Saturday, February 4, 2012

కాపీ క్యాటులు అనబడు కోతులు !

వామ్మో వామ్మో ఎంత కాపీ ఎంత కాపీ ! 

కాపీ క్యాటులు వారి కవాతులు.

అదేమీ చోద్యమో గాని, చౌర్యమో గాని

మక్కీకి మక్కీ మన టపాలని బ్లాగులని దిన పత్రిక వాళ్ళూ, వారపత్రిక వాళ్ళూ కాఫీ లాగిస్తూ కాపీలు కొట్టేస్తూ కవాతులు చేస్తున్నారట !

ఈ విషయాలు తెలీకుండానే నేను టపాలు గట్రా ఇన్ని రాసేసానే మరి.

నా టపాలన్నీ ఎక్కడెక్కడ తేలు తున్నాయో ! ఎవరైనా కాస్త తెలిస్తే  చెబ్దురూ !

ఈ గుళ్ళకి వెళ్లి నప్పుడు మనకు కలిగే నిత్యానుభవం ఇక్కడ గుర్తు తెచ్చు కోవాలి.

మనం భక్తీ గా స్వామీ వారీ ప్రసాదం అని ఎ అరటి పండో, లేకుంటే మరోదే టో చేతిలో పట్టు కుని కొంత సావకాశం గా ఆరగిద్దామని ఉంటాం, అప్పుడే, మన కోతీ వారు వచ్చి చలాగ్గా మన చేతిలోని పండు ని లాగేసు కుని చక్కా పోతారు !

ఇక మనం ఎం చేస్తాం ! స్వామీ వారు మనకు ఇంతే అనుగ్రహించారు అనుకోవాల్సిందే !

అట్లాగే కదా మన బ్లాగు వాళ్ళ గతి కూడా అయి పోయింది. !

మనం ఎ అర్ధ రాత్రో తెల్లారి జామో ఓపిగ్గా కూర్చొని, ఎ లేఖిని తొ టో కనా కష్టాలు పడి టైపాటు చేసి వామ్మా ఒక్క టపా రాసేను అని సంతోష పడి పొతే , ఈ పత్రికల వాళ్ళు వచ్చి దాన్ని పట్టేసుకుని, కొట్టేసుకుని వాళ్ళ పేపర్లో వేసేసు కుని (అంతా 'ఖూనీ') మనకు తెలీనివ్వ కుండా గప్పు చిప్పుగా కాపీ కొట్టేసుకుని ....

కాబట్టి మనం ఏమి చేయ్యవలె. ? అరవం లో ఒక సామెత ఉంది. ఈ అడిచ్చా కాపీ అని. అంటే ఎదుటి వాడు రాసేటప్పుడు ఒక ఈ గ వచ్చి వాలితే దానినీ కొట్టి రాస్తే, మనమూ ఒక ఈగని కొట్టి రాస్తామన్న మాట. అట్లాగా, మనం రాసేటపుడు సీక్రెట్ గా ఓ ఈగని కొట్టి రాసామంటే వాళ్ళూ కూడా ఒక ఈగని కొట్టి రాసి , మనకు దొరికి పోతారు సుమా !

 వావ్ నాకూ మాంచి ఐడియా వచ్చేసిందోచ్ !

11 comments:

 1. లేటెస్ట్ ఫేషన్ ఎత్తుకురావడం. అరవైనాలుగు కళల్లో ఒకటీ కదా!

  ReplyDelete
 2. మొన్న మన బ్లాగర్లలోనే ఎవరో పేరు గుర్తులేదు కాని ఇలా కాపీ చేస్తే పట్టేసే టెక్కునిక్కు ఒకటి విడుదల చేశారు!

  ReplyDelete
 3. ఇంత చిన్న విషయానికి అరవాన్ని ఆశ్రయించాలా?
  మన తెలుగులో కూడా 'మక్కికి మక్కీ' అన్న సామెత ఉంది కదా.
  ఇదేమో సంస్కృతంలోని 'యధా మక్షికానువాదం' అనే న్యాయానికి నకలు - అదేనండీ మక్కికి మక్కీ లేదా ఈ అడిచ్చా కాపీ అన్నమాట.

  కం. కాపీ కొట్టే రైటుకె
  కాపీరై టనెడి పేరు ఖాయం ఐతే
  కాపీ పిల్లుల తప్పా
  పాపం మన పాలు వాటి పాలు జిలేబీ

  ReplyDelete
 4. మనది ఎవరైనా కాపీకొడితే మనం దానికి గర్వపడాలిగానీ బాధ పడటం ఎందుకండీ. ఆ కాపీకొట్టేవాడు "ఇలా నేనెప్పటికీ రాయలేను" అని మనసులో ఫీలయ్యే కాపీకొడతాడుకదా. ఆమేరకు వాడు మనల్ని ఎలివేటు చేసినట్లేకదా. ఇహ గౌరవమర్యాదలంటరా? వాడికి తెలీవూ ఈ మెచ్చుకోళ్ళన్నీ ఈ కంటెంటు రచయితకేగానీ తనకు కాదని. అసలు విషయం బయటపడితే ఎక్కడ పరువుపోతుందోనని వాడుమాత్రం భయపడడూ.

  అయినా ఇంకెవరో వచ్చి మెచ్చేసుకొంటేగానీ మనమేంటో మనకు తెలీకపోతేఎలా చెప్పండి?

  ReplyDelete
 5. @కష్టే ఫలే వారు,

  కొట్టుకు రావడం, పట్టుకు రావడం, ఇప్పుడు ఎత్తుకు రావడం ఆల్ ఇన్ ఆల్ అన్నీ 'రా' వడాలే!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 6. @రసజ్ఞ వారు,

  వారిని పట్టుకున్నా కొట్టుకున్నా అంతా అంతర్జాలా లోకమే ! మిగిలేది సున్నా!!
  వున్నారా ఈ లోకం లో అసలు వున్నారా ఈ లోకం లో అన్న శ్రీ రామ రాజ్యం పాట పాడేసుకుని తృప్తి చెందాలంతే !!

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 7. శ్యామలీయం వారు,

  మక్కీ కి మక్కీ ఉదంతమూ, మీ కందోదంతమూ అమోఘము!!

  నెనర్లు
  జిలేబి.

  ReplyDelete
 8. ఇండియన్ మినేర్వా గారు,

  కరెక్టు గా చెప్పారు. ఒకరిని అనుసరిస్తేనే అది వారి గొప్ప దనాన్ని అంగీకరించినట్టు అర్థం.

  ఇక వారి టపాల ని మనవి గా నిచ్చా మంటే వారికే ఆ పూర్తి క్రేడిట్టు!!

  'మినహా , రవ్వంత' ఇలా అప్పుడప్పుడు కాస్త సోడా కొట్టడం అంతే !

  ఆ పై బ్రేవ్ మని తేంచి ఆ హా మన బాధ పోయిన్దోచ్ అనుకుని (అదేదో అమృతాంజనం వారి ఎడ్ లా అన్న మాట !) ఖుషీ అయి పోతాం అంతే !

  నెనర్లు.

  చీర్స్
  జిలేబి.

  ReplyDelete
 9. పైన Indyan Minerva గారి అభిప్రాయంతో ఏకీభవిస్తాను. "Imitation is the sincerest form of flattery"

  ReplyDelete
 10. అంతర్జాలలో వందలమంది చదువరులు చూస్తూనే వుంటారుగదా ఎత్తుకుపోవడం సాధ్యమేనంటారా? అలా ఎత్తుకెళ్ళి వేసినా చూసిన పెద్దమనుషులు "జిలేబిగారూ మీ పలానా టపా ఇదుగిదిగో ఈ పేపర్లో వేశారు చూడండొహో" అని చెప్పేస్తారుగా..మన కుటుంబమసలే చాలా పెద్దది.

  ReplyDelete