాట మేరకు దండిం చేశా ! ఇంతకీ అందరినీ ఎందుకు దండిం చ మన్నట్టు ?


జిలేబి మహా రాజ్ఞి ఇలా సమాధానమిచ్చింది .

"ప్రభూ ! అందులో ఘన  కార్యం చేసిన వారు  ఉన్నారు నీతి నియమాలకి తావివ్వక ; అంటే మీ రాజ్యం లో నీతి విలువలు వలువలు వదిలిన స్త్రీ లా ఉంది .

 కార్యానికి ప్రతి దండనం తామే  ఇచ్చిన వారు ఉన్నారు  , మీ రాచరికాన్ని మన్నించక దండాన్ని తమ చేతుల లో తీసుకుని  ;

ఘన కార్యానికి వత్తాసు ఇచ్చిన వాళ్ళూ ఉన్నారు - దానిని ఖండించక .

ఆ ఘన కార్యాన్ని చూసీ చూడనట్టు ఉన్న వారూ ఉన్నారూ , వారికి బుద్ధి చెప్పక, మీ రాజా వారి ఆస్థానానికి ఆ సంఘటన గురించి చెప్పక .

ఇట్లా అందరూ దండనార్హులే . అని జెప్పి ...

ఆ పై ఆ ఘన కార్యానికి మూల భూతమైన కల్లు తాగిన వారూ ఉన్నారు . వారు కల్లు తాగడానికి మూలం మీ రాజ్యం లో మీరు అనుమతించిన కల్లు దుకాణా లు  ...

సో, రాజా ఇందులో మీకూ భాగముంది  అని రాజా వారి వైపు చూసింది జిలేబి రాణి .

రాజా వారు తలూపేరు .

ఆ పై వారి రాజ్యం లో దండోరా వేయిం చేరు - కల్లు దుకాణా లన్నీ బందు అని .

కథ సిలికాన్ వేలీ కి ...

మనమంతా కామెంట్ వేలీ కి ....


చీర్స్
జిలేబి 

Wednesday, July 1, 2015

గురు శుక్ర యుగళ గీతం !

గురు శుక్ర యుగళ గీతం !
 
Venus and Jupiter conjunction 


 
 



http://indiatoday.intoday.in/education/story/facts-about-the-conjunction-of-venus-and-jupiter/1/448124.html

కర్టసీ : ఇండియా టుడే :


June 30 and July 1 will give us the finest conjunction of the year. Tuesday and Wednesday of this week will see Venus and Jupiter passing close to each other. The two celestial bodies are said to be coming so close that they will be just one-third of a degree apart from each other. Many people think of it as a rare incident but it's not. It happened last year in August and will happen again in October this year.
But there are few things that make this conjunction specifically rare. Read on to grab some facts on the two planets coming close:
1.  The coming close of the celestial bodies is called "Conjunctions".
2.  This conjunction is the second meet between the two planets.
       o   The first happened on August 18, 2014.
       o   The second will happen today (June 30) and tomorrow.
       o   The third conjunction will take place on October 26.
3.   This second series of conjunction is considered the best in 15 years.
4.   Venus will appear six times brighter than Jupiter.
5.   Venus is 56 million miles or 90 million Kilometres away from earth.
6.   Jupiter on the other hand is 550 million miles or 890 million Kilometres away from earth.
7.   The distance between the two is a lot but to the sky watchers it will give an optical illusion of the two planets being extremely close.
8.   Both the planets will separate and start to move away from each other after July 1.
9.   On July 18, the two planets will be welcoming crescent moon to form a group of three planets.



చీర్స్
జిలేబి
 
 

Monday, June 29, 2015

ఆధ్యాత్మిక ప్రశ్నలు - జవాబులు

ఆధ్యాత్మిక ప్రశ్నలు - సమాధానాలు - ఆలోచనా తరంగాలు -

ఆలోచనాత్మక మైన టపా !

ఈరోజు ఉదయం పంచవటి సభ్యుడు గిరీష్ సూరపనేని గుంటూరుకు వచ్చాడు.

'ప్రస్తుతం గుంటూరులో ఉన్నాను.మీ ఇంటి అడ్రస్ చెబితే వచ్చి కలుస్తాను.' అని ఫోన్ చేశాడు.

'ఏం పని మీద కలవాలనుకుంటున్నారు?' అడగడం కొంచం రూడ్ గా అనిపించినా తప్పక అడిగాను.

'ప్రత్యేకంగా పనేమీ లేదు.ఊరకే కలుద్దామని వచ్చాను' అన్నాడు.

'పనేమీ లేకుంటే కలవడం ఎందుకు? పిచ్చాపాటీ కబుర్లు నేనిష్టపడను.' అన్నాను.ఎందుకలా అనవలసి వచ్చిందంటే,ఆదివారం నేను ఖాళీగా ఉంటే,నా సాధనకే నాకు సమయం సరిపోదు. అందుకని ఇతర పనులు సాధారణంగా పెట్టుకోను.ముచ్చట్లలో సమయం గడపడాన్ని అసలు ఇష్టపడను.చాలామంది వచ్చి కూచుని మాట్లాడే కబుర్లు (ఆధ్యాత్మిక కబుర్లు అయినా సరే) నాకు మహా కంపరం కలిగిస్తాయి.వారి ఆరా నాకూ నచ్చదు. నా ఆరాను వారూ భరించలేరు. అందుకే అలా అనవలసి వచ్చింది.

అవతలనుంచి నిశ్శబ్దం. బహుశా చిన్నబుచ్చుకున్నాడేమో అనిపించింది.

'సరే.రండి.కానీ ఒక్క పదిహేను నిముషాలు మాత్రం మీతో మాట్లాడగలను.' అన్నాను.

కాసేపట్లో గిరీష్ ఇంటికి వచ్చి చేరాడు.

విజయవాడనుంచి హైదరాబాద్ వెడుతూ మధ్యలో నన్ను చూచి వెళదామని గుంటూరుకు వచ్చానని చెప్పాడు.శ్రీశైలం సాధనా సమ్మేళనానికి రావాలనుకుని కూడా రాలేకపోయానని అన్నాడు.

నేనేమీ రెట్టించలేదు.

కాసేపు కుశలప్రశ్నలు అయ్యాక - 'ధ్యానం చేస్తుంటే వేరే ఆలోచనలు వస్తుంటాయి. కాసేపయ్యాక మళ్ళీ ధ్యానం కొనసాగించవచ్చా?' అడిగాడు.

'అసలు చెయ్యవలసింది అదే. ఆలోచనలలో కొట్టుకుపోతున్నామన్న తెలివి వచ్చాక మళ్ళీ ధ్యానాన్ని సాగించాలి' అన్నాను.

పూర్తి గా .... ఆలోచనా తరంగాలు - శ్రీ శర్మ గారి టపా 


చీర్స్
జిలేబి

 

Saturday, June 27, 2015

రావణలంకలో రమణి సీతమ్మ!

 
శ్యామలీయం 
సంక్షిప్త రామాయణ మంజరి 


బ్రహ్మాదు లడుగగా వైకుంఠవాసి
చిన్మయు డంతట శ్రీరాము డనగ
దశరథపుత్రుడై ధరణి కేతెంచి
మునికులేశుని యాగమును వేగగాచి
హరమహా చాపంబు నవలీల నెత్తి
అవనిజ సీతమ్మ హస్తమ్ము బట్టి
జనకు డాజ్ఞాపించ సంతోషముగను
తమ్ముండు భార్యయు తనతోడు కాగ
నారచీరలు కట్టి నడచి కానలకు
ఖరదూషణాది రాకాసుల జంపి
వెలుగొందు చుండగా విపినంబు లందు
రావణుండను వాడు రాక్షసాధముడు
మోసాన సీతను మ్రుచ్చిలి పోవ
ఇంతిని వెదకుచు ఋష్యమూకాద్రి
వాసియై యుండిన వానరేశ్వరుడు
సుగ్రీవు చెలిమిని సొంపుగా బడసి
ఆతని మంత్రియౌ ఆంజనేయుండు
రావణలంకలో రమణి సీతమ్మ
జాడ లరసిరాగ సాగరమునకు
సేతువునే కట్టి చెచ్చెర కోతి
సైన్యమ్ముతో లంక చేరి ఢీ కొట్టి
సకలరాక్షసబలక్షయ మొనరించి
ఆహవంబున రావణాసురు ద్రుంచి
ముల్లోకములకును మోదమ్ము గూర్చి
స్వస్థానమును చేరి సర్వలోకములు
హర్షింప దివ్య సింహాసనం బెక్కి
పదియు నొకటి వేల వర్షముల్ పుడమి
వైభవంబుగ నేలి వైకుంఠమునకు
వేడుక మీరగా వెడలె శ్రీకరుడు
పరమాత్ము డాతని పాదాంబుజములు
తలచిన కలుగును తప్పక శుభము


శుభోదయం
జిలేబి 
(రమణీ నీ సమాన మెవరు!)

Friday, June 26, 2015

బోడిగుండుకి బట్టతలే శిక్ష ! (పని లేక రమణ - వెల్కం బెక బెక )


బోడిగుండుకి బట్టతలే శిక్ష !
one of the very impressing post from
initial years of blogging !
 
సంచలనాత్మక టపా
 
పని లేక రమణ గారు - మీరు మళ్ళీ మీ బ్లాగు మూత ని తెరిచి నందులకు
వెల్కం బెక బెక !!!
ఎప్ప్లటి లాగే మళ్ళీ మీరు టపాల తో తెలుగు బ్లాగు లోకాన్ని అలరింప జేస్తారని
ఆశిస్తూ
జిలేబి ప్రెజెంట్స్
 
 


తలనీలాలు ఇచ్చారు. ఏ దేవుడుకి సార్?". ఓ అతికుతూహల పేషంట్ యొక్క అనవసరపు వాకబు.
             
"డాక్టర్ గారు, మీరు చాలా పధ్ధతిగల మనిషండీ. ఈ రోజుల్లో చదువుకున్నవారిలో ఇంత భక్తిభావం అరుదుగా కనిపిస్తుంది!" ఓ ముసలి పంతులుగారి అతిమెచ్చుకోలు.
            
'ఓ ప్రభువా! ఈ పాపిని రక్షించు!'
             
రాన్రాను నెత్తిమీద కేశరహిత ప్రదేశం పెరుగుట వలన.. జయసూర్య, బ్రూస్ విల్లిస్ మొదలగువారి గుండు నుండి స్పూర్తి పొంది.. నేను కూడా బోడిగుండు చేయించుకొని.. ఫేషన్ గురు వలే పోజ్ కొట్టిన మొదటిరోజు అనుభవమిది!
             
మనది కర్మభూమి. ఇచ్చట బట్టతల వాడి ఫాషన్ గుండునీ, దేవుడి భక్తిగుండునీ ఒకేగాట గట్టే అజ్ఞానులే ఎక్కువ. భగవంతుణ్ణీ భక్తుణ్ణీ అంబికా దర్బార్ బత్తి ఎంత అనుసంధానం చేస్తుందో నాకు తెలీదు కానీ బోడిగుండు మాత్రం ఖచ్చితంగా చేస్తుందని చెప్పగలను.


మానవునికి తన జుట్టు అందానికీ, అహంకారానికీ చిహ్నం. ఈ రెండూ ఆ దేవుడికి సమర్పించడం త్యాగానికీ, భక్తికీ కొలబద్ద అని అంటాడు అన్నయ్య. అటులనే కానీండు. మరి గుండు దాచడానికి టోపీ ఎందుకు పెట్టుకుంటారో!
              
అయినా నా బట్టతలకో కథ ఉంది. నాకు మెడిసిన్ సీటొస్తే గుండు చేయిస్తానని మా అమ్మ తన ఇష్టదైవమైన ఆ తిరపతి వెంకన్నకి మొక్కుకుంది. కానీ నేను ససేమిరా అన్నాను.


నాకు జుట్టుపై ప్రేమకన్నా.. కష్టపడి సాధించిన మెడికల్ సీటుని దేవునిఖాతాలో వెయ్యడానికి మనసొప్పలేదు. అంచేత ఏంచేయ్యాలో తోచని అమ్మ మధ్యేమార్గంగా అర్భకుడైన రెండేళ్ళ మా అక్కకొడుక్కి గుండు కొట్టించింది. 


ఈ ఎడ్జస్టుమెంట్ గుండు ఆ దేవుడికి నచ్చినట్లు లేదు. అప్పటినుండీ వెంకటేశ్వరస్వామి నా మీద పగబట్టి.. నా నెత్తిమీద కల తనదైన బాకీ (జుట్టు)ని.. వాయిదాల పధ్ధతిన శాస్వితంగా తీసేసుకున్నాడు. ఫైనాన్స్ వ్యాపారివలే దేవుడు కూడా బాకీ వసూలు దగ్గర ఖచ్చితంగా ఉంటాట్ట! అమ్మ చెప్పింది.


'దేవుడు జుట్టునే బాకీగా ఎందుకు వసూలు చేసుకోవడం? ఏకంగా మెడిసిన్ సీటే వెనక్కి లాక్కోవచ్చుగా?' ఈ సందేహానికి అమ్మ దగ్గర రెడీమేడ్ ఆన్సర్ ఉంది.


'ఆ తిరపతి వెంకన్నకి అదెంతసేపు పని! కానీ ఆయన అలా చెయ్యడు. నువ్వు తన భక్తురాలి కొడుకువి! అంచేత ఏదో మందలించి వదిలేసినట్లు బట్టతల అనే తక్కువ శిక్ష వేశాడు. సంతోషించు.' అంటూ అమ్మ బల్ల గుద్దుతుంది. నమ్మక తప్పదు!


అంచేత మీకు చెప్పొచ్చేదేమనగా.. యుల్ బ్రిన్నర్, బ్రూస్ విల్లిస్, అమ్రిష్ పూరీ, గిబ్స్ మొదలైన బోడిగుండు వీరులంతా కూడా.. వారి తల్లులు మొక్కిన పాతమొక్కుల తాలూకా బాకీలు తీర్చే క్రమంలో బట్టతలల బారిపడ్డారని! అప్పుడేకదా మా అమ్మ 'గుండుమొక్కులు - బట్టతల థియరీ' కరెక్టయ్యేది.


ఈమధ్య ఓ తోటి బట్టబుర్రవాడు బట్టతల మేధావిత్వానికీ, మగతనానికీ ప్రతీకలనీ.. ఇంకా ఏవో చాలా చెప్పాడు.

కానీ వాడు తన బట్టతల గూర్చి తీవ్రంగా వ్యాకులత చెందుతూ.. ఆ భాధ తప్పించుకోడానికి మాత్రమే ఈరకమైన వాదనలని తలకెత్తుకున్నాడని అర్ధమైంది.
              
నాకు మాత్రం నా జుట్టులేమి మీద అంత ఆత్మన్యూనతా భావమేమి లేదు. 'ఉంటే మంచిదే.. ఉండకపోతే మరీ మంచిది!' లాంటి ఉదాసీనవైఖరి తప్ప!

*య రమణ*

చీర్స్
జిలేబి

Thursday, June 25, 2015

కామెంట్ల తో కామెడీ - సరదా సరదా గా :)


కామెంట్ల తో కామెడీ - సరదా సరదా గా :)

ఈ మధ్య లేచిన పెను తుఫాను లో మునిగి తేలి కామింట్ల వరదలో కొట్టు మిట్టాడి ఆ పై తేలి కామింట్లు చదువుతూం టే ఒక కామింటు కి మరో కామింటు రిప్లై గా కనిపిస్తే ఆహా ఇదియే కదా కా మింటు సరదా అనుకుంటూ కొంత జోడింపు తో సరదా గా కాలక్షేపం కోసం -

  • బ్లాగు : Padmarpita...
    Janani Maata
    ఇదేం సావుకొచ్చే
    భయంతో చస్తే ఎట్లమ్మ

  • బ్లాగు : Padmarpita...
    నాలో నేను

    తిడుతూనే ప్రేమ ఎంతో ఒలకబోసారు. చాలా బాగుంది
     
    ****
     
    Sudha Srinath
    ‘తండ్రికి మరో పేరు బాధ్యత.

  • బ్లాగు : మన భద్రాచలం...!
    Uppal
    Inspiring narrative!

  • ****

    బ్లాగు : వరూధిని
    YJs

    మీరు ఎదురింటి మోకాలికి పక్కింటి బోడిగుండుకి లింక్ పెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించండి!
     
  • బ్లాగు : కష్టేఫలే
    kastephale

    ఇదీ నిజమేనండోయ్!
    బోడి గుండుకీ బొటనవేళ్ళకీ ముళ్ళెట్టడం తేలికేం కాదండి,అబ్బో! దానికెన్ని తెలివితేటలు కావాలండి, మగపురుగులికి ఆ తెలివితేటలేవీ? 
    ధన్యవాదాలు.

  • ****


    బ్లాగు : నెమలికన్ను

    మీరు మిస్సయినట్లు ఉన్నారు.ఈ కధ నుండే ఆ వ్యాఖ్యలు తీసుకున్నాను.మిమ్మల్ని ఉద్దేశ్యించి కాదు.
     
    బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

    మీకు నచ్చే జవాబులను మీకు మీరే చెప్పుకోగలరు కాని ఇతరులు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పలేరని అనిపిస్తోంది.
     
    ***
     
     
    అడ్వొకేట్ జెనరల్ గారు ఏమన్నారో నాకు తెలీదు. మీకు తెలిస్తే లింకు ఇవ్వగలరా?
     
    విన్నకోట నరసింహా రావు
    "Power tends to corrupt and absolute power corrupts absolutely" అని 19వ శతాబ్దలోనే అన్నాడు కదా ఓ బ్రిటిష్ ఎం పి లార్డ్ ఏక్టన్ (Lord Acton). ఆయనే మరో మాట కూడా అన్నాడు - "Great men are almost always bad men !
     
    *** high light :)
     
  • బ్లాగు : Telangana Assange
    assange telangana
    తెలంగాణ ప్ర‌జ‌ల‌కు నా రూపం తెలుసు..
  •  
  • బ్లాగు : నగ్నచిత్రం
    Narayanaswamy S.
    Interesting. Look forward to it


  • ****

    సరదా గా వేరు వేరు కామింట్ల ని చదివి వాటికి లింకు పెట్టేరంటే ఆల్ ఈజ్ టైం పాస్ ఫన్ :) మీకు ఇట్లాంటివి కన పడితే షేర్ టు ఎంజాయ్ :)

    చీర్స్
    జిలేబి

     

    Tuesday, June 23, 2015

    జిలేబి ఎచట ఉండును ?

    జిలేబి ఎచట ఉండును ?

    వసుంధర వారి పరిచయం



    జిలేబి

    క్కువగా

    దివిన

    పాల లో

    ఉండును !


    జిలేబి

    Monday, June 22, 2015

    విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః !

    విముక్త ధర్మాః చపలాః స్త్రీయాః !

    "వైదేహీ, జనకాత్మజే, స్త్రీలు స్వభావ రీత్యా విముక్త ధర్మ రీత్యా చపలులు, భేదాన్ని కలిగించే వాళ్ళు - ఇట్లాంటి పరుష వాక్యాలు నీ వద్ద నించి నేను వినలేను "

    చెప్పింది లక్ష్మణుడు - ఉద్దేశించింది సీతమ్మ తల్లిని .

    అరణ్య కాండ లో జింక రూపం లో ఉన్న మారీచుడు 'హా సీతా' అంటే , అది తన భర్త రాములవారిదే ననుకుని,సీతా దేవి,  లక్ష్మణుని రాములవారిని కాపాడ డానికి వెళ్ళమంటే, లక్ష్మణుండు ససేమిరా కుదరదం టాడు - ఆ ఆర్త నాదం రామునిది కాదు - ఆ మాయావి రాక్షసులది - నిన్ను కాపాడ మని రాములవారి ఆజ్ఞ - ఇక్కడి నించి కదలను గాక కదలను అని లక్ష్మణుడు అంటే ,

    అమ్మవారు "సంరక్త లోచను" రాలై లక్ష్మణుని పరుష వాక్యాలతో అంటుంది -

    'లక్ష్మణా, నువ్వు నన్ను పొంద డానికే రాముని వెంట గోముఖ వ్యాఘ్రం వలె పొంచి పొంచి వచ్చావు ఈ కాననానికి" అని .

    అంతటి తో ఊరుకున్నదా  ?

    "ఇది నువ్వూ , భరతుడు కలిసి ఆడుతున్న నాటకం కూడా అయివుండ వచ్చు. భరతుడు అర్ధం (రాజ్యం) , నువ్వు మరొక అర్ధమైన నన్ను నా పతి నించి వేరు జేయాలని అనుకున్నారు' అంటుంది పరుషం గా  .

    "నా పై కోరికతో నువ్వు  రాముడు ఎట్లా పోయినా ఏమైనా కానీ అని ఆతన్ని కాపాడ డానికి  వెళ్ళ నంటు న్నావు "

    लोभात् तु मत् कृतम् नूनम् न अनुगच्छसि राघवम् |
    व्यसनम् ते प्रियम् मन्ये स्नेहो भ्रातरि न अस्ति ते || ३-४५-७

    ఇట్లా పరుష మాటలు మాట్లాడి (వాల్మీకి అంటాడు 'సంరక్త లోచనా ! అని ) అన్న మరో క్షణం లో నే కళ్ళ నీళ్ళు జల జలా రాలి పోతున్నాయి - భీత హరిణి ! - బాష్ప శోక సమన్విత !

    మరో క్షణం లో లక్ష్మణుని - अनार्य करुणारंभ नृशंस कुल पांसन అంటూ మరో మారు జాడించడం మొద లెడు తుంది !(ఇట్లా జాడించడం అన్నది మాకు వెన్నతో బెట్టిన విద్య :) అర్థమున్నా లేకున్నా జాడిస్తాం !)

    ఈ అరణ్య కాండ లో ఈ ఒక్క సర్గ లో నే వాల్మీకి  స్త్రీ ఒక వివశ స్థితి లో ఎట్లా ఎట్లా మాట్లాడ గలదు - ఏమేమి అనుకో గలదు - ఏవిధ మైనట్టి 'reaction' చూపించ గలదు అన్నదాన్ని  ప్రముఖం గా చూపించడం జరుగుతుంది.

    యథొ కర్మః తథొ ఫలః  అన్నదానికి ఈ సంఘటన ఒక నిదర్శనం అవుతుందేమో మరి.

    ఇట్లాంటి పరుష వాక్యాలని సీతమ్మ లక్ష్మణుడి తో అనటం - అదిన్నూ తన భర్త తమ్ముడు, పుత్ర సమానుడు ఐన వాడి తో అనటం - దీని పరిణామం - యుద్ధ కాండ లో - రాముల వారితో అట్లాంటి పరుష వాక్యాలు పలికించ డానికి కారణ భూతమయ్యిందేమో మరి కూడా అనిపిస్తుంది .

    మళ్ళీ అంటుంది సీతమ్మ లక్ష్మణుడి తో -- గోదాట్లో దూకైనా , అగ్నిలో దూకైనా చస్తా గాని, రాముల వారు లేని జీవితాన్ని నేను చూడ లేను - మరొక్కరి తో ఉండ లేను అని - गोदावरीम् प्रवेक्ष्यामि हीना रामेण लक्ष्मण ! అంటుంది

    (రామాయణం లో ఈ అరణ్య కాండ తనకు అన్నిటి కన్నా నచ్చిన కాండ అని చెప్పు కున్నారు - శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రు ల వారు - ఎందుకంటే - ఇందులో గోదావరి మాట ఉన్నదంట ! కాండం పర్యంతం ఆంధ్ర దేశం ఉన్నదంట !-  అందుకనేమో 'గోదాట్లో దూకి చస్తా ' అన్న పదం ఆంధ్ర దేశం లో ప్రాశస్త్య మైన పదమయి పోయింది మన  'ఆండోళ్ళ కి ' , సీతమ్మ వారి స్టైల్ లో !- అబ్బా, ఈ గోదావరి తీరం వాళ్ళు రామాయణం లో కూడా గోదారి పిడకల వేట  వెయ్యకుండా ఉండరు సుమీ !!!))

    प्रवेक्ष्यामि हुताशनम् |! - అగ్గి లో బుగ్గై పోతా నంటుంది మళ్ళీ .

    దీని పర్యవసానం - యుద్ధ కాండ లో అగ్ని ప్రవేశ ఘట్టం !

    మరి ఈ అగ్ని ప్రవేశానికి కారణం సీతమ్మ తన గురించి చెప్పిన శోకా తప్త మాటలే తధాస్తు దేవతలయ్యే యా ?

    పరుష వాక్యాలను విన్న లక్ష్మణుడు తన రెండు చెవుల మద్య కాల్చిన బాణం  తో పొడిచినట్టు ఉన్నది అని మళ్ళీ ఇట్లా అంటాడు - "ఇట్లాంటి ధిక్కారా లతో నిన్ను నువ్వే శపించు కుంటున్నావు వైదేహీ అని" -

    धिक् त्वाम् अद्य प्रणश्यन्तीम् !


    న తు అహం రాఘవాత్ అన్యం కదాపి (పదాపి!) పురుషం స్ప్రుశే !

    न तु अहम् राघवात् अन्यम् कदाअपि (पदापि !) पुरुषम् स्पृशे!?



    శుభోదయం
     జిలేబి
    (రామా ! నిన్ను నేను వదలను గట్టి గా 'హేటేస్తూ' ఉంటా :)